
ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలు కుదేలైన వేళ దివ్వెల పండుగ ఆయా రంగాల్లో వెలుగులు నింపుతోంది. పండగ వేళ వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్‌లో ఉత్తేజం నెలకొంది. పండగ సీజన్‌లో వినిమయం పెరగడం ఆర్థిక వ్యవస్థకూ ఊరట ఇస్తోంది. గత పండగ సీజన్‌తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ఈసారి ఇప్పటికే అమ్మకాలు 9 నుంచి 12 శాతం మేర పెరిగాయి. కేరళలో ఓనం పండుగతో ప్రారంభమైన పండగ సీజన్ నవర్రాతి-దుర్గా పూజ, దసరా, కర్వా చౌత్, దంతేరస్ ఆపై దివాలితో ముగియనుండగా రిటైల్ సేల్స్ ఆశాజనకంగా సాగుతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఎలక్ర్టానిక్, ఆటోమొబైల్ సహా పలు రిటైల్ సేల్స్ వార్షిక అమ్మకాల్లో 35-40 శాతం వరకూ ఈ సీజన్‌లోనే ఉంటాయి. వాహనాలు, స్మార్ట్ టీవీ అమ్మకాలు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ ప్రోత్సాహకరంగా లేకపోవడంతో పండగ సీజన్ సేల్స్‌పైనే ట్రేడర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు దిగిరావడం, ఆఫర్ల వెల్లువతో బంపర్ సేల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇక దివాలి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు పోటాపోటీ ఆఫర్ల పటాస్‌లను పేల్చుతూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.దసరా సేల్‌ను మిస్సయ్యామని ఫీలయ్యే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలి సేల్‌తో ముందుకొచ్చింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. బిగ్ దివాలి సేల్‌లో రెడ్‌మి నోట్ 7 ప్రొ, రెడ్‌మినోట్ 7ఎస్, రెల్మీ 5, వివో జడ్1 ప్రొ సహా పలు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణలపై 75 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. బిగ్ దివాలీ సేల్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్ర్కైబర్లకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఈ సేల్‌లో రెడ్‌మి నోట్ 7 ప్రొ ఎంఆర్‌పీ 13,999 కాగా రూ 11,999కు లభిస్తుంది, రెడ్‌మి నోట్ 7ఎస్ (10,999) రూ 8999, రెల్మీ 5 రూ 9999కు, వివో జడ్1 ప్రొ (రూ 14,990) రూ 12,990 నుంచి ప్రారంభమవుతాయి. డిస్కౌంట్ ధరలతో పాటు బిగ్ దివాలి సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్‌లు, ఇతర వస్తువులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మరింత ఆకర్షణీయ ధరలకు అందుబాటులో ఉంటాయి. దాదాపు 50,000కు పైగా ఉత్పత్తులపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. శాంసంగ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ (32 ఇంచ్) సహా పలు గృహోపకరణాలపైనా భారీ డిస్కాంట్లు ఉంటాయని మైక్రోసైట్‌లో ఫ్లిప్‌కార్ట్ పొందుపరిచింది.
ఇక పలు ఎలక్ర్టానిక్ పరికరాలు, యాక్సెసరీస్‌పై 90 శాతం వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉందని పేర్కొంది. యాపిల్ వాచ్ సిరీస్ 3పైనా ఆకర్షణీయ తగ్గింపులను ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ర్టానిక్ ఉపకరణాలపై ధమాకా డీల్స్ పేరిట అదనపు డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ సేల్‌లో రష్ హవర్, మహా ప్రైస్ డ్రాప్ వంటి ఫ్లిప్‌కార్ట్ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బిగ్ దివాలీ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌కార్డును ఉపయోగించే వారికి పది శాతం అదనపు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఆఫర్లు ఇలా..
ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలి స్పెషల్ ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈనెల 25 వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, రుపే కార్డుహోల్డర్డ్స్‌కు పది శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. మొబైల్ ఫోన్లు సహా పలు ఎలక్ర్టానిక్ ఉత్పత్తులు, వస్తువులపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఎస్ 64జీబీ రూ 89,900 కాగా దివాలీ సేల్‌లో రూ 79,999కే ఆఫర్ చేస్తోంది. అందుబాటు ధరలో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ వివో యూ10పై ఎంఆర్‌పీ రూ 8,990 కాగా రూ 7,990కి ఆఫర్ చేస్తోంది. ఒన్‌ప్లస్ 7ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ 13,000 వరకూ తగ్గింపును ప్రకటించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ 32,999 కాగా రూ 29,999కు సేల్‌లో అందుబాటులో ఉంది. ఒన్‌ప్లస్ 7 ప్రొ ఎంఆర్‌పీ రూ 48,999 కాగా రూ 44,999కి అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఎంఆర్‌పీ రూ 51,990 కాగా రూ 41,999కి, శాంసంగ్ గెలాక్సీ ఎం 30 ఎంఆర్‌పీ రూ 13,999 కాగా రూ 11,999కి సేల్‌లో ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు రెడ్‌మి 7, రెల్మి వంటి స్మార్ట్ ఫోన్‌లు సహా స్మార్ట్ టీవీలు, వాచ్‌లు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment