బంపర్‌ డిస్కౌంట్‌.. ఐఫోన్‌ 15పై రూ.10,000 తగ్గింపు! iPhone 15 Pro Max at Rs 10000 off | Sakshi
Sakshi News home page

బంపర్‌ డిస్కౌంట్‌.. ఐఫోన్‌ 15పై రూ.10,000 తగ్గింపు!

Published Sun, Dec 31 2023 7:15 PM

iPhone 15 Pro Max at Rs 10000 off - Sakshi

స్మార్ట్ ఫోన్‌ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్‌ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం.

కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ విజయ్‌ సేల్స్ తమ ఇయర్‌ ఎండ్‌ యాపిల్‌ సేల్‌ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌తో సహా కొన్ని లేటెస్ట్‌ యాపిల్‌ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది.  ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఐఫోన్‌ 15ప్రో 1టీబీ వేరియంట్‌ను డిస్కౌంట్‌పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ బేస్ 256జీబీ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్‌లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్‌ 14 మోడల్‌లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.

 

కేవలం ఐఫోన్‌లే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్‌తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్‌ ఎయిర్‌ (iPad Air 5th Gen) ఆఫర్‌ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్‌ సెకండ్‌ జనరేషన్‌ ఎయిర్‌ పాడ్స్‌ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement