చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారతీయ మార్కెట్లో 'జీటీ 7 ప్రో' లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందుతుంది.
కొత్త రియల్‌మీ జీటీ 7 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.56,999), రెండు 16 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ. 62,999). ఇవి రెండూ నవంబర్ 29నుంచి కంపెనీ వెబ్‌సైట్‌లో, అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం.
మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభించే రియల్‌మీ జీటీ 7 ప్రో.. హై పర్ఫామెన్స్డ్ స్మార్ట్‌ఫోన్. ఇది 1.5కే రిజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాకుండా.. వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని
జీటీ7 ప్రోలో.. సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం మరో 50MP Sony IMX906 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా &16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా వీడియో రీకరింగ్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి. పోర్ట్రెయిట్, నైట్, అండర్ వాటర్ వంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
రియల్‌మీ జీటీ 7 ప్రో 5800mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐపీ69 నీరు & ధూళి నిరోధకతను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా మన్నికైనది, ఏ వాతావరణనైకైనా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 222.8 గ్రాములు.. పొడవు 162.45 మిమీ పొడవు, వెడల్పు 76.89 మిమీగా ఉంది.
The #realmeGT7Pro is now more accessible!
Get the flagship 12GB RAM + 512GB storage for just ₹56,999 & the 16GB RAM + 512GB storage for ₹62,999 with 50MP Periscope, IP69, AI features & more!#ExploreTheUnexplored
Join the Livestream: https://t.co/6E90cRlxyy pic.twitter.com/KYTnXPO6pa— realme (@realmeIndia) November 26, 2024
Comments
Please login to add a commentAdd a comment