టెక్ విభాగంలో యాపిల్ సంస్థకు, ఆ కంపెనీ విడుదల చేసే ప్రొడక్ట్‌లకు మార్కెట్‌లో ఉన్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే యాపిల్ విడుదల చేసే ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవాలని టెక్ లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా ఐఫోన్‌లు. అవి విడుదలైతే వాటిని పోటీ పడి మరి దక్కించుకోవాలని అనుకుంటారు. అందుకే వినియోగదారుల డిమాండ్ తగ్గట్లు యాపిల్ సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేస్తుంది.
తాజాగా, యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ కోసం యూజర్లు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. తీరా.. ఎంతో ముచ్చటపడి కొన్న ఫోన్లు విపరీతంగా వేడెక్కడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి ఫోన్‌ని దక్కించుకుంటే ఇలా అయ్యిందేంటని తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు.
ముఖ్యంగా, ఐఫోన్ 15 సిరీస్‌లోని ఐఫోన్ ప్రో, ఐఫోన్ మ్యాక్స్‌లో గేమ్స్ ఆడే సమయంలో, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫోన్‌ల వెనుక భాగం వేడెక్కుతుందని చెబుతున్నారు. మరికొందరు ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఇదే తరహా సమస్య ఎదుర్కొంటున్నట్లు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు.కస్టమర్ల ఫిర్యాదుతో యాపిల్ టెక్నీకల్ సపోర్ట్ టీం సైతం గతంలో ఐఫోన్‌ను ఎలా వినియోగించాలో వివరిస్తూ బ్లాగ్‌లో రాసిన ఆర్టికల్స్‌ను చదవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాగ్ ఆర్టికల్‌లో ఫోన్ కూల్‌గా, హీట్‌గా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు.
వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ .. అందుకు కారణాలు
👉సూపర్ ఛార్జ్ ప్రాసెసర్‌ల కారణంగా ఐఫోన్‌లు వేడెక్కుతుంది.
👉వినియోగదారులు తమ కొత్త ఫోన్‌లో యాప్‌లు, డేటా, ఫోటోలను డౌన్‌లోడ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల హీటెక్కుతుంది.
👉ఇన్‌స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు.
👉చాలా మంది యూజర్లు థర్మామీటర్‌తో ఫోన్ ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓ పోస్ట్ ప్రకారం, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ త్వరగా వేడెక్కుతుంది. సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం వల్లేనని మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
👉పలువురు ఐఫోన్ 15 ప్రో యూజర్లు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదని, మునుపటి మోడల్‌లకు అనుగుణంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లు ఉన్నాయని చెబుతున్నారు.
👉ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కాల్ సమయంలో స్విచ్ ఆఫ్ అయ్యేంత వేడిగా ఉంది. సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది : మరో యూజర్
👉ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లు శక్తివంతమైన గ్రాఫిక్స్ ఇంజన్‌తో కొత్త ఏ17 చిప్‌లు ఉన్నాయి. బహుశా గేమింగ్ పనితీరును మెరుగుపడే సమయంలో వేడెక్కొచ్చని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment