Poco
-
కొత్త ఫోన్: ప్రీమియం కెమెరా ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్‌లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్‌కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్‌ను జోడించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.Poco M6 Plus స్పెసిఫికేషన్స్ » స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) » గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ » అదనంగా 8GB వర్చువల్ ర్యామ్» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్» 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ » సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5030mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్Poco M6 Plus ధర, లభ్యతపోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. -
HyperOS: ఈ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే..
హైపర్ ఓఎస్ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లోకి తొలి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్ దీన్ని లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్ 14తో కూడిన హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది. పోకో తన ఎక్స్ సిరీస్‌ను రెండు కొత్త స్మార్ట్ఫోన్లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో మోడల్‌లు వచ్చే వారంలో భారత్‌లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్ఫోన్లకు సంబంధించిన కొన్ని స్పెక్స్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్6 సిరీస్‌కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోకో షేర్ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్ఓఎస్తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు. More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS. Global launch on 11th Jan, 5:30 PM on @flipkart. Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y — POCO India (@IndiaPOCO) January 5, 2024 పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే.. పోకో ఎక్స్6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్మెంట్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్ ఉన్నాయి. ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్ 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్6 సిరీస్ మోడల్‌లు 120Hz డిస్ప్లేతో వస్తున్నాయని రూమర్స్ వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు 64MP మెయిన్ కెమెరా, 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. -
రూ.7,499లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్‌లో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పోకో సీ65 స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్‌ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్‌కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్ సేల్ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 6.74 అంగుళాల HD+ 90Hz డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ C-టైప్ ఛార్జర్ సపోర్ట్ -
పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. భారత్‌లో విడుదల ఎప్పుడంటే
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో లేటెస్ట్ సిరీస్‌తో స్మార్ట్ ఫోన్ ప్రియుల్ని అలరించనుంది. త్వరలో భారత్ మార్కెట్లోకి పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎక్స్5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా పోకో ఎక్స్6 ను విడుదల చేస్తుంది. అయితే రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ - 8జీబీ- 12 జీబీ ర్యామ్, 128 జీబీ /256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోపీ చిప్ సెట్ పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. -
అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు భారత్‌లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లాంచ్ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోంది. రెండో సేల్కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ ట్విటర్లో షేర్ చేశారు. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్‌ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఓఎస్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ Today we had the second sale of #POCOM6Pro5G and it started at 12 noon and went Out of Stock in just 9 minutes. Thanks everyone for the tremendous response. #5GDisrupter #POCOM6Pro5G pic.twitter.com/k7f8QR7JR1 — Himanshu Tandon (@Himanshu_POCO) August 12, 2023 -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్‌టెల్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్‌ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్‌జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్‌ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్‌తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్! -
ఈ ఏడాది 80 శాతం వృద్ధి: పోకో
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న పోకో ఇండియా ఈ ఏడాది 75–80 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ప్రధానంగా మీడియం, ఎకానమీ విభాగంలో కంపెనీ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ ఇందుకు కారణమని పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ సోమవారం తెలిపారు. ‘మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ ప్రకారం.. భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10–15 శాతం క్షీణించింది. ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. అయితే షావొమీ సబ్–బ్రాండ్ పోకో మార్చి 2023 త్రైమాసికంలో 68 శాతం వృద్ధితో అమ్మకాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ బ్రాండ్‌గా ఉద్భవించింది. రూ.10,000 లోపు ధరల శ్రేణిలో సి–సిరీస్‌లో మూడు మోడళ్లను, రూ.20,000–25,0000 ధరల విభాగంలో ఎక్స్5 ప్రో మోడళ్లను విడుదల చేయడం 2023 తొలి త్రైమాసికంలో కంపెనీ వృద్ధికి ఆజ్యం పోశాయి. రెండవ త్రైమాసికం విక్రయాలు జనవరి–మార్చి కంటే ఎక్కువగా ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా) కస్టమర్లలో 60 శాతం పాతవారే. కొన్ని పెద్ద బ్రాండ్లు ఆన్లైన్ విభాగంలో పలు ధరల శ్రేణులను ఖాళీ చేశాయని భావిస్తున్నాను. ఆ వాటాను పొందేందుకు ఇది మాకు సరైన సమయం. రూ.10,000లోపు సెగ్మెంట్‌పై దృష్టి పెడతాం. రూ.10 వేల శ్రేణిలో 5జీ మోడళ్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు. -
మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్‌లో తన పవర్ఫుల్ మొబైల్‌ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) కొత్త పోకో ఎఫ్5 మొబైల్లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్లో ఉంటాయి. -
తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!
భారతదేశం అభివృద్ధి మార్గంలో పరుగులు పెడుతున్న వేళ స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ఇతర మొబైల్స్ కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నాయి. కానీ తక్కువ ధరలో కావాలనుకునే వారికోసం మార్కెట్లో లభించే స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ చూసేద్దాం.. లావా బ్లేజ్ 5జి: లావా కంపెనీకి చెందిన బ్లేజ్ 5జి మొబైల్ ధర మార్కెట్లో రూ. 10,999. ఇది 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ & 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మొబైల్ ఆధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ పొందుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివో టి2ఎక్స్ 5జి: 5జి మొబైల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో టి2ఎక్స్ 5జి ఒకటి. దీని ధర రూ. 12,999. ఇవి మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.58 ఇంచెస్ HD+ LCD స్క్రీన్, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్స్ మైక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమరా వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జి: ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో ఒకటి శాంసంగ్. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విడుదలైన గెలాక్సీ ఎమ్14 5జి తక్కువ ధరలో లభించే ఉత్తమమైన మోడల్. దీని ధర రూ. 14,900. ఈ 5జి మొబైల్ 6.6 ఇంచెస్ HD డిస్ప్లే పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ మరింత ఆధునికంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పోకో ఎక్స్5 5జి: పోకో కంపెనీకి చెందిన ఎక్స్5 5జి మొబైల్ మార్కెట్లో లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 18,999. ఇది 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా కెమెరా ఆప్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. -
పోకో ‘ది 5జీ ఆల్ స్టార్’ లాంచ్: ఆఫర్ ఎంతంటే?
సాక్షి, ముంబై: పోకో ఎక్స్ 5 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా తన రెండో ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో ప్రారంభ ఆఫర్‌గా 2 వేల రూపాయల తగ్గింపుతో పోకో ఎక్స్ 5 5జీ రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎక్స్5 5జీ ధర మార్చి 21 మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart ద్వారా సేల్. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 2,000 తక్షణ తగ్గింపు లేదా రూ. 2000 చేంజ్ బోనస్ తొలి రోజు సేల్‌లో నో-కాస్ట్ EMI ఈ ఆఫర్‌తో, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 16,999 , టాప్-ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను 18,999 అందిస్తోంది.సూపర్నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ , జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం పోకో ఎక్స్5 5జీ స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 695 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 48+8 + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ Give us a better definition of an “All-Star”, we’ll wait! The POCO X5 5G comes with 7 5G bands, Snapdragon 695, and a 120Hz Super AMOLED Display… ...the list can go on and on! The POCO X5 5G goes on sale on 21st March on @Flipkart at a special price.#The5GAllStar pic.twitter.com/orx2kNRW35 — POCO India (@IndiaPOCO) March 14, 2023 -
పోకో సీ55 స్మార్ట్‌ఫోన్: రూ.10వేల లోపు బెస్ట్ ఫోన్!
సాక్షి, ముంబై: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోలాంచ్ చేసింది. పోకో సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ధరను పదివేల లోపే నిర్ణయించడం విశేషం. 5,000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్‌లాంటి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్‌కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం. పోకో సీ 55 ఫీచర్లు 6.71-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 SoC MIUI 13 స్కిన్‌తో Android 12 OS 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్లిప్‌కార్ట్ వివరాల ప్రకారం పోకో సీ 55 4జీ ప్రారంభ ధర 8,499 రూపాయలు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. ఈ బడ్జెట్ ఫోన్ ఫిబ్రవరి 28నుంచి సేల్స్ మొదలు. సేల్ ఆఫర్‌గా రూ. 500 ఫ్లాట్ తగ్గింపు, బ్యాంక్ కార్డ్‌లపై రూ. 500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. -
పోకో ఎక్స్5 ప్రో
డిస్ప్లే: 6.67 అంగుళాలు ; రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్ ,మెమోరీ: 128జీబి 6జీబి ర్యామ్ , 6 జీబి 8జీబి ర్యామ్ రిజల్యూషన్: 1080“2400 పిక్సెల్స్ , బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ ; కలర్స్: బ్లాక్, బ్లూ, ఎల్లో -
Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్‌స్టార్ చేతులమీదుగా
సాక్షి,ముంబై: పోకో ఎక్స్5 ప్రో ఈరోజు( సోమవారం) సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్ చానెల్, ఫ్లిప్‌కార్ట్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. గతేడాది విడుదల చేసిన పోకో ఎక్స్4 ధర రూ.18,999. అయితే తాజాగా లాంచ్ చేయనున్నపోకో ఎక్స్5 ప్రో బేసి వేరియంట్ ధర 20 వేల లోపే ఆవిష్కరించ నుందట. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 22,999 ఉంచనుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా 2వేల తగ్గింపుతో 20,999 అందించనుంది. ఫిబ్రవరి 13 నుంచి తొలి సేల్ షురూ కానుంది. ప్రత్యేకతలు ఇవే.. (అంచనా) ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో కొన్నింటిని కంపెనీ ఇదివరకే వెల్లడించింది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 778 ఎస్ఓసీ టెక్నాలజీతో రాబోతోంది. ఇదే టెక్నాలజీతో వచ్చిన శాంసంగ్, ఐక్యూ కంపెనీలకు చెందిన ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే. పోకో ఫోన్లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. 108+8+ 2 ఎంపీ రియర్ కెమెరా, 120హెడ్జ్ ఆమోల్డ్ డిస్ప్లే, స్లిమ్ డిజైన్ ఉండబోతోంది. 5000 ఎంఏహచ్ బ్యాటరీ సామర్థ్యం, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో ఇది పనిచేస్తుంది. Rockstar on the field and a superstar IRL. Catch @hardikpandya7 #UnleashX with the #POCOX5Pro5G behind the scenes. Revealing today @ 5:30 PM on @Flipkart: https://t.co/fRPK7AdL8X pic.twitter.com/hfCNQWuCGA — POCO India (@IndiaPOCO) February 6, 2023 -
న్యూ ఇయర్ ధమాకా: జనవరిలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం! Tecno Phantom X2 ►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Poco C50 ►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తోంది. ►ఈ స్మార్ట్‌ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లే ► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా ► ఇది ఫింగర్‌ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. Samsung Galaxy F04 ►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే ► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ► 5,000mAh బ్యాటరీ సపోర్ట్ Redmi Note 12 series ►రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్లు ఉన్నాయి. ►రెడ్మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్‌కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. iQOO 11 ►ఐక్యూ 11 సిరీస్‌లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో. ►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్, ►2K రెజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్ప్లే ►పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ► ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తోంది. -
5G Phones: బడ్జెట్ 5జీ ఫోన్లకు డిమాండ్..
న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీతో కూడిన బడ్జెట్ ఫోన్ల (రూ.10,000–15,000) విభాగంలో కంపెనీల మధ్య పోరు మొదలైంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వినియోగదారులు తమ ఫోన్లను కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపించనున్నారు. దీంతో ఈ విభాగం కంపెనీలకు ఆకర్షణీయంగా మారనుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణలు ఇప్పటికే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంటే పోటీ ఇప్పటికే మొదలైనట్టు కనిపిస్తోంది. రానున్న పండుగల నేపథ్యంలో మరిన్ని 5జీ ఫోన్ల ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయని.. కంపెనీల మధ్య పోటీ మరింత వేడెక్కుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తయారీ వ్యయాలు (ముడి పదార్థాల వల్ల) పెరిగిపోవడం, బలహీన రూపాయి రూపంలో కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాల వల్ల కంపెనీలు బ్యాటరీ, డిస్ప్లే, మెమొరీ విషయంలో రాజీపడి, రూ.15,000లోపు ధరకే 5జీ ఫోన్లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ విభాగమే టార్గెట్.. రూ.10,000–15,000 విభాగాన్ని 5జీ ఫోన్లు శాసిస్తాయని అంచనా వేస్తున్నట్టు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది చివరికి ఈ విభాగంలో 5జీ ఫోన్లదే హవా ఉంటుందన్నారు. దీపావళికి చాలా బ్రాండ్లు ఈ విభాగాన్నే లక్ష్యం చేసుకుని ఉత్పత్తులు తీసుకురానున్నట్టు అంచనా వేశారు. ఇదే ధరల శ్రేణిలో ఏకంగా ఆరు 5జీ ఫోన్లు ఒక్క ఆగస్ట్ నెలలోనే విడుదలయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే సమయానికి ఈ ధరల శ్రేణిలో ఉన్న 5జీ ఫోన్లు కేవలం మూడే. ‘‘2022 మొదటి ఆరు నెలల్లో రూ.10,000–15,000 ధరల్లోని 5జీ స్మార్ట్ఫోన్ల డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే నాలుగు రెట్లు అధికంగా ఉంది’’అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ ధరల శ్రేణికి సంబంధించి 5జీ ఫోన్ల మార్కెట్ వాటా మొత్తం స్మార్ట్ఫోన్లలో చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి. 2022 ద్వితీయ మూడు నెలల్లో 6 శాతంగా ఉంది. 2021 చివరి నుంచి చూస్తే మార్కెట్ వాటా రెట్టింపైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ ఏడాది చివరికి 5జీ స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. తక్కువ ధరల్లో అందించేందుకు కంపెనీలు డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్‌లో రాజీపడటం ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ వాటా.. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 5జీ ఫోన్లలో షావోమీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పోకో బ్రాండ్‌తో కలిపి ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటా షావోమీ చేతుల్లోనే ఉంది. రియల్మీ మార్కెట్ వాటా 25 శాతంగా ఉంది. ఇక మోటరోలా 5 శాతం వాటా కలిగి ఉంది. -
పోకో ఎం5 వచ్చేసింది.. లాంచింగ్ ఆఫర్, ధర, ఫీచర్లు
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో దీన్నివిడుదల చేసింది. భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499 ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం5 స్పెసిఫికేషన్స్ 6.58అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ -
మొదలైన 5జీ మొబైల్ వార్.. రంగంలోకి దిగిన పోకో
మొబైల్ ఫోన్ల మార్కెట్లో మరోసారి వేడి రగులుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం పనులు ఊపందుకోవడంతో మార్కెట్లోకి కొత్త మోడళ్లను రిలీజ్ చేయడంపై మొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో సరికొత్త 5జీ ఫోన్ రిలీజ్ చేసింది. 5జీ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి పోటీ కంపెనీల కంటే ముందుగా పోకో సంస్థ ఎఫ్4 పేరుతో 5జీ ఫోన్ మార్కెట్లోకి వదిలింది. ఇందులో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను ఉపయోగించడంతో పాటు మరెన్నో అకట్టుకునే ఫీచర్లు పొందుపరిచింది పోకో. ఫీచర్లు - క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎసఓసీ చిప్సెట్ - ఆండ్రాయిడ్ 12, ఎంఐయూఊ 13 యూజర్ ఇంటర్ఫేస్ - 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమెల్డ్ డిస్ప్లే - 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్జ్ టచ్ సాంప్లింగ్ రేట్ - ట్రిపుల్ రియర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ - 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా - డాల్బీ ఆట్మోస్, డాల్బీ విజన్ - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 - 5 జీ సపోర్ట్ - జైరో స్కోప్, మాగ్నెటో మీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ - 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ధరలు ఇలా పోకో ఎఫ్ 4 5జీ ఫోన్ వివిధ వేయింట్లలో లభిస్తోంది. అన్నింటి కంటే తక్కువగా 6జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999లు ఉండగా హై ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్ 256 జీమీ స్టోరేజ్‌తో రూ.33,999 దగ్గర లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ సేల్కు అందుబాటులో ఉంది. వివిధ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో పాటు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల ద్వారా అదనంగా రూ.3000ల వరకు తగ్గింపు పొందవచ్చు. చదవండి: బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ధర ఎంతంటే! -
పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. జూన్ 23 సాయంత్రం వర్చువల్ ఈవెంట్లో పోకో ‘ఎఫ్ 4 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు పోకో ట్వీట్ చేసింది. ఫీచర్లు, అంచనాలు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు రెడ్మి కే40ఎస్కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్ కెమెరా, దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. A new thinnest #POCOF4 that's sure to make some big waves. Watch our global launch event on June 23rd for more. See you in two days. #AllTheStrengths pic.twitter.com/6umW3TrZti — POCO (@POCOGlobal) June 21, 2022 పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు 6.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Every action will feel a lot more magical when you record moments using Clone Mode on the POCO F4 5G. Get ready to create even cooler videos starting 23-06-2022 - https://t.co/k1MjtkjFVq pic.twitter.com/XZw58DHRaT — POCO India (@IndiaPOCO) June 21, 2022 -
జూన్‌లో స్మార్ట్ ఫోన్ల పండుగ, అదిరిపోయే ఫీచర్లతో 9 ఫోన్లు రిలీజ్!
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి సీజన్లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్ ఫోన్ సేల్స్ సైతం విపరీతంగా జరుగుతుంటాయి. అందుకే జూన్‌లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలైన ఒప్పో, వన్ ప్లస్, పోకో, రియల్ మీ, షావోమీ'లు ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. 1.రియల్మీ చైనా స్మార్మ్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ జూన్ 7న స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో రియల్ మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. 2.పోకో షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్తో పోకో ఎఫ్4 జీటీ స్మార్ట్ ఫోన్‌ను జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది 3.వన్ ప్లస్ మరో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ 90హెచ్ జెడ్ ఆమోలెడ్ డిస్ప్లే, 80 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్ ప్లస్ నార్డ్ 2టీని జూన్ నెలలో విడుదల చేయనుంది. 4.ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 5.షావోమీ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో షావోమీ 12ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సైతం జూన్ 15 తేదీ లోపు విడుదల చేయనుంది 6.మోటో జూన్ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మోటో ఈ32ఎస్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 7.శాంసంగ్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది. 8.వివో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్‌లో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 9.మోటరోలా మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్ ఫోన్‌ను జూన్ నెలలో విడుదల కానుంది. చదవండి👉ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్! -
రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్‌కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్‌ఫోన్స్ ..!
POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో భారత్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో బీభత్సం సృష్టించింది. తక్కువ సమయంలో సుమారు 30 లక్షలకు పైగా పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో పోకో ఈ ఏడాది సెప్టెంబర్ 30 న పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. POCO C3, POCO C31 మోడళ్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 10,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి.అదిరిపోయే ఫీచర్స్, ట్రిపుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో పోకో సీ-సిరీస్ ఫోన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌గా నిలిచాయి. POCO C3 ఫీచర్స్..! 6.53 అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్ 13ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5000 mAh బ్యాటరీ 10W ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్‌ప్లస్ ..! -
నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న
China Poco M3 battery explodes in india : చైనాకు చెందిన మరో కంపెనీ స్మార్ట్ ఫోన్ పేలింది. నవంబర్ 3న చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ పేలిందంటూ ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ 'పోకో' కు చెందిన 5జీ ఫోన్ పేలింది. ట్వీట్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 'పోకో' ఈ ఏడాది మనదేశంలో 'పోకో ఎం3' అనే 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంఛ్ చేసింది. లాంఛ్ సందర్భంగా మహబూబ్‌నగర్ కు చెందిన ఓ యువకుడు ఆఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాజాగా (నవంబర్ 27న) ఆ ఫోన్ పేలింది. దీంతో ఫోన్ పేలుడు ఘటనపై బాధితుడి అన్న మహేష్ ట్వీట్ చేశాడు. తన తమ్ముడు వినియోగిస్తున్న ఈ 5జీ ఫోన్ పేలిదంటూ మహేష్ ట్విట్లో పేర్కొన్నాడు. కానీ ఎందుకు పేలింది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. Hey @geekyranjit look at this. Another blast. This time it's Poco M3.https://t.co/BxdtZcUaj6 pic.twitter.com/DdAP25ZTrf — 𝕊𝕠𝕦𝕣𝕒𝕧 ℍ𝕒𝕥𝕚 (@Souravhati1999) November 27, 2021 మరి కొద్ది సేపటికి మహేష్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే పోకో ఫోన్ పేలింది అంటూ సౌరబ్ హతి అనే ట్విట్టర్ యూజర్ మహేష్ ట్వీట్‌ను షేర్ చేశారు. సౌరబ్ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. యూజర్ల భద్రతే తమకు ముఖ్యం అంటూ, ఫోన్ పేలడాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటాం' అంటూ రిప్లయి ఇచ్చారు. Hello Sourav, we are sorry to hear this and hope that you are safe. Your safety is our number one priority and we strive to make the highest quality products. Please share the details below and we will look into this on priority. Please refrain from sharing any personal (1/2) — POCO India Support (@POCOSupport) November 27, 2021 మహేష్ షేర్ చేసిన ట్వీట్లో బాధితుడి అన్న చేసిన ట్వీట్ ఆధారంగా పోకో 5జీ ఫోన్ కింది సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. కెమెరా మాడ్యుల్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ పేలడంపై పలు నేషనల్ మీడియా పోకో సంస్థను సంప్రదించింది. దీంతో ఫోన్ పేలుడుకు సంబంధించి పోకో బృందం దర్యాప్తు చేస్తుంది. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అంతేకాదు పోకో' కి ఇండియన్ యూజర్ల భద్రత చాలాముఖ్యం. ఇలాంటి విషయాల్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాం. సమస్యను పరిశీలించి కస్టమర్‌కు అండగా నిలుస్తాం అంటూ వివరణ ఇచ్చింది. చదవండి : యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్ పేలింది..! -
పోకో సిరీస్ స్మార్ట్ఫోన్లపై రూ. 7000 వరకు భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ దీవాళి సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. ఈ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో పలు స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. సుమారు రూ. 7000 వరకు భారీ తగ్గింపును కొనుగోలుదారులకు అందించనుంది. పోకో ఎక్స్ 3ప్రో, పోకో ఎమ్2 ప్రో, పోకో సీ3 ఇతర మోడళ్లపై కూడా డిస్కౌంట్‌ను పోకో అందిస్తోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను చివరిసారిగా అందిస్తామని పోకో ఒక ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటుగా పలు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది ►బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా పోకో ఎక్స్3 ప్రో మోడల్‌పై సుమారు రూ. 7,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో 6జీబీ ర్యామ్ వేరియంట్ పోకో ఎక్స్3 ప్రో ధర రూ. 16,999 కే రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.23,999. 8జీబీ ర్యామ్ పోకో ఎక్స్3 ప్రో ధర రూ. 18,999 గా ఉండనుంది. ►పోకో ఎమ్2ప్రో (4జీబీర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్)పై సుమారు రూ. 6000 తగ్గింపుతో కొనుగోలుదారులకు రూ. 10799 అందుబాటులో ఉండనుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 11,749కు లభించనుంది. ►బడ్జెట్ ఫోన్లలో పోకో సీ3 మోడల్‌పై 3జీబీర్యామ్+32 ఇంటర్నల్‌స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 3000 తగ్గింపుతో రూ. 6,749కే కొనుగోలుదారులకు లభించనుంది. ►పోకో ఎమ్3, పోకో ఎమ్3 ప్రో స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు వరుసగా రూ. 9899, రూ. 13249కు లభిస్తాయి. ►పోకో సీ31 రూ. 7,649కి రిటైల్ చేయగా, పోకో ఎఫ్3 జీటీ రూ. 23749కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: షావోమీ దీవాళి విత్ ఎమ్ఐ సేల్..! 5 లక్షల నగదు గెల్చుకునే అవకాశం..! -
వన్‌ప్లస్ నార్డ్ 2కు పోటీగా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్‌ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ధర భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది. ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్: 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1) మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్) 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ) 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
పోకో ఎఫ్ 3 జీటీ జూలై 23న లాంఛ్
పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు ధృవీకరించింది. చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ చేసిన మొబైల్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోకో బ్రాండ్ కింద 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ లో "స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్ ఉందని కంపెనీ పేర్కొంది. ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ నుంచి తయారు చేశారు. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో ఆటపట్టించారు. 2021 క్యూ3లో తీసుకొస్తారని అప్పుడు పేర్కొన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు, హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లేను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సీఎన్ వై 1,999 (సుమారు రూ. 23,000) లాంచ్ చేశారు. -
పోకో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్: ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పొకో కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో మంగళవార విడుదల చేసింది. పొకో ఎం3 ప్రొ పేరుతో రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. తొలి సేల్, ధరలు, లాంచింగ్ ఆఫర్ 4 జీబీ B ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999 ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ ఆఫర్‌గా జూన్ 14 న మాత్రమే తొలి సేల్‌లో రెండు వేరియంట్లపై 500 తగ్గింపు ఇస్తున్నట్లు పొకో ఇండియా పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ సేల్ జూన్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తద్వారా 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో షావోమీ, రియల్మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు గట్టి పోటి ఇస్తోంది. పొకో ఎం3 ప్రొ ఫీచర్లు 6.50 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీకెమెరా 48+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ Hard-hitting performance and a phone that can take hard hits. The #POCOM3Pro comes equipped with the uber-safe Corning ® Gorilla ® Glass protection. Basically, no place for mini-heart attacks. #MadSpeedKillerLooks pic.twitter.com/iY8tUqWtUZ — POCO India - Register for Vaccine 💪🏿 (@IndiaPOCO) June 8, 2021 -
POCO: పోకో నుంచి 5 జీ స్మార్ట్‌ఫోన్
5 జీ నెట్వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే వరుసగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా తక్కువ ధరలో హై ఎండ్ ఫోన్లు అందించే పోకో సైతం కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. పోకో ఎం 3 ప్రో పేరుతో కొత్త మొబైల్‌ని రేపు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు చేయనుంది. జూన్ 8న పోకో ఎం 3 పప్రోను తొలుత ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కోవిడ్ కల్లోకం కారణంగా రద్దయ్యింది. గత వారమే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. జూన్ 8న ఉదయం 11:30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. ఆకట్టుకునే ఫీచర్లు కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లను జత చేసింది పోకో సంస్థ. ఫోన్ వెనుక వైపు కర్వ్డ్ త్రీడీ గ్లాసీ ఫినిష్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే మూడు కెమెరాలను వెనుక వైపు ఇచ్చారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 18 వాట్ స్పీడ్ ఛార్జర్‌తో వచ్చే ఈ ఫోన్ బ్యాటరీ రెండు రోజుల వరకు డ్రైయిన్ అవదని పోకో హామీ ఇస్తోంది. -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.599కే పోకో స్మార్ట్‌ఫోన్
కొద్ది రోజుల క్రితం ఇండియాలో పోకో ఇండియా తన పోకో ఎం2 రీలోడెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రూ.10,000లోపు బడ్జెట్ విభాగంలో దీనిని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు, ఇప్పటికే ఫేమస్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ విషయంలో పెద్దగా ఏమీ మార్పు లేవు, కానీ ర్యామ్ ఆప్షన్ మాత్రం మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ + 64జీబీ, 6జీబీ + 128జీబీ మోడళ్లలో విడుదల అయింది. ఈ సారి సరికొత్తగా పోకో ఎం2 రీలోడెడ్ పేరుతో 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 64జీబీ వేరియంట్ ప్రస్తుతం ధర రూ.9,499. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.8,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే మీరు పోకో ఎం2 రీలోడెడ్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను రూ.599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌తో మొదటిసారి కొన్నట్లయితే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. కొత్తగా విడుదల అయిన పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్, గతంలో రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో పెద్దగా ఏమి మార్పు లేదు. చదవండి: ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.2,499కే పోకో ఎక్స్3 ప్రో
పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. పోకో ఎక్స్3 ప్రో తదుపరి సేల్ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.16,500 విలువచేయాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఒకవేళ పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను డైరెక్ట్‌గా సేల్ లో కొనాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
మోస్ట్ పవర్ఫుల్ ఫోన్...ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో మరొక మొబైల్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో పోకో ఎక్స్ 3 ప్రోను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన పోకో ఎక్స్3 కి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌ను అమర్చారు. పోకో ఎక్స్ 3 ప్రో క్వాడ్ రియర్ కెమెరాతో పాటు 120 హెర్ట్జ్ డిస్ప్లేను కలిగి ఉంది. పోకో ఫోన్ 25 జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62, రియల్ మీ ఎక్స్ 7, వివో వి 20 మొబైల్ ఫోన్లతో పోటీపడనుంది. కాగా, పోకో ఎక్స్ 3 ప్రో( 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) వేరియంట్‌కు రూ. 18,999 కాగా, (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) మోడల్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్ లో రానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1000 వరకు 10శాతం డిస్కౌంట్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్ 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48+8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5160ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.18,999 చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..! -
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3
పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది. పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డాట్ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) పోకో ఎఫ్3 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల -
లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర
మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి పోకో గుడ్ న్యూస్ తెలిపింది. పోకో ఎక్స్ 3 ప్రో మోడల్ ను మార్చి 30న ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేతో పాటు ఎల్ సీడి స్క్రీన్ ను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ సాప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్(అంచనా) 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5260ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.25,500 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,500 చదవండి: ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
లీకైన పోకో ఎక్స్3 ప్రో ధర, ఫీచర్లు
చైనా మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో రాబోతున్న పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. పోకో ఎక్స్3 ప్రో ధర, స్టోరేజ్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5200ఎంఏహెచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టిప్ స్టర్ సుధాంశు అంభోర్ ట్వీటర్ ద్వారా లీక్ చేశారు. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 250 యూరోలుగానూ(సుమారు రూ.21,600), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 300 యూరోలుగానూ(సుమారు రూ.26,000) ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను తీసుకోని రానున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ ఫీచర్లు ఉండనున్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో ఈ ఫోన్ రానుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ఈ ఫోన్ త్వరలో రానుంది. చదవండి: ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
పోకో ఎం3 కాసుల వర్షం!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇటీవలే ఎం3 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో లాంచ్ అయిన పోకో ఎం2కి తర్వాతి వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 9న ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొచ్చిన ఫస్ట్ సేల్‌లో 1.5 లక్షల యూనిట్లు అమ్ముడపోయినట్లు పోకో ప్రకటించింది. మొదటి నుంచి దీని మీద చాలా హైప్ ఉండటం చేత ఇంతగా సేల్ జరిగింది. దాదాపు 30లక్షల మంది వినియోగదారులు ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి కనబరిచినట్లు పోకో పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా దాదాపు రూ.165 కోట్ల బిజినెస్ జరిగింది. ఫిబ్రవరి 16న ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సేల్ కి రానుంది. పోకో ఎం3 ఫీచర్స్: డిస్ప్లే: 6.53-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ బ్యాటరీ: 6,000 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ ర్యామ్: 6జీబీ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: పవర్ బ్లాక్, కూల్ బ్లూ, యెల్లో ధర: రూ.10,999(6జీబీ, 64జీబీ) రూ.11,999(6జీబీ, 128జీబీ) చదవండి: -
పోకో ప్రియులకు శుభవార్త!
పోకో ఎఫ్1 మొబైల్.. ఇండియన్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. ఏదైనా ఒక ఫోన్ విడుదల అయితే 6నెలల తర్వాత ఔట్ డేట్ గా మారిపోతుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం విడుదలైనప్పటి నుంచి ఒక ఏడాది పాటు దాని హవా కొనసాగింది. అంత బాగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం ప్రీమియం మొబైల్స్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకోనిరావడమే. 2018లో విడుదలైన పోకో ఎఫ్1 మొబైల్లో అప్పటి ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. దీనిని కేవలం రూ.20వేలకే అందుబాటులో ఉంచడంతో చాలా మంది ఎగబడి కొన్నారు. అంతలా సక్సెస్ అయిన ఈ మొబైల్ కి కొనసాగింపుగా పోకో ఎఫ్2ను తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని అందుబాటులోకి తీసుకొనిరాలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి తీసుకోని రానున్నట్లు సమాచారం. ఇటీవలే పోకో ఇండియన్ డైరెక్టర్ అనుజ్ శర్మ, క్వాల్కామ్ ప్రాసెసర్ ప్రతినిధితో ట్విటర్ లో మాట్లాడిన వీడియోలో త్వరలో మరో కొత్త మొబైల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఆ రాబోయే మొబైల్ పోకో ఎఫ్2 కావచ్చు అని చాలా మంది నిపుణలు భావిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్/875 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చని అంచనా. పోకో ఎఫ్2 లీకైన స్పెక్స్‌లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. పోకో ఎఫ్2 5జీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానుంది. ఇది రూ.25వేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. (చదవండి: టెస్లాకు పోటీగా మరో ఎలక్ట్రిక్ కారు) -
బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3
న్యూఢిల్లీ: పోకో ప్రియులు ఎంతగానో ఇష్టపడే పోకో ఎం3 మొబైల్ నేడు ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. పోకో ఎం3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.(చదవండి: మహిళను రక్షించిన యాపిల్ స్మార్ట్‌వాచ్) పోకో ఎం3 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ గల పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 మీద పనిచేయనుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.79 లెన్స్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 మాక్రో లెన్స్‌తో 2ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం పోకో ఎం3 ముందు భాగంలో ఎఫ్/2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. పోకో ఎం3 64జీబీ,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్, యుఎస్బి టైప్-సి, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనిలో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 198 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) పోకో ఎం3 ధర: భారతదేశంలో పోకో ఎం3 6 జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.10,999 ఉండగా, 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో సేల్ కి రానుంది. పోకో ఎం3ను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. -
పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?
ఇండియాలో పోకోఎం3 విడుదల తేదీని అధికారికంగా సంస్థ ప్రకటించింది. దీనిని ఫిబ్రవరి 2న తీసుకొస్తున్నట్లు ఒక వీడియోను నేడు విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. పోకో ఎం3లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ని తీసుకురానున్నారు. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3ని తీసుకువస్తున్నారు.(చదవండి: నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02) పోకో ఎం3 ఫీచర్స్: పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే ఎంఐయుఐ 12 మీద నడుస్తుంది. ఇది 6.53-అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. పోకో ఎం3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనితో పాటు 4జీబీ ఎల్ పిడీడీఆర్4ఎక్స్ ర్యామ్+ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ లలో దీనిని తీసుకొస్తున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో ఎం3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పోకో ఎం3లో కనెక్టివిటీ విషయానికి వస్తే 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇందులో ఉంది. దీని బరువు 198 గ్రాములుగా ఉంది. గ్లోబల్ లాంచ్ ధరల ప్రకారం, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 యూరోలుగా(సుమారు రూ.11,000) నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 169 యూరోలుగా(సుమారు రూ.12,500) ఉంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. -
మొదలైన ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్బంగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(జనవరి 20) నుంచి జనవరి 24 వరకు కొనసాగనుంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఐదు రోజుల సేల్ లో ప్రముఖ మొబైల్ ఫోన్లు, టీవీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రస్తుతం లైవ్ లో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు 10 శాతం(కార్డుపై రూ.1,500 వరకు) తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్ లో మొబైల్ పై తీసుకొచ్చిన కొన్ని ఉత్తమమైన ఆఫర్స్ మీకోసం అందిస్తున్నాం.(చదవండి: వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక) ఆపిల్ ఐఫోన్ 11: ఆపిల్ ఐఫోన్ 11 64జీబీ వేరియంట్ ఈ వారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.48,999(అసలు రూ.54,900)కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ: ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.31,999(అసలు రూ.39,900)కి లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులకు రూ.3,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అతి తక్కువ ధర. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్: శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్ మళ్లీ రూ.44,999(ఎంఆర్పి రూ.83,000)కి లభిస్తుంది. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఇప్పటికీ ఈ ధర వద్ద మంచి ఎంపికగా కనిపిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గెలాక్సీ ఎస్ 20 ప్లస్ పై కూడా రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. పోకో ఎక్స్ 3: గత ఫ్లిప్‌కార్ట్ సేల్ లో పోకో ఎక్స్ 3ను కొనలేకపోయినట్లయితే ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో మరోసారి రూ.14,999 (ఎంఆర్పి రూ.19,999)కు కొనుగోలు చేయవచ్చు. పోకో ఎక్స్ 3 6.67-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉంది. దీనిలో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తాయి. మోటో జీ 5జీ: మోటో జీ 5జీ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన 5జీ స్మార్ట్ఫోన్లలో ఒకటి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.18,999(ఎంఆర్పి రూ.24,999)కే లభిస్తుంది. మోటో జీ 5జీ 6.67-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనిలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్: ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.39,990(ఎంఆర్పి రూ.55,000)కి లభిస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. -
త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల
ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లలో ఈ ఏడాది(2021)లో పోకో F2 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తాజాగా పేర్కొంది. 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. 2018లో విడుదల చేసిన పోకో F1 స్మార్ట్ ఫోన్ స్థానే సరికొత్త ఫీచర్స్‌తో పోకో F2ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. 10 లక్షల ఫోన్లను విక్రయించడం ద్వారా దేశీయంగా ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో టాప్-5లో ఒకటిగా నిలుస్తున్నట్లు పోకో వెల్లడించింది. అయితే పోకో F2 స్మార్ట్ ఫోన్ సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫీచర్స్పై టిప్‌స్టెర్ తదితర టెక్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. చదవండి: (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) ఫీచర్స్ ఇలా పోకో F2 స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో విడుదలకానుంది. గతంలో రూ. 16,000 ధరలో విడుదల చేసిన పోకో X3 మోడల్లో వినియోగించిన ఎస్వోసీతో 4,250 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ సెన్సర్‌తో క్వాడ్కెమెరాలకు వీలుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయనుంది. ఈ స్పెసిఫికేషన్స్ అంచనాలతో చూస్తే పోకో F2 స్మార్ట్ ఫోన్ ధరలు రూ. 20,000-25,000 మధ్య ఉండవచ్చు. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) -
షియోమీ లవర్స్ కి గుడ్ న్యూస్
షియోమీ తన సొంత ప్లాట్ఫామ్లో నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్ఫోన్లు ఇంకా మరిన్ని ఉత్పత్తులపై కంపెనీ 4,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో రూ.13,999కు లభిస్తుంది. షియోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ సందర్భంగా ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్‌ను రూ.9 వేల తగ్గింపుతో రూ.50,999కు పొందవచ్చు. కంపెనీ తన ఎంఐ వాచ్ రివాల్వ్‌ను 9,999 రూపాయలకు అందిస్తోంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.15,999కు లభించింది. ఫిట్నెస్ వాచ్‌లో 10 స్పోర్ట్స్ మోడ్లు, బాడీ ఎనర్జీ మానిటరింగ్, జిపిఎస్ సపోర్ట్, 1.39-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. షియోమీ తన 10,000ఎంఏహెచ్ ఎంఐ వైర్లెస్ పవర్ బ్యాంక్‌పై రూ.700 తగ్గింపుతో 1,999 రూపాయలకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకు 10వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఉత్పత్తిపై ఈ సేల్‌లో తగ్గింపును ప్రకటించింది.(చదవండి: అమెజాన్ లో మరో కొత్త సేల్) -
ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా వెతికే వాటిలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. ఈ వారంలో కొత్తగా రాబోయే శామ్సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ మొబైల్ ను తెగ వెతికేయడం వల్ల ఇది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కొత్తగా రాబోయే ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీని ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల 2వ స్థానంలో నిలిచింది. గత వారంలో 2వ స్థానంలో నిలిచిన షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఈసారి మూడవ స్థానంలో ఉంది. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త!) అదేవిదంగా గతవారంలో మొదటి స్థానంలో ఉన్న షియోమీ పోకో ఎమ్3 3 స్థానాలు కోల్పోయి 4వ స్థానంలో నిలిచింది. కొత్తగా రాబోయే శామ్సంగ్ గెలాక్సీ ఎ52 5జీ మొబైల్ ఐదవ స్థానంలోను, కొత్తగా వచ్చే శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ 6వ స్థానంలో నిలిచాయి. గత వారం 3వ స్థానంలో నిలిచినా ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఈసారి ఏడవ స్థానంలో నిలిచింది. అలాగే గతవారం 5,4,7 స్థానాలలో నిలిచిన షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ ఎ51, షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ మొబైల్స్ ఈసారి 8,9,10 స్థానాలలో నిలిచాయి. ర్యాంక్ 1: శామ్సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ ర్యాంక్ 2: ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ ర్యాంక్ 3: షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ర్యాంక్ 4: షియోమీ పోకో ఎమ్3 ర్యాంక్ 5: శామ్సంగ్ గెలాక్సీ ఎ52 5జీ ర్యాంక్ 6: శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ ర్యాంక్ 7: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ర్యాంక్ 8: షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో ర్యాంక్ 9: శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ర్యాంక్ 10: షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ -
2021లో రాబోయే షియోమీ ఫోన్లు ఇవే
షియోమీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ లను తీసుకొస్తుంది. ఒక్కోసారి నెలకు 1, 2 ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. అలాగే 2021లో కూడా మరిన్నీ ఫోన్లను తీసుకురావడానికి షియోమీ సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం షియోమీ మనదేశంలో రెడ్మి బ్రాండ్ క్రింద రెడ్మి 10 సిరీస్, రెడ్మి నోట్ 10 సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే పోకో విషయానికి వస్తే పోకో ఎం 3 ప్రో, పోకో ఎమ్ 3 ప్రో మరియు పోకో ఎక్స్ 4, పోకో ఎక్స్ 5 ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 2021లో రాబోయే పూర్తీ షియోమీ ఫోన్ల జాబితా ఈ క్రింద ఉంది. (చదవండి: వోడాఫోన్ ఐడియా రికార్డు) షియోమీ ఎంఐ 11, ఎంఐ 11 ప్రో షియోమీ ఎంఐ 11 సిరీస్ లో రాబోయే మొబైల్ జనవరిలో వస్తుందని సమాచారం. దీనిలో ఇటీవల లీకైన సమాచారం ప్రకారం 108 ఎంపీ ప్రధాన కెమెరా, కర్వేడ్ డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లను తీసుకురానున్నారు. ఎంఐ 11 ప్రోలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ నుండి 192 మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం. పోకో ఎఫ్ 2 పోకో ఎఫ్ 2 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. పోకో ఎఫ్ 1 తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. పోకో ఈ మధ్యే ఎన్నో ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది. పోకో ఎఫ్ 2 ఫీచర్ల గురుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ రెడ్ మీ నోట్ సిరీస్‌లో రానున్న తర్వాతి వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయని సమాచారం. రెడ్మి నోట్ 10 తక్కువలో 108 ఎంపి కెమెరా ఫోన్‌గా మారవచ్చు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ కే 40/ పోకో ఎక్స్ 4 రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 775 5జీ ప్రాసెసర్ తో రావచ్చు. కొన్ని మార్కెట్లలో రెడ్ మీ బ్రాండింగ్, కొన్ని మార్కెట్లలో పోకో ఎక్స్4గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్మి కే 40 ప్రో/ పోకో ఎఫ్ 3ప్రో రెడ్మి కే 30 ప్రో లేదా పోకో ఎక్స్ 2 ప్రో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో భారతదేశానికి రావచ్చు. రెడ్మి కె 40 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మల్టీ కెమెరా సెటప్, 12 జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీ తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్మి 10, రెడ్మి 10 ప్రైమ్, రెడ్మి 10 పవర్, రెడ్మి 10 ఐ ఇవి రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో లాంచ్ కానున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ తర్వాతి వెర్షన్లుగా రెడ్ మీ 10 సిరీస్ రానుంది. వీటి ధర వచ్చేసి 7,000 నుండి రూ.12,000 ఉండనున్నట్లు సమాచారం. 2021 మొదటి త్రైమాసికంలో మొదలయ్యి ఏడాది పొడవునా రెడ్మి 10 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. పోకో ఎం3, పోకో ఎం 3 ప్రో పోకో ఎం3 ఇప్పటికే లాంచ్ అయింది. కొన్ని దేశాల్లో ఈ ఫోన్ పోకో ఎం3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. పోకో ఎం 3 రియల్మే నార్జో 20 ఎ, రియల్మే సి 15 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వంటి వాటికీ పోటీగా తీసుకొచ్చింది. పోకో ఎం3 స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. పోకో ఎం3 ఇండియా ధర బడ్జెట్ కేటగిరీ రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. పోకో ఎం 3 ప్రో 15,000 కేటగిరీలో మిడ్-బడ్జెట్ రేంజ్ లో తీసుకురానుంది. ఎంఐ నోట్ 10 లైట్/ఎంఐ 10ఐ ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2021 ప్రారంభంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎంఐ నోట్ 10 లైట్ సెప్టెంబర్‌లో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీగా లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఎంఐ 10ఐగా లాంచ్ కానుందని తెలుస్తోంది. -
టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. డిసెంబర్ మొదటి వారంలో కూడా పోకో ఎమ్3 మొదటి స్థానంలో నిలిచింది. గత వారం 7వ స్థానంలో నిలిచిన రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఈ వారంలో 2వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ తన స్థానాన్ని కోల్పోకుండా మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ఇప్పుడు 2 స్థానాలు పైకి ఎగబాకి 4వ స్థానంలో నిలిచింది. యధాతదంగా షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో తన స్థానాన్ని నిలుపుకొని ఐదవ స్థానంలో నిలిచింది. గత వారం నాల్గవ స్థానంలో నిలిచిన షియోమీ పోకో ఎక్స్3 ఎన్ఎఫ్ సి ఈ వారం 6వ స్థానంలో ఉంది. కొత్తగా రాబోయే షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ ఏడవ స్థానంలో ఉంది. తరువాత 8,9,10 స్థానాలలో శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్, శామ్సంగ్ గెలాక్సీ A71, ఇన్ఫినిక్స్ జీరో 8ఐ ఉన్నాయి. ర్యాంక్ 1: పోకో ఎమ్3 ర్యాంక్ 2: రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ర్యాంక్ 3: ఐఫోన్ 12 ప్రో మాక్స్ ర్యాంక్ 4: శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ర్యాంక్ 5: రెడ్మి నోట్ 9 ప్రో ర్యాంక్ 6: పోకో ఎక్స్3 ఎన్ఎఫ్ సి ర్యాంక్ 7: ఎంఐ 10టీ ప్రో 5జీ ర్యాంక్ 8: శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్ ర్యాంక్ 9: శామ్సంగ్ గెలాక్సీ A71 ర్యాంక్ 10: ఇన్ఫినిక్స్ జీరో 8ఐ -
ఫ్లిప్‌కార్ట్ లో మరో కొత్త సేల్
ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ పేరుతో కొత్త సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎక్స్3, పోకో సి3, పోకో ఎం2 మరియు పోకో ఎం2 ప్రోపై డిస్కౌంట్‌ను ఇస్తుంది. పోకో డేస్ సేల్ అనేది నేటి నుండి డిసెంబర్ 6 వరకు ఉంటుంది. పోకో ఎక్స్3ని ఈ సేల్ లో భాగంగా రూ.15,999కే అందిస్తున్నారు. రెండేళ్లపాటు షియోమితో కలిసి ఉండి ఆ తర్వాత వేరుపడి స్వతంత్ర సంస్థగా అవతరించింది పోకో. ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ సేల్లోభాగంగా నాలుగు పోకో ఫోన్లపై డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుపై ఫ్లిప్‌కార్ట్ రూ.5000 వరకు తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. (చదవండి: ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్) పోకో సి3 ఫోన్ యొక్క అసలు ధర 9,999 కాగా ఈ సేల్ భాగంగా 6,999కి అందిస్తున్నారు. ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్ మరియు మాట్టే బ్లాక్ కలర్లో లభిస్తుంది. పోకో ఎం2 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 12999 కాగా.. 9,999కి అందిస్తున్నారు. అలాగే పొకో ఎం2 ప్రో మొబైల్ అసలు ధర రూ. 16,999 నుంచి రూ.12,999కి తగ్గించి విక్రయిస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 48 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే పొకో ఎక్స్3 మొబైల్ అసలు ధర రూ. 19,999 కాగా.. రూ.15,999కే ఈ సేల్‌లో అందిస్తున్నారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్ -
భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3
మొబైల్ మార్కెట్ లో చైనా సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పోకో ఎం2 అప్‌గ్రేడ్ మోడల్ ఇది. భారత్ లో విడుదల చేసిన పోకో ఎం2 బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. దింతో రాబోయే పోకో ఎం3పై కూడా అంచనాలు పెరిగాయి. చివరికి ఈ సరికొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది పోకో. కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పాటు 48 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. దీనిలో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: షాక్ గురైన స్నాక్ వీడియో యూజర్లు) పోకో ఎం3 ఫీచర్స్ పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10సపోర్ట్ తో ఎంఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడవనుంది. ఇందులో 90.34 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.53-అంగుళాల పూర్తి-హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. డిస్ప్లే కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, దీనితో పాటు 4జీబీ ఎల్ పీడీడీఆర్ఎక్స్ ర్యా మ్ ఉంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.79 లెన్స్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్ 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3 64జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ లలో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ వేయడం ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో ఎం3లోని కనెక్టివిటీ కోసం 4జీ ఎల్ టీఈ, వై -ఫై, బ్లూటూత్, జిపిఎస్/ ఏ-జిపిఎస్, యుఎస్ బి టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ ను కలిగి ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: 15 వేలలో లోపు ఇవే బెస్ట్!) పోకో ఎం3 ధర 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు పోకో ఎం3 ధర.149 డాలర్లు(సుమారు రూ. 11,000)గా నిర్ణయించబడింది. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర. 169 డాలర్లు(సుమారు రూ. 12,500) ధరను కలిగి ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో పోకో ఎం3 రిలీజ్ అయింది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో ఉన్నాయి. మరి పోకో ఎం3 ఇండియాకు వస్తుందా? దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
పోకో ఎం3 ఫీచర్స్ విడుదల
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన పోకో సంస్థ కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో పోకో ఎం2తో పాటుగా పోకో ఎం2 ప్రోను కూడా ఇండియాలో విడుదల చేసింది. సంస్థ ఇప్పుడు వీటికి అప్ డేట్ వెర్షన్ గా పోకో ఏం3ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. పోకో ఎం3ను నవంబర్ 24న ఐరోపా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు, పోకో ఏం3 ఫోన్ యొక్క డిస్ప్లే, బ్యాటరీ, చిప్సెట్తో సహా మొబైల్ గురించి కొన్ని వివరాలను అధికారికంగా ధ్రువీకరించింది. పోకో ఎం3 స్పెసిఫికేషన్లలో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 6.53-అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. పోకో డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్, వెనుక ప్రత్యేకమైన దీర్ఘచతురస్రాకార బ్లాక్‌తో ఆకృతి గల కెమెరా ప్యానల్‌తో వస్తుంది. ప్రధాన కెమెరా విభాగంలో ఎల్ఇడీ ఫ్లాష్ మరియు పోకో బ్రాండింగ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అందరు పోకో ఎం3 ధర గురుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు లాంచ్ ఈవెంట్ లో దీని ధరను వెల్లడించనున్నారు. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్) పోకో ఏం3 ఫీచర్స్ పోకో ఏం3 బెజెల్-తక్కువ 6.53-అంగుళాల డిస్ప్లేతో ఫుల్ హెచ్ డి ప్లస్ రిజల్యూషన్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. కనీసం 4జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకు రానున్నారు. అయితే 6,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. పోకో ఏం3లో ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఎంఐయుఐ 12ను పోకో ఏం3 బాక్స్ లో తీసుకురానున్నారు. పోకో ఏం3 ట్రిపుల్ రియర్ కెమెరాలతో పాటు 48 ఎంపీ ప్రాథమిక సెన్సార్ ఉంటుంది. మిగిలిన కెమెరా సెన్సార్లు, స్టోరేజ్ గురించి వివరాలు ప్రస్తుతానికి మిస్టరీగా ఉన్నాయి. పోకో ఏం3 నలుపు, నీలం, పసుపు అనే మూడు రంగులలో రానున్నట్లు సమాచారం. భారతదేశంలో పోకో ఎం3 విడుదల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఇవే
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. పోకో ఎమ్3 మొబైల్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పోకో కంపెనీ వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్3ని నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది. ఆ రోజు జరిగే లాంచ్ ఈవెంట్ లో పోకో ఎమ్3 యొక్క ధర, ఫీచర్స్ వెల్లడించనుంది. అయితే రెడ్మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎమ్3 పేరుతో తీసుకు వస్తునట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. (చదవండి: పబ్జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది) I don’t know about you, but I truly miss the feeling of waiting for a new POCO to be revealed. 🙌 Introducing POCO M3, Our MOST ???? yet! 😏#POCOM3 Is #MoreThanYouExpect pic.twitter.com/pQKQoGbFSe — POCO (@POCOGlobal) November 17, 2020 M2010J19CG మోడల్ నంబర్ తో కొత్త POCO ఫోన్ ఈ వారం ప్రారంభంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత MIUI, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు యుఎస్బి టైప్-సి పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా. -
15 వేల లోపు కొత్త ఫోన్ కొనాలంటే ఇవే బెస్ట్!
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పోటీగా మామూలుగా లేదు. తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ గల స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రూ .15 వేల లోపు ధర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ధర అనేది చాలా మందికి అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు రూ. 15,000 లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి, మీడియాటెక్ హెలియో జి80, మరియు మీడియాటెక్ హెలియో జి95 వంటి శక్తివంతమైన ప్రాసెసర్లను తీసుకొస్తున్నాయి. మంచి కెమెరా టెక్నాలజీ కూడా ఈ ధరలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్ లు ఉన్నందున, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ లను ఎంచుకోవడం అంత సులభం కాదు. అలా ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.. రియల్ మీ నార్జో 20.. ఈ మధ్య విడుదలైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ నార్జో సిరిస్ మొబైల్ ఫొన్లను కొత్తగా మార్కెట్ లొకి తీసుకొచ్చింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 4500mAh ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లాక్ నింజా, వైట్ నైట్ సెన్సర్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ రియల్ మీ 7.. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో వచ్చిన బెస్ట్ ఫోన్ లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ 7 రియల్ మీ 6తో పోలిస్తే మూడు ప్రధాన మార్పులు చేసింది. అవి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలలో మార్పు చేసింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000mAh ప్రధాన కెమెరా 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ మీస్ట్ బ్లూ, మీస్ట్ వైట్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ పోకో ఎం 2 ప్రో.. పోకో ఎం 2 ప్రో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండటంతో పాటు రెడ్మి నోట్ 9 ప్రోతో సమానంగా కనిపిస్తుంది. పోకోలో 6.67-అంగుళాల పూర్తి-హెచ్డి + ఎల్సిడి డిస్ప్లేను ఉపయోగించారు. పోకో ఫ్రంట్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. పోకో M2 ప్రో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 11 పై నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 720G SoC చిప్ ని వాడారు. 5,000mAh సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఒక రోజు మొత్తం సులభంగా వాడుకోవచ్చు. దీని ధర వచ్చేసి Rs. 13,999. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లూ, గ్రీన్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రెడ్మి నోట్ 9 ప్రో గతంలో రెడీమి నోట్ సిరీస్ లో వచ్చిన ఫోన్ ల కంటే రెడ్మి నోట్ 9 ప్రో తక్కువ ప్రారంభ ధరలో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 6.67-అంగుళాల ఎల్సిడి స్క్రీన్‌ను కలిగి ఉండటంతో పాటు పైభాగంలో హోల్-పంచ్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. దీనిలో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ ఉపయోగించారు. రెడ్మి నోట్ 9 ప్రో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర వచ్చేసి 12,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67- ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ అరోరా బ్లూ, ఛాంపింగ్ గోల్డ్, గ్లేసియర్ వైట్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రియల్ మీ నార్జో 10.. రియల్ మీ నార్జో 10 తక్కువ ఖర్చుతో కూడిన ఫోన్, ఇది మీడియాటెక్ హెలియో జి80 SoC ప్రాసెసర్ పై నడుస్తుంది. దీనిలో కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను వాడారు. ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ పొందవచ్చు. ఇందులో హెలియో జి80 ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల గేమింగ్ పనితీరు చాలా బాగుంది. భారత్ లో దీని ధర వచ్చేసి 11,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 720x1600 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో జి80 ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 128జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000ఎమ్ఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ గ్రీన్, వైట్ -
పోకో ఎక్స్3 లాంచ్.. ధర, ఫీచర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు పోకో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ అందుబాటు ధరలో పోకో ఎక్స్3 పేరుతో భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది. పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పోకో ఎక్స్3 ఎట్టకేలకు మనదేశంలో కూడా అందుబాటులోకి తెస్తోంది. గత నెలలో యూరోప్‌లో లాంచ్ అయిన పోకో ఎక్స్3 ఎన్ఎఫ్సీ మాదిరిగానే దీన్ని రూపొందించింది. పోకో ఎక్స్3 ధర, లభ్యత మూడు వేరియంట్లు, కోబాల్ట్ బ్లూ, షాడో గ్రే రంగుల్లో పోకో ఎక్స్ 3 లభ్యం. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499 హైఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. పోకో ఎక్స్3 ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం 64 +13 +2 +2 మెగా పిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ Everything you need to know about the #POCOX3. - @qualcomm_in #Snapdragon 732G - 64MP Sony IMX682 Quad Cameras - 120Hz FHD+ Display with 240Hz touch sampling rate - 6000mAh battery with 33W fast charger (in-box) - LiquidCool Technology 1.0 Plus 3000 RTs & we'll giveaway one. pic.twitter.com/RSJwwuTfzQ — POCO India #POCOX3 (@IndiaPOCO) September 22, 2020 -
అద్భుత ఫీచర్లు, సరసమైన ధర పోకో ఎం2
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం 2 ను ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో, పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80ప్రాసర్, క్వాడ్ రియర్ కెమెరా, భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా అందుబాటు ధరలో దీన్ని లాంచ్ చేసింది. భారతదేశంలో పోకో ఎం 2 ధర, లభ్యత 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ ధర రూ. 10,999 టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 12,499. సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం2 ఫీచర్స్ 6.53 అంగుళాలు స్ర్రీన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 మీడియాటెక్ హెలియో జి 80ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 13+ 8+5+2మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
‘వాయువేగంతో పోకో స్మార్ట్‌ఫోన్ సేవలు’
ముంబై: మొబైల్ దిగ్గజం రియల్మీ జూన్ 25న ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అయితే మరోవైపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో (స్మార్ట్ ఫోన్)ఇండియా జనరల్ మేనేజర్ సీ.మన్మోహన్ మాత్రం రిలయ్‌మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్‌ను క్రీప్(నెమ్మదైన ఫోన్‌గా) అభివర్ణించాడు. ట్టిటర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సీ. మన్మోహన్ స్పందిస్తూ.. వాయు వేగంతో సేవలందించే పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండగా, మీరెందుకు రియల్మీ ఎక్స్2, ఎక్స్3 లాంటి నెమ్మదైన ఫోన్లను వాడడానికి ప్రయత్నిస్తారని యూజర్‌ను ప్రశ్నించారు. మరోవైపు పోకో మేనేజర్ గతంలో కూడా రియల్ మీ లాంచ్ చేసిన ఎక్స్ 50పప్రో (5జీ స్మార్ట్‌ఫోన్) నెట్వర్క్సేవలందించే ఫోన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ దేశంలో ప్రస్తుతం 5జీ సేవలను ప్రజలు కోరుకోవడం లేదని, ప్రజలు కోరుకునే అన్ని సేవలను పోకో స్మార్ట్‌ఫోన్ అందిస్తుందని తెలిపారు. -
అద్భుతమైన ఫీచర్లతో ఫోకో ఎఫ్ 2 ప్రొ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: పోకో ఎఫ్ సిరీస్‌లో సెకండ్ జనరేషన్ ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సబ్ బ్రాండ్ అయిన పోకో తన కొత్త ఫ్లాగ్షిప్ పోకో ఎఫ్ 1 ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత పోకో ఎఫ్ 2 ప్రొ పేరుతో కొత్త మొబైల్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. (షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..) పోకో ఎఫ్2 ప్రొ ఫీచర్లు 6.67అంగుళాల పూర్తి హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 64 +13+5+2 ఎంపీ క్వాడ్ రియర్‌కెమెరా 20 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ 5 జీ కనెక్టివిటీ, వెనుక వైపున ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 , పాప్ అప్ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 30వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో, బాక్స్ లోనే దీనికి సరిపడిన ఛార్జర్ తో వస్తుందనీ కేవలం 63 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. నియాన్ బ్లూ, ఫాంటన్ వైట్, ఎలక్ట్రిక్ పర్పుల్, సైబర్ గ్రే నాలుగు రంగులలో లభ్యం. ధర రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 41500 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 50 000