Hire
-
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్ కంపెనీ విస్తరణ.. భారీగా జాబ్స్!
ఫిన్ టెక్ కంపెనీ క్యాష్ఈ (CASHe) ఈ ఏడాది చివరి నాటికి 300 మందిని నియమించుకోవాలని, డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను విస్తరించడానికి కొత్త టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పనిచేస్తుందని, కంపెనీ సాంకేతిక అవసరాలకు తోడ్పడుతుందని క్యాష్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెసిలిటీ ప్రస్తుతం కంపెనీ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ విభాగాలను నిర్వహిస్తుంది.టెక్నాలజీ, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, డెవ్ఆప్స్, టెక్ఆప్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్రెడిట్, కలెక్షన్స్ వంటి ఎక్స్పీరియన్స్ లెవల్స్, డొమైన్లలో నియామకాలు ఉంటాయి. క్యాష్ఈ హైదరాబాద్, ముంబై కేంద్రాల్లో 550 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా నియమించుకోనున్న 300 మందిలో 150 మందిని సంస్థ ప్రణాళికాబద్ధమైన టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీకి అనుగుణంగా నియమించనున్నారు.'ఫిన్ టెక్ పరిశ్రమ గణనీయమైన మార్పులకు లోనవుతోంది. లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ టెక్ స్పేప్లో మా ఫిన్‌టెక్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మేము మా బృందాలు, మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నాము" అని క్యాష్ఈ సీఈవో యశోరాజ్ త్యాగి పేర్కొన్నారు. -
‘పెద్ద సంఖ్యలో’.. ఐటీ ఉద్యోగులకు క్యాప్‌జెమినీ చల్లని కబురు!
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది. క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది. మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి. -
ఆ కంపెనీలకు ‘ఇంకా డిగ్రీ’లే కొలమానం!
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటాయి. అయితే ఆ ధోరణికి స్వస్తి పలుకుతామని కొన్ని కంపెనీలు గతంలో వాగ్దానాలు చేశాయి. డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అభ్యర్థులకు కళాశాల డిగ్రీలు ఉండాలనే నిబంధనను వదులుకుంటామని వాగ్దానం చేసిన కంపెనీలలో ఉన్నాయి. అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. వారి నియామక పద్ధతులు ఇప్పటికీ పాత ధోరణినే అనుసరిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికీ కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. ఆయా కంపెనీల్లో డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకుంటామని చెప్పిన సుమారు 11,300 ఉద్యోగాలను 2014 తర్వాత నుంచి అధ్యయనం పరిశీలించింది. గత సంవత్సరం జరిగిన 700 మంది నియామకాలను పరిశీలించగా డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకున్న ఉద్యోగం ఒక్కటీ లేదని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో కంపెనీలను మూడు వర్గాలుగా విభజించారు. వాల్‌మార్ట్, యాపిల్, టార్గెట్‌తో సహా 37 శాతం కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకంలో పురోగతి సాధించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్‌లతో సహా 45 శాతం కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. ఇక మూడవ వర్గం కంపెనీలను "బ్యాక్స్లైడర్స్" అని పిలుస్తారు. వాటిలో నైక్, ఉబెర్, డెల్టా ఉన్నాయి. నివేదికలో 18 శాతంగా ఉన్న ఈ కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకాల విషయంలో మొదట్లో పురోగతిని సాధించాయి. కానీ తర్వాత పాత పద్ధతికే వచ్చేశాయి. -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్‌లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కి అనుబంధ సంస్థ. -
గుడ్ న్యూస్: ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు
గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్‌బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే కాకుండా టాలెంట్ హబ్‌గా చూస్తున్నామన్నారు. కొత్త ఇంజనీరింగ్ కోర్సు ఎయిర్‌బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్.. ) ఎయిర్‌బస్ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు. భారత్ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2026 సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. -
మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే క్రమంలో ’రెయిన్బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్–వింగ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఐటీ సంస్థ ఇన్ఫోగెయిన్ తమ మార్కెట్‌ను పెంచుకునే దిశగా డిజిటైజేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా సిబ్బందిని తీసుకోనుంది. అలాగే సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఇన్ఫోగెయిన్ ప్రెసిడెంట్ దయాపత్ర నెవాతియా ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగుల తీసివేతలేమీ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా రిక్రూట్ చేసుకునే వారిలో 800 మంది భారత్‌లోనే ఉండబోతున్నారని నెవాతియా వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కంపెనీకి 6,000 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 5,000 మంది భారత్‌లో పని చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్ టెక్ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, భారతీయ ఐటీ మేజర్ చల్లటి కబురు చెప్పింది. కొంతమంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్టు హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ప్రకించింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది. హెచ్సీఎల్టెక్గత ఐదేళ్లుగా రొమేనియాలో పనిచేస్తోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ క్లయింట్లకు సేవలందించేలా ఇప్పటికే దేశంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులుండగా, మరో వెయ్యిమందిని చేర్చుకోనుంది. ఐటీ సేవల్లో వృద్ధిని కొనసాగించేందుకు స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ బుకారెస్ట్, ఇయాసిలో ఉద్యోగులను పెంచుకుంది. తమకు రొమేనియా కీలకమైన మార్కెట్ అని అందుకే మరింత మెరుగైన సేవలందించేలా వర్క్‌ఫోర్స్‌ను పెంచుకుంటు న్నామని ఐడీసీ అసోసియేట్ కన్సల్టెంట్ అలెగ్జాండ్రా సిమియన్ వెల్లడించారు. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) రొమేనియాలో స్థానిక ప్రతిభావంతులకు సాంకేతికతలో వృత్తిని కొనసాగించేందుకు అవకాశాలను సృష్టించేందుకు పెట్టుబడులు పెడుతున్నామని అక్కడి కంట్రీ లీడ్ ఇలియాన్ పదురారు అన్నారు. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, ఎంట్రీ లెవల్లోవారిని నియమించుకోవడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. (ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో) కాగా గూగుల్, అమెజాన్ , మెటా గత ఏడాది చివర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినసంగతి తెలిసిందే. గూగుల్ 12వేలు, మెటా, అమెజాన్లు వరుసగా 21వేలు, 27వేల మంది ఉద్యోగాలపై వేటు వేశాయి. -
తయారీ రంగంలో ఉద్యోగాల జోరు!
ముంబై: తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీలు ఈ ఏడాది(2022–23) చివరి త్రైమాసికంలో ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ4)లో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరిట టీమ్‌లీజ్ విడుదల చేసిన సర్వే తెలియజేసింది. భారీస్థాయి కంపెనీలు 69 శాతం, మధ్యస్థాయి సంస్థలు 44 శాతం, చిన్నతరహా బిజినెస్‌లు 39 శాతం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వివరించింది. సర్వేకు దేశవ్యాప్తంగా 14 నగరాల నుంచి తయారీ రంగంలోని 301 కంపెనీలను పరిగణించినట్లు తెలియజేసింది. 60 శాతానికిపైగా యాజమాన్యాలు తమ మానవ వనరులను విస్తరించే యోచనలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇక తయారీ, సర్వీసుల రంగాల ఉపాధి ప్రణాళికలు సంయుక్తంగా 68 శాతానికి బలపడినట్లు తెలియజేసింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఇది 65 శాతమేనని ప్రస్తావించింది. ఉపాధి కల్పనా ప్రణాళికల జాబితాలో ముంబై(97 శాతం), బెంగళూరు(94 శాతం), చెన్నై(89 శాతం), ఢిల్లీ(84 శాతం), పుణే(73 శాతం) ముందున్నట్లు పేర్కొంది. -
మహిళలకు బంపరాఫర్.. పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ కంపెనీలు!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్ బ్యాంకు, ష్నీడర్ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్‌ల నుంచి తీసుకోవడం, సీనియర్ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్ లీడ్ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్ కెరీర్ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. మంచి ఐడియాలకు నాంది ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఎల్అండ్టీ కార్పొరేట్ హ్యుమన్ రీసెర్సెస్ హెడ్ సి.జయకుమార్ తెలిపారు. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగైన ఫలితాలు ఇస్తుందనే దానిపై అధ్యయనాలు కూడా ఉన్నట్టు చెప్పారు. మంచి నైపుణ్యాలు కలిగిన మహిళా ఉద్యోగులను తాము కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు పనిలో సౌకర్యంపై దృష్టి పెట్టాలని చాలా కంపెనీల అభిప్రాయపడుతున్నాయి. ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్–ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకున్నట్టు బ్యాంక్ హెచ్ హెడ్ రాజ్‌కమల్ వెంపటి తెలిపారు. పోటీతత్వం.. ఎల్అండ్టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ హెడ్ అమితవ్ ముఖర్జి పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి గాను 23 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైవిధ్యాన్ని పెంచడం కోసం గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంక్ తీసుకుంటున్న చర్యలతో ఇది పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం ఓ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. క్యాంపస్ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని, సెకండ్ కెరీర్ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడం సానుకూలం. అధిక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న మహిళలు తిరిగి చేరేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆహ్వానం పలుకుతోంది. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తోంది. పిల్లల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న వారిని తిరిగి నియమించుకోవడం, గత ఐదేళ్లలో సంస్థను వీడిని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చేస్తోంది. ఉన్న మహిళా ఉద్యోగులను కాపాడుకోవడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాన్ని కాగ్నిజంట్ అనుసరిస్తోంది. 2020 నుంచి డైరెక్టర్, ఆ పై స్థాయి వారికి ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. చదవండి👉 ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియా శుభవార్త అందించింది.టాప్ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో శాంసంగ్ ఇండియా ఉద్యోగ నియామకాలను ప్రకటించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట నిచ్చింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?) కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఇంజనీర్లను రిక్రూట్ చేయనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణలతో సహా, ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే ఆవిష్కరణలు, సాంకేతికతలు, ఉత్పత్తుల, డిజైన్లపై వీరు పనిచేస్తారని, డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలనే తమ విజన్‌ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్, అండ్ డెవలప్మెంట్ కేంద్రాల కోసం సుమారు 1000 మందిని నియమించుకోనుంది. దీనికి అదనంగా మేథ్స్, కంప్యూటింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సిస్టమ్ ఆన్‌లో పనిచేసేలా ఈ ఇంజనీర్లను 2023లో కంపెనీలో చేర్చుకుంటామని శాంసంగ్ తెలిపింది. పరిశోధనా కేంద్రాలు మల్టీ-కెమెరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G అల్ట్రా-వైడ్‌బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాంటి రంగాలలో 7,500కి పైగా పేటెంట్లను దాఖలు చేశాయి. ఈ పేటెంట్లలో చాలా వరకు శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు,డిజిటల్ అప్లికేషన్లున్నాయి. అలాగే ఇండియాలో తయారైన ఆవిష్కరణలతో నంబర్ పేటెంట్ ఫైలర్గా నిలిచిందినీ, నేషనల్ IP అవార్డు 2021, 2022ని కూడా గెలుచుకుందని కంపెనీ తెలిపింది. -
ఉద్యోగ నియామకాలు పెరిగాయ్, ఏ రంగంలో ఎంత పెరిగాయంటే!
ముంబై: దేశీయంగా జూన్‌లో నియామకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), యాత్రలు, పర్యాటకం, రసాయన పరిశ్రమల్లో నియామకాల అధికమయ్యాయి. సుస్థిర ఆర్థిక రంగం, పర్యావరణ అనుకూల విభాగాలు, ఆతిథ్యంలోనూ ఈ జోరు సాగింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 271 నుంచి గత నెలలో 279కి ఎగసింది. మే నెలలో ఇండెక్స్ 284 పాయింట్లు నమోదు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ 26 శాతం, ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగాలు 20 శాతం తిరోగమనం చెందాయి. -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు టాటా గ్రూప్ శుభవార్త!
ముంబై: టాటా గ్రూపులో భాగమైన ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ తర్వాల పైలట్లను మరో ఐదేళ్లపాటు తిరిగి విధుల్లో నియమించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. కార్యకలాపాల్లో స్థిరత్వం కోసం ఈ విధానమని సంస్థ వర్గాలు తెలిపాయి. రిటైర్మెంట్ అయిన వెంటనే పైలట్లను కమాండర్లుగా ఐదేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) నియమించుకోనున్నట్టు ఎయిర్ ఇండియా డిప్యూటీ జీఎం వికాస్ గుప్తా అంతర్గత ఈ మెయిల్లో పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా తన సేవలను దేశీ, విదేశీ మార్గాల్లో పెద్ద ఎత్తున విస్తరించే ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా 300 విమానాలకు ఆర్డర్ చేసే సన్నాహాలతో ఉంది. దీంతో రిటైరైన పైలట్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విమరణ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. -
జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
ముంబై: కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోవడం.. సానుకూల ఆర్థిక కార్యకలాపాలు, ఎగుమతులకు డిమాండ్ వెరసి వ్యాపార వృద్ధి అవకాశాల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్‌లీజ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్–జూన్ కాలానికి ‘టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి. 21 రంగాలకు చెందిన 796 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇందు లో 16 రంగాల్లోని కంపెనీలు నియామకాలకు అను కూలంగా ఉన్నాయి. ఐటీలో 95%, విద్యా సేవల్లో 86%, ఈకామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 81%, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో 78% కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలతో ఉన్నాయి. అగ్రికల్చరల్, ఆగ్రోకెమికల్స్, బీపీవో/ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో నియామకాల ధోరణి బలహీనంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..!
బెంగళూరు: ప్రముఖ చిప్సెట్ కంపెనీ మీడియాటెక్ భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) సౌకర్యాలను బలోపేతం చేయడానికి, విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్, ఎంటర్ప్రైజ్ విభాగాలు, 5జీ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌పై దృష్టి సారించి కంపెనీ రిక్రూట్మెంట్ చేయనుందని ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! మీడియాటెక్ బెంగళూరు జనరల్ మేనేజర్ రీతుపర్ణ మండల్ మాట్లాడుతూ...మీడియాటెక్‌కు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్. భారత్‌లో, ప్రపంచ మార్కెట్లలోని పలు ఆవిష్కరణలను రూపోందించడం కోసం స్థానిక ప్రతిభ అవసరమని పేర్కొన్నారు. మీడియాటెక్ కంపెనీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు , నోయిడాలోని పరిశోధనా కేంద్రాలలో పరిశోధన , ఉత్పత్తి రూపకల్పన సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం పలు కాలేజీ క్యాంపస్‌ల నుంచి భారీ రిక్రూట్మెంట్కు కంపెనీ ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. 2021లో మీడియోటెక్ కంపెనీ విస్తరణలో భాగంగా, భవిష్యత్తు ప్రణాళికల కోసం ఆర్అండ్డీ బడ్జెట్‌ను సుమారు 3 బిలియన్ డాలర్లను పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఇటీవల భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి దారులకు ముఖ్యమైన చిప్సెట్ భాగస్వామిగా మీడియాటెక్ అవతరించింది. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! -
సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ 24]7.ఏఐ భారీ నియామకాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5,000ల పైచిలుకు మందిని కొత్తగా చేర్చుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 1,500 మందిని హైదరాబాద్ కేంద్రం కోసం నియమిస్తామని కంపెనీ ఎస్వీపీ నీనా నాయర్ తెలిపారు. ఇప్పటికే భాగ్యనగరి కేంద్రంలో 2,000 మంది పనిచేస్తున్నారు. సేల్స్, కస్టమర్ సర్వీస్, టెక్ సపోర్ట్ విభాగాల్లో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. టెలికం, రిటైల్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలో ఉన్న గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలకు సేవలు అందిస్తున్నారని కంపెనీ తెలిపింది. ఇక 80 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సంస్థకు బెంగళూరుతోపాటు ఇతర దేశాల్లో మరో అయిదు కార్యాలయాలు ఉన్నాయి. చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
కాగ్నిజెంట్‌లో కొలువుల జాతర: లక్ష ఉద్యోగాలు
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లోఆన్బోర్డింగ్ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్ ఇస్తామన్నారు. అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకో నున్నట్టు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్‌ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్సేషన్, సర్దుబాట్లు, ఉద్యోగ భ్రమణాలు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లు లాంటి చర్యలపై దృష్టిపెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ త్రైమాసికంలో డిజిటల్ రెవెన్యూ వృద్ధి సంవత్సరానికి 20 శాతానికి పెరిగిందని వెల్లడించిన ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్నారు. మూడవ త్రైమాసిక ఆదాయం 4.69 - 4.74 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండనుందని, 10.6-11.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ సీగ్మండ్ చెప్పారు. కాగా జూన్ 2020 త్రైమాసికంలో కాగ్నిజెంట్ 41.8 శాతం వృద్దితో, 512 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 3,802 కోట్లు) నికర ఆదాయాన్ని నివేదించింది. అలాగే 10.2-11.2 శాతం (స్థిరమైన కరెన్సీలో 9-10 శాతం) వృద్ధి అంచనాలను ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. -
స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ భారీ ప్రణాళికలతో వస్తోంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడంతోపాటు, ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా స్విగ్గీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న18 నెలల్లో 3లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. దీంతో తనఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థగా అవతరిస్తుంది. గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్నివెల్లడించారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది. ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 4.5 లక్షలతో ప్రయివేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ. 5 లక్షల ఉద్యోగుల లక్ష్యం నెరవేరితే టీసీఎస్‌ను అధిగమించి అతిపెద్ద ప్రైవేటు రంగ యజమానిగా స్విగ్గీ దూసుకురానుంది. -
ప్రముఖ ఐటీ సంస్థలో 30వేల ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దేశీయ నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించు కోనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా స్టాక్ (అబ్స్ట్రాక్ట్ డేటా) ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన గైడెన్స్ ప్రకారం వృద్ధిరేటును సాధించేందుకు 25-30వేల వరకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామరని హెచ్‌సీఎల్ హెచ్ఆర్ విభాగం ముఖ్య అధికారి వి అప్పారావు ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అమెరికాలో స్థానికులకు 65శాతం ప్రాధాన్యత నిచ్చిన నేపథ్యంలో డిపెండెన్స్ వీసాలు బాగా తగ్గాయన్నారు. దీంతోపాటు వీసాల జారీ అస్యంగా కారణంగా హెచ్1బీ , ఎల్1బీ వీసాల సంఖ్య క్షీణించిందని అప్పారావు వెల్లడించారు. ఈ ఏడాది 640హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా 400మందికి అనుమతి లభించినట్టు తెలిపారు. సెప్టెంబరు 30నాటి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12875 ఉండగా క్యూ2లో అదనంగా మరో 3754మంది చేరారని కంపెనీ ఫలితాల సందర్భంగా వివరించింది. -
శాంసంగ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారతీయ ఇంజనీర్లకు శుభవార్త అందించింది. దాదాపు వెయ్యిమంది ఇంజనీర్లను ఏడాది ఎంపిక చేయనున్నామని ప్రకటించింది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్ చేస్తామని, ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నతమ ఆర్ అండ్ డీ సెంటర్ల కోసం ఈ ఇంజనీర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయో మోట్రిక్స్, అగ్మెంటెడ్ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన్లలో వీరిని నియమించుకుంటుంది. దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల కోసం ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం బుధవారం ప్రకటించింది. వీరిలో 300మందిని ఐఐటీలనుంచి నియమించుకుంటామని వెల్లడించింది. అలాగే ఐఐటీ,, ఎన్ఐటీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, పిట్స్ పిలానీ, మణిపాల్ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,ఎండీ బెంగళూరు దీపేష్ షా వెల్లడించారు. ప్రతిభకు పెద్ద పీట వేస్తామనన్నారాయన. సాం ప్రదాయికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్ ఇంజనీరింగ్, మాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అప్లైడ్ మెషీన్స్ అండ్ స్టాటస్టిక్స్ లాంటి ఇతర కోర్సుల వారిని కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో ఆర్ అండ్ డి సెంటర్లు ఉన్నాయి. -
బోయింగ్ ఇండియాలో ఉద్యోగాలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ దేశంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఏరోస్పేస్ పరిశ్రమలో పెరుగుతున్న వృద్ధిపై కన్నేసిన సంస్థ దేశంలో మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలకు తెరతీసింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్ పరిశ్రమలో మరింత విస్తరించడానికి విమానాలు , ఇతర సంబంధిత సామగ్రి తయారీ అమెరికా కంపెనీ బోయింగ్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 800 మంది డైరెక్ట్ ఉద్యోగులను నియమించుకోనున్నామని బోయింగ్ సీనియర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. టాప్ ఇంజనీర్లనుంచి ఫాక్టరీ కార్మికులతో పాటు హెచ్ ఆర్ లాంటి ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ప్రస్తుతం బోయింగ్ ఇండియా కంపెనీలో భారతదేశంలోని భాగస్వాముల సంస్థల ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారు 7వేలమంది ఉన్నారు. వీరిలో 1,200 మంది ప్రత్యక్ష ఉద్యోగులు . అయితే ఈ ఏడాది చివరినాటికి వీరి సంఖ్య 15వందలకు పెరగవచ్చని తెలిపింది. అలాగే భాగస్వామ్య సంస్థల సంఖ్యకూడా పెంచుకోనున్నామనీ... తద్వారా ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. అంతరిక్షంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలకు ఇండియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబర్‌లో ప్రచురించబడిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) నివేదిక ప్రకారం, ఊహించిన దాని కంటే ఎక్కువగా 2025 నాటికి మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా నిలవనుంది -
2 లక్షల ఉద్యోగాలు..త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలు, రైల్వే భద్రతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టింది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలను నియమించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భద్రతా సంబంధిత ఉద్యోగాలు16 శాతం ఖాళీగా ఉండటంతో రైల్వే ట్రాక్‌ల నియంత్రణ, పెట్రోలింగ్ కష్టంగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద రైలు నెట్ వర్క్ భారతీయ రైల్వే ఇటీవల ప్రమాదాలపై సీరియస్‌గా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలను పెంచడానికి యోచిస్తోంది. వచ్చే కొన్ని ఏళ్లలో సుమారు 2లక్షలమంది నియమించుకోనుంది. రాబోయే రోజులలో భద్రత మరియు నిర్వహణ విభాగంలో భారీగా పోస్టులను భర్తీ చేయనుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీంతో రైల్వే మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 15 శాతం భారీ జంప్ చేసిన 1.5 మిలియన్లకు చేరనుంది. మరోవైపు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె. మిట్టల్ రాజీనామా చేశారు. అటు రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంత్రిపదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ రూ .15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2016 డిశెంబర్ నాటి గణాంకాల ప్రకారం రైల్వే ఉద్యోగాల సంఖ్య 1.3 మిలియన్లుగా ఉండగా, గ్రూప్ 'సి', గ్రూప్ 'డి' విభాగాల్లో 225,823 ఖాళీలున్నాయి. గత మూడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం సగటున 115 రైలు ప్రమాదాలుచోటు చేసుకోగా కనీసం 650 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మానవరహిత రైల్వే క్రాసింగ్ లవద్దే జరుగుతున్నాయి. గత శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కనీసం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌కు అమెజాన్ ఉద్యోగాలు
బెంగళూరు : అమెజాన్ తన రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ అయిన భారత్‌లో ఉద్యోగవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. 1000 మందికి పైగా ఉద్యోగులను భారత్‌లో నియమించుకోవాలని చూస్తోంది. వీరిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. కంపెనీ భిన్నమైన వెర్షన్లు అంటే అమెజాన్.కామ్, అమెజాన్.ఇన్, డివైజ్‌ల బిజినెస్‌లలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు, క్లౌడ్ కంప్యూటింగ్ డివిజిన్ అమెజాన్ వెబ్ సర్వీసుల్లో ఈ నియామకాల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. సంబంధిత టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్న వారికే ఈ నియామకాలను పరిమితం చేయాలని కంపెనీ నిర్ణయించినట్టు ఓ ఆంగ్ల సైటు రిపోర్టు చేసింది. బుధవారం సాయంత్రం అమెజాన్ తన వెబ్‌సైట్‌లోని కెరీర్ పేజీలో భారత్‌లో 1,245 స్థానాలను లిస్టు చేసింది. ప్రస్తుతం అమెజాన్‌కు భారత్‌లో దాదాపు 50వేల మంది వరకు ఉద్యోగులున్నారు. అమెరికా తర్వాత అమెజాన్ రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ భారతే. గ్లోబల్‌గా ఈ సంస్థకు 3,41,000 మంది ఉద్యోగులున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు, డేటా అనాలిటిక్స్లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ వంటి టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్నవారి కోసం అమెజాన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అత్యంత లాభాదాయక వ్యాపార యూనిట్, ఏడబ్ల్యూఎస్, 195 మందిని నియమించుకోవాలనుకుంటుండగా.. బెంగళూరులో 557 మందిని, హైదరాబాద్‌లో 403 మందిని, చెన్నైలో 149 మందిని నియమించుకోవాలని చూస్తున్నట్టు అమెజాన్ ఇండియా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ దలే వాజ్ చెప్పారు. బెంగళూరు సెంటర్ అమెజాన్‌కు అతిపెద్దది. కిండ్లీ, ఫైర్ లాంటి డివైజ్‌లపై చెన్నై సెంటర్ ఎక్కువగా ఫోకస్ చేసింది. అమెరికా మినహా మిగతా అన్ని సెంటర్లలో కెల్లా బెంగళూరులోనే అమెజాన్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటోంది. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
-
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల కల్పనపై ఉసూరు మనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) లో ఉద్యోగులను తక్కువగా నియమించుకోనున్నట్టు దేశీయ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ప్రకటించింది. ఇటీవల అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. విలీనం తర్వాత అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో తమ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు . దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో నియామకాలు చేపటామని తాము భావించడం లేదని తెలిపారు. ముఖ్యంగా క్లరికల్ ఉద్యోగాల్లో నియమకాలు అసలు ఉండవని, ఆఫీసర్ స్థాయి నియామకాలు ఈ సంవత్సరాంతానికి స్వల్పంగా ఉండనున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ బ్యాంకులు ప్రధాన సంస్థలో విలీనమయ్యాయి.మీ విలీనం ఫలితంగా, ఎస్బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా క్యూ4లో ఎస్బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఎన్పీఏలు భారీగా తగ్గి, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది.