
బెంగళూరు: ప్రముఖ చిప్‌సెట్ కంపెనీ మీడియాటెక్ భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి) సౌకర్యాలను బలోపేతం చేయడానికి, విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్, ఎంటర్‌ప్రైజ్ విభాగాలు, 5జీ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌పై దృష్టి సారించి కంపెనీ రిక్రూట్‌మెంట్ చేయనుందని ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..!
మీడియాటెక్ బెంగళూరు జనరల్ మేనేజర్ రీతుపర్ణ మండల్ మాట్లాడుతూ...మీడియాటెక్‌కు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్. భారత్‌లో, ప్రపంచ మార్కెట్లలోని పలు ఆవిష్కరణలను రూపోందించడం కోసం స్థానిక ప్రతిభ అవసరమని పేర్కొన్నారు. మీడియాటెక్ కంపెనీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు , నోయిడాలోని పరిశోధనా కేంద్రాలలో పరిశోధన , ఉత్పత్తి రూపకల్పన సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం పలు కాలేజీ క్యాంపస్‌ల నుంచి భారీ రిక్రూట్‌మెంట్‌కు కంపెనీ ప్లాన్ చేస్తోందని వెల్లడించారు.
2021లో మీడియోటెక్ కంపెనీ విస్తరణలో భాగంగా, భవిష్యత్తు ప్రణాళికల కోసం ఆర్‌అండ్‌డీ బడ్జెట్‌ను సుమారు 3 బిలియన్ డాలర్లను పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఇటీవల భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి దారులకు ముఖ్యమైన చిప్‌సెట్ భాగస్వామిగా మీడియాటెక్ అవతరించింది.
చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..!