MediaTek processor
-
మీడియాటెక్‌తో జియోథింగ్స్ జట్టు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ జియోథింగ్స్ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్స్‌ను అందిస్తుంది.ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ మొదలైన వాటికి స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్ యాప్ సూట్‌కి ఈ ప్లాట్‌ఫాం ద్వారా యాక్సెస్ లభిస్తుంది. -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ఫీచర్స్.. ధర కూడా తక్కువే!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ 'వన్‌ప్లస్' ఇప్పుడు నార్డ్ సిరీస్'లో మరో మొబైల్ తీసుకొచ్చింది. ఈ మిడ్ రేంజ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్'ను, వన్‌ప్లస్ వై1ఎస్ సిరీస్ టీవీతో పాటు నేడు(ఫిబ్రవరి 17) మన దేశంలో లాంచ్ చేసింది. కంపెనీ గత ఏడాది లాంఛ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీకి వారసుడు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ తీసుకొచ్చారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే హెచ్డీఆర్+ సపోర్టు చేసే అమోలెడ్ డిస్ప్లే ఉంది. నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ధర మన దేశంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటే, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బహామా బ్లూ, గ్రే మిర్రర్ రంగులలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అమ్మకానికి వస్తుందని వన్‌ప్లస్ తెలిపింది. నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ స్పెసిఫికేషన్స్ 6.43 అంగుళాల(1,080ఎక్స్2,400) ఫుల్హెచ్డీ+ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఏఆర్ఎమ్ మాలి-జీ68 జిపియు, 8జిబి ఎల్పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా + 2 ఎంపీ మాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 471 సెల్ఫీ కెమెరా 5జీ కనెక్టివిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సి, 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, యుఎస్బి టైప్-సి పోర్ట్ 65డబ్ల్యు సూపర్ వీఓఓసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!) -
బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!
ముంబై: భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ మీడియాటెక్‌తో కలిసి రిలయన్స్ జియో ప్రత్యేకంగా అత్యంత ప్రజాదరణ పొందిన బీజీఎంఐ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ టోర్నమెంట్ రూ.12.5 లక్షల ప్రైజ్ పూల్తో అక్టోబర్ 30, 2021న ప్రారంభమయ్యింది. అయితే, టోర్నమెంట్‌కు దేశంలోని బీజీఎంఐ కమ్యూనిటీ నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చినట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయని పేర్కొంది. టోర్నమెంట్లో పాల్గొన్న సాధారణ గేమర్లు, ఔత్సాహిక ప్లేయర్లు మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. చివరకు టోర్నమెంట్లో బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ విజేతలుగా మాయావీ టీమ్ నిలచింది. ఈ ఎస్పోర్ట్స్ టోర్నమెంట్ 9 జనవరి 2022న ముగిసింది. ఈ ఫైనల్ టోర్నమెంట్‌ను మిలియన్ల మంది వీక్షకులు యూట్యూబ్ ద్వారా చూశారు. (చదవండి: జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!) -
Moto G31: మోటోరోలా నుంచి మరో శక్తి వంతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా భారతదేశం మీద దండయాత్ర ప్రకటించినట్లు కనిపిస్తుంది. వరుస బెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ను మొబైల్ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తాజాగా మీడియాటెక్ ప్రాసెసర్, వెనుక ట్రిపుల్ కెమెరా యూనిట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల కొత్త స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ31'ను మోటోరోలా మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹12,999గా ఉంది. రెండవది 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹14,999గా ఉంది. మోటో జీ31 కూడా అన్నీ మోటోరోలా మొబైల్స్ మాదిరిగానే సమీప స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది యాడ్ ఫ్రీ, దీనిలో ఎటువంటి బ్లోట్ వేర్ ఉండదు. దీని ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 6 నుంచి అందుబాటులోకి వస్తుంది. మోటో జీ31 ఫీచర్స్: డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్(1,080 X 2,400), ఓఎల్ఈడీ హోల్-పంచ్ డిస్ ప్లే ఆపరేటింగ్ సిస్టమ్: స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ర్యామ్, స్టోరేజ్: 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ: ఎఫ్ఎమ్ రేడియో, 3.5మిమి ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 802.11 , యూఎస్బీ టైప్-సి పోర్ట్ సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ (చదవండి: జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!) -
మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..!
ప్రపంచవ్యాప్తంగా క్వాలకమ్, మీడియాటెక్, హెలియో ప్రాసెసర్లను పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్ ప్రాసెసర్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ సంచలన విషయాలను వెల్లడించింది. చదవండి: మెటావర్స్‌తో ముప్పు! అంతకు మించి.. మీ కాల్స్‌ను మూడో వ్యక్తి వినగలరు..! మీడియాటెక్ ప్రాసెసర్స్‌తో నడిచే స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్ల కాల్స్‌ను మూడో వ్యక్తి వినే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక ప్రకారం.... మీడియాటెక్ చిప్ ఆడియో ప్రాసెసర్‌లో అనేక దుర్బలత్వాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకవేళ వీటిని రెక్టిఫై చేయకుండా వదిలేస్తే హ్యాకర్లు సులభంగా వారి సంభాషణలు వినే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాటెక్ ప్రాసెసర్లను ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు షావోమీ, ఒప్పో, రియల్మీ,వివో లాంటి కంపెనీలు వాడుతున్నాయి. పరిష్కరించిన మీడియాటెక్..! చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన లోపాలపై మీడియాటెక్ స్పందించింది. పలు ప్రాసెసర్లలో లోపాలు ఉన్నది వాస్తవమైనప్పటికీ, ఈ లోపాల సహాయంతో ఇప్పటివరకు ఎలాంటి డేటా చౌర్యం జరిగిందనే రుజువులేదని మీడియా టెక్ భద్రత అధికారి టైగర్ హుజ్ వెల్లడించారు. ఆయా లోపాలను కంపెనీ వెంటనే గుర్తించి, పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఆయా స్మార్ట్ఫోన్ల యూజర్లు కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌కి అప్డేట్ చేయాలని పేర్కొంది. వాటితో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. CVE-2021-0661, CVE-2021-0662, CVE-2021-0663గా గుర్తించబడిన లోపాలను కంపెనీ పరిష్కరించిందని మీడియాటెక్ తన సెక్యూరిటీ బులెటిన్‌లో ప్రచురించింది. చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్ నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్..! -
ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్ నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్..!
క్వాలకమ్ పోటీగా ప్రముఖ చిప్‌మేకర్ మీడియా టెక్ సంస్థ ‘డైమెన్సిటీ 9000 5జీ’ పేరుతో కొత్త చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో వాడనున్నట్లు తెలుస్తోంది. ఎన్4 చిప్‌మేకింగ్ ద్వారా ఈ కొత్త డైమెన్సిటీ 9000 5జీ చిప్సెట్ తయారుచేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్4 చిప్‌మేకింగ్ టెక్నాలజీ ఉపయోగించి చేసిన చిప్‌గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్ సైజ్‌తో, అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్తో పనిచేయనున్నాయి. చదవండి: భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..! గత ఏడాది మీడియాటెక్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాంచ్ చేసిన కొత్త చిప్సెట్తో ఈ ఏడాది గాను కంపెనీ ఆదాయం 17 బిలియన్ల డాలర్లకు చేరుకోవాలని మీడియాటెక్ భావిస్తోంది. మీడియాటెక్ 4జీ చిప్‌లు బహిరంగ మార్కెట్లలో 10 డాలర్లకు అమ్ముడవుతుండగా...ఈ 5జీ చిప్సెట్లను 30 నుంచి 50 డాలర్లకు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని 5జీ స్మార్ట్‌ఫోన్ చిప్ తయారీ కంపెనీల్లో మీడియో టెక్ మూడో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో క్వాలకమ్, రెండో స్థానంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్ ఉన్నాయి. షావోమీ, ఒప్పో, వివోకు చెందిన తక్కువ, మధ్య స్థాయి స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ ప్రాసెసర్లను వాడుతున్నారు. చదవండి: క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు -
JIO: ఇ గేమింగ్ టోర్నమెంట్.. భారీ క్యాష్‌ప్రైజ్
MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్వర్క్! ఇండియాలో ఇ గేమ్స్ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ జియో, చిప్సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్ మాస్టర్ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్లో గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. క్యాష్ ప్రైజ్ గేమింగ్ మాస్టర్ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్, ఇ గేమింగ్‌లో ఉత్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. రిజిస్ట్రేషన్లు గేమింగ్ మాస్టర్ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్ https://play.jiogames.comకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్ మాస్టర్ 2.ఓ టోర్నమెంట్ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్ యూజర్లు ఈ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదు. ఇలా చూడొచ్చు గేమింగ్‌మాస్టర్ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్డీ ఈస్పోర్ట్స్ ఛానల్, ఫేస్బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛాన్సల్‌లో చూడవచ్చు. మీడియాటెక్ జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్ అందిస్తోన్న హెలియో జీ సిరీస్ చిప్సెట్లపై గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్సెట్లను అందుబాటులోకి తెచ్చింది. -
అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ లావా ఇంటర్నేషనల్ తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీని నేడు దేశంలో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరాలు, 30 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది. లావా అగ్ని 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గల 90హెర్ట్జ్ డిస్ ప్లేతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8జీబీ ర్యామ్, 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 8ఎస్ 5జీ, మోటో జీ 5జీ, శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ వంటి వాటితో పోటీపడనుంది. లావా అగ్ని 5జీ ధర: లావా అగ్ని 5జీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. నవంబర్ 18 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా దేశంలో అమ్మకానికి వస్తుంది. నేటి నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5జీని ముందస్తుగా బుకింగ్ చేసుకునే కస్టమర్లు ప్రాథమిక మొత్తం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వీరికి ఫోన్ మీద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. లావా అగ్ని 5జీ ఫీచర్స్: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ ర్యామ్, స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా: 64 ఎంపీ, 5 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ 5జీ: డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఓఎల్టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సి పోర్ట్ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆంబియంట్ లైట్ సెన్సార్, ప్రోమిసిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ (చదవండి: చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు) -
మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ "లావా" ఈ సంవత్సరంలో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అగ్ని పేరుతో రేపు మధ్యాహ్నం మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. ఈ పండుగ కాలంలో 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు తక్కువ ధరకు అందించాలని భావిస్తుంది. లావా అగ్ని 5జీ ఫోన్ ను రూ.19,999 ధరకు తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ను రెడ్ మీ నోట్ 10 సిరీస్, రియల్ మీ ఫోన్లకు దీటుగా తీసుకొనిరావాలని కంపెనీ చూస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ క్రింది విధంగా ఉన్నాయి. లావా అగ్ని 5జీ ఫీచర్స్(అంచనా): డిస్ప్లే: 6.51 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ ర్యామ్, స్టోరేజ్ : 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా: 64 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ (చదవండి: బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి) -
భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..!
బెంగళూరు: ప్రముఖ చిప్సెట్ కంపెనీ మీడియాటెక్ భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) సౌకర్యాలను బలోపేతం చేయడానికి, విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్, ఎంటర్ప్రైజ్ విభాగాలు, 5జీ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌పై దృష్టి సారించి కంపెనీ రిక్రూట్మెంట్ చేయనుందని ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! మీడియాటెక్ బెంగళూరు జనరల్ మేనేజర్ రీతుపర్ణ మండల్ మాట్లాడుతూ...మీడియాటెక్‌కు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్. భారత్‌లో, ప్రపంచ మార్కెట్లలోని పలు ఆవిష్కరణలను రూపోందించడం కోసం స్థానిక ప్రతిభ అవసరమని పేర్కొన్నారు. మీడియాటెక్ కంపెనీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు , నోయిడాలోని పరిశోధనా కేంద్రాలలో పరిశోధన , ఉత్పత్తి రూపకల్పన సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం పలు కాలేజీ క్యాంపస్‌ల నుంచి భారీ రిక్రూట్మెంట్కు కంపెనీ ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. 2021లో మీడియోటెక్ కంపెనీ విస్తరణలో భాగంగా, భవిష్యత్తు ప్రణాళికల కోసం ఆర్అండ్డీ బడ్జెట్‌ను సుమారు 3 బిలియన్ డాలర్లను పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఇటీవల భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి దారులకు ముఖ్యమైన చిప్సెట్ భాగస్వామిగా మీడియాటెక్ అవతరించింది. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! -
వన్‌ప్లస్ నార్డ్ 2కు పోటీగా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్‌ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ధర భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది. ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్: 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1) మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్) 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ) 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 2
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్: 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్) 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్) 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 189 గ్రాముల బరువు -
విడుదలకు ముందే లీకైన గెలాక్సీ ఏ 22 5జీ ధర, ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శామ్సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కానీ, విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ ఫోన్ ధర లీక్ అయింది. ఈ ఫోన్ ను రెండు ర్యామ్ వేరియెంట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిని జూన్ లో యూరోపియన్ మార్కెట్లో రూ.20,000 ధర ట్యాగ్ తో ప్రారంభించారు. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ జూన్ లోనే లాంఛ్ చేశారు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, గెలాక్సీ ఏ22 5జీ ఆగస్టులో రావచ్చు అని సమాచారం. దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. వీటి ధర 10 నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటుంది. శామ్సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది. దీని 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్ 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
ఇండియాలోనే ఫాస్టెస్ట్ 5జీ ఫోన్... రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ ఫుల్ ప్రాసెసర్, దుమ్మురేగిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసేందుకు ఒప్పో రంగం సిద్ధం చేసింది. జులై 14న సరికొత్త ఒప్పో రెనో 6 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఇప్పటి వరకు మిడ్‌రేంజ్ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో ఒప్పో నుంచి వచ్చిన రెనో సీరిస్ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకున్నాయి.పవర్ఫుల్ ప్రాసెసర్ఇటీవల కాలంలో పవర్ ఫుల్ ప్రాసెసర్‌గా గుర్తింపు పొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 900ని ఈ మొబైల్లో ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేయడంతో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 గిగాహెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఫాస్ట్ ఛార్జింగ్, వైఫై 6 కనెక్టివిటీ, ఆల్ట్రా ఫాస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, బ్యాటరీ మేనేజ్మెంట్ పనులు అద్భుతంగా నిర్వహిస్తుందనే పేరుంది. హాట్‌స్పాట్‌ని ఆన్ చేసి ఉంచనప్పుడు బ్యాటరీ డ్రైయిన్ కాకుండా ఎక్కువ సేపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కంపెనీలతో పోల్చితే కనీసం 30 శాతం బ్యాటరీ ఎక్కువగా వస్తుందని చెబుతోంది.ఫాస్టెస్ట్ 5జీమీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ని ఉపయోగించడం ద్వారా ఇండియాలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని ఒప్పో రీసెర్చ్ , డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరీఫ్ అన్నారు. అత్యంత వేగవంతమైన ఫోన్లో గేమింగ్, వీడియోగ్రఫి, వీడియో కంటెంట్ చూసేప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.మీడియాటెక్ప్రస్తుతం హై ఎండ్ ప్రీమియం ఫోన్లు ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే వాటికి ధీటుగా మీడియాటెక్ ఇటీవల డైమెన్సిటీ 900ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీంతో కొత్త ప్రాసెసర్‌తో రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ని ఒప్పో ఫోన్ తీసుకు వస్తోంది. -
జులై 22న వచ్చేస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే!
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా): 6.43 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 12 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా -
OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక టీజర్లో ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ 2పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. తాజాగా కంపెనీ నార్డ్ 2 గురించి అధికారిక వివరాలను టీజ్ చేసింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో రావచ్చని సమాచారం. భారతీయ కస్టమర్ల కోసం వన్‌ప్లస్, మీడియాటెక్ తో జతకట్టినట్లు కంపెనీ తెలిపింది. మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గా వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ నిలవనుంది. గతంలో వన్‌ప్లస్ ఏ మోడల్లో వాడని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీని దీనిలో ఉపయోగించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2లో AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్‌ను చేర్చనుంది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు అదే బ్రైట్ నెస్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ కనెక్టివిటీ సపోర్ట్‌తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్ప్లే తీసుకు రానున్నారు. ఈ డిస్ప్లే ఓఎల్‌ఇడీ టెక్నాలజీ, ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇక, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చే అవకాశం ఉంది. -
లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు
కొద్ది రోజుల క్రితమే వన్ ప్లస్ నార్డ్ సీఈ విడుదల అయ్యిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నార్డ్ 2కి సంబంధించిన పుకార్లు బయటకి వస్తున్నాయి. గత ఏడాది విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్ లను వెల్లడించిన టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్ అకా @OnLeaks సోమవారం మరికొన్ని వివరాలను షేర్ చేశారు. ఏఐ బెంచ్ మార్క్ వెబ్ సైట్ లో లిస్టింగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఎస్ వోసిపై సమాచారం లీక్ అయిన వెంటనే ఈ వార్త వచ్చింది. ఈ ఫోన్ జూలైలో మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డి + అమోల్డ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ లో హెమ్మర్స్ఆఫర్(అకా ఆన్ లీక్స్) షేర్ చేసిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ నార్డ్ 2 డిస్ప్లే పై ఎడమ మూలలో సెల్ఫీ స్నాపర్ హోల్-పంచ్ కటౌట్ ను కలిగి ఉంటుంది. ఇందులో వాల్యూమ్ రాకర్ ఎడమ అంచున ఉంది, కుడి అంచులో పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉంది. వన్ ప్లస్ నార్డ్ 2లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్ లో ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా యుఎస్ బి టైప్-సీ పోర్ట్, సీమ్ ట్రే, దిగువన స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఏఐ బెంచ్ మార్క్ లిస్టింగ్ ప్రకారం స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ తో వస్తుందని తెలుస్తుంది. చదవండి: ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ నార్జో 30 స్మార్ట్ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ బడ్స్ క్యూ2, రియల్ మీ ఫుల్-హెచ్ డి స్మార్ట్ టీవీతో పాటు వర్చువల్ ఈవెంట్ లో రియల్ మీ ఈ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్ మీ నార్జో 30 5జీ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తే, రియల్ మీ నార్జో 30 మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ పనిచేస్తుంది. రెండు ఫోన్ లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రియల్ మీ నార్జో 30 5జీ 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ ధర రూ.15,999. మరోవైపు రియల్ మీ నార్జో 30 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.12,499, 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ రెండు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ రంగులలో లభిస్తాయి. నార్జో 30 5జీ మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. అదే రోజున కొన్నవారికి రూ.500 డిస్కౌంట్(రూ.15,499) లభిస్తుంది. అలాగే, రియల్ మీ నార్జో 30 జూన్ 29న అమ్మకానికి రానుంది. మొదటి రోజు కొంటే 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ పై కూడా రూ.500 తగ్గింపు(రూ. 11,999 సమర్థవంతమైన ధర) లభిస్తుంది. రెండు ఫోన్ లు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం అవుతాయి. రియల్ మీ నార్జో 30 5జీ ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ (ఎఫ్/2.4 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపెర్చర్) 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (ఎఫ్/2.1 అపెర్చర్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 18 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ రియల్ మీ నార్జో 30 ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 30 డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్ ఫోన్ -
బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్సాంగ్
ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ సంస్థ శామ్సాంగ్ మార్కెట్లోకి బడ్జెట్ లో మరో కిల్లర్ మొబైల్ తీసుకొనివచ్చింది. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎమ్31 కొనసాగింపుగా ఈ ఏడాది గెలాక్సీ ఎమ్32ను నేడు(జూన్ 21) లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్సాంగ్ ఫోన్ 90హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32లో మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ వోసి ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది. మూవీలు, గేమ్స్, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్32 రెడ్ మి నోట్ 10ఎస్, పోకో ఎం3 ప్రో, రియల్ మీ 8 5జీ వంటి వాటితో పోటీపడనుంది. భారతదేశంలో శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంటే, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,999గా ఉంది. ఇది బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అమెజాన్, శామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, కీలక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు రానుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం జూన్ 28 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా గెలాక్సీ ఎమ్32 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ ఎమ్32 స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(వన్ యుఐ 3.1) 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ బ్రైట్ నెస్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 25డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (బాక్స్‌లో 15డబ్ల్యు ఛార్జర్ వస్తుంది) 4జీ ఎల్ టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సీ, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ 196 గ్రాముల బరువు చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి? -
రూ. 25 వేలకే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్‌బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
దేశంలో తొలిసారిగా విడుదలైన డ్యూయల్ సిమ్ 5జీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ.. డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో తొలిసారిగా డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌ను ఇందులో తీసుకొచ్చారు. డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై కూడా సపోర్ట్ చేస్తుంది. జూన్ 4 నుంచి అమ్మకానికి రానుంది. దీని గరిష్ఠ డేటా డౌన్లోడ్ వేగం సెకనుకు 4.7 గిగాబిట్ వరకు ఉంటుంది. రియల్మీ ఎక్స్ 7 మాక్స్ 5జీలోని మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మొబైల్ ప్రియులకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని రిరియల్మీఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ, 128జీబీ ధర రూ.26,999, అలాగే 12 జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.29,999 ఉంది. రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా(సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్) 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 50W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1 సపోర్ట్ చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్‌లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది
న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1(ఫస్ట్ ఇంప్రెషన్స్) మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు రానుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లు 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డుతో 256జీబీ వరకు పెంచుకునే అవకాశం 48 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.9,999 6జీబీ + 128జీబీ వేరియంట్‌కు రూ.11,499 చదవండి: జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు -
రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన ఎక్స్7ప్రో 5జీ మొబైల్ ను కొద్దీ రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా రియల్ మీ ఎక్స్7 ప్రో ఫ్లిప్ కార్టులో ఫస్ట్ సేల్ కి వచ్చింది. రియల్ మీ ఎక్స్7 సిరీస్ లో రెండు మొబైల్స్ తీసుకోని వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లనే దీనిలో అందించారు. రియల్ మీ ఎక్స్7 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ప్రస్తుతం 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను రూ.30,000కు తీసుకొనివచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫీచర్స్: డిస్ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ బ్యాటరీ: 4,500 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ బ్యాక్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్ కనెక్టివిటీ: డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1 ధర: రూ.29,999 చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక -
ఒప్పో ఏ55 5జీ వచ్చేసింది!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ55 5జీని చైనాలో విడుదల చేసింది. ఒప్పో ఏ55 5జీ 6జీబీ ర్యామ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ఫోన్ బిగ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) ఒప్పో ఏ55 5జీ ఫీచర్స్ డ్యూయల్ సిమ్ ఒప్పో ఏ55 5జీ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే కలర్ఓఎస్ 11పై నడుస్తుంది. ఇది 6.5-అంగుళాల ఎల్సిడి వాటర్‌డ్రాప్-స్టైల్ హెచ్డి ప్లస్(720x1,600 పిక్సెల్స్) డిస్ ప్లేను అందించారు. ఇది 6 జీబీ ర్యామ్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ(1టీబీ వరకు పెంచుకోవచ్చు) ఉంది. ఒప్పో ఏ55 5జీలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ఎఫ్/2.2 ఎపర్చరుతో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఒప్పో ఏ55 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5(802.11ac), బ్లూటూత్ v5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. దీని బరువు 186 గ్రాములు. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కొత్త ఒప్పో ఏ55 5జీలో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర చైనాలో సిఎన్ వై1,599 (సుమారు రూ.18,000)గా ఉంది. ఇది బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
ఎల్జీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం 'ఎల్జీ' మొబైల్ ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగవచ్చనే ఊహగానాల మధ్య భారతదేశంలో ఎల్జీ కె42 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎల్జీ కె42 తన ఆధిక ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత షాక్, వైబ్రేషన్ వంటి తొమ్మిది పరీక్షల్లో యుఎస్ మిలిటరీ డిఫెన్స్ స్టాండర్డ్ అందుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఎల్జీ కె42 అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810G సర్టిఫైడ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 26 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తుంది. దీని ధర 10,990 రూపాయలు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) ఎల్జీ కె42 ఫీచర్స్: ఎల్జీ కె42లో 6.6-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లే ఉంది. దీనిలో మీడియాటెక్ హెలియో పీ23 ప్రాసెసర్ తో పనిచేసే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంది. కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీల కోసం 8 ఎంపీ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఎల్జీ కె42 ఆండ్రాయిడ్ 10లో ఎల్జి యుఎక్స్ ఓఎస్ తో నడుస్తుంది. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. -
రూ.15 వేలకే ఒప్పో 5జీ మొబైల్
ఒప్పో ఏ53 4జీ మొబైల్ నీ ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా చైనాలో ఒప్పో ఏ53 5జీ వెర్షన్ మొబైల్ ని లాంచ్ చేసింది. 15వేలకే 5జీ మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే ఉంది. వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90 హెర్ట్జ్‌గా ఉంది. ఒప్పో ఏ53 5జీ 4జీబీ + 128జీబీ వేరియెంట్ ధర జెడి.కామ్‌లో చైనా యువాన్లు1,299(సుమారు రూ.14,600). ఇది 6జీబీ + 128జీబీ వేరియెంట్లో కూడా లభిస్తుంది. భారత్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.(చదవండి: ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్) ఒప్పో ఏ53 5జీ ఫీచర్స్ ఒప్పో ఏ53 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కలర్ఓఎస్ 7.2పై పనిచేస్తుంది. ఇది 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్డి ప్లస్(1,080x2,400) పిక్సెల్స్ డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఏ53 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ వేరియంట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ఎఫ్/2.0 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఒప్పో ఏ53 5జీలో 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,040 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని బరువు 175 గ్రాములగా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11ఎ/బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది లేక్ గ్రీన్, సీక్రెట్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
రియల్ మీతో జత కట్టిన జియో
రిలయన్స్ జియో రియల్ మీ, ఇతర కంపెనీలతో కలిసి 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారీ ఒకరు తెలిపారు. తక్కువ ధరకు 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్ వర్క్ అనుగుణంగా ఫోన్ల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి దేశంలో చాలా మంది 2జీ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ తెలిపారు. త్వరలో వీరి కోసం చాలా తక్కువ ధరలో 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: 10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ మరియు ట్రిక్స్) 4జీ మొబైల్స్ ని తీసుకురావడంకోసం రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు, ఇతర పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ తెలిపారు. రియల్ మీ సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ.. దేశంలో త్వరలో తక్కువ ధరలో 5జీ మొబైల్స్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మొబైల్స్ ని తీసుకురావడానికి చిప్సెట్లు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన అన్నారు. మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ డిజిటల్ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో 5జీ సహాయంతో కృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం రాబోతుందని తెలిపారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు. -
11వేలలో 5జీ ఫోన్
11 వేలలో 5జీ మొబైల్ ను చైనాలో విడుదల చేసింది జెడ్‌టీఈ కంపెనీ. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్‌ఫోన్ ను 2 డిసెంబర్ 2020న విడుదల చేసింది. ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర 999 చైనా యువాన్లు (సుమారు రూ.11,200), ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. (చదవండి: భారత్‌లో షియోమీని బ్యాన్ చేయండి) జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్పెసిఫికేషన్లు జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫోన్ 6.52-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 4జీబీ ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించగల 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ తో వస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంతో మిఫావర్ 10 ఆపరేటింగ్ సిస్టంపై నడవనుంది. ఇది 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపున ఉన్న జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను f/1.79 ఎపర్చర్‌తో, f/2.2 ఎపర్చర్‌తో రెండవ 8 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో మూడవ 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇది సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ గ్రే, ఫాంటసీ బ్లూ మరియు స్పేస్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధరను 999 యూరోలుగా(సుమారు రూ.11,200) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యూరోలుగా(సుమారు రూ.15,700) నిర్ణయించారు. -
వచ్చే వారంలో టెక్నో పోవా మొబైల్
టెక్నో స్మార్ట్ ఫోన్ కంపెనీ మనదేశంలో పోవా అనే కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో మొదటి ఫోన్ అయిన టెక్నో పోవా గేమింగ్ ఫోన్‌గా రానుంది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 4న భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. టెక్నో పోవా మూడు రంగులలో లభిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ(రూ.10,800)గా ఉండనున్నట్లు సమాచారం. (చదవండి: డిసెంబర్ లో లాంచ్ కానున్న వివో వీ20 ప్రో) టెక్నో పోవా ఫీచర్స్ ఇందులో 6.7 అంగుళాల హెచ్డీ+ డాట్-ఇన్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. టెక్నో పోవాలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. దీంతో పాటు మరో ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది. -
వివో వై1ఎస్ వచ్చేసింది
వివో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం వివో వై1ఎస్ రూపంలో మొబైల్ ని తీసుకొచ్చింది. సాదారణంగా సోషల్ మీడియా ద్వారా ఫోన్‌ను ప్రకటించే బదులు, ఈ సారి తన వెబ్సైట్ ద్వారా ఫోన్‌ను తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.(చదవండి: పడిపోయిన మొబైల్ అమ్మకాలు) వివో వై1ఎస్ స్పెసిఫికేషన్స్ వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం దీని 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా పేర్కొన్నారు. -
ఒప్పో బడ్జెట్ ఫోన్‌పై ధర తగ్గింపు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో గత నెల అక్టోబర్‌లో ఒప్పో ఏ15 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపును అందించారు. రియల్మీ, షియోమి, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒప్పో ఏ15 ధరను తగ్గించినట్లు తెలుస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల వంటి ఫీచర్లను అందించారు. ఒప్పో ఏ15ను ఇండియాలో విడుదల చేసినప్పుడు 2జీబీ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ కి 9,490 రూపాయలు కాగా, 3జీబీ + 32జీబీ మొబైల్ కి 10,990 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ధరను రూ .1,000 తగ్గించింది. దీనితోఒప్పో ఏ15 2జీబీ మోడల్ ధర రూ .8,490 కాగా, 3జీబీ మోడల్ ధర 9,990 రూపాయలు. కొత్త ధర ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (చదవండి: పబ్ జీ టోర్నీలో గెలిస్తే రూ.6 కోట్లు) ఒప్పో ఏ15 ఫీచర్స్ ఈ మొబైల్ లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఒప్పో ఏ15 6.5-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లేను 1600 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అమర్చారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. -
అత్యంత చవకైన డ్యూయల్ 5జీ ఫోన్
రియల్మీ 7 5జీ ఫోన్‌ని ఇంగ్లాండ్‌లో జరిగిన వర్చువల్ ఈవెంట్లో రియల్మీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన రియల్మీ వీ5నే రీబ్రాండ్ చేసి రియల్మీ 7 5జీగా లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ రియల్మీ ఈ ఫోన్లో పలు మార్పులు చేసింది. రియల్మీ వీ5లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను తీసుకురాగా, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మే 7 5 జీలో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి మరియు ఫ్రంట్ లో హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను అందిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో, రియల్ మీ 7ఐలకు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అత్యంత చవకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్ ఇదే. రియల్ మీ 7 5జీ స్పెసిఫికేషన్లు డిస్ ప్లే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ర్యామ్ 6 జీబీ స్టోరేజ్ 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు(256 జీబీ) ప్రధాన కెమెరా 48 ఎంపీ, 8 ఎంపీ( అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో షూటర్, మోనోక్రోమ్ ) ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ బ్లూటూత్ బ్లూటూత్ 5.1 సెన్సార్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యు ఐ కనెక్టివిటీ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై కలర్ బాల్టిక్ బ్లూ ఈ స్మార్ట్ ఫోన్ ధరను 279 యూరోలుగా(సుమారు రూ.27,400) నిర్ణయించారు. ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బాల్టిక్ బ్లూ రంగులో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇంగ్లండ్‌లో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని 229 యూరోలకే(సుమారు రూ.22,500) విక్రయించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియాల్సి ఉంది. -
వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!
మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు దానిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ర్యామ్ ఎంత.. డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతాం. అయితే తాజాగా ఈ జాబితాలో 5జీ వచ్చి చేరింది. ఇప్పుడు విడుదలయ్యే మొబైల్ లలో ఎక్కువగా 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే నెట్వర్క్ సంస్థలు కూడా 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 2020లో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్‌తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. కానీ ప్రస్తుతం 5జీ ఫోన్ల యొక్క ధరలు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారి ఆశ నిరాశగానే మిగిలిపోతుంది. (చదవండి: ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్) 5జీ ఫోన్ల యొక్క ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రాసెసర్ యొక్క ధర ఎక్కువగా ఉండటమే. దీనిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ధరలలో ఫోన్లు తయారు చేసే కంపెనీల కోసం మీడియా టెక్ కంపెనీ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మీడియాటెక్ బడ్జెట్ ఫోన్ల కోసం డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తీసుకొచ్చింది. తాజా ప్రకటనతో బడ్జెట్ ధరలో 5జీ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ 5జీని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల ఒకే ఫోన్లో రెండు 5జీ నెటవర్క్లను మీరు ఉపయోగించవచ్చు. కొత్త డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 7 ఎన్ఎమ్ తయారుచేశామని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో దీనిని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఇది రెండు కార్టెక్స్- A76 సిపియు కోర్లతో 2.2జీహెర్ట్జ్ మరియు ఆరు కార్టెక్స్- ఏ55 కోర్లతో క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్-ఇంటెన్సివ్ పనులకోసం మాలి- జీ57 ఎమ్ సీ యు జీ పీ యు ఉంది. మునుపటి తరం చిప్సెట్లతో పోలిస్తే మెరుగైన ఆడియో నాణ్యతను అందించే డ్యూయల్ స్టాండ్‌బై, వాయిస్ ఓవర్ న్యూ రేడియో(VoNR)ను కూడా మీరు పొందుతారు. ఇది గ్లోబల్ 5జి ఎన్ఆర్ బ్యాండ్ సపోర్ట్, మీడియాటెక్ యొక్క “5జీ అల్ట్రాసేవ్” బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీతో వస్తుంది. అలానే, ఈ ప్రాసెసర్‌తో 5జీ డౌన్‌లింక్ వేగం 2.77 జీబీపీఎస్ ఉంటుందట. ఇంకా ఏఐ-కలర్, ఏఐ-బ్యూటీ, మల్టీ ఫ్రేం నాయిస్ రిడక్షన్ ఫీచర్స్ 48 ఎంపీ, 64 ఎంపీ కెమెరాలతో పాటు 90హెడ్జ్ ప్రీమియం డిస్ప్లేను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ధర 250 డాలర్లు ఉంటుందని మీడియాటెక్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,000. అయితే ఈ ధర మరింత తగ్గొచ్చనేది మార్కెట్ వర్గాల నిపుణుల అభిప్రాయం. -
వివో నుండి మరో బడ్జెట్ ఫోన్
మొబైల్ ప్రపంచంలో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివో తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో మరో మొబైల్ ని తీసుకువచ్చింది. "వివో వై12ఎస్" పేరుతో హాంకాంగ్ మరియు వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించింది. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వి 10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఫాంటం బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభించనున్నాయి. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు 270 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా, అలాగే ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భారతదేశంలో వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ .11,999గా ఉండనుంది. -
కొత్త సరుకు
జోలో క్యూ900టీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జోలో తాజాగా ఓ మధ్యమశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. క్యూ900టీగా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.12వేలు. అయితే ఫీచర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. మల్టీటాస్కింగ్తోపాటు, గేమింగ్‌కు ప్రాసెసర్ కీలకమన్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యూ900టీలో ఏకంగా 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 1080 పిక్సెళ్ల వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ నాలుగు గిగాబైట్లు. మొత్తమ్మీద చూస్తూ ఈ డ్యుయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగిచడం కొంచెం నిరాశ కలిగించే అంశం. వీడియోకాన్ ఏ29 కొంచెం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి మంచి ఆప్షన్ వీడియోకాన్ ఏ29. నాలుగు అంగుళాల కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్లో 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ మాత్రమే. వీడియోకాన్ ఏ29లో 512 ఎంబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.5800.