హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ కంపెనీ విస్తరణ.. భారీగా జాబ్స్‌! | CASHe to set up technology excellence centre in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ కంపెనీ విస్తరణ.. భారీగా జాబ్స్‌!

Published Mon, Jun 3 2024 9:54 PM | Last Updated on Mon, Jun 3 2024 9:54 PM

CASHe to set up technology excellence centre in Hyderabad

ఫిన్ టెక్ కంపెనీ క్యాష్‌ఈ (CASHe) ఈ ఏడాది చివరి నాటికి 300 మందిని నియమించుకోవాలని, డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను విస్తరించడానికి కొత్త టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పనిచేస్తుందని, కంపెనీ సాంకేతిక అవసరాలకు తోడ్పడుతుందని క్యాష్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెసిలిటీ ప్రస్తుతం కంపెనీ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగాలను నిర్వహిస్తుంది.

టెక్నాలజీ, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, డెవ్ఆప్స్, టెక్ఆప్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్రెడిట్, కలెక్షన్స్ వంటి ఎక్స్పీరియన్స్ లెవల్స్, డొమైన్లలో నియామకాలు ఉంటాయి. క్యాష్‌ఈ హైదరాబాద్, ముంబై కేంద్రాల్లో 550 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా నియమించుకోనున్న 300 మందిలో 150 మందిని సంస్థ ప్రణాళికాబద్ధమైన టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీకి అనుగుణంగా నియమించనున్నారు.

'ఫిన్ టెక్ పరిశ్రమ గణనీయమైన మార్పులకు లోనవుతోంది. లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ టెక్ స్పేప్‌లో మా ఫిన్‌టెక్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను  తీర్చడానికి మేము మా బృందాలు, మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నాము" అని క్యాష్‌ఈ సీఈవో యశోరాజ్ త్యాగి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement