new phone
-
సరికొత్త 'రియల్మీ జీటీ 7 ప్రో' వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారతీయ మార్కెట్లో 'జీటీ 7 ప్రో' లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందుతుంది.కొత్త రియల్మీ జీటీ 7 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.56,999), రెండు 16 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ. 62,999). ఇవి రెండూ నవంబర్ 29నుంచి కంపెనీ వెబ్సైట్లో, అమెజాన్ ఈ-కామర్స్ సైట్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం.మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభించే రియల్మీ జీటీ 7 ప్రో.. హై పర్ఫామెన్స్డ్ స్మార్ట్‌ఫోన్. ఇది 1.5కే రిజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాకుండా.. వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకునిజీటీ7 ప్రోలో.. సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం మరో 50MP Sony IMX906 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా &16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా వీడియో రీకరింగ్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి. పోర్ట్రెయిట్, నైట్, అండర్ వాటర్ వంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్లు ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..రియల్మీ జీటీ 7 ప్రో 5800mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐపీ69 నీరు & ధూళి నిరోధకతను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా మన్నికైనది, ఏ వాతావరణనైకైనా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 222.8 గ్రాములు.. పొడవు 162.45 మిమీ పొడవు, వెడల్పు 76.89 మిమీగా ఉంది.The #realmeGT7Pro is now more accessible!Get the flagship 12GB RAM + 512GB storage for just ₹56,999 & the 16GB RAM + 512GB storage for ₹62,999 with 50MP Periscope, IP69, AI features & more!#ExploreTheUnexploredJoin the Livestream: https://t.co/6E90cRlxyy pic.twitter.com/KYTnXPO6pa— realme (@realmeIndia) November 26, 2024 -
డేట్ ఫిక్స్.. ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ అప్పుడే
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 21న భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ కానుంది. ఇది ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అనే రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ పొందనుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అధిగమించగలదని సమాచారం. గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం ఏఐ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది.కంపెనీ.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కొన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త మొబైల్ హ్యాండ్సెట్లు, పర్ఫామెన్స్ అన్నీ కూడా దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 7.85 మిమీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ నాలుగువైపులా 1.45 మిమీ సన్నని బెజెల్స్‌తో 6.59 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ అనే రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రెండో వేరియంట్.. ఫైండ్ ఎక్స్8 ప్రో విషయానికి వస్తే.. రెండు వైపులా క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌తో పెద్ద 6.78 ఇంచెస్ డిస్ప్లే పొందనుంది. ఇది స్పేస్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్ఒప్పో ఫైండ్ ఎక్స్8 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రానుంది. ఎక్స్8 ప్రో 5910mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. కాగా కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధరలు నవంబర్ 21న వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
రిలయన్స్ జియో.. ఎట్టకేలకు జియోభారత్ సిరీస్‌లో వీ3, వీ4 ఫోన్లను ఆవిష్కరించింది. 2జీ ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులను 4జీ డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.ధరజియోభారత్ సిరీస్ మొబైల్ ఫోన్స్ ధర కేవలం రూ.1099 మాత్రమే కావడం గమనార్హం. వీ3, వీ4 రెండు మోడల్స్ త్వరలో ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ అవుట్లెట్లలో మాత్రమే కాకుండా జియో మార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కూడా 40 శాతం తక్కువ. జియో భారత్ సిరీస్ ఫోన్ కేవలం రూ.123 రీఛార్జ్ ప్లాన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ వరకు డేట్ లభిస్తుంది.బ్యాటరీ & స్టోరేజ్జియోభారత్ సిరీస్ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ పొందుతాయి. 125 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి.వీ3, వీ4 రెండు మోడల్‌ల ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవవచ్చు. జియో టీవీ వినియోగదారులు ఈ మొబైల్స్ ద్వారా తమకు ఇష్టమైన షోలు, వార్తలు లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్ యాక్సెస్ పొందుతారు.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుజియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో, డిజిటల్ పేమెంట్లు సులభంగా చేసుకోవడానికి కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. జియోచాట్ యూజర్లు అన్లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ పొందుతారు. తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ ఈ ఫోన్స్ అనుమతిస్తాయి. -
ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం
న్యూఢిల్లీ: కొత్త ఫోన్ కొన్న స్నేహితుడి నుంచి చిన్న పార్టీ ఆశించి భంగపడిన తోటి స్నేహితులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషాద ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నిందితులు ముగ్గురు 9వ తరగతి చదివే 16 ఏళ్ల టీనేజర్లు కావడం గమనార్హం. తూర్పు ఢిల్లీ పరిధిలోని షకర్‌పుర్ ప్రాంతం రాంజీ సమోసా దుకాణం దగ్గర అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. మంగళవారం ఢిల్లీ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈస్ట్) అపూర్వ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సచిన్ అనే 16 ఏళ్ల టీనేజర్ ఫోన్ కొనేందుకు స్నేహితుడిని వెంట తీసుకెళ్లాడు. వారికి మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నారు. కొత్త ఫోన్ చూశాక స్నేహితులంతా పార్టీ ఇవ్వాల్సిందేనని సచిన్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకు సచిన్ ససేమిరా అన్నాడు. దీంతో మాటామాటా పెరిగింది. స్నేహితుల్లో ఒకడు సచిన్‌ను వెనుక నుంచి కత్తితో రెండుసార్లు పొడిచి హత్యచేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. రక్తమోడుతున్న సచిన్ ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటనా స్థలి మీదుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ బృందం రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను చూసి ఆగి ఆరా తీశారు. స్థానికంగా ఉండే ఆ ముగ్గురు టీనేజర్లను అరెస్ట్‌చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 103(1), 3(5) సెక్షన్లకింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. ఘటనాస్థలిలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. -
ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 20) ప్రారంభం కానున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. ప్రో సిరీస్‌ను భారత్‌లో తెలిసారిగా అసెంబ్లింగ్ చేసే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.ఇటీవలి బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో తొలిసారిగా గత సిరీస్ కన్నా కొత్త ప్రో సిరీస్ ఫోన్లను యాపిల్ తక్కువ రేటుకు విక్రయించనుంది. దేశీయంగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,000 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.గతేడాది ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,59,900 నుంచి మొదలైంది. మరోవైపు, తాజా ఐఫోన్ 16 రేటు రూ. 79,900 నుంచి, 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 128 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీతో లభిస్తాయి. -
జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో కొత్త 'జియోఫోన్ ప్రైమ్ 2' ప్రవేశపెట్టింది. నవంబర్ 2023లో కంపెనీ విడుదల చేసిన జియోఫోన్ ప్రైమా 4జీ కొనసాగింపుగా ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ధర రూ. 2,799 మాత్రమే. ఇది లక్స్ బ్లూ అనే ఒకే కలర్ షేడ్‌లో లభిస్తుంది. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.జియోఫోన్ ప్రైమ్ 2 క్వాల్కమ్ చిప్సెట్, 2000 mAh బ్యాటరీ పొందుతుంది. అంతే కాకుండా 2.4 ఇంచెస్ కర్వ్డ్ స్క్రీన్.. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను పొందుతుంది. వీడియో కాలింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది.జియో కొత్త ఫోన్.. జియోపేకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేయడానికి స్కాన్ చేయవచ్చు. ఎంటర్టైన్ కోసం జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెన్స్ వంటి సోషల్ మీడియా వంటివి యాక్సెస్ చేయవచ్చు. ఇదీ చదవండి: సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ ఈ కొత్త జియో ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. 120 గ్రాముల బరువున్న ఈ ఫోన్ పరిమాణం 123.4 x 55.5 x 15.1 మిమీ వరకు మాత్రమే ఉంటుంది. హ్యాండ్సెట్ ఒకే నానో సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. మొత్తం మీద తక్కువ ధర వద్ద మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి జియో కొత్త ఫోన్ మంచి ఆఫర్ అనే చెప్పాలి. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ కంపెనీ సుమారు 25 సంవత్సరాల తరువాత మార్కెట్లో 'నోకియా 3210 4జీ' ఫోన్ లాంచ్ చేసింది. కాలంలో కలిసిపోయిందనుకున్న ఈ ఫోన్ మళ్ళీ కనిపించడంతో నోకియా ప్రియులు సంబరపడిపోతున్నారు.ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3210 4జీ ధర రూ. 3999. దీనిని ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో లేదా హెచ్ఎండీ వెబ్సైట్లో కొనుకోగలు చేయవచ్చు. ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తుంది. టీ107 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ కీబోర్డుతి వస్తుంది.ఈ కొత్త నోకియా 3210 4జీ ఫోనులో అందరికీ ఇష్టమైన 'స్నేక్' గేమ్ కూడా ఉంది. 64 ఎంబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 128 ఎంబీ స్టోరేజ్ పొందుతుంది. దీనిని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి SD కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ వంటి వాటి కోసం యాప్స్ కూడా ఉన్నట్లు సమాచారం.కెమెరా కోసం నోకియా 3210 4జీ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు 1450 mAh రినోవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్టుతో వస్తుంది.Here it is! As iconic as ever – Nokia 3210 4G! Relive the retro, now with a modern touch - YouTube, Scan & Pay with UPI, long battery life, Bluetooth, 4G connectivity, and more!Buy now - https://t.co/E7s4Mblyg4 #HMD #Nokia3210 #IconIsBack pic.twitter.com/0rs00bssDc— HMD India (@HMDdevicesIN) June 10, 2024 -
లాంచ్‌కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డిజైన్ లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో క్యాప్చర్ బటన్‌గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది. డిస్ప్లే 2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్క్రీన్లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్‌తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్‌లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. చిప్సెట్ వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలోని A17 ప్రో చిప్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్‌ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్‌కున్న డిమాండ్!
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. గతంలో ఇలా.. గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది. -
న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా?
యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'వండర్లస్ట్' మెగా ఈవెంట్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇందులో సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ చేయనుంది. యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది. అర్బన్ డిక్షనరీ ప్రకారం, 'వండర్లస్ట్' అనే పదానికి అర్థం 'నిరంతరం అద్భుత స్థితిలో ఉండాలనే కోరిక'. టిమ్ కుక్ నేతృత్వంలోని కంపెనీ ఉత్పత్తులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్న కారణంగా ఈ పేరు పెట్టడం జరిగినట్లు తెలుస్తోంది. యాపిల్ మెగా ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో అండ్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి వాటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9 కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఐఫోన్ 15 సిరీస్ ధరలు 1199 నుంచి 1299 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. లక్ష కంటే ఎక్కువ. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా వినియోగదారుని అవసరమైన ఆధునిక ఫీచర్స్ ఇందులో లభించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది! గత ఏడాది ఇదే సమయంలో ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి 15 సిరీస్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. అయితే ఈరోజు జరిగే ఈవెంట్లో 16 సిరీస్ గురించి ప్రస్తావిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు జరిగే ఈవెంట్ చూడాలనుకునే వారు యాపిల్ వెబ్సైట్, యూట్యూబ్ స్ట్రీమ్, యాపిల్ టీవీ ద్వారా వీక్షించవచ్చు. -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్‌ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని, కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం. ఇకపై టెక్కాలజీ కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు అని ఆకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత సంగీత యాప్ JioSaavn, JioPayని కలిగి ఉంది. -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్‌లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‌గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్‌లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్‌తో కలపవచ్చు. అప్‌గ్రేడ్ బోనస్‌ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్‌లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో.. వై సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్‌లో వివో వై100 విడుదలైన కొద్దిసేపటికే వివో వై56 5జీ మార్కెట్లోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ బడ్జెట్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ రంగుల్లో లభిస్తోంది. వివో అఫీషియల్ వెబ్‌సైట్‌తోపాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు. మరి ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేయండి.. వివో వై56 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్: 6.58 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (SD కార్డ్‌తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు) 50ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బరువు 184 గ్రాములు (ఇదీ చదవండి: రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?) -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్‌లో నూతన వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్‌ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్‌స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు
హైదరాబాద్: దక్షిణ కొరియా శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్23 సిరీస్ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ బడే అన్నారు. గెలాక్సీ ఎస్23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 బ్లూటూత్‌ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 క్లాసిక్ ఎల్టీఈ–గెలాక్సీ బడ్స్ రూ.4999కే లభిస్తుంది. -
ఐకూ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది. ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. -
మోటరోలా నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా సరికొత్త మోటో జీ పవర్ 2022 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్‌గ్రేడ్‌గా రానుంది. 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటుచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు సుమారు రూ. 14 వేల నుంచి 18 వేల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లలోకి వచ్చే ఏడాదిలో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11తో పనిచేయనుంది. మోటో జీ పవర్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే మీడియా టెక్ హెలియో జీ37 ప్రాసెసర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 50ఎమ్పీ ప్రైమరీ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 11 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టైప్ సీ సపోర్ట్ చదవండి: భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..! -
మోటోరోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్..!
Moto E40 India Launch Teased: భారత మార్కెట్లలోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఈ40 లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లలోకి వస్తోందని మోటోరోలా ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోటో ఈ40 ‘ది పర్ఫెక్ట్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విటర్లో టీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ను ప్రకటించలేదు. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరలో లేదా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక మోటో ఈ40 ధర విషయానికి వస్తే ఈ డివైజ్ భారత్‌లో రూ 10,000లోపు లభించనున్నట్లు తెలుస్తోంది. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్ గ్రే, పింక్ కలర్ వేరియంట్ ఆప్షన్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...! మోటో ఈ40 ఫీచర్స్(అంచనా) 6.5-అంగుళాల హెచ్డి+ ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే 1,600x720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 11 యునిసోక్ టీ700 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 42+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్సెన్సార్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ Fuel your imagination with the #PerfectEntertainer and color the world with your ideas! Can you guess what we're talking about? pic.twitter.com/NZXAr5QLkh — Motorola India (@motorolaindia) October 6, 2021 చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! -
శామ్సంగ్ నుంచి 5 జీ ఫోన్.. ప్రత్యేక తగ్గింపు ధర
దక్షిణ కొరియా టెక్నాలజీ కంపెనీ శామ్సంగ్ పండగ సీజన్లో సరికొత్త ఫోన్‌ని ఇండియా మార్కెట్లో లాంఛ్ చేయనుంది. మీడియం రేంజ్ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ని కస్టమర్లకు అందుబాటులోకి తేనుంది. బరిలో శామ్సంగ్ దేశంలో ఇంకా 5 జీ సర్వీసులు ప్రారంభం కాలేదు. దీంతో యాపిల్, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ ఫోన్ మార్కెట్‌పై ఇంత కాలం ఫోకస్ పెట్టలేదు. మరోవైపు ఎంట్రీ, మీడియం సెగ్మెంట్లో షావోమి, రియల్మీ, వన్‌ప్లస్ వంటి సంస్థలు వరుసగా 5జీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. దీంతో శామ్సంగ్ సైతం బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ తెచ్చేందుకు రెడీ అయ్యింది. శామ్సంగ్ ఎం 52 5జీ టెక్నాలజీ సపోర్ట్‌తో శామ్సంగ్ సంస్థ ఎం 52 మోడల్ని మార్కెట్లోకి తేబోతుంది. అక్టోబరు 3న అమెజాన్‌లో ఈ ఫోన్ అమ్మకాలు షురూ అవుతున్నాయి. గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్స్‌లో భాగంగా ఈ ఫోన్‌ని తగ్గింపు ధరతో రూ. 26,999కే అందివ్వబోతున్నారు. అదిరిపోయే ఫీచర్లు - శామ్సంగ్ ఎం 52 మోడల్లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ప్రాసెసింగ్ స్పీడ్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో ఈ ప్రాసెసర్ పని తీరు ఎంతో మెరుగని శామ్సంగ్ చెబుతోంది - ఈ మొబైల్లో 6.7 ఫుల్హెచ్డీ ఎస్ అమోల్డ్ డిస్ప్లేని పొందు పరిచారు. డిస్ప్లే రీఫ్రెష్ రేటు 120 హెర్జ్‌గా ఉంది. - మొబైల్లో వెనుకు వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండగా మిగిలిన రెండు కెమెరాలు 16 ఎంపీ (ఆల్ట్రా వైడ్), 5 ఎంపీ (మైక్రో లెన్స్)లు గాఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్స్. - బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ , 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌ని అందిస్తున్నారు - ఈ మొబైల్లో శామ్సంగ్ డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ అయిన శామ్సంగ్ నాక్స్ని ఇన్‌బిల్ట్ చేశారు. దీంతో యూజర్ల డేటాకు మరింత భద్రత ఉంటుంది - ఆండ్రాయిడ్ 11 ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్ రిలీజ్ అవుతోంది. స్లీక్ డిజైన్‌తో పాటు కేవలం 173 గ్రాముల బరువు కలిగి ఉంది. - స్క్రీన్ ప్రొటెక్షన్గా గోరిల్లా గ్లాస్ 5ని అందించారు. ధరలు వేరియంట్ ధర ఆఫర్ ప్రైస్ 6 జీబీ, 128 జీబీ రూ.29,999 రూ.26,999 8 జీబీ, 128 జీబీ రూ.31,999 రూ.28,999 చదవండి : జియో స్పెషల్ ఆఫర్... ఈ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ -
మార్కెట్‌పై మైక్రోమ్యాక్స్ ఫోకస్.. మరో కొత్త ఫోన్ రిలీజ్‌కి రెడీ
దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న మైక్రోమ్యాక్స్ మరో మోడల్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంఆ చైనా ఫోన్లకు దీటుగా తక్కువ బడ్జెట్లో ఓ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. మైక్రోమ్యాక్స్ నోట్ సిరీస్‌లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మైక్రోమ్యాక్స్ సంస్థ 2020 నవంబరులో నోట్ 1 పేరుతో స్మార్ట్‌పోన్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ మోడల్‌కి కొనసాగింపుగా నోట్ 1 ప్రో మొబైల్‌ని మార్కెట్లోకి తేనున్నట్టు సమాచారం. మీడియాటెక్ హెలియె G 90 చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో ఉపయోగించారు. నోట్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై పని చేస్తుండగా నోట్ 1 ప్రో మొబైల్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై పని చేయనుంది. అంతేకాకుండా 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్‌సీ పోర్టుతో కొత్త ఫోన్ ఉండబోతుంది. ధర ఎంత ? మైక్రోమ్యాక్స్ నోట్ 1 ప్రో ధర రూ 15,000లు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తెస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పట్టుకోసం ప్రయత్నాలు ఇండియన్ మార్కెట్లో నోకియా, శామ్సంగ్ హవా కొనసాగుతున్న కాలంలో వాటి తర్వాత స్థానం మైక్రోమ్యాక్స్‌దే అన్నట్టుగా ఉండేంది. ముఖ్యంగా కాన్వాస్ పేరుతో తక్కువ ధరకే స్మార్టు ఫోన్లను అందించి మార్కెట్‌ను కైవసం చేసుకుంది. అయితే మైక్రోమ్యాక్స్ తరహాలోనే చైనా కంపెనీలైన వివో, ఒప్పో, షావోమీ, రియల్‌మీలు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. వీటితో పోటీ తట్టుకోలేక మైక్రోమ్యాక్స్ వెనుకబడిపోయింది. మరోసారి ఇండియన్ మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్