ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.
ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
స్పెసిఫికేషన్లు
» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్
» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే
» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్‌లు
» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్
» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరా
ధర
ఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment