పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే? | POCO M3 India Launch Date is February 2 | Sakshi
Sakshi News home page

పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?

Published Wed, Jan 27 2021 6:18 PM | Last Updated on Wed, Jan 27 2021 6:43 PM

POCO M3 India Launch Date is February 2 - Sakshi

ఇండియాలో పోకోఎం3 విడుదల తేదీని అధికారికంగా సంస్థ ప్రకటించింది. దీనిని ఫిబ్రవరి 2న తీసుకొస్తున్నట్లు ఒక వీడియోను నేడు విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. పోకో ఎం3లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ని తీసుకురానున్నారు. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3ని తీసుకువస్తున్నారు.(చదవండి: నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02)

పోకో ఎం3 ఫీచర్స్:
పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే ఎంఐయుఐ 12 మీద నడుస్తుంది. ఇది 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. పోకో ఎం3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనితో పాటు 4జీబీ ఎల్ పిడీడీఆర్4ఎక్స్ ర్యామ్+ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ లలో దీనిని తీసుకొస్తున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. 

పోకో ఎం3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పోకో ఎం3లో కనెక్టివిటీ విషయానికి వస్తే 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇందులో ఉంది. దీని బరువు 198 గ్రాములుగా ఉంది. గ్లోబల్ లాంచ్ ధరల ప్రకారం, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 యూరోలుగా(సుమారు రూ.11,000) నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 169 యూరోలుగా(సుమారు రూ.12,500) ఉంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement