వన్‌ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్‌ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది.
పోకో ఎఫ్3 జీటీ ధర
భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది.
ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది.
పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్:
- 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే
- 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1)
- మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్
- 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్)
- 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ)
- 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా
- 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
- 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
Comments
Please login to add a commentAdd a comment