ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 15 విడుదలైందో లేదో టెక్ ప్రియులు ఐఫోన్ 16 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 ఫీచర్లు ఇలా ఉండబోతున్నాయంటూ పలు లీకులు వెలుగులోకి వచ్చాయి.
ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ని సైతం అప్‌గ్రేడ్ చేసి మార్కెట్‌లో విడుదల చేయనుందని సమాచారం. ముఖ్యంగా స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్‌జెడ్‌గా ఉంది. ఇప్పటి వరకు అన్నీ ఐఫోన్‌లలోని రిఫ్రెష్ రేటు 60 ఉండగా.. దీనిపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే ఐఫోన్ 16లో రిఫ్రెష్ రేటుని 120హెచ్‌జెడ్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
స్క్రీన్ సైజ్ 6.9 అంగుళాలు
ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలతో లార్జ్ డిస్‌ప్లే ఉండనుంది. అదే సిరీస్‌లోని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌తో రావచ్చు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ స్క్రీన్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని అంచనా. ఐఫోన్ 15 సిరీస్ వరకు విడుదలైన స్టాండర్డ్, ప్లస్ ఫోన్‌ల డిస్‌ప్లేలు 6.1-అంగుళాల, 6.7-అంగుళాల స్క్రీన్‌లను కొనసాగిస్తుందని లీకులు వచ్చాయి.
సాలిడ్-స్టేట్ బటన్‌లు
ఐఫోన్ ఎస్ సిరీస్ హోమ్ బటన్‌లో కనిపించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ మాదిరిగానే ఐఫోన్ 15 ప్రో లైనప్‌తో సాలిడ్-స్టేట్ బటన్‌లను పరిచయం చేయాలని యాపిల్ మొదట భావించింది. ఐఫోన్ 15 ప్రోలో ఈ ఫీచర్ కార్యరూపం దాల్చనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో సాలిడ్-స్టేట్ బటన్‌లు ఉండొచ్చని యాపిల్ ఫోన్ అనలిస్ట్ మింగ్-చి కువో సూచించారు.
‘టెట్రా-ప్రిజం’
అంతేకాకుండా, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లో కనిపించే ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరా రాబోయే ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీ 3x నుండి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసే అవకాశం ఉంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను చేర్చాలని అంచనా వేస్తున్నారు. లైట్ తక్కువగా ఉన్నా మెరుగైన పనితీరును అందిస్తుంది.
చిప్ సెట్ డిజైన్‌లలో మార్పులు
ప్రస్తుత ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు వెనుక రెండు సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్‌లో నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉందని పలువురు టెక్నాలజీ నిపుణులు ఆశిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల కోసం A18 ప్రో చిప్‌ని ఉపయోగించవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment