కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’(WonderLust) పేరుతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఆ ఫోన్‌ల అమ్మకాలు కొనసాగుతుండగా.. వాటిని కొన్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విమర్శలపై యాపిల్ స‍్పందించింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లు వేడెక్కడంతో పాటు టైటానియం ఫ్రేమ్, కొత్త ఫీచర్, రంగు మారుతున్నట్లు యూజర్లు యాపిల్ సంస్థకు మెయిల్స్ పెడుతున్నారు.
స్పందించిన యాపిల్
ఈ క్రమంలో ఫోన్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు యాపిల్ రంగంలోకి దిగింది. ఫోన్ వేడెక్కడానికి కారణం ఫోన్ హార్డ్‌వేర్ డిజైన్ కాదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27న ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ చేసిన వెర్షన్ 302 వల్లేనని యాపిల్ చెప్పినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని యాపిల్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ ఫోన్ వేడెక్కడానికి ఇన్‌స్టాగ్రామ్, ఊబెర్, వీడియోగేమ్ అస్ఫల్ట్ అని తెలిపారు. వీటి వినియోగం వల్లే ఐఫోన్‌లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఫోన్ వేడి వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు.
ఛార్జింగ్ మరో కారణం
20డబ్ల్యూ కంటే ఎక్కువ ఛార్జింగ్ సామర్థ్యంతో యూఎస్‌బీ-సీ పవర్ అడాప్టర్‌లను ఉపయోగించడం, ఫోన్‌ను పునరుద్ధరించిన కొద్దిసేపటికే బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెసింగ్ కారణంగా ఫోన్ వేడెక్కేందుకు దోహదం చేస్తుందన్నారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ సమస్యలకు పరిష్కారం చూపించాలని, లేదంటే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment