Nokia C32 Likely To Launch In India, More Details Inside - Sakshi
Sakshi News home page

Nokia C32: నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?

Published Sun, May 21 2023 9:14 PM | Last Updated on Tue, May 23 2023 10:56 AM

Nokia new mobile c32 launch soon in india - Sakshi

Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్‍లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి.

ఫీచర్స్..
కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్‍డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్‍ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‍గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్‍ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్‍డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది.

(ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ - ప్రత్యేకతలివే!)

ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంటుంది. అదే సమయంలో ఫేస్‍ అన్‍లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement