iphone 15
-
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది. -
రూ. 26999లకే ఐఫోన్ 15!
అధిక ధరల కారణంగా యాపిల్ (Apple) ఐఫోన్ కొనుగోలు చేయలేకపోయిన వారికి 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) శుభవార్త చెప్పింది. ఇప్పుడు 'ఐఫోన్15'ను కేవలం రూ. 26,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్నిజానికి యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 69,990. ఇది ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో 58,499 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ఠగా రూ. 31,500 తగ్గింపు పొందవచ్చు. అంటే 58,499 రూపాయలలో.. 31,500 రూపాయలు తీసేస్తే.. రూ. 26,999 మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఐఫోన్ 15ను తక్కువ ధరలోనే కొనేయొచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఖచ్చితంగా రూ. 31,500 తగ్గింపు లభిస్తుందని అనుకోకూడదు.ఇదీ చదవండి: అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్ఐఫోన్ 15 డీటెయిల్స్ఐఫోన్ 15 మొబైల్ 48 మెగాపిక్సెల్ కెమెరా పొందుతుంది. USB-C కనెక్టర్‌ను కలిగి మొట్ట మొదటి ఐఫోన్ మోడల్ ఇదే. ఇది హెక్సా-కోర్ యాపిల్ ఏ17 ప్రో చిప్‌ను కలిగి.. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచెస్ డిస్ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. -
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
భారత్‌లో భారీగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఇదే..
ధర ఎక్కువైనప్పటికీ భారతీయ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు డిమాండ్ భారీగానే ఉంది. గత అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రికార్డ్ సేల్స్ సాధించి, 7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కెనాలిస్ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కూడా అత్యధికంగా 15 సిరీస్ మోడళ్లకు గిరాకీ ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో సులభ ఫైనాన్సింగ్ ఎంపికలు, రిటైలర్లకు ప్రోత్సాహక పథకాల కారణంగా.. పండుగ సీజన్లో అమ్మకాలు బాగా పెరిగాయి. అంతే కాకుండా గతేడాది ఐ15 సిరీస్ లాంచ్ అవ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ మీద కూడా సంస్థ తగ్గింపులు ప్రకటించడంతో ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. యాపిల్ మొబైల్స్ అమ్మకాల తరువాత శాంసంగ్, షావోమి, వివో, రియల్మీ, ఒప్పో వంటి కంపెనీలు మంచి అమ్మకాలను పొందాయి. భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ల సంఖ్య 14.86 కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది 5జీ పరికరాల ధరలు పెరుగుదల కారణంగా.. తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. కానీ కెనాలిస్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మకాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అయితే అమ్మకాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన విషయమే.. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. -
‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’!
ఐఫోన్! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్‌ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి తండ్రి ఏం చేశాడు. గత దశాబ్దకాలంగా లేటెస్ట్గా మార్కెట్లో విడుదలవుతున్న గాడ్జెట్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్ తయారు చేసిన ఐఫోన్‌తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం. నాకు ఐఫోన్ 15 కావాలి తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్‌టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్ 13 ఫోన్‌ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. ఐఫోన్ 13 కొనిస్తా నాన్న అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్ 8ని ఇచ్చాను. ఆ ఫోన్‌తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్ అడిగిందని ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్ ఐఫోన్ సిరీస్‌లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. అయితే, ఆఫోన్ 120హెచ్‌జెడ్ డిస్ప్లే ఉందని, గేమ్స్ ఆడుకునేందుకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ని కోరుకుంటుంది. ఆ ఫోన్ కూడా అంతే 120 హెచ్‌జెడ్ డిస్ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను. కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది. గడుగ్గాయ్.. చివరికి అనుకున్నది సాధించింది ‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని మొండిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. -
ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు! ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
నీతా అంబానీ మొబైల్ రూ.400 కోట్లా? నిజమెంత?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఖరీదైన బంగ్లా, అన్యదేశ్య కార్లతో పాటు, వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్ అన్నీ కూడా వారి రేంజ్‌కు తగ్గట్టుగానే ఉంటాయి. గతంలో నీతా అంబానీ ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరిగాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నీతా అంబానీ రూ.400 కోట్లు విలువైన మొబైల్ ఉపయోగిస్తుందని గతంలో వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉపయోగిస్తుందని సమాచారం. ఈ మొబైల్ ధర రూ.159900 నుంచి రూ.199900 వరకు ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ భారతీయ మార్కెట్లో తయన్త ఖరీదైన మొబైల్స్ జాబితాలో ఒకటైన 'యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్' నేచురల్ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది! ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనేది కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ17 బయోనిక్ చిప్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవి 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులను తెగ ఆకర్శించేస్తున్నాయి. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్‌ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్‌ను డిస్కౌంట్‌పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్‌లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్‌తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
ఆనంద్ మహీంద్రా వాడే ఫోన్ ఏంటో తెలుసా?
తయారీలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మేడిన్ ఇండియా ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కళ్లకు కట్టినట్లు చూపించారు. టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. తమ ప్రీమియం ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో తెలిపారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గూగుల్ నిర్ణయంపై ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో మేడిన్ ఇండియా గురించి తన ఎదురైన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల,ఆనంద్ మహీంద్రా అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా లోకల్ సిమ్ కొనుగోలు చేసేందుకు వెరిజాన్ స్టోర్‌కి వెళ్లారు. అక్కడ భారత్‌లో తయారైన ఐఫోన్ -15 కోసం సిమ్ కావాలని అడగ్గా సదరు సేల్స్ పర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను వ్యక్తం చేసిన ఆశ్చర్యం నాకు ఆనందాన్ని కలిగించింది’ అంటూ ఇదే విషయాన్ని ట్వీట్లో పేర్కొన్నారు. I recently was in a Verizon store in the U.S to get a local sim and proudly informed the salesperson that my iPhone 15 was made in India. It was a particular pleasure to see his raised eyebrows! I also have a Google Pixel. I will switch to the India-made version when it’s out. So… https://t.co/QouFIOSu1M — anand mahindra (@anandmahindra) October 20, 2023 అంతేకాదు తన వద్ద గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది. మేడిన్ ఇండియా ‘పిక్సెల్’ విడుదలయ్యాక దాన్నీ తీసుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్‌లైన్‌తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్‌ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్‌కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్‌ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
ఐఫోన్ 16 ఫోన్ ఫీచర్లు లీక్.. భారీ మార్పులు చేయనున్న యాపిల్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 15 విడుదలైందో లేదో టెక్ ప్రియులు ఐఫోన్ 16 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 ఫీచర్లు ఇలా ఉండబోతున్నాయంటూ పలు లీకులు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ని సైతం అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో విడుదల చేయనుందని సమాచారం. ముఖ్యంగా స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్జెడ్గా ఉంది. ఇప్పటి వరకు అన్నీ ఐఫోన్లలోని రిఫ్రెష్ రేటు 60 ఉండగా.. దీనిపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే ఐఫోన్ 16లో రిఫ్రెష్ రేటుని 120హెచ్‌జెడ్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ సైజ్ 6.9 అంగుళాలు ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలతో లార్జ్ డిస్ప్లే ఉండనుంది. అదే సిరీస్‌లోని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌తో రావచ్చు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ స్క్రీన్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని అంచనా. ఐఫోన్ 15 సిరీస్ వరకు విడుదలైన స్టాండర్డ్, ప్లస్ ఫోన్ల డిస్ప్లేలు 6.1-అంగుళాల, 6.7-అంగుళాల స్క్రీన్లను కొనసాగిస్తుందని లీకులు వచ్చాయి. సాలిడ్-స్టేట్ బటన్లు ఐఫోన్ ఎస్ సిరీస్ హోమ్ బటన్‌లో కనిపించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ మాదిరిగానే ఐఫోన్ 15 ప్రో లైనప్‌తో సాలిడ్-స్టేట్ బటన్లను పరిచయం చేయాలని యాపిల్ మొదట భావించింది. ఐఫోన్ 15 ప్రోలో ఈ ఫీచర్ కార్యరూపం దాల్చనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో సాలిడ్-స్టేట్ బటన్లు ఉండొచ్చని యాపిల్ ఫోన్ అనలిస్ట్ మింగ్-చి కువో సూచించారు. ‘టెట్రా-ప్రిజం’ అంతేకాకుండా, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లో కనిపించే ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరా రాబోయే ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీ 3x నుండి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసే అవకాశం ఉంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను చేర్చాలని అంచనా వేస్తున్నారు. లైట్ తక్కువగా ఉన్నా మెరుగైన పనితీరును అందిస్తుంది. చిప్ సెట్ డిజైన్లలో మార్పులు ప్రస్తుత ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు వెనుక రెండు సెన్సార్లను కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్‌లో నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉందని పలువురు టెక్నాలజీ నిపుణులు ఆశిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల కోసం A18 ప్రో చిప్‌ని ఉపయోగించవచ్చని అంచనా. -
వరుస సమస్యలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి.. ఐఫోన్ 15తో ఈ సారి ఏకంగా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కి వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి? ఇటీవల ఆ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్లలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బంది పడుతుండగా.. ఫోన్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని యాపిల్ సైతం హామీ ఇచ్చింది. అయినప్పటికీ, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యాపిల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బీఎండబ్ల్యూ వినియోగదారులు ఐఫోన్ 15 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే సమయంలో హార్డ్‌వేర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నివేదికల ప్రకారం బీఎండబ్ల్యూ వైర్లెస్ ఛార్జర్లు ఐఫోన్ 15 ఎస్ వేడెక్కడానికి కారణమవుతున్నాయి. కారు వైర్లెస్ ఛార్జర్లను ఉపయోగిస్తున్నప్పుడు వారి ఐఫోన్ 15 చాలా వేడెక్కిందని, దానిని డిస్కనెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదని బీఎండబ్ల్యూ కార్ల యాజమానులు చెప్పారంటూ నివేదికలు హైలెట్ చేశాయి. ఫోన్ కూల్ అయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత ఫోన్ పనితీరు పునఃప్రారంభమవుతున్నట్లు గమనించానని ఓ వినియోగదారుడు తెలిపాడు. మరి ఈ సమస్య నుంచి యాపిల్, ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఆ రెండు కంపెనీలు బీఎండబ్ల్యూ కార్లలోని ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇంతకుముందు బీఎండబ్ల్యూ కార్ల వినియోగదారులతో పాటు ఇతర ఐఫోన్ 15 యూజర్లు యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేశారు. వాటిల్లో ప్రధానంగా... ఫోన్ మాట్లాడేటప్పుడు లేదంటే, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ వెనుక భాగం హీటెక్కుతుంది. ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. మరికొందరు ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు యాపిల్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. చదవండి👉 ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్ -
చెవులకు చిల్లు.. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుగోలు దారులకు రోజుకో కొత్త సమస్య ఎదురవతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నట్లు యాపిల్‌కు పిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐ ఫోన్15 సిరీస్ ఫోన్లోని ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఫోన్ వ్యాల్యూమ్ ఎక్కువ పెట్టినప్పుడు వస్తున్న శబ్ధాలకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాదు, ఫోన్ నుంచి శబ్ధం వచ్చే సమయంలో ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఈ సమస్య ఎక్కువగా కాల్స్ చేసే సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో ఉత్పన్నమవుతుంది. దీంతో ఆడియో స్పష్టత లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని కస్టమర్లు వరుస ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. విడుదల నుంచి ఏదో ఒక సమస్య యాపిల్ ఎంతో అట్టహాసంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను వాడుతున్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా,యాపిల్ ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ ఫోన్లలో హీటింగ్ సమస్యపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఫోన్ వెనుక భాగం వేడెక్కుతుందని కస్టమర్లు ఫిర్యాదు చేసినట్లు యాపిల్ యాజమాన్యం ధృవీకరించింది. సమస్యల్ని పరిష్కరిస్తాం అయితే ఈ సమస్య కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్‌లోని బగ్ ఇందుకు కారణమని గుర్తించినట్లు చెప్పింది. దాంతోపాటు థర్డ్‌పార్టీ యాప్‌ల నుంచి వచ్చే అప్డేట్లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఒఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తామని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సారి ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌లో సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్‌తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్‌లో పరిచయం చేసింది. టైటానియం బాడీ కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి. పర్యావరణహితం లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్‌స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్‌తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్‌లను ఉపయోగించారు. యాక్షన్ బటన్ సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్లలో మ్యూట్ స్విచ్‌కి బదులుగా యాక్షన్ బటన్‌ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్ల కోసం షార్ట్‌కట్‌గా ఉంటుంది. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కొత్త ఐఫోన్లు సరికొత్త Qi2 వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్‌ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు. A17 ప్రో చిప్ మొదటి 3-నానోమీటర్ చిప్‌గా పిలిచే A17 ప్రో చిప్‌ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్. కన్సోల్ గేమింగ్ యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్లస్ట్ ఈవెంట్లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది. 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్‌లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్‌లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్‌కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్‌ను ఇందులో ఉంది. టెట్రాప్రిజం డిజైన్ జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్‌ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్తో కూడిన టెట్రాప్రిజం డిజైన్‌ను కలిగి ఉంటుంది. -
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై విమర్శలు.. స్పందించిన యాపిల్!
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’(WonderLust) పేరుతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఆ ఫోన్ల అమ్మకాలు కొనసాగుతుండగా.. వాటిని కొన్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విమర్శలపై యాపిల్ స్పందించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వేడెక్కడంతో పాటు టైటానియం ఫ్రేమ్, కొత్త ఫీచర్, రంగు మారుతున్నట్లు యూజర్లు యాపిల్ సంస్థకు మెయిల్స్ పెడుతున్నారు. స్పందించిన యాపిల్ ఈ క్రమంలో ఫోన్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు యాపిల్ రంగంలోకి దిగింది. ఫోన్ వేడెక్కడానికి కారణం ఫోన్ హార్డ్‌వేర్ డిజైన్ కాదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27న ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేసిన వెర్షన్ 302 వల్లేనని యాపిల్ చెప్పినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని యాపిల్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ ఫోన్ వేడెక్కడానికి ఇన్స్టాగ్రామ్, ఊబెర్, వీడియోగేమ్ అస్ఫల్ట్ అని తెలిపారు. వీటి వినియోగం వల్లే ఐఫోన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఫోన్ వేడి వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఛార్జింగ్ మరో కారణం 20డబ్ల్యూ కంటే ఎక్కువ ఛార్జింగ్ సామర్థ్యంతో యూఎస్బీ-సీ పవర్ అడాప్టర్లను ఉపయోగించడం, ఫోన్‌ను పునరుద్ధరించిన కొద్దిసేపటికే బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెసింగ్ కారణంగా ఫోన్ వేడెక్కేందుకు దోహదం చేస్తుందన్నారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ సమస్యలకు పరిష్కారం చూపించాలని, లేదంటే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్
టెక్ విభాగంలో యాపిల్ సంస్థకు, ఆ కంపెనీ విడుదల చేసే ప్రొడక్ట్‌లకు మార్కెట్లో ఉన్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే యాపిల్ విడుదల చేసే ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవాలని టెక్ లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా ఐఫోన్లు. అవి విడుదలైతే వాటిని పోటీ పడి మరి దక్కించుకోవాలని అనుకుంటారు. అందుకే వినియోగదారుల డిమాండ్ తగ్గట్లు యాపిల్ సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేస్తుంది. తాజాగా, యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ కోసం యూజర్లు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. తీరా.. ఎంతో ముచ్చటపడి కొన్న ఫోన్లు విపరీతంగా వేడెక్కడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి ఫోన్‌ని దక్కించుకుంటే ఇలా అయ్యిందేంటని తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా, ఐఫోన్ 15 సిరీస్‌లోని ఐఫోన్ ప్రో, ఐఫోన్ మ్యాక్స్‌లో గేమ్స్ ఆడే సమయంలో, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫోన్ల వెనుక భాగం వేడెక్కుతుందని చెబుతున్నారు. మరికొందరు ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఇదే తరహా సమస్య ఎదుర్కొంటున్నట్లు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు.కస్టమర్ల ఫిర్యాదుతో యాపిల్ టెక్నీకల్ సపోర్ట్ టీం సైతం గతంలో ఐఫోన్‌ను ఎలా వినియోగించాలో వివరిస్తూ బ్లాగ్‌లో రాసిన ఆర్టికల్స్‌ను చదవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాగ్ ఆర్టికల్‌లో ఫోన్ కూల్‌గా, హీట్‌గా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ .. అందుకు కారణాలు 👉సూపర్ ఛార్జ్ ప్రాసెసర్ల కారణంగా ఐఫోన్లు వేడెక్కుతుంది. 👉వినియోగదారులు తమ కొత్త ఫోన్లో యాప్‌లు, డేటా, ఫోటోలను డౌన్లోడ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల హీటెక్కుతుంది. 👉ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. 👉చాలా మంది యూజర్లు థర్మామీటర్‌తో ఫోన్ ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓ పోస్ట్ ప్రకారం, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ త్వరగా వేడెక్కుతుంది. సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం వల్లేనని మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. 👉పలువురు ఐఫోన్ 15 ప్రో యూజర్లు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదని, మునుపటి మోడల్లకు అనుగుణంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఉన్నాయని చెబుతున్నారు. 👉ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కాల్ సమయంలో స్విచ్ ఆఫ్ అయ్యేంత వేడిగా ఉంది. సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది : మరో యూజర్ 👉ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లు శక్తివంతమైన గ్రాఫిక్స్ ఇంజన్‌తో కొత్త ఏ17 చిప్‌లు ఉన్నాయి. బహుశా గేమింగ్ పనితీరును మెరుగుపడే సమయంలో వేడెక్కొచ్చని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
అమెరికా నుంచి యాపిల్ (Apple) ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) మోడల్ తెప్పించుకుంటున్నారా? భారత్‌లో కంటే ధర తక్కువన్న కారణంతో అక్కడ ఉంటున్న బంధువులు, స్నేహితుల ద్వారా ఈ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఐఫోన్ 15 మోడల్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సహా భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఆఫ్‌లైన్ యాపిల్ స్టోర్లు, ఆన్లైన్ ఛానెల్‌లలో కస్టమర్లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. కాగా ఐఫోన్ 15 ప్రో ధర భారత్‌లో రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అయితే రూ. 1,59,900 ఉంది. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) అదే సమయంలో ఐఫోన్ ప్రో మోడల్స్‌ను దిగుమతి చేసుకునే గ్రే మార్కెట్ ప్రాక్టీస్ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. విదేశాల్లోని తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా భారతీయ కస్టమర్లు అక్కడ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, యూఏఈ వంటి దేశాలలో ఐఫోన్ ప్రో మోడల్స్ తక్కువ ధరకు లభిస్తుండటమే దీనికి కారణం. అమెరికా ఐఫోన్లతో ఇదే సమస్య అయితే విదేశాల్లో లభించే ఐఫోన్లలో ఉండే సమస్యల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ముఖ్యమైనది ఫిజికల్ సిమ్ స్లాట్ లేకపోవడం. ప్రధానంగా యూఎస్ నుంచి కొనుగోలు చేసే ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ 15లలో ఈ-సిమ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ ఆ దేశంలో ఫిజికల్ స్లాట్లతో కూడిన ఫోన్లను విక్రయించడం ఆపేసింది. కాబట్టి ఫిజికల్ సిమ్ స్లాట్ కావాలంటే యూఎస్ వేరియంట్‌ను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇక యూరప్, యూఏఈ వంటి ఇతర దేశాల్లో లభించే ఫోన్లకు సింగిల్ సిమ్ స్లాట్లు ఉంటాయి. ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లు కావాలంటే.. హాంకాంగ్‌లో లభించే ఐఫోన్లు ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లతో వస్తాయి. ఏకకాలంలో రెండు సిమ్ కార్డ్‌లను వీటిలో ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ భారత్‌లో విక్రయిస్తున్న ఐఫోన్ 15 ప్రో వేరియంట్లో కూడా లేదు. ఇందులో ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. -
షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు యాపిల్ (Apple) ఐఫోన్లు. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను యాపిల్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చినప్పుటి నుంచి రోజుకో కంప్లైంట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)పై జెర్రీరిగ్ఎవెరీథింగ్ (JerryRigEverything) అనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన నాణ్యత పరీక్షకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ నాణ్యతపై రకరకాల పరీక్షలు చేశారు. దీంట్లో ప్రధానంగా కేవలం చేతి వేళ్లలో వంచగానే ఫోన్ వెనుకవైపున్న గ్లాస్ చిట్లిపోయింది. Oh man team no case on iPhone 15 Pro Max going to be interesting… pic.twitter.com/X9yng11umf — Miguel Lozada (@MLozada) September 23, 2023 ‘ఐఫోన్15 ప్రో మ్యాక్స్‌ను అత్యంత దృఢమైన గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేసినట్లు యాపిల్ ప్రకటించినప్పుడు తాను ఆశ్చర్యపోయాను. కానీ టైటానియం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెనుక గ్లాస్ ప్రైమ్ టైమ్ కోసం సిద్ధంగా లేదని తేలింది. యాపిల్స్ కొత్త ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఏదో తప్పు జరిగింది’ అని వీడియో డిస్క్రిప్షన్లో ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు. యూట్యూబ్‌లో సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8.5 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. 2.6 లక్షలకుపైగా లైక్‌లు రాగా వేలాది మంది కామెంట్లు చేశారు. "నేను షాక్ అయ్యాను. ప్రో మాక్స్ అంత తేలిగ్గా బ్రేక్ అవుతుందని ఊహించలేదు.. ఆ బ్రేక్ షాకింగ్ గా ఉంది" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ను కొంతమంది ‘ఎక్స్’ (ట్విటర్)లోనూ షేర్ చేశారు. -
భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో..
ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా యాపిల్ ఐఫోన్స్కి డిమాండ్ భారీగా ఉందనే విషయం తెలిసిందే. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైన రోజు ఈ లేటెస్ట్ ఫోన్ కొనటానికి కస్టమర్లు ఎంత ఉత్సాహం చూపించారనే వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. డిమాండ్ పెరిగే కొత్త ధరలు అమాంతం పెంచుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో ఐఫోన్ 15 మొబైల్స్ మేనియా కొనసాగుతోంది. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి అసలు ధర ఎక్కువ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. రిటైలర్లు కూడా ఇదే అదనుగా చూసుకుని ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎమ్ఆర్పీ ధరలపై రూ. 20వేలు నుంచి రూ. 32వేలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ నేచురల్ టైటానియం కలర్ ఫోన్ మీద రిటైలర్లు రూ. 20,000 ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేదు - కారణం ఇదే! ఐఫోన్ 15 సిరీస్ అసలు ధరలు.. భారతీయ మార్కెట్లో 15 సిరీస్ మొబైల్స్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు స్టోరేజ్ ఆప్సన్స్ మీద ఆధార పది ఉంటాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన 15 ప్రో ధర రూ. 1,34,900. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1 టీబీ ధర రూ. 1,99,900 వరకు ఉంది. -
ఐఫోన్ 15పై మనసుపడిన మస్క్.. రీజన్ ఇదేనట!
మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విడుదలైనప్పటి నుంచి దానిపై ఉన్న అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అనుకున్న విధంగా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా మస్క్ కూడా ఒక ఐఫోన్ 15 కొనాలని మనసులో మాట చెప్పాడు. 2023 సెప్టెంబర్ 22 నుంచి ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సేల్స్ ప్రారంభించడానికి ముందే ఐఫోన్ లవర్స్ స్టోర్ల ముందు గంటల కొద్దీ పడిగాపులు కాస్తూ ఎదురు చూసారు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్.. ఫోటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వుతో కలిసి ఉన్న ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఫోటోగ్రాఫర్లకు ఐఫోన్ పనిని చూపించడం కనిపిస్తుంది. ఇందులో రోడ్ ఐలాండ్‌లోని వేసవి అందం నుంచి ఉటాలోని ఇతర ప్రపంచ ఎడారుల వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను ఇక్కడ గమనించవచ్చు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. దీనిపైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఐఫోన్ ఫోటోలు & వీడియోల అందం అపురూపంగా ఉందని అన్నారు. తాను కూడా ఒకటి కొనబోతున్నట్లు ట్వీట్ చేసాడు. దీనికి కొంతమంది ఏ మోడల్ కొనబోతున్నావు, ఏ కలర్ ఎంచుకోబోతున్నావని అడుగుతున్నారు. అయితే మస్క్ ఐఫోన్ 15 కొంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. The beauty of iPhone pictures & video is incredible — Elon Musk (@elonmusk) September 22, 2023 I’m buying one! — Elon Musk (@elonmusk) September 22, 2023 -
అయ్యో పాపం.. ఐఫోన్ 15 కోసం ఎంతకు తెగించారో చూడండి..
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 23 నుంచి లభ్యం కావడంతో ఈ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. విడుదలై గంటలు గడవక ముందే ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కమలా నగర్‌కు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌కి కొంత మంది ఐఫోన్ల కోసం వచ్చారు. అయితే, ఫోన్ల డెలివరీ కాస్త ఆలస్యం అవుతుందని స్టోర్ సిబ్బంది చెప్పడంతో కోపోద్రికులయ్యారు. డెలివరీ అలస్యం అవుతుందని చెప్పిన స్టోర్ ఉద్యోగి దుస్తులు చించారు. ఆపై దారుణంగా కొట్టారు. స్టోర్‌లోని ఇతర సిబ్బంది వినియోగదారుల్ని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. ప్రస్తుతం, ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై స్టోర్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్టోర్ సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డ కస్టమర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi Police took legal action against the customers after a scuffle broke out between customers and mobile shop employees after an alleged delay in supplying iPhone 15 to him in the Kamla Nagar area of Delhi (Viral Video Confirmed by Police) pic.twitter.com/as6BETE3AL — ANI (@ANI) September 23, 2023 చదవండి : కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ? -
ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మనచెంతకే వచ్చేలా చేసుకుంటున్నాం. అలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఒకటి 'బ్లింకిట్' (Blinkit). కిరాణా, ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసరాలను డెలివరీ చేసే ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం ఐఫోన్స్ కూడా డెలివరీ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. ఈ మొబైల్ సేల్స్ నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్లు ఓపెన్ చేయక ముందు నుంచే కస్టమర్లు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఐఫోన్ డెలివరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు! ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లో బ్లింకిట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేస్తున్నట్లు నెటిజన్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం బ్లింకిట్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Love this 🫶 https://t.co/qhCUjDqbKc — Albinder Dhindsa (@albinder) September 22, 2023 -
నేను ఏం కొంటే నీకేంట్రా నొప్పి.. నా డబ్బు.. నా ఖర్చు: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తనకు నచ్చని, నచ్చిన విషయం ఏమైనా తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తుంది. కొన్నిసార్లు నెటిజన్లు ఆమెపట్ల నెగటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. తను మంచి చెప్పినా కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. వాటిని ఆమె తిప్పి కొడుతూనే తన పని తాను చేసుకుంటు పోతుంటుంది. తాజాగా అలాంటి ఘటనే మంచు లక్ష్మీ విషయంలో జరిగింది. ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబయి వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్ అపరిశుభ్రంగా ఉండటం గమనించి ఆపై ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్లు శుభ్రంగా లేవని సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్లు నవ్వి ఊరుకున్నారని తెలిపారు. పరిశుభ్రత అనేది ప్రయాణికుల హక్కు అని ఆమె తెలిపారు. తన ఐఫోన్ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనపడేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. అందుకు గాను ఎయిర్ ఇండియా కూడా స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: తెలుగు టాప్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?) కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై చేసిన కామెంట్లకు ఇలా స్పందించారు. 'ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. అంతే వరుసగా చాలామంది కామెంట్లు చేశారు. వారందురూ ఎలాంటి కామెంట్లు చేశారంటే.. ‘ఓహో.. నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా’ అంటూ కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ‘ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా’. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటిరా.. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏదీ చేయకూడదు. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి..? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మాకు ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.. చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.' అంటూ మంచు లక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023 -
ఐఫోన్ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..
Complaints on iphone 15: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యాపిల్ (apple) ఐఫోన్ 15 (iphone 15) సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు మొదలైన కొన్ని గంటల్లోనే కొత్త ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిజైన్, సాంకేతిక సమస్యలపై కంప్లైంట్లు వచ్చాయి. కొత్త ఐఫోన్ మన్నిక పరీక్షలలో పేలవంగా పని చేసిందని, అసమాన రంగులు, ఇతర లోపాలను కలిగి ఉందని టెక్ ఔత్సాహికులు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి. ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్ల వద్ద వందలాది మంది క్యూలు కట్టారు. “మొదటి ఐఫోన్ 15 ప్రో డ్రాప్ టెస్ట్ గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రో కంటే అధ్వాన్నమైన మన్నికను చూపుతోంది. కొత్త వంపు అంచులు స్ట్రెయిట్ ఎడ్జ్ డిజైన్ కంటే పెళుసుగా కనిపిస్తున్నాయి" ఒకరు పోస్ట్ చేశారు. 'సాఫ్ట్వేర్ గ్లిచ్' అని మరొక క్లిప్ ఫ్లాగ్ చేసింది. కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై గీతలు వచ్చినట్లు ఫిర్యాదు చేసింది. “ఐఫోన్ 15 ప్రో కొన్ని యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కలరింగ్ సమాంతరంగా లేదు. అంతేకాకుండా స్క్రీన్ అంచులతో సరిగ్గా అలైన్ చేయలేదు" అని ‘ఎక్స్’(ట్విటర్) యూజర్ షేర్ చేశారు. కొన్ని నివేదికలు కొత్త ఫోన్‌ను 'ఫింగర్‌ప్రింట్ మాగ్నెట్'గా పేర్కొన్నాయి. మరికొందరు రంగు మార్పును తోసిపుచ్చడానికి యాపిల్ సపోర్ట్ కథనాన్ని ఉదహరించారు. యూజర్ల చర్మం నుంచి వచ్చే నూనె ఐఫోన్ 15 బాహ్య బ్యాండ్ రంగును తాత్కాలికంగా మార్చవచ్చు. ఐఫోన్‌ను కొద్దిగా తడిగా ఉన్న మెత్తని గుడ్డతో తుడవడం వల్ల అసలు రంగు వస్తుందని యాపిల్ కంపెనీ సపోర్ట్ సమాచారంలో పేర్కొంది. It appears that some units of the iPhone 15 Pro are defective. The coloring was not applied evenly, furthermore the screen seems not to be perfectly aligned with the edges pic.twitter.com/krzhz4gv4f — Majin Bu (@MajinBuOfficial) September 22, 2023