న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్ స్మార్ట్ వాచీని విడుదల చేసింది. ఐఫోన్ 15 మోడళ్ల చార్జింగ్‌కు టైప్ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇతర యాపిల్ గాడ్జెట్లను సైతం టైప్ సీ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15, 15 ప్లస్ మోడళ్లకు ఏ 16 చిప్‌ను వినియోగించింది. వాచీ మోడళ్లకు రీసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందించిన విభిన్న స్ట్రాప్స్‌ను ప్రవేశపెట్టింది.
ఇక ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల కేసు తయారీలో టైటానియంను వినియోగించింది. ఏ17 చిప్‌ను వినియోగించింది. తద్వారా అత్యంత వేగవంత, మన్నికైన, తేలికపాటి ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ తెలియజేసింది. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, 15 ప్లస్‌కు 899 డాలర్లు చొప్పున నిర్ణయించింది.
ఇక ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్లు కాగా, ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్లుగా ప్రకటించింది. కొత్త ఐఫోన్ మోడళ్లన్నీ 48 ఎంపీ ప్రధాన కెమెరాతో విడుదలయ్యాయి. 6.1, 6.7 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ప్రవేశపెట్టింది. స్టోరేజీ 128 జీబీ, 256 జీబీతో విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment