
అధిక ధరల కారణంగా యాపిల్ (Apple) ఐఫోన్ కొనుగోలు చేయలేకపోయిన వారికి 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) శుభవార్త చెప్పింది. ఇప్పుడు 'ఐఫోన్15'ను కేవలం రూ. 26,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్
నిజానికి యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 69,990. ఇది ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో 58,499 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ఠగా రూ. 31,500 తగ్గింపు పొందవచ్చు. అంటే 58,499 రూపాయలలో.. 31,500 రూపాయలు తీసేస్తే.. రూ. 26,999 మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఐఫోన్ 15ను తక్కువ ధరలోనే కొనేయొచ్చు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్‌ఛేంజ్ చేసే మొబైల్ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఖచ్చితంగా రూ. 31,500 తగ్గింపు లభిస్తుందని అనుకోకూడదు.
ఇదీ చదవండి: అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్
ఐఫోన్ 15 డీటెయిల్స్
ఐఫోన్ 15 మొబైల్ 48 మెగాపిక్సెల్ కెమెరా పొందుతుంది. USB-C కనెక్టర్‌ను కలిగి మొట్ట మొదటి ఐఫోన్ మోడల్ ఇదే. ఇది హెక్సా-కోర్ యాపిల్ ఏ17 ప్రో చిప్‌ను కలిగి.. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది.