
మార్కెట్లో ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్కౌంట్స్ (Discounts) లేదా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తారు. అలాంటి వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 15 కొనుగోలుపై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) రూ.79,900 వద్ద మార్కెట్లో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లేకుండానే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.59,999లకు అందుబాటులో ఉంది. అంటే ఒక్కసారిగా ఐఫోన్ 15 ధర 19,091 రూపాయలు తగ్గింది.
ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌ఛేంజ్ కింద రూ. 45,200 తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్‌ఛేంజ్ అనేది.. మీరు ఎక్స్‌ఛేంజ్ చేసుకునే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తుందని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!
ఐఫోన్ 15 వివరాలు
ఐఫోన్ 15 ప్రీమియం మెటీరియల్‌తో తయారైంది. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా.. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం IP68 రేటింగ్ కూడా పొందింది. 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్.. యాపిల్ ఏ16 బయోనిక్ చిప్ పొందుతుంది. డ్యూయెల్ స్పీకర్లు కలిగిన ఈ ఫోన్ USB టైప్ సీ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment