Budget Smartphones
-
కొత్త ఫోన్: ప్రీమియం కెమెరా ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్‌లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్‌కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్‌ను జోడించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.Poco M6 Plus స్పెసిఫికేషన్స్ » స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) » గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ » అదనంగా 8GB వర్చువల్ ర్యామ్» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్» 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ » సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5030mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్Poco M6 Plus ధర, లభ్యతపోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ -
బంపరాఫర్.. రూ. 999కే అదిరిపోయే ఫీచర్లున్న వివో స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
వివో (Vivo) కొన్ని నెలల క్రితం మార్కెట్లో కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా వివో టీ1 ఎక్స్( Vivo T1X) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది యూజర్లకు మంచి గేమింగ్ ఎక్సపీరియన్స్ కోసం ప్రత్యేకంగా తయారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌కు సంబంధించి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కేవలం రూ.999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అదెలా అనుకుంటున్నారా, దానిపై ఓ లుక్కేద్దాం! Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అవి ఫ్లిప్‌కార్ట్( Flipkart)లో.. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.16,999గా ఉండగా, 4GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ.17,990, ఉంది. వీటితో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన దాని టాప్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లతో అందిస్తోంది. ఇవి గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. చదవండి: సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేవలం.. రూ.999లకే ఈ ఫోన్ మీ జేబులోకి ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సెల్లో, మీరు 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ. 999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే .. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,990గా ఉంది. ఇందులో 21 శాతం తగ్గింపు ఆఫర్‌తో వస్తోంది. అంటే ఈ ఫోన్‌ని రూ.14,999కే వస్తుంది. దీంతో పాటు, మీరు ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్. కంపెనీ దీనిపై రూ.14,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కనుక కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వనియోగం చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కు మీ సొంతం చేసుకుని జేబులో పెట్టుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్న కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట! -
రూ.20 వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్ల విడుదల ఎక్కువైంది. కొనుగోలు దారులు సైతం ఆకట్టుకునే ఫోన్లు కళ్లెదురుగా కనిపిస్తుంటే ఏ ఫోన్ కొనుగోలు చేయాలో అర్ధం గాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే పనితీరు బాగుండి.. కెమెరా, బ్యాటరీ, స్మూత్ డిస్ప్లేతో రూ.20వేలకు మార్కెట్లో ఇప్పటికే కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. 5జీ పోకో ఎక్స్4 ప్రో రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఫోన్ల స్థానంలో పోకో ఎక్స్4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఫర్మామెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జర్, 64 ఎంపీ లెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభ్యం అవుతుంది 5జీ రెడ్మీ నోట్ 11ప్రో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 11ప్రో. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హేలియా జీ96 చిప్ సెట్‌తో రూ.20వేల లోపు బడ్జెట్ ధర ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుంటే ఈ ఫోన్లో బీజీఎంఐ,కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ) లాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్‌ను ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేట్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 5జీ ఐక్యూ జెడ్6 రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్6 బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ పండితులు చెబుతున్నారు. ఎందుంటే ఇందులో ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా పనితీరు బాగుండటమే కాదు.. స్నాప్ డ్రాగన్ 696 చిప్సెట్తో వస్తుంది. 50 ఎంపీ,2ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో డిజైన్ చేసింది ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 5జీ రియల్ మీ 9ప్రో రియల్ మీ 9ప్రోలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.6 అంగుళాల డిస్ప్లే,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ,33 డబ్ల్యూ ఛార్జర్, 64ఎంపీ నైట్ స్కేప్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్‌తో అందుబాటులో ఉంది. మోటోజీ52 మోటరోలా మోటో జీ 52 సూపర్ డిస్ల్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్ 2ఎంపీ సెన్సార్లతో ఈ ఫోన్ రూ.14,999కే లభ్యమవుతుంది. -
అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ రూ.15వేల లోపు బడ్జెట్ ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది శాంసంగ్ మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ03ఎస్ సిరీస్‌లో 3వ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీని ఏ 03ని తాజాగా దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ధర శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ని రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ చేసింది. 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేష్ ఆప్షన్ ధర రూ.10499 ఉండగా 4జీబీ ప్లస్ 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ నలుపు, నీలం, ఎరుపు వేరింయంట్ కలర్స్‌లో లభ్యం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ స్పెసిఫికేషన్లు • శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ డిస్ప్లే • 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ • యూఎన్ఐ ఎస్ఓసీ టీ606 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. • గరిష్టంగా 4జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ • 1టెరాబైట్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు • మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. • వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. • 48ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. • ఇందులో 2MP డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీల కోసం, ఫోన్లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. • ఆండ్రాయిడ్ 11కి సపోర్ట్ చేస్తుంది. -
పబ్జీ లైట్ తరహాలో బీజీఎమ్ఐ లైట్ త్వరలోనే...!
పబ్జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 2న పబ్జీ స్థానంలో బీజీఎమ్ఐను క్రాఫ్టన్ తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను అత్యధిక సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. బీజీఎమ్ఐ లాంటి గేమ్స్ హై ఎండ్ ర్యామ్ ఉన్న ప్లాగ్ షిప్ ఫోన్లలో సులువుగా పనిచేస్తుంది. ర్యామ్ తక్కువగా ఉన్న బడ్జెట్ స్మార్ట్ఫోన్లలో బీజీఎమ్ఐ అంతగా సపోర్ట్ చేయదు. తరుచూ ఫోన్ హ్యగ్ అవుతోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లను దృష్టిలో ఉంచుకొని పబ్జీ లైట్ తరహాలోనే బీజీఎమ్ఐ లైట్ గేమ్‌ను త్వరలోనే తీసుకురావాలని క్రాఫ్టన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజీఎమ్ఐ లైట్ వర్షన్‌తో అధిక సంఖ్యలో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేస్తోంది. కాగా లైట్ వెర్షన్ ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు. చదవండి: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
కార్బన్ 4జీ స్మార్ట్ఫోన్లు లాంచ్..ధరలు?
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ మొబైల్ కంపెనీ కార్బన్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లతో 4 జీ మొబైల్స్‌లోకి విస్తరించింది. ఔరా సిరీస్ లో కొత్త 4 జీ స్మార్ట్ ఫోన్లను తాజాగా లాంచ్ చేసింది. ఔరా స్లీక్ 4జీ, ఔరా నోట్ 4జీ పేర్లతో సరికొత్త డివైస్ లను బడ్జెట్‌ధరల్లో లాంచ్ చేసింది. అతి వేగవంతమైన 4 జీ పెర్ ఫార్ఫామెన్స్తో తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తెచ్చినట్టుకంపెనీ ప్రకటించింది. ఔరా స్లీక్ 4జీ ధరను రూ. 5,290 గాను, ఔరా నోట్ 4జీ ధరను రూ. 6,890గా నిర్ణయించింది. అయితే వీటి విక్రయ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఔరా స్లీక్ 4 జీ 5 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లౌ 1.25గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ 5 ఎంపీ రియర్ కెమెరా 2ఎంపీ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్ అండ్ షాంపైన్ వైట్ లో ఈ హ్యాండ్ సెట్ లభించనుంది. ఔరా నోట్ 4 జీ 5,5 హెచ్డీ డిస్ప్లే 1.25గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 32 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు 2800 ఎంఏహెచ్ బ్యాటరీ మెటల్ బ్లాక్, మెటాలిక్ షాంపైన్ కలర్స్‌లో ఇది లభ్యంకానుంది. అయితే ఈ రెండుడివైస్లలోనూ యాక్సిలోమీటర్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్స్ర్ ను అమర్చినట్టు కంపెనీ చెబుతోంది.