రాయదుర్గం: ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్–2024 ముగిసింది. ఒక రోజు హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి 130 మంది సాంకేతిక నిపుణులు, డెవలపర్లు, వికీ మీడియా ప్రాజెక్ట్‌ల స్వచ్ఛంద సహకారులు పాల్గొన్నారు.
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీ మీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పోకడలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలోని లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మిట్ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీలలో టెక్నికల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. వికీమీడియా ఉద్యమం ద్వారా ఊహించిన విధంగా ఉచిత జ్ఞానం కోసం మిషన్‌ను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, వికీమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment