మరో వారం పది రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానుంది. ఈ తరుణంలో ఐఫోన్ తయారీ విషయంలో ఏదో ఒక రూమర్ సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిగ్గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఐఫోన్ తయారీపై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. అందులో ఐఫోన్ 15 తయారీ భారీ తగ్గిందని.. భారీ అమ్మకాలు, డిమాండ్ దృష్ట్యా ఇది యాపిల్ సంస్థకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
9 టూ 5 రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల ప్రముఖ హాంకాంగ్ పెట్టుబడి సంస్థ హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 15 యూనిట్లు తయారవుతాయో అంచనా వేశారు. గతంలో 83 మిలియన్ యూనిట్లు వస్తాయని అంచనా వేసిన ఆయన..ఇప్పుడు 77 మిలియన్ యూనిట్లు మాత్రమే అని అన్నారు. ఫోన్ల తయారీకి అవసరమైన అన్ని విడిభాగాలను పొందడంలో సమస్యలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు కొనాలనుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున.. ఉత్పత్తి తగ్గించినట్లు జోస్యం చెప్పారు.
11 మిలియన్ యూనిట్ల తగ్గింపు
జెఫ్ పు నివేదికను ఊటంకిస్తూ ఐఫోన్ 15ను ఎన్ని ఉత్పత్తి అవుతాయో తెలుపుతూ మిజుహో అనే జపనీస్ బ్యాంక్ ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. అందులో 84 మిలియన్లు అవుతుందని భావించిన మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా 73 మిలియన్లు ఉత్పత్తి అవుతుందని చెప్పడం గమనార్హం. ఐఫోన్ 15 ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన విడి భాగాల్ని యాపిల్ పొందలేకపోతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆలస్యం
9 టూ 5 మరో నివేదికలో.. ఈ సెప్టెంబర్‌లో యాపిల్ సంస్థ ఈవెంట్ నిర్వహించనుంది. ఆ ఈవెంట్‌లో ఐఫోన్ 15 మోడల్స్‌ను విడుదల చేయనుంది. కానీ వాటిల్లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉండబోదని భావిస్తోంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కోసం అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోటోల్ని మరింత దగ్గరగా జూమ్ చేసేలా లేటెస్ట్ టెక్నాలజీతో కెమెరాను డిజైన్ చేయనుంది. అయితే కెమెరా విడిభాగాలను తయారు చేసే సోనీ సంస్థ ఐఫోన్ లాంచ్ కు సకాలంలో వాటిని అందించలేకపోతోంది. కాబట్టి, ఫ్యాన్సీ ఐఫోన్ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment