ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుగోలు దారులకు రోజుకో కొత్త సమస్య ఎదురవతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ల నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నట్లు యాపిల్‌కు పిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఐ ఫోన్15 సిరీస్ ఫోన్‌లోని ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఫోన్ వ్యాల్యూమ్ ఎక్కువ పెట్టినప్పుడు వస్తున్న శబ్ధాలకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోతున్నారు.
అంతేకాదు, ఫోన్ నుంచి శబ్ధం వచ్చే సమయంలో ఆ ఫోన్‌ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఈ సమస్య ఎక్కువగా కాల్స్ చేసే సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో ఉత్పన్నమవుతుంది. దీంతో ఆడియో స్పష్టత లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని కస్టమర్లు వరుస ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు.
విడుదల నుంచి ఏదో ఒక సమస్య
యాపిల్ ఎంతో అట్టహాసంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్‌లను వాడుతున్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా,యాపిల్ ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ ఫోన్‌లలో హీటింగ్ సమస్యపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఫోన్ వెనుక భాగం వేడెక్కుతుందని కస్టమర్లు ఫిర్యాదు చేసినట్లు యాపిల్ యాజమాన్యం ధృవీకరించింది.
సమస్యల్ని పరిష్కరిస్తాం
అయితే ఈ సమస్య కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్‌లోని బగ్ ఇందుకు కారణమని గుర్తించినట్లు చెప్పింది. దాంతోపాటు థర్డ్‌పార్టీ యాప్‌ల నుంచి వచ్చే అప్‌డేట్‌లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఒఎస్ 17 అప్‌డేట్‌ను విడుదల చేస్తామని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment