తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్‌లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్‌కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్‌ను జోడించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.
Poco M6 Plus స్పెసిఫికేషన్స్
» స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్)
» గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్
» అదనంగా 8GB వర్చువల్ ర్యామ్
» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్
» 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్
» సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5030mAh బ్యాటరీ
» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
Poco M6 Plus ధర, లభ్యత
పోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment