Lava Yuva 2 launched in India for just Rs 6,999 - Sakshi
Sakshi News home page

మరో చవక మొబైల్‌.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Published Wed, Aug 2 2023 8:59 PM | Last Updated on Thu, Aug 3 2023 9:02 AM

Lava launches Yuva 2 smartphone for Rs 6999 - Sakshi

Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్‌లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్‌లూ రూ. 10,000 కంటే తక్కువ  ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి.

గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్‌ అందిస్తారు.

ఇదీ చదవండి  Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్‌లోకి అత్యంత ఖరీదైన టీవీ

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

  • 90Hz 6.5 అంగులాల హెచ్‌డీ ప్లస్‌ సింక్‌ డిస్‌ప్లే
  • 3జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 3జీబీ వరకు వర్చువల్‌ మెమొరీ
  • 8-కోర్ Unisoc T606 చిప్‌సెట్‌
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా
  • 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement