సాక్షి, బెంగళూరు: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ దేశంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఏరోస్పేస్ పరిశ్రమలో పెరుగుతున్న వృద్ధిపై కన్నేసిన సంస్థ దేశంలో మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలకు తెరతీసింది.
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్ పరిశ్రమలో మరింత విస్తరించడానికి విమానాలు , ఇతర సంబంధిత సామగ్రి తయారీ అమెరికా కంపెనీ బోయింగ్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 800 మంది డైరెక్ట్ ఉద్యోగులను నియమించుకోనున్నామని బోయింగ్ సీనియర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. టాప్ ఇంజనీర్లనుంచి ఫాక్టరీ కార్మికులతో పాటు హెచ్ ఆర్ లాంటి ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
ప్రస్తుతం బోయింగ్ ఇండియా కంపెనీలో భారతదేశంలోని భాగస్వాముల సంస్థల ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారు 7వేలమంది ఉన్నారు. వీరిలో 1,200 మంది ప్రత్యక్ష ఉద్యోగులు . అయితే ఈ ఏడాది చివరినాటికి వీరి సంఖ్య 15వందలకు పెరగవచ్చని తెలిపింది. అలాగే భాగస్వామ్య సంస్థల సంఖ్యకూడా పెంచుకోనున్నామనీ... తద్వారా ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
అంతరిక్షంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలకు ఇండియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబర్‌లో ప్రచురించబడిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నివేదిక ప్రకారం, ఊహించిన దాని కంటే ఎక్కువగా 2025 నాటికి మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా నిలవనుంది
Comments
Please login to add a commentAdd a comment