టిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం | IIIT Hyderabad Has Started A New Course | Sakshi
Sakshi News home page

టిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం

Published Fri, Sep 24 2021 1:11 AM | Last Updated on Fri, Sep 24 2021 1:11 AM

IIIT Hyderabad Has Started A New Course - Sakshi

రాయదుర్గం(హైదరాబాద్‌): ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(పీడీఎం)లో ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్‌లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది.

ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్‌ హెడ్‌ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement