న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా? | iPhone 15 Launch Today: Expected Indian Price, Rumors, Special Features, Design And More Details Inside - Sakshi
Sakshi News home page

iPhone 15 Launch Date: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా?

Published Tue, Sep 12 2023 11:02 AM | Last Updated on Tue, Sep 12 2023 11:40 AM

iPhone 15 Launch Expected Price Rumors Features Design and More - Sakshi

యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'వండర్‌లస్ట్' మెగా ఈవెంట్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇందులో సంస్థ ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ చేయనుంది. యాపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యాపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది. అర్బన్ డిక్షనరీ ప్రకారం, 'వండర్‌లస్ట్' అనే పదానికి అర్థం 'నిరంతరం అద్భుత స్థితిలో ఉండాలనే కోరిక'. టిమ్ కుక్ నేతృత్వంలోని కంపెనీ ఉత్పత్తులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్న కారణంగా ఈ పేరు పెట్టడం జరిగినట్లు తెలుస్తోంది.

యాపిల్ మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో అండ్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి వాటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9 కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఐఫోన్ 15 సిరీస్ ధరలు 1199 నుంచి 1299 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. లక్ష కంటే ఎక్కువ. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ మొబైల్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా వినియోగదారుని అవసరమైన ఆధునిక ఫీచర్స్ ఇందులో లభించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది!

గత ఏడాది ఇదే సమయంలో ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి 15 సిరీస్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. అయితే ఈరోజు జరిగే ఈవెంట్‌లో 16 సిరీస్ గురించి ప్రస్తావిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు జరిగే ఈవెంట్ చూడాలనుకునే వారు యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ స్ట్రీమ్, యాపిల్ టీవీ ద్వారా వీక్షించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement