innovation
-
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్‌లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్‌లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్‌ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్‌ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్‌లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
ఆవిష్కరణలతోనే ఫార్మాకు భవిష్యత్
న్యూఢిల్లీ: ఆవిష్కరణలతోనే భారత ఫార్మా పరిశ్రమ రాణించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆవిష్కరణలు లేకపోతే ఈ పరిశ్రమే మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఫార్మా రంగం పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కోసం ఎప్పుడూ ప్రభుత్వంపైనే ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేవారు. ‘‘దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రతి దాని కోసం ప్రభుత్వం వైపు చూసే బలహీన మనస్తత్వ ధోరణి నెలకొంది. ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించినప్పుడే పరిశోధన నిర్వహిద్దామని అనుకుంటారు. విజయానికి ఆవిష్కరణలే ఆధారమైన పరిశ్రమ ఇది. ఎవరైతే ఆవిష్కరణకు దూరంగా ఉంటారో వారి కథ ముగిసినట్టే’’అని ముంబైలో ఫార్మా కంపెనీలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి వ్యాఖ్యానించారు. మారుతున్న జీవనశైలి తీరులు, సమాజం, రోగుల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ కూడా మారాలని సూచించారు. ప్రాజెక్టులతో ఫార్మా పరిశ్రమ ముందుకు వచ్చి.. ప్రభుత్వం, విద్యా సంస్థల సహకారంతో పరిశోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక్కడ ఆవిష్కరణలతో పేటెంట్లు సంపాదించుకుని, ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలని పిలుపునిచ్చారు. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఏఎన్ఆర్ఎఫ్) కింద 2023–28 కాలానికి కేంద్రం రూ.50,000 కోట్ల నిధిని ప్రకటించడం గమనార్హం. దీని కింద పరిశోధన, ఆవిష్కరణలకు చేయూతనివ్వనుంది. ఆ దేశాల్లో ఆవిష్కరణలే బలం.. స్విట్జర్లాండ్, యూఎస్, జపాన్ దేశాల్లో తలసరి ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉందని, ఇందుకు అక్కడి కంపెనీల ఆవిష్కరణలే కారణమని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘నాణ్యత, ఆవిష్కరణ అన్న రెండు అంశాలపై మీ మనుగడ ఆధారపడి ఉంది’’అని పేర్కొన్నారు. ప్రజావేగులుగా మారి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న, నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టు బయటపెట్టాలని పులుపునిచ్చారు. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను దత్తత తీసుకుని, ఉత్తమ తయారీ విధానాలను అనుసరించడం ద్వారా అవి వృద్ధి చెందేందుకు సహకారం అందించాలని కోరారు. -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
ఐదు లక్షల మందితో భారత్ బ్యాటరీ షో!
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లువ్యాపార విస్తరణపై ఎల్అండ్టీ ఫైనాన్స్ దృష్టిఎల్అండ్టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది. -
పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్షీట్లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..
మనం దేశంలలో రోజుకు ఎన్ని కోళ్లు ఖతం అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ లెక్కన ఏడాదికి లక్షకు పైమాటే. ఒక కేజీ లేదా కేజీపైనా తూగే కోడిలో మహా అయితే దగ్గర 650 నుంచి 750 గ్రాముల మాంసం రాగా, మిగతా అంతా వేస్టేజ్. అంటే ఒక్క కోడికి ఇంత వేస్టేజ్ అంటే మరీ రోజుకి ఎంత పౌల్ట్రీ వ్యర్థాలు వస్తున్నాయో ఊహిస్తేనే వామ్మో అనిపిస్తోంది కదూ. అయితే ఈ వ్యర్థాలతో సరికొత్త వస్త్ర పరిశ్రమకు నాంది పలికి అందిరి చేత శెభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నాడు యూపీకి చెందిన ఒక వ్యక్తి. అతడెవరూ? ఎలా ఈ వ్యర్థాలతో వస్త్రాలు తయారీ చేశాడంటే..అతడి పేరు రాధేష్ అగ్రహరి. ఆయన స్టార్టప్ "గోల్డెన్ ఫెదర్స్" వ్యవస్థాపకుడు. ఇది ఇది పౌల్ట్రీ వ్యర్థాలను 'ఉన్ని లాంటి' ఫైబర్, చేతితో తయారు చేసిన కాగితంగా మారుస్తుంది. ఈ వ్యర్థాలను ముడి పదార్థంగా ఉపయోగించి, స్టార్టప్ శాలువాలు, కుల్తాలు, స్టోల్స్, డైరీలు, చేపల మేత కంపోస్ట్‌లను తయారు చేస్తుంది. జైపూర్, పూణేలలో కంపెనీకి సంబంధించని మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడ తయారైన ఉత్పత్తులను B2B మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్లు. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఏకంగా 73 లక్షల కిలోల కోడి మాంసం వ్యర్థాలను రీసైకిల్ చేసింది. ఆయన చేస్తున్న పర్యావరణ హిత బిజినెస్ి గానూ దాదాపు 25 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ వినూత్న ఆలోచన ఎలా వచ్చిందంటే..జైపూర్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ చదువుతున్న టైంలో రాధేష్ అగ్రహరికి ఈ ఆలోచన వచ్చింది. ఒక రోజు కాలేజ్‌లో రీసైక్లింగ్ స్టడీ నిమిత్తం విద్యార్థులను వ్యర్థాలను సేకరించి తీసుకురమ్మని ఉపాధ్యాయులు ఆదేశించారు. అందరూ ప్లాస్టిక్ నుంచి థర్మోకోల్ వరకు అన్ని రకాల వ్యర్థ పదార్థాలను క్రమబద్ధీకరించి ఏం తయారు చేయొచ్చొ వివరించారు. రాధేష్ వంతు వచ్చేటప్పటకీ ఎలాంటి వ్యర్థాలు సేకరించాలో అర్థంగాక తీసుకురాకపోవడంతో క్లాస్ రూం నుంచి ఉపాధ్యాయులు బయటకు పంపించేశారు. అవమానంతో నిరాశగా వచ్చిన అతడికి కాసేపు మంచి చికెన్ తెచ్చుకుని తింటే మూడ్ మారుతుంది. పైగా ఏదైన ఆలోచన తట్టొచ్చు అని భావించి, మార్కెట్‌కి వెళ్లి ఒక కేజీ చికెన్ ఆర్డర్ చేశాడు. అయితే అక్కడ దాన్ని నీటిగా క్లీన్ చేయగా తూగింది 650 గ్రాములే. కానీ దుకాణదారుడు ఒక కేజి చికెన్ ధర వసూలు చేయడం జరిగింది.మరీ మిగతా భాగం ఏంటని రాధేష్ దుకాణదారుడిని ప్రశ్నించటంతో.. మిగిలిన 350 గ్రాములు వేస్ట్ అని చెప్పగా దాన్ని ప్యాక్ చేసి ఇమ్మని చెప్పి మరీ తీసుకెళ్లాడు. అప్పుడే అతనికి ఈ వ్యర్థాలు ఏం చేస్తారు, ఏటా ఎన్ని కోళ్ల వ్యర్థాలు వస్తున్నాయి అనే దిశగా ఆలోచించడం, పరిశోధించండ ప్రారభించాడు. కాలేజ్ రీసెక్లింగ్ ప్రాజెక్ట్ కారణంగా కోళ్ల వ్యర్థాల గురించి వచ్చిన ఆలోచన క్రమేణ రీసైక్లింగ్ చేసి ఏం చేయొచ్చు అనే దిశగా పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అందరూ ప్లాస్టిక్ వంటి వ్యర్థాలతో రీసైక్లింగ్ వంటివి చేస్తారు తాను మాత్రం ఇలా కోళ్ల వ్యర్థాల రీ సైక్లింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడు. అలా రాధేష్కి వీటిని సరిగ్గా రీసైకిల్ చేసి ఉత్పత్తులుగా రూపొందించడానికి దగ్గర దగ్గర 13 ఏళ్లు పట్టింది.అంతేగాదు ఈ కోళ్ల వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద తడి వ్యర్థాల సమస్య. పైగా నదీ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. అదీగాక సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (CEE) నివేదిక ప్రకారం, US, EU, బ్రెజిల్ మరియు చైనా తర్వాత బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఐదవ అతిపెద్దది. వార్షిక ఉత్పత్తి 4.6 మిలియన్ మెట్రిక్ టన్నులు అని నివేదికలు చెబుతున్నాయి. ఐతే ప్రపంచం ప్లాస్టిక్ రీసైక్లింగ్ వైపు పని చేస్తోంది, కానీ చికెన్ వ్యర్థాల గురించి కూడా మాట్లాడటం లేదని అంటున్నారు రాధేష్. నీటి వనరులను శుద్ధి చేయాలని నినాదాలు చేసే బదులు మూలా కారణాలకు చెక్‌పెడితే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. కాగా, రాధేష్ తన స్టార్టప్ కంపెనీని 2019లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇక కంపెనీ పనితీరు గురించి వివరిస్తూ..ఈ కంపెనీ కబేళాల నుంచి కోళ్ల వ్యర్థాను సేకరించి క్రిమి సంహారక మందులు, ఆవిరితో శుభ్రపరుస్తాం. అలాగే వాటికి ఉండే ఈకలను పత్తి, జనపనార, ఉన్ని, పట్టు వంటి సహజ ఫైబర్లుగా తయారు చేస్తాం. ఇక స్పిన్నింగ్‌కి సరిపడని ఈకలతో హ్యాండ్ మేడ్ కాగితాన్ని తయారు చేస్ం. అంతేగాదు కోళ్ల వ్యర్థాల్లోని ఉపఉత్పత్తులను ఎరువులుగా, చేపల మేతగా మార్చడం జరుగుతుందని చెబుతున్నారు రాధేష్. నిజానికి రాధేష్ డిజైనర్ నుంచి గొప్ప ఇన్నోవేటర్‌గా మార పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించేలా గొప్ప స్టార్టప్ వ్యాపారానికి నాంది పలికి, యువతకు ఆదర్శంగా నిలిచారు.(చదవండి: సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు..నవతరం తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!) -
కొత్త ఆవిష్కరణలకు ‘ఇంటింటా ఇన్నోవేటర్’
చదువున్నా, లేకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2024 సంవత్సరానికిగాను ఆరో విడత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు..ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చని ప్రభుత్వం చెప్పింది. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో తమ ప్రయోగ వివరాలను తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది.ఈ సందర్భంగా ఐటీ అండ్ కమ్యునికేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ..‘ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. విభిన్న వర్గాల ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభను పెంపొందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. గతంలో కంటే ఈ ప్రోగ్రామ్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.‘ఇంటింటా ఇన్నోవేటర్ 2024’ కార్యక్రమంలో పాల్గొనే ఆవిష్కర్తలు ఆగస్టు 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. వారి వివరాలను వాట్సాప్ 9100678543కి పంపించాల్సి ఉంటుంది.దరఖాస్తు విధానం..దరఖాస్తుదారు పేరు, వయసు, ఫొటో, వృత్తి, గ్రామం, మండలం వంటి వివరాలు ప్రాథమికంగా పంపించాలి. దాంతో పాటు 100 పదాలలోపు ఆవిష్కరణ గురించి క్లుప్తంగా వివరించాలి. ఆవిష్కరణకు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోలు, నాలుగు ఫొటోలు తీసి పంపాల్సి ఉంటుంది.తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. స్థానిక సవాళ్లకు పరిష్కారం అందించే వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరింది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఆగస్టు 15, 2024న ప్రోత్సాహకాలు అందిస్తామని తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలకు చెందిన 3,000+ గ్రామ పంచాయతీల నుంచి ఆవిష్కర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌ను 1 కోటి మందికి పైగా గ్రామీణ పౌరులకు అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 33 మంది ‘ఇన్నోవేషన్ మిత్ర’లతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బృందంలోని సభ్యులు కోఆర్డినేటర్లుగా సేవలందిస్తారు. జిల్లా అధికారులు, ఎన్జీఓలు, పౌర సమాజ సంస్థలు, గ్రామాల్లోని ప్రజలను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు. -
Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం!
తండ్రి సైన్యంలో పనిచేస్తుండడంతో ఆకాంక్ష ప్రియదర్శిని బాల్యం దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గడిచింది. పచ్చదనం అంటే చెప్పలేనంత ఇష్టం. రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆకాంక్షకు కాలుష్య సమస్య గురించి ఆందోళనగా ఉండేది.వాయు కాలుష్య ప్రభావంతో తన బంధువులు, కాలేజి స్నేహితులలో కొందరికి శ్వాసకోశ సమస్యలు రావడం ఆమెను కలవరపరిచింది. వాయు కాలుష్యంకు సంబంధించి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలనే లక్ష్యంతో క్లైమెట్ టెక్ స్టార్టప్ ‘ఆరాసుర్’ప్రారంభించింది. ఒడిషాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ‘ఆరాసుర్’ ప్రయాణం మొదలైంది.వైర్లెస్, సెన్సర్ ఆధారిత సాంకేతిక సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉన్న సమాచార అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చురుగ్గా పనిచేస్తోంది. హైపర్–లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన సందేహాలకు సమాధానం చెప్పడానికి మా హార్డ్‌వేర్ పరికరాల నుంచి సేకరించిన డేటా ఉపయోగపడుతుంది.ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా జెనరేట్ చేయాలి....అనే విషయాలకంటే పర్యావరణ విషయాలకేప్రాధాన్యత ఇచ్చాం’ అంటుంది ఆకాంక్ష. హార్డ్‌వేర్ డిజైనింగ్, సప్లైచైన్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇన్స్టాలేషన్... మొదలైన వాటిలో ప్రావీణ్యం సాధించిన ఆకాంక్ష ‘మల్టీటాలెంటెడ్’గా గుర్తింపు పొందింది.ఇవి చదవండి: Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా.. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్‌లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు. -
డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ సంస్థ నెక్ట్స్వేవ్తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది.భారత్ చెందిన కంపెనీలు ఇవే..ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్ కంపెనీ జియో స్పేషియల్ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సర్వమ్ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్‌అవర్ తయారుచేస్తోంది. క్రాప్ఇన్ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్‌ప్లిక్స్ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మాంగనీజ్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది. -
మన నేలమీదే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్ స్టోరీ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది. నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. హై బుష్ కౌన్సిల్ ప్రకటన! ‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం. దిగుబడికి ముందే ఆర్డర్లు! ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్లు వచ్చారు. రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం. -
రిచ్ సపోర్ట్ సిరీస్.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది. SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్ ద్వారా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్‌మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్‌ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు. ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్‌పై సెషన్లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. -
కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్ యాత్ర 2024!
అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది. ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం. -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు
మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. జర్మనీలోని రాజకీయ సామాజిక పరిస్థితులు విషయం కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో మాత్రం ఆ దేశం చొరవ చూపినట్లు తెలుస్తుంది. మొబైల్లో వాడే సిమ్‌కార్డు, మోటార్‌సైకిల్, న్యూస్‌పేపర్, ఎయిర్‌బ్యాగ్, టెలిస్కోప్..వంటి దాదాపు ప్రపంచం ఉపయోగించే ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఆవిష్కరణలు కింది తెలుపబడ్డాయి. కెప్లర్ గ్రహాల చలన నియమాలు ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ ఫారెన్‌హీట్ స్కేల్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ +, - గుర్తులు ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్ అల్జీమర్స్ వ్యాధి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్రోమాటోగ్రఫీ ఎనిగ్మా యంత్రం ఎలక్ట్రిక్ ఎలివేటర్ కాంక్రీటు పంపు "√" చిహ్నం ప్రిగ్నెన్సీ టెస్ట్ వాక్యూమ్ పంపు గైరో కంపాస్ స్పీడో మీటర్ స్ట్రాటో ఆవరణం కిండర్ గార్టెన్ గమ్మీ బేర్ బాక్టీరియాలజీ టాకోమీటర్ హిమోగ్లోబిన్ పాస్ఫరస్(భాస్వరం) కణ విభజన మైక్రోఫోన్ వార్తాపత్రిక హాంబర్గర్ ఆటోమొబైల్ మోటార్ సైకిల్ ఓమ్స్ నియమం అతినీలలోహిత కిరణాలు జిర్కోనియం టెలిస్కోప్ ఎగ్ స్లైసర్ వాల్ ప్లగ్ సిమ్ కార్డు నెప్ట్యూన్ యురేనియం ఇయర్‌ప్లగ్ ఆక్సిజన్ యురేనస్ ఆస్పిరిన్ హెరాయిన్ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ఎంపీ3 ప్లేయర్ ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ -
అంధులకు కోసం స్మార్ట్ గాగుల్స్.. 14 ఏళ్ల బాలికల ఆవిష్కరణ!
కేరళలోని నలుగురు బాలికలు అంధులకు ఉపయోగపడే స్మార్ట్‌గాగుల్స్‌ని రూపొందించారు. వాళ్లు దాన్ని తమ పాఠశాల్లో అంధురాలిగా ఉన్న సహ విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్‌లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేదికగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో దీన్ని ప్రదర్శించారు బాలికలు. ఈ ఆవిష్కరణ మూడో స్థానం దక్కించుకోవడమే గాక అందరీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించడం విశేషం. ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టునున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఒక అడుగు ముందేసి ఇలాంటి గాగుల్స్‌ని రూపొందించాలనుకోవడం అందర్నీ సభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ బాలికలు ఎలా రూపొందించారు? ఈ ఆలోచనకు మార్గదర్శకం చేసిందెవరూ..? తదితర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!. కేరళలోని సెయింట్ మేరిస్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్మార్ట్ గాగుల్స్‌ని రూపొందించారు. ఈ నమునాను హన్నా రీతు సోజన్, ఆన్సిలా రెజి, ఆన్లిన్ బిజోయ్, అంజెలినా అనే నలుగురు బాలికలు రూపొందించారు. ఈ స్మార్ట్ గాగుల్ అల్ట్రా సోనిక్ సెన్సార్లను ఉపయోగించింది రూపొందించారు. అందువల్ల వీటిని ధరించిన అంధ వ్యక్తులకు ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి బజర్ ద్వారా వారిని ముందుగా హెచ్చరిస్తుంది. ఆ బాలికలు ఈ స్మార్ట్ గ్లాస్ నమునాని త్రిసూర్‌లోని సెయింట్ పాల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ అటల్ టింకరింగ్ లాబొరేటరీ(ఏటీఎల్) తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఏటీఎల్‌ని నీతి అయోగ్‌లో బాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాల్లలో ఏర్పాటు చేసింది. ఇలాంటి ల్యాబరేటరీలను దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేలకు పైగా ఏర్పాటు చేసింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ ల్యాబరేటరీలను పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచన వెలికితీసి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది. అంతేగాదు ముఖ్యంగా విద్యార్థుల్లో డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సదరు బాలికలు మాట్లాడుతూ..తాము రూపొందించిన స్మార్ట్ గాగుల్ బేసిక్ మోడల్ అని, దీన్ని మరింతగా మెరుగుపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. రేబాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు తెలుసని అన్నారు. అయితే అవి అత్యంత ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా, చౌకగా, పర్యావరణ హితంగా రూపొందించాలనేది తమ లక్ష్యం అని ఆ బాలికలు పేర్కొన్నారు. ఇక ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో లెర్నర్ లింక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా నియమించబడిన ఒక మెంటర్ ఆయా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాడు. ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో మొత్తం మూడు వేర్వేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 20కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో మొదటి మూడు ప్రాజెక్ట్‌లు ప్రత్యేక అవార్డులను పొందాయి. అందులో ఈ స్మార్ట్ గాగుల్స్ ప్రాజెక్ట్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కేరళలోని ఏటీఎల్ ల్యాబ్ ఒప్పో ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఏటీఎల్ కార్యక్రమంలో ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ..ఆ యువ విద్యార్థుల అంకితభావం, కృషికి ముగ్దుడినయ్యానన్నారు. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందానని చెప్పారు. దృష్టిలోపం ఉన్న తమ తోటి విద్యార్థి పట్ల వారు కనబర్చిన సానుభూతి వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు వచ్చేలా చేయడమేగాక ఈ ఆవిష్కరణకు నాంది పలికేలా చేయడం నిజంగా గొప్ప విషయమంటూ ఆ బాలికలను ప్రశంసించారు వివేక్ వశిష్ట. (చదవండి: చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!) -
'ఇంటింటా ఇన్నోవేటర్' అవార్డుల ప్రదానం
హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది. 44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది. "ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్‌బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్‌వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
యువత బంగారు భవిష్యత్‌కు భరోసా ఇచ్చే ఎంఎంజీఈఐఎస్ ప్రోగ్రామ్
భారత్‌ను జియోస్పేషియల్ టెక్నాలజీ స్కిలింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా మాస్టర్ మెంటర్స్ జియో-ఎనేబ్లింగ్ ఇండియన్ స్కాలర్స్ (ఎంఎంజీఈఐఎస్) ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు సెంటర్ ఫర్ నాలెడ్జ్ సావరిన్టీ, ఎస్రీ ఇండియా చేతులు కలిపాయి. ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ సమక్షంలో సెంటర్ ఫర్ నాలెడ్జ్ సావరిన్టీ కార్యదర్శి వినిత్ గోయెంకా, ఎస్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం ఎనిమిదో తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వరకు విద్యార్థుల జీవితాల్ని మార్చేలా ఈ ఎంఎంజీఏఐఎస్ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యమని ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్,డాక్టర్ కేజే రమేష్, ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్, గిరీష్ కుమార్‌లు తెలిపారు. విద్యార్థులకు చర్చలు, మాస్టర్ మెంటర్లతో పరస్పర చర్య, నిపుణులచే ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను అందిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ జనవరి 2024లో ప్రారంభించనున్నారు. 2024 జూన్ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ నాలెడ్జ్ సావరిన్టీ సెక్రటరీ వినిత్ గోయెంకా మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన మెంటర్‌కు విద్యార్థి జీవితాన్ని గణనీయంగా మార్చే శక్తి ఉంటుందన్నారు. ఎంఎంజీఈఐఎస్ ఉద్దేశ్యం.. ఈ ఆలోచనను విస్తరించడం, విద్యార్థులను ఆలోచనాపరులుగా తీర్చిదిద్దే నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వేదికను అందించడమని అన్నారు. ఎంఎంజీఈఐఎస్ ద్వారా ఉత్సుకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మా పిల్లలు ఆవిష్కర్తలుగా మారడానికి, దేశ అభివృద్ధికి అర్ధవంతమైన సహకారం అందించడానికి స్ఫూర్తినిచ్చే బలమైన పునాదిని ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ మాట్లాడుతూ సెంటర్ ఫర్ నాలెడ్జ్ సార్వభౌమాధికారంతో చేతులు కలపడం ఆనందంగా ఉందన్నారు. జీఐఎస్ టెక్నాలజీలు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి పట్టణ ప్రణాళిక, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయం, భూ రికార్డులు, విపత్తు నిర్వహణ, ఇతర రంగాలలో ఉన్నాయని చెప్పారు. ఎంఎంజీఈఐఎస్ కార్యక్రమం పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రాదేశికంగా ఆలోచించడం, ఆవిష్కరణలు చేయడం, మేధోశక్తిని సృష్టించడం వంటి మా భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే మా లక్ష్యాన్ని సాధించడంలోనూ ప్రపంచ వేదికపై భారతదేశ ఉనికిని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్పేస్ కమిషన్ సభ్యుడు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాస్టర్ మెంటర్ జియో-ఎనేబ్లింగ్ ప్రోగ్రామ్ పరిచయం భారతదేశం ప్రముఖ ఆవిష్కర్తగా మారే ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందన్నారు. భారతీయ యువకులు దాఖలు చేసిన పేటెంట్ల పెరుగుదలకు దారితీస్తుందని, వారి సృజనాత్మకత, ప్రోగ్రామ్ ప్రభావాన్ని ప్రదర్శిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ సృజనకు పట్టం!
స్టార్టప్‌లకు సహకారం అందించే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తాజాగా పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ (పీఎఫ్ఐ- 2023)లో తమ ఆవిష్కర్తలు భాగస్వామ్యం వహించనుండటంపై హర్షం వ్యక్తం చేసింది. గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్ (గెయిన్), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫారమ్‌ల (సీ-కాంప్) సహకారంతో ‘పీఎఫ్ఐ- 2023’ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనుంది. ‘స్కేలింగ్ ఇన్నోవేషన్స్: ఫ్రమ్ ఐడియా టు ఇంపాక్ట్’ అనే థీమ్‌తో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, జంతు ఆరోగ్యం, వ్యవసాయ యంత్రాలు, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణం, క్లీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాలలో డీప్‌టెక్, గ్రాస్‌రూట్ ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023 ఒక వేదిక కానుంది. మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో బధిరులకు భద్రతా హెచ్చరిక హెల్మెట్ తయారుచేసిన ఎన్కే రాజలిపాషా, రోగులకు సహాయపడే హెల్త్ బెడ్ రూపకర్త అల్లాడి ప్రభాకర్, విద్యుత్-పొదుపు, వీధి దీపాల నియంత్రణ ఆవిష్కర్త రాజు ముప్పరపు, వ్యర్థాలను నియంత్రించే యంత్రం తయారు చేసిన తేజస్వి వెలుగపల్లి, వ్యవసాయం, గ్యాస్ సిలిండర్లతో ఆటోమేటెడ్ టైమర్ నియంత్రణ కవాటాలను రూపొందించిన ఎం గోపాల్ సింగ్ ఉన్నారు. తమ ఆవిష్కరణలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం కలగడంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023లో అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇది ఆవిష్కర్తల సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు జాతీయ వేదికపై తమ ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో నెట్వర్కింగ్ అవకాశాలు, సదస్సులు, ప్లీనరీ చర్చలు, ప్యానెల్ చర్చలు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. ఇది మేథస్సును పరస్పరం పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆవిష్కర్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో పాటు కీలక వాటాదారులు కూడా పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ.. -
కొంగొత్త ఆవిష్కరణలు..తక్కువ ఖర్చుతో సమస్యకు ఈజీగా చెక్!
భారత స్టార్టప్‌ల హబ్‌గా ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకుపోతుంది. ప్రభుత్వం సైతం వీటికి మంచి ప్రోత్సహం ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే సరికొత్త టెక్నాలజీతో కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకొస్తున్నాయి. అలాంటి కొంగొత్త ఆవిష్కరణలతో జఠిలమైన సమస్యలను చెక్ పెట్టిన హైదరాబాద్‌కి చెందిన మూడు కంపెనీలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 2023 సంవత్సరానికి ఇచ్చే ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఆ స్థార్టప్ కంపెనీలు కనుగొన్న ఆవిష్కరణలు, వాటి ప్రత్యేకత గురించే ఈ కథనం.! కామెర్లకు ఏఐ nLite 360తో చికిత్స అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో నవజాత శిశువుల్లో వచ్చే నియోనాటల్ కామెర్ల సమస్య మరీ ప్రముఖమైనది. దీని కారణంగా నిత్యం వేలాది చిన్నారులు అంగవైకల్యం బారిన పడటం లేదా మరణించడం జరుగుతోంది. దీనికి చెక్ పెట్లేలా ఐఐటీ హైదరాబాద్ ఆధారిత మెడ్‌టెక్ స్టార్టప్ హీమ్యాక్ ఏఐ సాంకేతికతో కూడిన ఫోటోథెరపీ పరికరం 'nLite 360'తో ముందుకు వచ్చింది. ఇది శిశువుల్లో వచ్చే కామెర్ల వ్యాధికి సమర్థవంతంగా చికిత్స అందించగలదు. ఇతర సాధారణ ఫోటోథెరపీ పరికరాల కంటే మెరుగ్గా తక్కువ సమయంలోనే నవజాత శిశువులకు చికిత్స అందించగలదు అని ఈ హీమాక్ సహ వ్యవస్థాపకురాలు అంకిత కొల్లోజు చెప్పారు. సాధారణంగా శిశువుల్లో కామెర్ల వ్యాధి రాగానే వైద్యులు బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెడతారు. ప్రతి నిమిషం ఆ బిడ్డను పర్యవేక్షించాలా ఓ నిపుణుడు ఉంటారు. కానీ ఈ సాంకేతికతో కూడిన పరికరానికి ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పరికరానికి నిర్ధిష్ట సెన్సార్లు ఉంటాయి. అలాగే చికిత్సకు ఎలాంటి ఆటంకం లేకుండా బిడ్డకు తల్లి పాలిచ్చేలా పోర్టబుల్ యూనిట్ ఉంటుంది. ఈ వైద్య పరికరం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా పోర్టబిలిటీ యాక్సిస్ ఉంది. సరైన విద్యుత్ సరఫరాల లేని కుగ్రామాల్లో సైతం సమర్థవంతంగా పనిచేసే విధంగా బ్యాటరీతో నడిచేలా డిజైన్ చేసిన వైద్య పరికరం. చేనేత కష్టాన్ని తీర్చే ఆవిష్కరణ భారతదేశంలో చేనేత రంగం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం. తరతరాలుగా వస్తున్న ఓ సంప్రదాయ కళ. సృజనాత్మక కళకు చెందిన జీవనోపాధి. ఈ వృత్తి చాలా శ్రమతో కూడిన పని. మగ్గం నేయాలంటే సుమారు 20 నుంచి 45 కిలోల బరువులు ఉండే మగ్గం యంత్రాల్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇక నెయ్యాలంటే దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల సార్లు తొక్కాలి. ముఖ్యంగా మనదేశంలో సుమారు 19 లక్షల మందికి పైగా మహిళలకు చేనేత వృత్తే ఆధారం. ఈ వృత్తి అత్యంత కష్టమైనది గాక దీని కారణంగా మోకాళ్లు నొప్పులు, వెన్నునొప్పి వంటి ఇతరత్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు చేనేత కార్మికులు. పలువురు ఈ వృత్తి కారణంగా కాళ్లు పోగొట్టుకున్నావారు ఉన్నారు. అంతేగాదు వికలాంగులు లేదా చేనేత కార్మికుడే ప్రమాదవశాత్తు వికలాంగుడైతే ఈ చేనేత వృత్తి కొనసాగించడం మరింత కష్టం. ఆ సమస్యను నివారించేలా శివకుమార్ మోదా స్థాపించిన మోదా టెక్నాలజీస్ ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. శివకుమార్ ఆయన బృందం చేనెత కార్మికుడి కష్టాన్ని తీర్చేలా మోధా పెడల్ ఆపరేటింగ్ మెషీన్‌ను తీసుకొచ్చింది. మగ్గాలకు ఎలాంటి మార్పులు చేయకుండా ఈ యంత్రాన్ని మగ్గానికి బిగిస్తే సరిపోతుంది. యంత్రానికి అమర్చిన మోటారు బరువులును ఎత్తక్కర్లేకుండా అదే ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. దానికుండే పెడల్ స్విచ్ నొక్కితే చాలు తొక్కాల్సిన పని ఉండదు. దీంతో చేనేత కార్మికుడి మోకాళ్లు, వీపుపై ఎలాంటి భారం పడదు. పైగా హయిగా ఈ వృత్తిని చేసుకోగలుగుతారు. ఈ మిషన్‌తో చేనేత పని ఈజీ అవ్వడమే గాక మన దేశ వారసత్వ వృత్తి కనుమరగవ్వకుండా కాపాడుకోగలుగుతాం. వికలాంగులకు ఈ మిషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుబాటు ధరలోనే ఈ మిషన్ లభించేలా వినూత్నంగా తీసుకొచ్చారు శివ కుమార్, అతడి బృందం. ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని గుర్తించే ఏఐ టూల్ లక్షలాది మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ దగ్గుకి, ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే వచ్చే దగ్గుకు తేడా ఉంటుంది. కేవలం దగ్గు ఆధారంగా ఊరితిత్తుల సమస్య గుర్తించడం ఎలా అన్న ఆలోచనే ఆ ఆవిష్కరణకు నాంది అయ్యింది. ఈ మేరకు సాల్సిట్ వ్యవస్థాపకుడు నారాయణరావు శ్రీపాద ఐదేళ్ల క్రితం ఎయిమ్స్‌లో ఒక ప్రొఫెసర్‌తో దీనిపై జరిపిన చర్చే ఈ ఆవిష్కరణకు మూలం. ఆయన వైద్య రంగంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్ధారించే పరికరాల అవసరాన్ని గ్రహించారు. అంతేగాదు ఆయన దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం అయినప్పుడూ ఆ దగ్గులో అంతర్తీనంగా ఉండే తేడాల బట్టి అది ఉబ్బసం, టీబీ, క్షయం లేక కోరింత దగ్గు అనేది గుర్తించేలా సాంకేతికతను ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనుకున్నారు. ఆ క్రమంలోనే శ్వాశ ఏఐ సాఫ్టేవేర్ టూల్ మన ముందుకు వచ్చింది. ఈ టూల్‌ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అభ్యర్థి దగ్గును పది సెకన్లలో రికార్డు చేసి దేని వల్ల దగ్గు వచ్చిందనేది విశ్లేషిస్తుంది. దీని అనుగుణంగా ప్రజలు తదుపరి టెస్ట్ చేయించుకుని సకాలంలో వైద్యం పొందొచ్చు. పైగా ల్యాబ్ టెస్ట్‌లు చేయించుకోవాలనే భయం తప్పుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఈ వైద్య పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ల్‌కు వెళ్లక్కర్లేకుండా ప్రజలే ఇంటి వద్దే సులభంగా చెక్ చేసుకోగలుగుతారు. దీని వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్‌లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది. 96 కంపెనీల నుంచి ఇన్పుట్స్ గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది. గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేసేవే.. అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో 77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది. -
భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్‌లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్‌పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్‌పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
అనాథ పిల్లలకు అండగా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్కై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నేడు వెయ్యిమంది రక్తదానం మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు. -
చిన్న ఆవిష్కరణ - పెద్ద మెసేజ్!
ఆధునిక కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని పొదుపుగా ఇలా వాడొచ్చు అనే సంఘటనకు సంబంధించిన ఒక పోస్ట్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో రెస్ట్ రూమ్‌లోని టాయిలెట్‌కు హ్యాండ్ వాష్ సింక్ జతచేసి ఉండటం చూడవచ్చు. ఇందులో చేతులు కడుక్కుంటే ఆ నీరు కిందికి వెళుతుంది. దానిని ఫ్లష్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల నీరు ఆదా అవుతుంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్, కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటిది మనదేశంలో ఉంటే బాగుంటుందన్నారు. Simple innovations. Perhaps the strongest weapons to sustain the planet… This should become a standard in India. https://t.co/a56EUxxJRC — anand mahindra (@anandmahindra) July 18, 2023 -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
సెవెన్ సీటర్ బైక్ : ఇది కదా.. మేకిన్ ఇండియా అంటే..
మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్ బైక్‌ను రూపొందించుకున్నాడు. మార్కెట్లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్ బైక్" నిజమే.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది. So much sustainable innovation in one product - produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW — Harsh Goenka (@hvgoenka) April 29, 2023 చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
ఆవిష్కరణలు.. అద్భుతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో గురువారం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ (భవిష్యత్ ఆవిష్కర్తలు) ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ డిష్ వాషర్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్‌లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్ హ్యాండ్ డిష్ వాషర్‌ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్‌కు స్క్రబ్బర్‌తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్‌తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు. అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్ డిష్ వాషర్‌కు ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్ డిష్ వాషర్‌ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లు రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్కిన్ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్కిన్లు తయారు చేశారు. వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్ ప్రూఫ్‌తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్కిన్లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్’ అలర్ట్ అగ్ని ప్రమాదాలపై అలర్ట్ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్ డ్రయిడ్ ’ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్ టెక్నాలజీతో ఫైర్ స్టేషన్‌కు సమాచారాన్ని పంపుతుంది. మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్ స్టేషన్‌కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్ను ఆవిష్కరించారు. ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్.. కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్లెంట్ స్టార్ హైసూ్కల్ విద్యార్థి రయాన్ ‘ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. కల్వర్టుల వద్ద ఆర్.ఎఫ్ ట్రాన్స్‌మీటర్, వాహనంలో ఆర్.ఎఫ్.రిసీవర్లను అమర్చ డం ద్వారా వాహనం లైట్ ఆటోమెటిక్‌గా లోయర్ డిప్పర్లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టర్.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్ బహుమతి లభించింది. -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్: సింగిల్ ఛార్జ్‌తో..
భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, CNG వాహనాలు దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం బస్సులు, కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయపూర్ నగరంలోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 45 కిమీ రేంజ్ అందిస్తుంది. సుమారు 160 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 30 నిముషాల్లో ఛార్జ్ చేసుకోగలదు. ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య దవే వెల్లడించారు. (ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!) ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గేర్, పెడల్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ప్యానెల్ ప్లేట్, లైట్, హార్న్ వంటివి కూడా అమర్చారు. పాత సైకిల్ని ఇలాంటి కొత్త సైకిల్ మాదిరిగా మార్చడానికి రూ. 18,000, కొత్త సైకిల్ కావాలంటే రూ. 30,000 నుంచి రూ. 35,000 ఖర్చవుతుందని డాక్టర్ విక్రమాదిత్య తెలిపారు. ఈ సైకిల్ కావాలనుకునే వారు కాలేజీని సంప్రదించి తీసుకోవచ్చని కూడా వెల్లడించారు. -
రెండేళ్లలో 3.5 కోట్లకు ఉత్పత్తి సామర్థ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 800 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు పూర్తయితే 2025 నాటికి తమ వార్షిక టైర్ల ఉత్పత్తి సామర్థ్యం 3.5 కోట్లకు చేరుతుందని జేకే టైర్స్ ఎండీ అన్షుమన్ సింఘానియా వెల్లడించారు. ఇప్పుడు ఇది 3.2 కోట్లుగా ఉన్నట్లు మంగళవారమిక్కడ కొత్త లెవిటాస్ అల్ట్రా టైర్ల ఆవిష్కరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. తమకు భారత్‌లో 9 ప్లాంట్లు, మెక్సికోలో మూడు ప్లాంట్లు ఉన్నాయన్నారు. అలాగే, 650 పైగా బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయని, ఏడాది వ్యవధిలో మరో 200 పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా టైర్ల పరిశ్రమ ప్రస్తుతం రూ. 70,000 కోట్ల స్థాయిలో ఉందని, 2025 నాటికి ఇది రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా) అనుజ్ కథూరియా తెలిపారు. మరోవైపు, లగ్జరీ కార్ల కోసం అధునాతనమైన లెవిటాస్ అల్ట్రా టైర్లను రూపొందించినట్లు వివరించారు. యూరప్ ప్రమాణాలతో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ టైర్లు ఏడు సైజుల్లో లభ్యమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో సింహభాగం వాటా రూ. 40 లక్షలు–రూ. 80 లక్షల కార్లది ఉంటోందని కథూరియా వివరించారు. -
భారత్-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!
ముంబై: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యునైటెడ్ అరబ్ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్‌ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు) ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని అంచనా. ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఎల్జీ ఆవిష్కరణల సదస్సు
హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ ఎలక్ట్రా నిక్స్ హైదరాబాద్‌లో ‘ఆవిష్కరణల పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.ఇందులో తన డిస్ప్లే ఉత్పత్తి ఎల్జీ మ్యాగ్నిట్తోపాటు 136 ఆల్ ఇన్ వన్ ఎల్ఈడీ, ఎల్జీ వన్: క్విక్ ఫ్లెక్స్, ఎల్జీ వన్: క్విక్వర్క్స్, ఎల్జీ క్రియేట్ బోర్డ్ తదితర ఉత్పత్తులు, సొల్యూషన్లను ప్రదర్శించింది. ఈ వార్షిక సదస్సుకు కస్టమర్లు, భాగ స్వాములు, సిస్టమ్ ఇంటెగ్రేటర్లు విచ్చేసినట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఎల్జీకి సంబంధించి డిస్ప్లే ఉత్పత్తులు, సొల్యూషన్ల గురించి కస్టమర్లు తెలుసుకునే వీలు కల్పించడ మే ఈ సదస్సు ఉద్దేశ్యమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండి యా బిజినెస్ హెడ్ హేమేందు సిన్హా తెలిపారు. -
నున్నలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
ప్రాప్‌టెక్ స్టార్టప్‌లకు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ దన్ను
ముంబై: ప్రాపర్టీ టెక్నాలజీ స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్, ఇన్వెస్ట్ ఇండియా ప్రత్యేక ప్లాట్‌ఫాం ఆవిష్కరించాయి. అఫోర్టబుల్ హౌసింగ్‌కు సంబంధించి నిర్మాణం, అమ్మకాలు, ఫిన్‌టెక్, అంశాల్లో కొత్త ఆవిష్కరణలను వెలికితీసేందుకు హెచ్డీఎఫ్సీ రియల్ ఎస్టేట్ టెక్ ఇన్నోవేటర్స్ 2022 వేదికను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ విపుల్ రుంగ్టా తెలిపారు. దీని ద్వారా మూడు అత్యంత వినూత్న కంపెనీలు లేదా సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగం అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఇన్నోవేటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. దీనికి అనరాక్, సెకోయా, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, యాక్సెల్ తదితర సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
t-hub: ఆవిష్కరణల వాతావరణానికి టీహబ్ ఊతం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధించేలా ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్న ‘టీ–హబ్’... కార్పొరేట్ సంస్థల్లో నిరంతరం ఆవిష్కరణలు జరిగేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వరుస రోడ్ షోలు, సదస్సులు నిర్వహిస్తోంది. ‘ఇనో– కనెక్ట్’పేరిట మంగళవారం బెంగుళూరులో రోడ్ షో నిర్వహించగా 22న చెన్నైలో రోడ్ షోతోపాటు వచ్చే నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’ నిర్వహిస్తారు. దీనికి ప్రపంచ నలుమూలల నుంచి 500కుపైగా ఆహ్వానితులు, 50కి మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్థికరంగం వేగంగా మార్పులకు లోనవుతున్న ప్రస్తుత వాతావరణంలో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త సాంకేతికతలను వినియోగించుకోవడం, ఎంట్రప్రెన్యూర్షిప్ సంస్కృతిని నిర్మించడమే లక్ష్యంగా ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’జరుగుతుందని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ సంస్థల చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్లు(సీఎక్స్‌వో), చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లు(సీఐవో), ఎంట్రప్రెన్యూర్లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ, విద్యారంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆవిష్కరణల వృద్ధి వ్యూహం, డిజైన్, ఎమర్జింగ్ టెక్నాలజీ తదితరాలపై చర్చ జరగనుంది. ‘మారుతున్న ప్రపంచంలో ఆధునిక థృక్పథాన్ని అలవరుచుకునేందుకు, కొత్త వాణిజ్య వ్యూహాలు రూపొందించేందుకు ఢిల్లీలో జరిగే సదస్సు దోహదం చేస్తుంది’ అని టీ హబ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
ఆవిష్కరణల్లో తెలంగాణ అ‘ద్వితీయం’!
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి.. ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ గురువారం ఆవిష్కరించారు. పెర్ఫార్మర్స్‌లో టాప్ ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా.. ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే.. పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లతో మెరుగైన పనితీరు స్టార్టప్‌లకు తెలంగాణ నిలయంగా మారుతోంది. ‘ఇన్ఫ ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం తెలంగాణ పనితీరును మెరుగుపర్చు కోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు తాము సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చడంపై దృష్టి సారించాలని సూచించింది. ‘3ఐ మంత్రం’తో అద్భుత ఫలితాలు: కేటీఆర్ దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్‌లో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న ‘3ఐ మంత్రం’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021’లో తెలంగాణ మొత్తంగా రెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది’’ అని ట్వీట్ చేశారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం తెలంగాణ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రాష్ట్రం అగ్రగామిగా నిలవడం గర్వకారణం. సీఎం కేసీఆర్, ఐటీ–పరిశ్రమల మంత్రి కేటీఆర్ దూరదృష్టి వల్లే ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలో టాప్ స్థానంలో నిలిచింది. – బి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు -
‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్ చదువుతూనే..
పిఠాపురం(కాకినాడ జిల్లా): వాహనంలో వెళ్తున్నప్పుడు ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తే.. మన ప్రమేయం లేకుండానే ప్రమాదాన్ని గుర్తించి వాహనం దానంతట అదే ఆగిపోతే.. ప్రతి వాహనదారుడు ఇలాంటి పరికరాలు తన వాహనంలో ఉండాలని కోరుకుంటాడు. బీటెక్ చదువుతున్న కొత్త లోక్‌నాథ్ ఇది గుర్తించి తన మెదడుకు పదును పెట్టాడు. చిన్న వయసులోనే అద్భుత ఆవిష్కరణ చేశాడు. చదవండి: AP: ‘ఆరోగ్య’ వ్యవసాయం అదే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. వాహనంపై రకరకాల ఆలోచనలతో వెళుతుంటే ఎదురుగా వేగంగా వాహనాన్ని గుర్తించలేక ప్రమాదం జరగొచ్చు. లేదా ఏవైనా జంతువులు అకస్మాత్తుగా అడ్డం పడొచ్చు. తప్పించుకునే లోపే ప్రమాదం ఎదురు కావచ్చు. ఇలాంటి వాటిని అధిగమించడానికి లోక్‌నాథ్.. ఓ సెన్సార్ సిస్టమ్ రూపొందించాడు. వాహనానికి అమర్చే ఈ సెన్సార్‌కు కొంత పరిధి ఉంటుంది. అందులోకి ఏదైనా వాహనం, జంతువులు, ఇతర ప్రమాదకర అంశాలు వస్తే గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్ సిస్టమ్ పని చేసి, వాహనం వేగం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాహనం ఆగిపోతుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన లోక్‌నాథ్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొత్త సునీల్, సుజాత దంపతుల కుమారుడు. తండ్రి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్. ప్రస్తుతం లోక్‌నాథ్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీలో బీటెక్ సెకండియర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పదో తరగతిలో 10కి 10 జీపీఏ, ఇంటర్లో 90% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు తన 2 ఆవిష్కరణలకు లోక్‌నాథ్ పేటెంట్ హక్కులు సాధించాడు. సుమారు 40 పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏటా నిర్వహించే స్పెషల్ ఎడ్యుకేషన్ డేటా సిస్టం అనే కార్యక్రమంలో ఆంధ్రా నుంచి తొలిసారి ఎంపికై సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ పొందాడు. గుజరాత్ పారుల్ యూనివర్సిటీ నిర్వహించిన 48 గంటల ఆన్లైన్ కోడింగ్ కాంపిటీషన్ (హ్యాకథాన్)లో 3వ స్థానం, వెల్లూరు విట్ యూనివర్సిటీ నిర్వహించిన హ్యాకథాన్‌లో 2వ స్థానం సాధించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అభినందనలు అందుకున్నాడు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తా దేశంలోనే పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం. నా తల్లిదండ్రులు, అక్క ప్రోత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మహీంద్ర వంటి వివిధ మోటార్ వాహనాల కంపెనీల నుంచి నా ఆవిష్కరణలకు ఆహా్వనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, వాహన ప్రమాదాల నివారణపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాను. – కొత్త లోక్‌నాథ్, బీటెక్ విద్యార్థి, పిఠాపురం స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ లోక్‌నాథ్ మరో సాంకేతిక ఆవిష్కరణ కూడా చేశాడు. ఇంటర్నెట్లేని మారుమూల ప్రాంతాల్లో వాతావరణ మార్పులను సెల్‌ఫోన్ ద్వారా హెచ్చరించే వ్యవస్థను రూపొందించాడు. ఫోన్‌కు టెంపరేచర్, రెయిన్ సెన్సార్లు అమర్చి, ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా వాతావరణ మార్పులను ఆ వ్యవస్థ మనకు తెలియజేస్తుంది. సెల్ఫోన్లో వాతావరణ హెచ్చరికలు సాధారణంగా వస్తుంటాయి. కానీ, లోక్‌నాథ్ ఆవిష్కరణలో రెయిన్ గేజ్ కూడా ఉంది. దీని ద్వారా ఎంత వర్షం, ఎంత సమయం పడింది, పడుతుంది అనే వివరాలు కూడా తెలుస్తాయి. లోక్‌నాథ్ తయారు చేసిన స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ -
చెత్త నుంచి సంపద
-
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
సాగు సమస్యలకు సాంకేతిక పరిష్కారం
న్యూఢిల్లీ: సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన వంగడాలు ప్రధాని మంగళవారం ఆవిష్కరించారు. రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించారు. నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులిచ్చారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు. ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వంగడాలు వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కారిస్తాయి’ అని మోదీ అన్నారు. రైతులు ఎదుర్కొనే భిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను సైంటిస్టులు రూపొందించారు. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకునే విధంగా వీటిని అభివృద్ధి చేశారని ప్రధాని చెప్పారు. అధిక పోషక విలువలున్న వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంట రకాలు కొత్తగా రూపొందించినవాటిలో ఉన్నాయి. దేశ రైతాంగంలో 86 శాతం మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని ఎల్లప్పుడూ శ్రద్ధ పెడుతుంటారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ చెప్పారు. సాగు రంగానికే కాకుండా మొత్తం పర్యావరణానికి వాతావరణ మార్పు(శీతోష్ణస్థితి మార్పు) అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు. దీనివల్ల సాగు, అనుబంధరంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి 5 మోదీ ఆవిష్కరించిన కొత్త వంగడాల్లో ఐదు హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కే చెందిన సీసీఎంబీ, పీజేటీఎస్ఏయూ ఈ వంగడాల అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. పంటకాలంతో పాటు నీటి అవసరం తక్కువగా ఉండే ‘డీఆర్ఆర్ ధన్ 57’, మధ్యమస్థాయి పలుచటి గింజ కలిగి, అగ్గితెగులును, ఉప్పునీటిని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 58’, పొడవుతోపాటు పలుచటి గింజలు కలిగి అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 59’, ఫాస్పరస్ తక్కువగా ఉన్న నేలల్లోనూ పండగల, అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 60’... అగ్గితెగులు, బ్లాస్ట్ రోగాన్ని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 62’ వంగడాలను ప్రధాని మంగళవారం కొన్ని ఇతర వంగడాలతో కలిపి విడుదల చేశారు. -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఇన్నోవేషన్ సూచీలో భారత్‌కు 46వ ర్యాంకు
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి సంబంధించి అంతర్జాతీయ నవకల్పనల (ఇన్నోవేషన్) సూచీలో భారత్ రెండు స్థానాలు ఎగబాకి 46వ ర్యాంకు దక్కించుకుంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ఈ సూచీని నిర్వహిస్తుంది. గత కొన్నేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతోందని.. 2015లో 81వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 46వ స్థానానికి చేరిందని డబ్ల్యూఐపీవో ఒక ప్రకటనలో తెలిపింది. అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్ పరిశోధన సంస్థల కృషి ఇందుకు దోహదపడ్డాయని వివరించింది. జాతీయ ఆవిష్కరణల వ్యవస్థను సుసంపన్నం చేయడంలో ఆటమిక్ ఎనర్జీ విభాగం, శాస్త్ర..సాంకేతిక విభాగం, బయోటెక్నాలజీ విభాగం, అంతరిక్ష విభాగం మొదలైన సైంటిఫిక్ డిపార్ట్మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. -
మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను షావోమీ రిజిస్టర్ చేసింది. ‘ మెథడ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ రియలైజింగ్ సెసిమిక్ మానిటరింగ్ ఆఫ్ మొబైల్ డివైజెస్’ పేరిట ఒక రిపోర్ట్‌ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది. చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా? ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్ యూనిట్‌కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో షావోమీ సౌండ్‌నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే పేటెంట్‌ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
తెలంగాణ నూతన ఐటి పాలసీ 2.0 ఆవిష్కరణ
-
ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదు: మంత్రి కేటీఆర్
-
రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది
పెంబి (ఖానాపూర్): ఓ యువరైతు కలుపుతీసే పరికరాన్ని తయారుచేసి కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత, అధిక ఖర్చును తగ్గించుకోవడానికి యువరైతు యూట్యూబ్‌లో చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. మందపల్లి శివారు వద్ద ఉన్న వరిపొలంలో ఆ యంత్రంతో కలుపు తీస్తుండడంతో సాక్షి పలకరించింది. ఈ యంత్రం తయారు చేసే విధానాన్ని వివరించారు. మూడు ఫీట్ల పొడవున్న రెండు ఇంచుల పీవీసీ పైపు, ఆఫ్ ఇంచ్ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. వాటికి కేవలం వెయ్యి నుంచి 12వందల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ముందుగా ఆఫ్ ఇంచ్ ఇనుప పైపుకు గొలుసులు వెల్డింగ్ చేయించి దానిని పీవీసీ పైపునకు తీగతో కట్టాలి. అంతే కలుపు నివారణ పరికరం తయారు అయినట్లే.. ఒక తాడు సాయంతో ఒక్కరితో ముందుకు నడుస్తూ పోతే చిన్న చిన్న కలుపు మొక్కలు గొలుసులకు తట్టుకోని బయటకు వచ్చి చనిపోతాయి. అంతే కాకుండా వరి మొక్కలను నాశనం చేసే కీటకాలు సైతం నీటిలో పడిపోతాయి. ఈ పరికరం గత సంవత్సరం నుంచి వాడుతున్నట్లు తెలిపాడు. దీంతో కూలీల ఖర్చు తగ్గిందని వివరించాడు. -
ఆవిష్కరణ: కరోనాను చంపే మాస్క్ అభివృద్ధి
కోల్‌కతా: కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు లాక్డౌన్ వంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు. ఇక కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. కరోనా నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్కే అని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కోవిడ్ వైరస్‌ను చంపే మాస్క్‌ని అభివృద్ధి చేశారు. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది. ఈ మాస్క్ కరోనాను చంపేస్తుందని విద్యార్థి పేర్కొంది. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్ ఇంటర్ సెకడింయర్ చదువుతుంది. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేయడం ఎలా అని ఆలోచించసాగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి విభిన్నమైన మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. దిగ్నాటిక ఆవిష్కరించిన ఈ మాస్క్‌ను ముంబైలోని గూగుల్స్ మ్యూజియం ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దిగ్నాటిక మాట్లాడుతూ.. ‘‘నేను తయారు చేసిన ఈ మాస్క్‌లో మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్లో ఉండే అయాన్ జనరేటర్ గాలిలోని దుమ్ము కణాలను వడబోస్తుంది. ఇలా ఫిల్టర్ అయిన గాలి సెకండ్ చాంబర్ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుంది. కెమికల్ చాంబర్‌గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుంది. ఫిల్టర్ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్‌ను ఈ సబ్బు నీరు చంపేస్తుంది’’ అని తెలిపింది. ఇక ‘‘కోవిడ్ పేషెంట్లు ఈ మాస్క్‌ను వినియోగిస్తే.. పైన చెప్పిన ప్రాసేస్ రివర్స్‌లో జరుగుతుంది. వారు వదిలిన గాలిలో కోవిడ్ క్రిములుంటాయి. థర్డ్ చాంబర్‌లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పడు అవి చనిపోతాయి. ఆ తర్వాత వైరస్ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుంది. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని తెలిపింది. ‘‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోమని ప్రచారం చేస్తున్నారు. అంటే సబ్బు నీరు కరోనాను చంపుతుందని అర్థం. దీని ఆధారంగా చేసుకుని నేను ఈ మాస్క్ అభివృద్ధి చేశాను. ట్రయల్స్ నిర్వహించడం కోసం త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ అధికారులను కలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది దిగ్నాటిక. ఇక ఫస్ట్ లాక్డౌన్ విధించిన సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపిన దిగ్నాటిక.. తనకు అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇక దిగ్నాటికాకు ఇలా విభిన్న ఆవిష్కరణలు చేయడం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. గతంలో ఆమె ఓ కళ్లజోడును తయారు చేసింది. దీన్ని ధరిస్తే.. తల వెనక్కు తిప్పకుండానే మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇవి అడవిలోకి వెళ్లే వారికి బాగా ఉపయోగపడ్డాయి. వెనక నుంచి ఏవైనా క్రూరమృగాలు వస్తే గమనించడానికి సాయం చేశాయి. ఇప్పటికే దిగ్నాటికా మూడు సార్లు ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్ అందుకుంది. చెవులపై భారం పడకుండా ఉండేలా రూపొందించిన మాస్క్‌కు గాను మూడో సారి ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డు లభించింది. చదవండి: మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్ -
సెల్‌ఫోన్ తయారీ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా?
సైన్స్ ఫిక్షన్లు అంటే చాలా మందికి ఇష్టం.. అవి బుక్స్ అయినా, సినిమాల్లో అయినా.. మనం ఊహించలేని ఏవేవో అద్భుతమైన టెక్నాలజీలు, చిత్రవిచిత్రమైన పరికరాలు, విజువల్ వండర్స్ భలే ఆకట్టుకుంటాయి. మరి ఈ సైన్స్ ఫిక్షన్లు కేవలం వినోదం కోసమేనా? చాలా మందికి అంతే. కానీ.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల్లో రాసిన, ఆ సినిమాల్లో చూపించిన టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకుని.. గొప్ప ఆవిష్కరణలు చేశారు. అవేవో అల్లాటప్పా వస్తువులు కూడా కాదు.. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణలు అవి. మరి ఈ విశేషాలేమిటో తెలుసుకుందామా? ‘స్టార్ ట్రెక్’ నుంచి సెల్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఊపుఊపిన ‘స్టార్ ట్రెక్’ సిరీస్ సినిమాల్లో హీరో క్యారెక్టర్.. స్పేస్ కెప్టెన్ కిర్క్ ఓ కమ్యూనికేటర్ డివైజ్ వాడుతుంటాడు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్ తరహాలోని చిన్న డివైజ్‌తో వైర్‌లెస్‌గా ఇతరులతో కమ్యూనికేట్ అవుతుంటాడు. 1966 నాటి స్టార్ ట్రెక్ సినిమాలో ఈ సీన్లు ఎంతో ఆకట్టుకున్నాయి. దాని నుంచి స్ఫూర్తి పొందిన మార్టిన్ కూపర్ అనే మోటరోలా కంపెనీ శాస్త్రవేత్త 1973లో సెల్‌ఫోన్ తయారు చేశాడు. తొలిసారిగా కాల్ చేసి ఇతరులతో మాట్లాడాడు. నాటి సెల్‌ఫోన్ ఓ పెద్ద ఇటుక అంత సైజులో ఉండేది. నవల హెలికాప్టర్‌ను తెచ్చింది ఇగోర్ సికోర్స్కీ.. ఇప్పుడు మనం వాడుతున్న అత్యాధునిక హెలికాప్టర్ ఆవిష్కర్త.1936లో ఆయన తొలి పూర్తిస్థాయి హెలికాప్టర్‌ను విజయవంతంగా రూపొందించి, నడిపారు. మరి హెలి కాప్టర్ తయారీపై ఆయనకు స్ఫూర్తినిచి్చంది ఏమిటో తెలుసా? అప్పటి ప్రపంచ ప్రఖ్యాత రచయిత జూల్స్ వెర్న్ 1886లో రాసిన ‘క్లిప్పర్ ఆఫ్ క్లౌడ్స్’ అనే నవల. గాల్లో ఎగిరే ఓ పెద్ద వాహనం, దానితో సాగే యుద్ధమే.. ఆ నవల ఇతివృత్తం. ఇగోర్ సికోర్స్కీ తన చిన్నతనంలో ఆ నవలను చదివానని.. అలా గాల్లో ఎగిరే వాహనాన్ని తయారు చేయాలన్న తపన అప్పుడే మొదలైందని చాలాసార్లు చెప్పారు. నీటి అడుగున అడ్వెంచర్.. సబ్‌మెరైన్ జూల్స్ వెర్న్ 1870లోనే ‘ట్వంటీ థౌజండ్ లీడ్స్ అండర్ ది సీ’ అనే నవల రాశారు. సముద్రం అడుగున సాహస పోరాటాలు చేసే ఓ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ నవల ఇది. ఇందులో ప్రత్యేక వాహనాల్లో నీటి అడుగున మనుషులు ప్రయాణిస్తుంటారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే.. సిమన్ లేక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి విజయవంతమైన జలాంతర్గామి ‘ఆర్గోనాట్’ను తయారు చేశారు. మరో విశేషం ఏమిటంటే.. అమెరికా నేవీ 1954లో తయారు చేసిన అత్యాధునిక జలాంతర్గామికి ‘నౌటిలస్’ అని పేరుపెట్టింది. ‘నౌటిలస్’ ఏమిటో తెలుసా?.. జూల్స్ వెర్న్ నవలలో నీటి అడుగున ప్రయాణించే వాహనం పేరే అది. గ్రహాంతర వాసుల యుద్ధంతో రాకెట్ ప్రఖ్యాత రచయిత హెచ్‌జీ వెల్స్ 1897లో రాసిన నవల ‘ది వార్ ఆఫ్‌ది వరల్డ్స్’. గ్రహాంతర వాసులు రాకెట్లలో భూమ్మీదికి రావడం, ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడం, మనవాళ్లు రాకెట్లు తయారు చేసి వారిని తిరిగి పంపేయడం ఇతివృత్తంగా ఈ నవల సంచలనం సృష్టించింది. ఈ నవల పేరుతోనే పలు హాలీవుడ్ సినిమాలూ వచ్చాయి. ఈ నవలను స్ఫూర్తిగా తీసుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ గొడ్డార్డ్ మొట్టమొదటి స్పేస్ రాకెట్‌ను తయారు చేశారు. 1926లో విజయవంతంగా ప్రయోగించారు కూడా. ఆ నవలతోనే అణు బాంబు హెచ్‌జీ వెల్స్ 1914లో రాసిన మరో నవల ‘ది వరల్డ్ సెట్ ఫ్రీ’. వెల్స్ ఈ నవ లలో దేశాల మధ్య యుద్ధాలు, అణు బాంబుల గురించి రాశారు. కొన్నిరకాల మూలకాలతో విధ్వంసకరమైన, నియంత్రించలేని శక్తిని సృష్టించవచ్చని కథ లో పేర్కొన్నారు. దీని స్ఫూర్తితోనే హంగేరియన్ సైంటిస్ట్ లియో జిలార్డ్.. 1933లో అణు విచి్ఛత్తి, దాని శక్తిని ఆవిష్కరించాడు. తర్వాత అణు రియాక్టర్లను అభివృద్ధి చేశాడు. అప్పటికే అణుశక్తి గురించి అంచనాలున్నా.. హెచ్‌జీ వెల్స్ నవల, విస్తృతస్థాయిలో అణుశక్తి ఏమిటనేది ఆ నవలతోనే స్ఫూర్తి పొందానని జిలార్డ్ ప్రకటించారు. ఈ ప్రయోగాలే 1939లో అమెరికా అణు బాంబును తయారు చేయడానికి దారితీశాయి. -
ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఎల్‌సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సె ల్ (టీఎస్ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్‌సీఈ ఏర్పాటు కోసం టీఎస్ఐసీ, నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు బాటలు వేస్తుందని టీఎస్ఐసీ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ రామ్‌జీ రాఘవ న్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాస్ చెప్పారు. 15 ఎకరాల్లో ఐఎల్‌సీఈ ఏర్పాటు.. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్ ప్రాంగణం’లో ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్‌సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్ సెంటర్లు, డోర్ టు డోర్ సైన్స్ ల్యాబ్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
సర్కారు బడిపిల్లల ఇన్నోవేషన్
-
5జీ ఐఫోన్ 12 వచ్చేసింది..
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ 5జీ టెక్నాలజీ ఆధారిత ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 12 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 12 రేటు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మినీ పరిమాణం 5.4 అంగుళాలు, ఐఫోన్ 12 స్క్రీన్ 6.1 అంగుళాలు కాగా, ప్రో స్క్రీన్ సైజు 6.1 అంగుళాలు, ప్రో మ్యాక్స్ డిస్ప్లే 6.7 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 నలుపు, తెలుపు, ఎరుపు తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఐఫోన్ 11తో పోలిస్తే ఇది 11 శాతం నాజూకైనది, 16 శాతం తేలికైనది. ఇందులో రెట్టింపు పిక్సెల్స్ ఉంటాయి. మరింత దృఢమైన సెరామిక్ షీల్డ్‌తో తయారైంది. స్మార్ట్ డేటా మోడ్ కారణంగా అవసరాన్ని బట్టి ఇది 5జీ, ఎల్టీఈ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యుయల్ కెమెరా, అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉంటాయి. ఐఫోన్ బాక్స్‌లో ఇకపై అడాప్టర్ ఉండదని సంస్థ తెలిపింది. 5జీని అత్యంత వేగవంతమైన, అధునాతనమైన టెక్నాలజీగా కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభివర్ణించారు. ఐఫోన్లతో పాటు హోమ్ పాడ్ మినీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. అక్టోబర్ 16 నుంచి ప్రి–అర్డర్లు, 23 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. -
గ్రామీణ ఆవిష్కరణలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: పౌర సేవలు, ప్రభుత్వ పాలనలో ఆధునిక ఐటీ సాంకేతిక ఆవిష్కరణలను వినియోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ఆవిష్కరణలకు కూడా ఊత మివ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), టీ వర్క్స్, టాస్క్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఆవిష్కరణల వాతావరణం సృష్టించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆవిష్కరణలు, స్టార్టప్ సంబంధిత అంశాల్లో కృషి చేసే విద్యార్థుల కోసం కోర్సు క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ విద్యార్థుల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖతో కలసి టీఎస్ఐసీ తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరిట తాజాగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహి స్తోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సహకారంతో 6 రోజుల పాటు జరిగే శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 5,093 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటు న్నారు. తమ చుట్టూ ఉన్న సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని టీఎస్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రోత్సాహం గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాల వారీగా ఉత్తమ ఆవిష్కరణలను టీఎస్ఐసీ గుర్తిస్తోంది. ఈ ఆవిష్కరణలకు వాణిజ్య రూపాన్ని ఇచ్చేందుకు అవసరమైన సహకారాన్ని టీఎస్ఐసీ అందజేస్తుంది. ఇదిలాఉంటే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టీ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వీ హబ్ ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
నవకల్పనల్లో భారత్‌కు ‘టాప్’ ర్యాంకు
న్యూఢిల్లీ : నవకల్పన(ఇన్నోవేషన్)లకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిల్చింది. 2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. (ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు నాణ్యమైన ఆవిష్కరణలకు తోడ్పడుతున్నాయని డబ్ల్యూఐపీవో తెలిపింది. జీఐఐ టాప్ 5 దేశాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. జీఐఐ కోసం 131 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్ ఇచ్చారు. (ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం) -
చెక్క వీడర్.. పక్కా లోకల్!
వరి పంట సాగులో కలుపు నియంత్రణ కోసమని దాదాపు పంట కాలం అంతా పొలంలో నీటిని నిల్వగట్టడం అలవాటుగా వస్తోంది. దీని వల్ల మిథేన్ వాయువు వెలువడి పర్యావరణపరమైన ఇబ్బందులు వస్తున్న విషయం కూడా తెలిసిందే. నీరు నిల్వగట్టినప్పటికీ రసాయనిక కలుపు మందులు వాడుతున్న వారూ లేకపోలేదు. అయితే, శ్రీవరి సాగులో నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిలోనే అందిస్తారు. ప్రకృతి వ్యవసాయదారులు రసాయనిక కలుపు మందులకు బదులు కూలీలతోనో, యంత్ర పరికరాలతోనో కలుపు తీస్తారు. శ్రీవరి సాగులో కలుపు తీతకు ఇనుముతో తయారైన ‘మండవ వీడర్’ను ఇన్నాళ్లూ వాడుతున్నారు. అయితే, విశాఖ ఏజన్సీలో ఓ గిరిజన రైతు తన తెలివి తేటలతో చెక్కతో సరికొత్త వీడర్‌ను తయారు చేసి మంచి ఫలితాలను పొందుతున్నారు. చిన్న పనస దుంగ, వెదురు బొంగు, గుప్పెడు మేకులతో చెక్క వీడర్‌ను తయారు చేశారు. ఒకే ఒక్క రోజులో దీన్ని తయారు చేయటం మరో విశేషం. ఇది బాగా పనిచేస్తోందని నిపుణులు తెలిపారు. బోయి భీమన్న.. దాదాపు ముప్పయ్యేళ్ల యువ ఆదివాసీ రైతు. విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ప్రకృతి వ్యవసాయ క్లస్టర్‌లోని కుమ్మరితోము అతని స్వగ్రామం. ఐదో తరగతి వరకు చదువుకొని 2.80 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, కోవెల్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఏడాదే 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో శ్రీవరి సాగుకు శ్రీకారం చుట్టారు. ♦ కోవెల్ ఫౌండేషన్ శ్రీవరి రైతులకు కలుపు తీత కోసం ఇనుముతో తయారు చేసిన ‘మండవ వీడర్’ను ఇస్తున్నారు. దీని ఖరీదు రూ. 1,500. మూడు జిల్లాల్లో 50 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కోవెల్ ఫౌండేషన్ ఈ ఏడాది కొత్త రైతులకు ఇవ్వడానికి 2 వేల వీడర్లు ఆర్డర్ ఇచ్చింది. అయితే, కరోనా విలయతాండవం కారణంగా మండవ వీడర్లు ఈ ఏడాది రైతులకు ఇంకా అందలేదు. ♦ ఈ నేపథ్యంలో భీమన్న నాట్లు వేసి నెల రోజులైంది. కలుపుతీత సమయం దాటిపోతుండటంతో భీమన్న అవసరం కొద్దీ బుర్రకు పదును పెట్టారు. భిన్నంగా ఆలోచించారు. అంతా ఇనుముతోనే ఎక్కడో తయారైన కలుపు తీత పరికరం చేతికి వచ్చే వరకు ఎదురు చూసే కన్నా సొంతంగా చేతనైనది చేద్దామనుకున్నారు. శ్రీవరి సాగులో సాళ్ల మధ్య దూరం 25 సెంటీ మీటర్లు (పది అంగుళాలు) ఉంటుంది. భీమన్న 24 సెం.మీ. వెడల్పు, అడుగు చుట్టుకొలత ఉన్న గుండ్రటి పనస దుంగ సమకూర్చుకున్నారు. అరున్నర అడుగుల వెదురు బొంగును కొంత వరకూ చీల్చి దానికి చువ్వలతో బండి లాగా ముందుకు నడిపేందుకు వీలుగా బిగించారు. పనస దుంగకు అంగుళానికొకటì చొప్పున ఇనుప మేకులు కొట్టారు భీమన్న. ఇందుకు మూడు అంగుళాల మేకులు సరిపోతాయి. ఒక అంగుళం లోపలికి దిగినా రెండు అంగుళాల పొడవైన మేకు పైకి ఉంటే సరిపోతుంది. అయితే, భీమన్న దగ్గర 6 అంగుళాల పొడవైన మేకులు మాత్రమే ఉన్నాయి. ఆ మేకులను సగానికి తెగ్గొట్టి వీడర్ తయారీలో వాడుకొని అనుకున్న రోజే పని పూర్తి చేయటం విశేషం! దుంగ(చెక్క చక్రాన్ని)ను వెదురు బొంగు సాయంతో నెట్టుకుంటూ వెళ్తుంటే.. ఈ ఇనుప మేకులు కలుపు మొక్కలను పీకేస్తూ ఉంటాయన్న మాట. వరి మొక్కల మధ్య వరుసల్లో చెక్క వీడర్‌ను ముందుకు తోసినప్పుడు దానికున్న మేకులు కలుపును మధ్యస్థంగా ముక్కలు చేస్తుంటాయి. ఆ వెంటనే చెక్క చక్రం ఆ కలుపు ముక్కలను బురదలోకి తొక్కి పెట్టి, కుళ్లేందుకు వీలుగా చేస్తుంది. నాటేసిన నెల రోజుల్లోనే రెండు సార్లు తన వీడర్‌తో కలుపు తీశానని భీమన్న తెలిపారు. 20 సెంట్లకు గత ఏడాది కలుపు తీత కూలి ఖర్చు రూ. వెయ్యి ఖర్చు అయితే, ఈ ఏడాది రూ. 400 కూలి అయ్యిందన్నారు. అంటే.. ఎకరానికి రూ. 3 వేలు ఖర్చు తగ్గిందన్న మాట. గత ఏడాది నాటేసిన నెలకు తమ పద్ధతిలో 15 పిలకలు వచ్చేవని, ఈ ఏడాది శ్రీవరిలో 35 పిలకల వరకు వచ్చాయని అంటూ.. దిగుబడి కూడా పెరుగుతుందను కుంటున్నానన్నారు. ఇదిలా ఉండగా.. తేలికగా ఉంటుంది కాబట్టి పనస దుంగను వీడర్ తయారీకి వాడానని, బరువైన తంగేడు, ఏగిశ దుంగలతో కూడా వీడర్‌ను తయారు చేస్తానని, ఏది బాగా పని చేస్తోందో చూస్తానని భీమన్న వివరించారు. రూ. 1,500లతో సుదూర మైదాన ప్రాంతంలో ఇనుముతో తయారయ్యే కలుపు తీత పరికరానికి ప్రత్యామ్నాయంగా.. భీమన్న తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంచక్కా చెక్క వీడర్‌ను తయారు చేశారు. అన్నీ కలిపి మహా అయితే రూ. 400–500కు మించి ఖర్చు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరైనా, ఎక్కడైనా, ఒక్క పూటలో దీన్ని తయారు చేసుకోవచ్చు. నిరుపేద రైతుకూ ఇది ఆర్థిక భారం కాదు. ఇదీ భీమన్న ఆవిష్కరణ విశిష్టత. ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి భీమన్నను ఫోన్లో పలుకరించి అభినందించింది. అయితే, భీమన్న స్వరంలో మాత్రం తానేదో చాలా గొప్ప పని చేసేశానన్న భావం ఏ కోశానా ధ్వనించ లేదు! స్థిత ప్రజ్ఞత అంటే ఇదేనేమో!! (బోయి భీమన్న గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేదు. కోవెల్ ఫౌండేషన్ సీఈవో కృష్ణారావు ద్వారా భీమన్నను సంప్రదించవచ్చు. మొబైల్: 94409 76848. ఐదేళ్లుగా తాము పాడేరు ఏజన్సీలో ఆదివాసీ రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నామని, కంటెపురం గ్రామాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం బయో గ్రామంగా ప్రకటించిందని కృష్ణారావు తెలిపారు. శ్రీవరిలో దిగుబడి 30–50% పెరిగింది. ఎకరానికి రూ. 4 వేలు ఖర్చు తగ్గిందని ఆయన వివరించారు.) -
న్యూస్ పేపర్‌తో రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే శాఖ
తిరువనంతపురం: కేరళకు చెందిన 12 ఏళ్లు బాలుడు న్యూస్ పేపర్‌తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లాక్డౌన్లో మెదడుకు పదును పెట్టి తన సృజనాత్మకతను చాటుకుని మాస్టర్‌గా మారాడు. తన టాలెంట్‌తో నెటిజన్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను కూడా అబ్బురపరిచిన ఈ బాలుడి పేరు అద్వైత్ కృష్ణ. ఇతడు కేరళలో త్రిస్పూర్‌లోని సీఎన్ఎన్ బాయ్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ అద్వైత్ న్యూస్ పేపర్‌తో రైలును తయారు చేస్తున్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. (‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’) Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers. His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 ‘12 ఏళ్ల మాస్టర్ అద్వైత్ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్ పేపర్లు, 10 ఎ4(A4) షిట్లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్లో పేర్కొంది. మాస్టర్ అద్వైత్ రైలు ఇంజన్, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్‌లు వచ్చాయి. ‘అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్ అండ్ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!) pic.twitter.com/qRN6WEQ3ms — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 -
మూడు సంస్థలకు కొత్త సీఈవోలు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ రానుండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఏపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రంగానికి చెందిన మూడు సంస్థలు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిట), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడీటీ)లకు ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను త్వరలో సీఈవోలుగా నియమించనుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సీఈవోను ఎంపిక చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: బోస్‌కు సముచిత స్థానం) ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రమోటింగ్ ఏజెన్సీగా అపిట వ్యవహరిస్తుంది. ► కొత్త కొత్త పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ సొసైటీ కృషి చేస్తుంది. ► తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐడీటీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులను అందిస్తుంది. ► ఇలా మూడు సంస్థలకు సమర్థవంతమైన కొత్త సీఈవోలను ఎంపిక చేయడం ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై సర్వే కృష్ణా, ప.గోదావరి జిల్లాల్లో 27 ప్రాంతాల్లో అధ్యయనం సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సైసెఫ్ (సెంటర్ ఫర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ) కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజుల క్రితం సర్వే కార్యక్రమాలను పూర్తి చేసింది. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఆరుగురు నిపుణులు 27 ప్రాంతాలను 10 రోజులు పరిశీలించారు. మత్స్యకారులకు వేటలో లభిస్తున్న మత్స్య సంపద, మత్స్యసంపద నిల్వ, మార్కెటింగ్ పరిస్ధితులను అధ్యయనం చేశారు. మత్స్యకారుల మరపడవలు, పడవలు లంగరు వేసుకోడానికి వార్ఫు, ఫ్లాట్‌ఫారాలు, కోల్డుస్టోరేజి ప్లాంట్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి ఏర్పాటు తరువాత ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు ఉంటుంది, మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయి అనే అంశాలపైనా పరిశీలన చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, ఈలచెట్ల దిబ్బ, ఎదర్లంక, గొల్లలమోద, క్యాంప్‌బెల్‌పేట, పల్లెతుమ్మలపాలెం, ప.గో. జిల్లా దెయ్యపుదిబ్బ వంటి ప్రాంతాలపై అధ్యయనం చేశారని మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖరం తెలిపారు. -
భళా..బాలమేధావి..!
ఒడిశా, భువనేశ్వర్: మనకున్న తెలివితేటలకు కాస్త సృజనాత్మకత పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయనే విషయాన్ని నిరూపించోడో బాలుడు. బాలమేధావిగా, సైంటిస్ట్ బుడతుడిగా పేరొందిన ప్రియవ్రత సాహు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సదుపాయాలతో సమాజంలో నిత్యం తారసపడే విభిన్న పరిస్థితుల పట్ల స్పందించాడు. వృథా నుంచి ఉపయోగకరమైన పరికరాలను ఆవిష్కరించడం వైపు దృష్టి సారించాడు. ఇదే దిశగా ప్రయత్నం చేసి, అంధకారంతో కంటిచూపు కొరవడిన వారి కోసం గైడింగ్ సెన్సార్ కళ్లజోడును ఆవిష్కరించాడు.ఈ కళ్లజోడు అంధులు, బధిర వర్గాలకు ఎంతో ఉపకరించే ఉపకరణం. అల్ట్రాసోనిక్ సెన్సార్, బజర్, వైబ్రేటర్ మోటార్ అనుసంధానంతో ఈ కళ్లజోడు పనిచేస్తుంది. ముందుకు సాగుతున్న మార్గంలో ఎదురయ్యే అవాంతరాలను బజర్ ధ్వనితో గైడింగ్ సెన్సార్ కళ్లజోడు సకాలంలో హెచ్చరిస్తుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్, బజర్ సదుపాయాలతో ఆవిష్కరించిన ఈ ప్రత్యేక కళ్లజోడు అంధులకు మాత్రమే ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్‌తో ... ప్రియవ్రత సాహు ఆవిష్కరించిన ఈ గైడింగ్ సెన్సార్ కళ్లజోడు మరిన్ని హంగులతో తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ కళ్ల జోడుకు జీపీఎస్ మోటార్, స్పీకర్ జోడించనున్నట్లు ఈ బుడత సైంటిస్టు చెబుతున్నాడు. ఈ దశ విజయవంతమైతే కంఠ ధ్వనితో గూగుల్ మ్యాప్ వ్యవస్థను అనుసంధానం చేసేందుకు వైజ్ఞానిక పరిశోధన కొనసాగిస్తున్నాడు. ఈ సదుపాయం కళ్లజోడుతొడుగుకున్న వారు ఉన్న ప్రాంతం వివరాలను ఇట్టే తెలియజేస్తుంది. సృజనాత్మకత.. గ్రామంలో పలువురు అంధులు తొడుగుకుంటున్న నల్ల కళ్లజోడు ప్రయోజనం శూన్యంగా భావించిన ప్రియవ్రత సాహు అధునాతన కళ్లజోడు ఆవిష్కరణ వైపు వేశాడు. తొడుగుకున్న కళ్లజోడు అంధులు, చెవిటి వర్గాలకు ఉపయోగపడే రీతిలో అత్యాధునిక కళ్లజోడు ఆవిష్కరించాలనే కృత నిశ్చయాన్ని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులతో పంచుకున్నాడు. అక్కడి నుంచి ఆయన సృజనాత్మకత వైజ్ఞానిక బాటలోకి అడుగిడింది. జాజ్‌పూర్ జిల్లా పురుషోత్తంపూర్ అడంగా గ్రామం ప్రహ్లాదచంద్ర బ్రహ్మచారి ఉన్నత పాఠశాలలో ప్రియవ్రత సాహు 8వ తరగతి విద్యార్థి. కేంద్ర ప్రభుత్వం, నీతీఆయోగ్ సౌజన్యంతో ఈ పాఠశాలలో అటల్ టింకరింగ్ లేబొరేటరీ పనిచేస్తుంది. బాల్య దశలో వైజ్ఞానిక ఆలోచనలను ప్రేరేపించడం ఈ లేబోరేటరీ ధ్యేయం. ప్రధానంగా వ్యర్థ, వినియోగించిన సామగ్రిని వైజ్ఞానిక రీతిలో పునర్వినియోగం పట్ల అటల్ టింకరింగ్ లేబొరేటరి ప్రేరేపిస్తుంది. ఆదివారం వంటి సెలవు దినాల్లో కూడా ప్రియవ్రత సాహు లేబొరేటరీలో నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం, గమనించిన సైన్స్ ఉపాధ్యాయుడు తుఫార్కాంతి మిశ్రా విద్యార్థిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ అద్భుత ఆవిష్కరణ చూసిన ఉపాధ్యాయులు, సహచరులు, గ్రామస్తులు ఆ విద్యార్థిని మెచ్చుకుంటున్నారు. -
నితిన్ గడ్కరీ ఆసక్తికర ప్రతిపాదన
ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. దేశ వ్యాప్తంగా యూరిన్‌ని నిల్వ చేసుకోగలిగితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన పని లేదన్నారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనం దేశ ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగితే.. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చాలా సొమ్ము ఆదా అవుతోంది. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయ’ని తెలిపారు. అంతేకాక ‘విమానాశ్రయాల్లో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే నేను కోరాను. కానీ నా ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదు. కార్పొరేషన్ కూడా నా మాటలు పట్టించుకోలేదు. సనాతన ఆచారాలను పాటించే వారికి నా అద్భుతమైన ఆలోచనలు నచ్చవ’ని గడ్కరీ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి చెబుతూ.. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా చెప్పారు గడ్కరీ. ఇదే సమావేశంలో మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఫలితంగా పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందన్నారు. అమినో యాసిడ్స్‌ను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. -
ఇంజినీర్ వినూత్న ప్రయత్నం.. వాటర్ లెస్ జ్యూస్
గచ్చిబౌలి :పండ్లను ముక్కలుగా కోసి అందులో ఐస్ ముక్కలు, షుగర్ వేసి తయారు చేసిన జ్యూస్‌ను మనం తాగే ఉంటాం. కానీ పండ్లను మిషన్‌లో క్రష్ చేసి నీరు, చక్కెర లేకుండా సహజ సిద్ధమైన జ్యూస్‌ను తయారు చేస్తున్నాడీ యువకుడు.నగరంలో ‘ఎన్ కోల్డ్ ప్రెస్ట్’ పేరిట జ్యూస్ తయారు చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు. అశోక్గనర్కు చెందిన అమితేష్ శర్మ 2012లో బీటెక్ పూర్తి చేశారు. కాలేజ్‌లో వినూత్న రీతిలో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని అక్కడి లెక్చరర్లు ప్రోత్సహించే వారు. బీటెక్ పూర్తి కాగానే 2013లో శివంలో ఫిల్మి తడక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్నునడుపుతూ కిచెన్ పండ్లతో వాటర్, షుగర్ కలపకుండా జ్యూస్ చేసి వచ్చే వారికి ఉచితంగా ఇచ్చేవారు. దీనికి మంచి స్పందనరావడంతో 2016లో రెస్టారెంట్ సమీపంలో మరో కిచెన్తీసుకొని జ్యూస్ తయారు చేస్తున్నారు. ఎన్ కోల్డ్ ప్రెస్డ్... ఎన్ కోల్డ్ ప్రెస్డ్ పేరిట వాటర్, షుగర్ లెస్ జ్యూస్‌ను తయారు చేసే విధానంపై ప్రాజెక్ట్ రిపోర్డ్‌ను తయారు చేసి ఐటీసీలో సీఈఓగా పని చేసిన ప్రదీప్ దోబ్లేను కలిశారు. ఆయన సంతృప్తి వ్యక్తం చేసి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. దీంతో మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఎన్ కోల్డ్ ప్రెస్డ్ స్టార్టప్‌ను నెలకొల్పారు. సీఈఓ, ఫౌండర్‌గా అమితేష్‌తో పాటుమరో ఐదుగురు కలిసి అధ్యయనం చేశారు. నిజాంపేట్‌లో ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించారు. 53 రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారు చేస్తున్నారు. రోజుకు 300 లీటర్ల జ్యూస్ తయారు చేస్తున్నారు. నాలుగైదు రకాల కూరగాయలు, పండ్లు కలిపి జ్యూస్ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జ్యూస్ తయారు చేసిన అనంతరం 6 గంటల పాటు కూలింగ్‌లో ఉంచుతారు. ఉదయం హోమ్ డెలివరీ చేస్తారు. తమ జ్యూస్‌ను సెలబ్రిటీలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారని అమితేష్ చెబుతున్నారు. త్వరలో వంద మందికి ఉపాధికల్పిస్తామని పేర్కొంటున్నారుఅమితేష్ శర్మ . చర్లపల్లిలో మరో యూనిట్... రోజుకు 5000 లీటర్ల జ్యూస్‌ను తయారు చేసేందుకు చర్లపల్లిలో మరో యూనిట్‌ను త్వరలో పెట్టనున్నారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి కేంద్రాన్నినెలకొల్పనున్నారు. – అమితేష్ శర్మ, ఎన్ కోల్డ్ ప్రెస్డ్ సీఈఓ -
భారత వృద్ధికి చోదకశక్తి
పాక్యాంగ్ (సిక్కిం): భారత్ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలను చోదకశక్తిగా మారుస్తామనీ, ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం లో అభివృద్ధి మందగించిందన్నారు. సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం ఇక్కడి పాక్యాంగ్ పట్టణంలో ఆవిష్కరించిన మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానయానం చేయాలనే దిశగా మేం కృషి చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 65 విమానాశ్రయాలు ఉండేవి. కానీ గత నాలుగేళ్లలో కొత్తగా 35 విమానాశ్రయాలను మేం ప్రారంభించాం. గతంలో సగటున ఏడాదికి ఓ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 9 కి చేరుకుంది’ అని మోదీ చెప్పారు. పాక్యాంగ్ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని మోదీ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు. విమానాశ్రయం ఆవిష్కరణ సందర్భంగా మోదీ నేపాలీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. సిక్కిం ప్రజలు ఇక్కడి ప్రకృతి అంత అందమైనవారన్నారు. ఉదయాన్నే చల్లటిగాలి వీస్తుండగా కొండలపై నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉందనీ, ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నారు. -
అక్టోబర్ 31న పటేల్ విగ్రహావిష్కరణ
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం) ఆవిష్కరణకు సిద్ధమైంది. అక్టోబర్ 31న పటేల్ 143 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
పాములంటే భయమా? ఇది చదవాల్సిందే..
బెంగళూరు: విషసర్పాలంటే ఎవరికి మాత్రం భయం ఉండదు! మనదేశంలో పాము కాటుకు ఏటా 46వేల మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఇలా చనిపోతున్నవారిలో అత్యధికులు గ్రామీణ రైతులు, కూలీలే అన్నది వాస్తవం. మరోవైపు కాటువేయకపోయినా జనం చేతిలో చనిపోతున్న పాముల సంఖ్యకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఔత్సాహికులు రూపొందిచిన ‘స్నేక్ గార్డ్’ ఇటీవల చర్చనీయాంశమైంది. పాముకాటు నుంచి మన రైతాంగాన్ని కాపాడుకోవడంతోపాటు ఆ మూగజీవాలకు సైతం సంరక్షించగల ఆధునిక యంత్రపరికరం ‘స్నేక్ గార్డ్’ ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రైతుల మన్ననలు పొందింది. ఏమిటీ స్నేక్ గార్డ్?: చేతికర్రను పోలిఉంటే యంత్రాన్ని భూమిపై నిలిపినప్పుడు ఆల్ట్రాసోనిక్ తరంగాలు విడుదలవుతాయి. యంత్రాన్ని నిలిపిన చోట నుంచి చుట్టూ 50 అడుగుల పరిధిలో(భూమిపొరలగుండా) తరంగాలు విస్తరిస్తాయి. ఇవి పాము వికర్షకాలు(snake repellents)గా పనిచేస్తాయి. అంటే ఈ తరగాలు వచ్చే చోట ఏదో ప్రమాదం పొంచిఉందని పాములు గ్రహించి.. అక్కడి నుంచి దూరంగా పారిపోతాయన్నమాట! 10 సెకన్లకు ఒకసారి తరంగాలు నిరంతరాయంగా వస్తూఉంటాయి. సౌరవిద్యుత్(solar powered)తో పనిచేస్తుంది కాబట్టి స్నేక్గార్డ్ను వినియోగించడం చాలా సులువు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే..: ‘‘స్నేక్‌గార్డ్ యంత్రం రైతుల ప్రాణాలనేకాదు మూగజీవాలను కూడా కాపాడుతుంది. అతి సాధారణ సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులు-పాములు ఎదురుపడకుండా నివారించగలుగుతున్నాం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొంతమంది రైతులకు స్నేక్‌గార్డ్ స్టిక్స్‌ను అందించాం. నల్లరేగడి, ఎర్రనేలలు, ఒండ్రుమట్టి లాంటి వేర్వేరు నేలల్లో స్నేక్ గార్డ్ పనితీరును అధ్యయనం చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ ఆవిష్కరణను ప్రభుత్వం ముందుకు తీసుకెళతాం. వ్యవసాయ శాఖల ఆమోదం లభిస్తే మరింతగా విస్తరిస్తాం’’ అని చెబుతున్నారు ప్రసాదం ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు వేదబ్రతో రాయ్. స్నేక్‌గార్డ్ యంత్రాల పంపిణీని ప్రభుత్వాలే చేపడితే ధర నామమాత్రంగానే ఉండొచ్చు. వీటిలా చేత్తో పట్టుకెళ్లేవి కాకుండా, ఒకే చోట నిలిపి ఉంచే ఇతర కంపెనీల స్నేక్ గార్డుల ధర అమెజాన్‌లో మూడున్నర వేల రూపాయల దాకా ఉంది. మరిన్ని వివరాల కోసం ప్రసాదం ఇండస్ట్రీస్ ఫేస్బుక్ పేజ్‌ను చూడొచ్చు. -
పాములంటే భయమా? అయితే ఇది చూడాల్సిందే..!
-
29 నుంచి సహస్ర చండీయాగం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి సీఎం పదవిని అధిష్టించాలని కోరుతూ.. ఈ నెల 29 నుంచి మహారుద్ర సహిత సహస్ర చండీయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, ప్రముఖ విద్యావేత్త ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయశారదారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ మహోత్సవ ఆహ్వాన పత్రికను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... వచ్చే శాసన సభ ఎన్నికల వరకు ప్రతిరోజు మహాన్యాసన పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర చండీపారాయణం, హోమం, మహావిద్యా పారాయణ హోమం, ప్రత్యేంగిర పారాయణ హోమం, మన్యసూక్త పారాయణ శ్రీలక్ష్మీ గణపతి జప హోమం, మహాసుదర్శన యాగం, నవగ్రహ సహిత రుద్రహోమాలు చేస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామప్రసాద్ శర్మతో పాటు ఆయన సోదరులు నేతృత్వం వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం 2 –4 – 120/1, స్నేహపురికాలనీ, రోడ్ నంబర్ 19, నాగోల్‌లో జరుగుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. వివరాలకు 98494 46530లో సంప్రదించవచ్చన్నారు. -
సత్తా చాటుతూ..
ఇన్నోవేషన్ ఫెలోస్‌కు జేఎన్టీయూకే, గైట్ కళాశాల విద్యార్థులు బాలాజీచెరువు(కాకినాడ) : సాంకేతిక యూనివర్సిటీలో అగ్రగామిగా నిలుస్తున్న జేఎన్టీయూకే ఇప్పుడు తన వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో పోటీపడి ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఒక బ్యాచ్ అర్హత సాధించి సిలికాన్ వ్యాలీ సదస్సులో పాల్గొనగా.. మరో నలుగురు విద్యార్థులు నవంబర్‌లో జరిగే సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హస్పోప్లాటర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(డీస్కూల్) కల్పించే యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్‌కు(యూఐఎఫ్) జేఎన్టీయూకే విద్యార్థులు ఎంపికయ్యారు. సీఎస్ఈ విభాగం నుంచి చైతన్య, ప్రతిభాంకిత, ఈసీఈ నుంచి సౌమ్య,తేజస్వినీలు ఎంపికైన వారిలో ఉన్నారు. గైట్ విద్యార్థులు కూడా.. వెలుగుబంద (రాజానగరం) : యూఎస్ఏలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమానికి స్థానిక గైట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గూగల్, స్టా¯ŒS ఫోర్టు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపికైన వారిలో బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులు రచన పారుపూడి, మెండ్రోటి వెంకటసత్యసాయిసిద్దార్థ (ఈసీఈ), గ్నషాకేర్ సహాని (సీఎస్ఈ), బీటెక్ సెకండియర్ విద్యార్థి సుందరిజాహ్నవి మావూరి (సీఎస్ఈ) ఉన్నారు. దేశవ్యాప్తంగా 224 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారిలో గైట్ నుంచి నలుగురు ఉండడం హర్షణీయమన్నారు. మార్చి 9 నుంచి 12 వరకు జరిగే సిలికాన్ వాలీ మీటప్‌లో పాల్గొని, వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం మన దేశంలోని ఉన్నత విద్యలో మార్పును తీసుకువచ్చేలా విద్యార్థి నాయకులను తయారు చేయడానికి, విద్యార్థుల శక్తిని మార్పునకు అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్షీ్మశశికిరణ్ అన్నారు. సమావేశంలో సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రామ్మూర్తి, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు, ఏపీఎస్ఎస్డీసీ ఎకనామిక్ కన్సల్టెంట్ టీవీ రావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణలకు అండగా ఉంటాం
• ఔషధ పరిశ్రమల సీఈవోలతో మంత్రి కేటీఆర్ • అమెరికా, బ్రిటన్‌లో మాదిరి ఇక్కడ లాబీయిస్టు గ్రూపులు లేవు • పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: ఔషధ పరిశోధనలు, ప్రయోగాల (క్లినికల్ ట్రయల్స్) వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశ్రమ లు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఔషధరంగ పరిశోధనల్లో భాగస్వా మ్యాన్ని పెంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహిం చడం ద్వారా ధరలను దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయో ఆసియా సదస్సు రెండోరోజు మంగళవారం ఇక్కడి హైటెక్స్‌లో జరిగింది. ‘100 కోట్ల కొత్త రోగులకు చికిత్స–ఔషధ పరిశ్రమల పాత్ర’ అంశంపై దిగ్గజ ఔషధ రంగ పరిశ్రమల సీఈవోలతో నిర్వహించిన చర్చాగోష్టిలో మంత్రి మట్లాడారు. మౌలిక సదుపాయాల ను కల్పించడం, నిబంధనలను సడలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పిస్తోందన్నారు. బ్రిటన్, అమెరికాల మాదిరిగా రాష్ట్రంలో లాబీయిస్టు గ్రూపులు లేవన్నారు. దేశ ఔషధ పరిశ్రమల్లో 35 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయ న్నారు. లైఫ్‌సైన్స్ రంగంలో తెలంగాణ.. దేశ రాజధానిగా ఖ్యాతి గడించిందన్నారు. పర్యా వరణ పరిరక్షణకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔషధ రంగ పరిశోధనలు మానవాళికి ఎంతో మేలు చేశాయని, మనిషి జీవితం కాలం పెరగడం లో పరిశుభ్రత సగం పాత్ర పోషిస్తే ఔషధాలు సగం పాత్ర పోషించాయని జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ అధికారి డాక్టర్ పౌల్ స్టొఫెల్స్ పేర్కొన్నారు. ఇంకా మరెన్నో ఆవిష్కరణలకు అవకాశం ఉందని చెప్పారు. కేన్సర్, క్షయ, హృద్రోగ మందులపై పరిశోధనల కోసం భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామన్నారు. పరిశోధనలు, అభి వృద్ధి రంగంలో చేస్తున్న పెట్టుబడులను తిరిగి రాబట్టేందుకు జీవ వైజ్ఞానిక పరిశ్రమల రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నొవార్టిస్ సంస్థ గ్లోబల్ హెడ్ (డ్రగ్ డెవలప్ మెంట్) డాక్టర్ వసంత్ నరసింహన్ పేర్కొన్నారు. ఔషధ, జీవ వైజ్ఞానిక రంగ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలపై 1,50,000 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టాయ న్నారు. ఈ డబ్బులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తిరిగి ఎలా రాబట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానాన్ని శోధించాల్సి ఉందన్నారు. కొత్త ఔషధ ఆవిష్కరణలే ప్రముఖ ఔషధ కంపెనీల ఏర్పాటుకు దారితీశాయని నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికాలోని స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ కర్ట్ వుత్రిచ్ పేర్కొన్నారు. ఔషధ కంపెనీలతో చర్చలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రముఖ ఔషధ కంపెనీలు నోవార్టిస్, గ్లెన్ మార్క్, జీఎస్కే తదితర కంపెనీల ప్రతిని ధులతో మంత్రి సదస్సులో ప్రత్యేక చర్చలు జరిపారు. రాష్ట్రంలో అందిస్తున్న ప్రోత్సహ కాలు, విధానాలను వారికి తెలిపారు. -
కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ
అహ్మదాబాద్‌లో ఈ నెల 7 నుంచి జరిగే కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీని శనివారం ఆవిష్కరించారు. భారత జట్టు కెప్టెన్ అనూప్ కుమార్‌తో పాటు ఇరాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, కెన్యా, అర్జెంటీనా కెప్టెన్ల సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ట్రోఫీని ఆవిష్కరించారు. -
వానర వీరుడికి వారాహి గ్రంథం
♦ బాలకృష్ణ సమర్పణలో పురాణ పండ రచనకు కొర్రపాటి ప్రచురణ ♦ వచ్చే నెలలో తిరుపతిలో ఆవిష్కరణ నల్లగొండ ‘బాహ్యలోకాల పరిధులను దాటించి, హనుమంతుడి అనంత శక్తి సంపన్న స్వరూపానికి పాఠకులను దగ్గర చేసే విధంగా, అచ్చెరువొందే అందాలతో ఓ మహాగ్రంథాన్ని వారాహి చలన చిత్ర సంస్థ రూపొందిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఐదు వందల ఆంజనేయ ఉపాస్యమూ ర్తులతో, యంత్ర, తంత్రాత్మకమైన ఈ విశేష గ్రంథాన్ని వచ్చే నెలలో తిరుపతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వారాహి చలనచిత్ర సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌమ్యత, ప్రశాంతత, ప్రచండం నిండిన మహావీరుడు హనుమంతుడిపై భక్తితత్వాన్ని ప్రకటిస్తూ సాగే ఈ గ్రంథంలో అంతర్ముఖ ప్రజ్ఞ గోచరించే శాశ్వత సత్యాలు కూడా ఉండే విధంగా రచయిత పురాణపండ శ్రీనివాస్ దీనిని రూపొందిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే లక్ష్మీనారసింహుడి కటాక్షం నిండిన ‘శరణు...శరణు’మహా మంత్ర గ్రంథాన్ని, చండీ ఉపాసనకు ప్రతీకగా నిలిచే ‘అమ్మణ్ణి’ గ్రంథాన్ని తిరుమల తిరుపతి వేదపండితులకు, అర్చకులకు బహూకరించిన హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ ఈ గ్రంథానికి సమర్పకులుగా ఉన్నారని పేర్కొ న్నారు. ఈ గ్రంథాలను బహూకరించిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. పురాణపండకు అభినందన ఆశీర్వచనాలు ఇచ్చినప్పుడే వానర వీరుడి కోసం ఈ గ్రం థానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివ రించారు. వేద, పురాణ, ఇతిహాస కావ్యాల ఆంజనేయంతోపాటు ఈ గ్రంథం ‘పరాశర సంహిత’ ప్రామాణికంగా, పరిపూర్ణ భరితంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
ఈ నెల 27 నుంచి టెలినార్ 4జీ సేవలు
♦ తొలుత వైజాగ్‌లో అందుబాటులోకి ♦ ఆగస్టు కల్లా భాగ్యనగరంలో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ సబ్సే సస్తా 4జీ సేవలకు రెడీ అయింది. ఈ నెల 27న వైజాగ్ వేదికగా సర్వీసులను ఆవిష్కరిస్తోంది. వారణాసిలో జరిపిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కావడంతో ఇప్పుడు సర్కిళ్ల వారీగా సేవలను విస్తరించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో తొలుత వైజాగ్‌ను ఎంచుకుంది. 4జీ కోసం లీన్ జీఎస్ఎం టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. ఇందుకోసం హువావేకు రూ.1,240 కోట్ల కాంట్రాక్టును అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా 25,000 టవర్లను కొత్త టెక్నాలజీతో ఆధునికీకరిస్తోంది. టెలినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిళ్లలో ఈ ప్రక్రియ 55% పూర్తి అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్ళలో 60 శాతం పూర్తయింది. డిసెంబరులోగా 50 నగరాలు.. ఈ ఏడాది డిసెంబరులోగా కనీసం 50 నగరాల్లో 4జీని పరిచయం చేయాలని టెలినార్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 30 నగరాల్లో లీన్ జీఎస్ఎం టెక్నాలజీని కంపెనీ పరీక్షిస్తోంది. 4జీని ఆఫర్ చేయాలని అనుకున్న నగరంలో నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే హైదరాబాద్‌లో జూలై తర్వాతే సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సర్కిళ్ళలో 3,350 టవర్లకుగాను 2,000లకుపైగా టవర్ల ఆధునీకరణ పూర్తి అయింది. ఇక డేటా చార్జీలను కంపెనీ సవరిస్తోంది. ఇతర టెల్కోల టారిఫ్ కంటే ఇవి చవకగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేస్తోంది. -
మనసి చిత్ర గీతాలావిష్కరణ
మానసి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం థియేటర్లో జరిగింది. మూవీ మోషన్స్, ఎంజే.ఫిలింస్ అధినేతలు ఏ.పాహిమ్ ముహ్మదు, మాథ్యూజోసెఫ్లు నిర్మిస్తున్న చిత్రం మనసి. నవ జంట నరేశ్‌కుమార్, హారిస హీరోహీరోయిన్లుగా నటిస్తునారు. నటి హారిస ఇప్పటికే మలయాళంలో రెండు మూడు చిత్రాలలో నటించింది. తమిళంలో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో తవసి, లనూప్సతీషన్, సల్మాన్, పృథ్వీ, కేశవ్, ఆశిక్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ దర్శకులు కమల్, ఫాజిల్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నవాజ్సులేమాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివరామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఒక గొర్రెల కాపరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఆ యువకుడు గొర్రెలను తన ఆత్మబంధువులుగా భావిస్తాడన్నారు. ఎవరికీ చెడు తలపెట్టని మూగ జీవులంటే అతనికి అంత ప్రేమ అన్నారు. అలాంటిది అందులో ఒక గొర్రె కనిపించకుండా పోయి ఆ యువకుడిని బాధకు గురి చేస్తుందన్నారు. అసలు ఆ గొర్రె ఏమయ్యింది, మళ్లీ తిరిగి వచ్చిందా? అన్న అంశాలను కమర్షియల్ రీతిలో చిత్రంగా మలచినట్లు తెలిపారు. చిత్రాన్ని తేని, కంభం, ఉత్తమపాళైయం, బోడి, ఉత్తుక్కాడు, కొంభై తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
కూపకన్ హైదరాబాద్ ఎడిషన్ 2016 ఆవిష్కరణ
హైదరాబాద్: కూపకన్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూపకన్ హైదరాబాద్ ఎడిషన్-2016ను ఆవిష్కరించింది. రూ.599 ధర ఉన్న ఈ కూపకన్ బుక్ వినియోగదారులకు అత్యుత్తమ డీల్స్‌ను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెటింగ్‌కు ఈ కూపన్లు మరో రూపమని కూపకన్ డెరైక్టర్ పంకజ్ బోత్రా పేర్కొన్నారు. ఈ కూపన్ల సాయంతో కొత్త ఉత్పత్తుల విక్రయాలను ముమ్మరం చేసుకోవచ్చన్నారు. రెస్టారెంట్లు, కాఫీ షాప్స్, స్పా, ఎంటర్టైన్మెంట్, స్విమ్మింగ్, హెల్త్‌కేర్ వంటి వివిధ విభాగాల్లో కస్టమర్లకు అత్యుత్తమ డీల్స్ అందించడం కూపకన్ లక్ష్యమని చెప్పారు. 116 అవుట్లెట్లలో 235 డీల్స్, 8 ఉచిత కూపన్లు పొందవచ్చని తెలిపారు. -
బీసీ సంక్షేమ వెబ్సైట్ ఆవిష్కరణ
ఇకపై సులువుగా సమగ్ర సమాచారం: మంత్రి జోగురామన్న సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు బీసీ సంక్షేమ వెబ్‌సైట్‌ను రూపొందించామని ఆ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో కొత్త వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, స్టడీ సర్కిళ్లు, ఆయా కేంద్రాల్లో లభించే శిక్షణ వివరాలను www.tsbcwd.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఇకపై తెలుసుకోవచ్చన్నారు. త్వరలోనే 3 జూనియర్ కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల పేరును తెలంగాణ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామన్నారు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఇచ్చే రుణాల్లో యూనిట్‌కు రుణపరిమితిని రూ.35 లక్షల వరకు, సబ్సిడీ పరిమితి రూ.15 లక్షల వరకు పెంచామన్నారు. నేడు (ఆదివారం) పదవీవిరమణ చేయనున్న బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ టి.రాధను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ కమిషనర్ అరుణ, జాయింట్ డెరైక్టర్ అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, స్టడీసర్కిల్స్ డెరైక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. -
ఫిబ్రవరి మొదటి వారానికి అంతా సిద్ధం
♦ మేడారం జాతర ఏర్పాట్లపై కడియం ♦ చందూలాల్, ఇంద్రకర ణ్‌తో కలసి పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరగనున్న తొలి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా భావించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నం దున ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి ఆయన మేడారం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆరు నెలల క్రితమే జాతర ఏర్పాట్లను ప్రారంభించామని, రూ.154 కోట్లతో పనులు చేస్తున్నామని కడియం వివరించారు. ప్రస్తుతం రోడ్లు, భక్తులు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు తదితర పనులు జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల మొదటివారానికల్లా పనులు పూర్తవుతాయని, త్వరలో క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తామన్నారు. రూ.1.20 కోట్లతో గద్దెల వద్ద, ఆ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ చేయిస్తున్నామని, స్టీల్ బారికేడ్లతోపాటు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే పరిసరాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇటు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా వెళ్లే దారి, అటు తాడ్వాయి మీదుగా వచ్చే రోడ్డును రెండు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం ఉత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకునే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు చెప్పారు. గురువారం నుంచి ఆహ్వానపత్రికలు పంపుతామన్నారు. మేడారం జాతరకు ఆసియాలోనే పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుందని మంత్రి చందూలాల్ అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఎస్సీ సెల్ చైర్మన్ రవి పాల్గొన్నారు. -
నవకల్పనలకు రూ.30 కోట్ల రివార్డు
న్యూఢిల్లీ: దేశంలో నవకల్పన(ఇన్నోవేషన్)లు, ఔత్సాహిక వ్యాపారవేత్త(ఎంట్రప్రెన్యూర్స్)లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం రూ.30 కోట్ల రివార్డుతో పాటు కార్పొరేట్ల లాభాల్లో 1 శాతాన్ని పక్కనబెట్టాలని నీతి ఆయోగ్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రముఖ విద్యావేత్త తరుణ్ ఖన్నా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ త్వరలోనే నివేదికను కేంద్రానికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంకా అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎయిమ్), స్వయం ఉపాధి, నైపుణ్యాల వినియోగం(ఎస్ఈటీయూ) ప్రోగ్రామ్‌ల స్వరూపానికి సంబంధించికీలక ప్రతిపాదనలు కూడా ఇం దులో ఉన్నాయి. ఇన్నోవేషన్‌లో ప్రత్యేక అవార్డుల(గ్రాండ్ చాలెంజెస్)పై ఎయిమ్ నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది. నిర్ధేశించిన వ్యవధిలోగా నిర్ధిష్ట లక్ష్యాన్ని సాధించిన ఒక్కో చాలెంజ్ (అవార్డు)కు రూ.10-30 కోట్ల నగదును బహుమానంగా ఇవ్వాలని పేర్కొంది. ముఖ్యాంశాలు... * యూనివర్సిటీల్లోని రీసెర్చ్ ల్యాబ్‌లు లేదా పరిశ్రమలు-యూనివర్సిటీల భాగస్వామ్యంతో చేపట్టే రీసెర్చ్ కార్యకలాపాలకు కార్పొరేట్ల లాభాల్లో 1 శాతాన్ని వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలి. * కార్పొరేట్లు వెచ్చించే ఇటువంటి పెట్టుబడులకు పన్ను రాయితీలు కూడా ఇవ్వాలి. * ఇంకా భాగస్వామ్యాలకు ఊతమిచ్చేందుకు ‘మేక్ ఇన్ యూనివర్సిటీస్’ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలి. దీని ప్రకారం దాదాపు 500 ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. * విదేశీ డిఫెన్స్ కంపెనీలతో ప్రభుత్వం 5 బిలియన్ డాలర్లకు మించి కుదుర్చుకునే కాంట్రాక్టు విలువలో 5 శాతాన్ని రీసెర్చ్ ఆధారిత యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు వినియోగించేవిధంగా నిబంధనలను విధించాలి. * ఆరంభ స్థాయిలో ఉన్న వెంచర్ ఫండ్స్‌కు నిధుల కల్పన కోసం రూ.5,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్)ను కూడా నెలకొల్పాలి. -
ఉద్యమంలా హరితహారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ను ఉద్యమంలా చేపట్టాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు జీవంపోసే వృక్షసంపదను కాపాడుకునేందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అభిలషించారు. జెడ్పీ సమావేశమందిరంలో శనివారం హరితహారంపై ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య ఆతిధిగా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2.34 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 20 లక్షల గుంతలు తవ్వి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచామని అన్నారు. మొక్కలను నాటడం కాదు.. సంరక్షించడం ముఖ్యమని, ఈ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం.. నాటిన మొక్కలను పోషించే బాధ్యతను గ్రామీణ ఉపాధి హామీతో అనుసంధానం చేసిందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. వృక్ష సంపద లేకపోవడం వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటేలా ప్రజలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అడవులు అంతరించిపోవడం వల్ల కోతులు గ్రామాల్లో సంచరిస్తున్నాయని, అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను పెంచేందుకు అటవీశాఖ కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మట్లాడుతూ కళాశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థల్లో విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, వివేక్, కనకారెడ్డి, గాంధీ, సుధీర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ శ్రీనివాస్, జేసీ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ వర్షిణి, వివిధ శాఖల అధికారులు, పురపాలికల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హరితహారం అమలుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొం దించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. డీపీఓపై గుస్సా! జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి వ్యవహారశైలిపై మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో లేచి నిరసన తెలిపారు. చేవెళ్ల ఎంపీపీని చాంబర్లోకి అనుమతించకుండా డీపీఓ అవమానపరిచారని సభ్యులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల కు కనీస గౌరవం ఇవ్వని డీపీఓ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి.. ఈ అంశంపై సమావేశంలో చర్చించడం సబబుకాదని సముదాయించడంతో ఎంపీపీలు శాంతించారు. -
పర్సంటేజీల కంటే ఆసక్తి ప్రధానం
గెస్ట్ కాలమ్ దేశంలో ఇటీవల కాలంలో పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో ఔత్సాహిక అభ్యర్థులెందరో ఆర్థిక కారణాలతో పరిశోధనలపై దృష్టి సారించలేకపోతున్నారు. వీరికి సరైన ప్రోత్సాహకాలు అందిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో తమ లక్ష్యాన్ని దూరం చేసుకోకూడదు. పరిశోధనల రంగంలో రాణించేందుకు అకడమిక్ పర్సంటేజీల కంటే ఆసక్తే ప్రధానం. ఆవిష్కరణలకు అదే ప్రధాన ఆయుధం. గణిత శాస్త్రవేత్త రామానుజన్, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ వంటి వారే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు భారతరత్న అవార్డ్ గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు. సైన్స్ రంగంలో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేసి దశాబ్దాల అనుభవం గడించిన సి.ఎన్.ఆర్.రావుతో ఇంటర్వ్యూ.. సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్చ కోర్సుల కరిక్యులంను మార్చాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని విద్యావేత్తలు, నిపుణులు కోరుతున్న మాట వాస్తవమే. కేవలం కరిక్యులం మార్పుతోనే విద్యార్థుల్లో పరిపూర్ణత వస్తుందనుకోవడం సరికాదు. కోర్సులో నిర్దేశించిన సబ్జెక్ట్‌లనే కచ్చితంగా చదవాలనే విధానానికి బదులుగా.. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌లను ఎంచుకునే స్వేచ్ఛ కరిక్యులంలో ఉండాలి. అప్పుడే విద్యార్థుల్లోని నిజమైన ఆసక్తి బయటకు వస్తుంది. తద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగపడతారు. కరిక్యులం అంటే.. సిలబస్ మాత్రమే కాదు. బోధన, అభ్యసనం, మూల్యాంకనం.. ఇలా ఎన్నో అంశాల సమ్మిళితం అని గుర్తించాలి. ఇంటర్ డిసిప్లినరీగా మార్చాలి గ్లోబలైజేషన్, పోటీ ప్రపంచ ం వంటి కారణాలతో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. సైన్స్, ఇంజనీరింగ్ల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎదురవుతున్న సమస్య ఆయా సబ్జెక్ట్‌లను వేర్వేరుగా పరిగణించడం. సైన్స్‌ను ఇంజనీరింగ్ నుంచి వేరు చేసి చూడటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ . వాస్తవానికి ఇంజనీరింగ్‌లోని అన్ని అంశాలు సైన్స్ భావనల మేరకు రూపొందేవే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో అధికశాతం ఫిజిక్స్ ఆధారిత అంశాలు ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్‌ల మధ్య అంతరాలు తొలగించి ఇంటర్ డిసిప్లినరీగా మార్చాలి. ప్రోత్సాహకాలు పెంచడం అవసరం మన దేశంలో ఇటీవల కాలంలో పరిశోధనలకు ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నారు. వీటిని మరింతగా పెంచాల్సిన అవసరముంది. కేవలం స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లతో సరిపెట్టకుండా ఔత్సాహికులకు అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యేవిధంగా ఆర్థిక తోడ్పాటు అందించాలి. ఫలితంగా వారికి విస్తృత స్థాయిలో నైపుణ్యాలు లభిస్తాయి. లక్ష్యాలు ఉన్నతంగా.. యువతలో అధిక శాతం ఉద్యోగ సాధననే మొదటి ప్రాధాన్యంగా పరిగణిస్తున్నారు. దానికి తగినట్లుగానే సర్టిఫికెట్లలో పర్సంటేజ్‌లు ప్రతిబింబించేలా అభ్యసనం పరీక్షలకే పరిమితమవుతోంది. ఇదే మనకు సమస్యగా మారుతోంది. విద్యార్థులు ఈ దృక్పథం మార్చుకోవాలి. చదువును ఉద్యోగ సాధనకే పరిమితం చేయకుండా.. ఉన్నత లక్ష్యాలకు ఉపకరణంగా మలచుకోవాలి. విస్తృత కోణంలో చెప్పాలంటే.. ఉద్యోగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొంత తగ్గించాలి. ఆసక్తిని గుర్తించేలా ప్రవేశ ప్రక్రియ విద్యార్థులకు ఇప్పుడు పరిశోధనలు, ఉన్నత విద్య దిశగా అవకాశాలు పుష్కలం. వాటిలో ప్రవేశానికి అకడమిక్‌గా అర్హత నిబంధనలు విధించడం సరికాదు. ఉదాహరణకు.. సీఎస్ఐఆర్-నెట్‌కు హాజరవ్వాలంటే పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొనడం వంటివి సమంజసం కాదు. అకడమిక్ పర్సంటేజి కంటే, అభ్యర్థుల్లోని ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ఆసక్తిని గుర్తించే విధంగా ప్రవేశ ప్రక్రియలు ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల కారణంగా అకడమిక్‌గా పర్సంటేజ్‌లు, ఆయా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఏమంత కష్టం కాదు. కానీ వాటి ఆధారంగా ఒక విభాగంలో పరిశోధన లేదా ఉన్నత విద్య కోర్సులో చేరే అభ్యర్థికి నిజమైన ఆసక్తి లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇన్స్టిట్యూట్ల విస్తరణ మంచిదే ఐఐటీలకు సంబంధించి ఫ్యాకల్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ముందుగానే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఐఐటీల నుంచి గత ఆరేళ్లలో ఏర్పాటైన కొత్త ఐఐటీల వరకూ.. దాదాపు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఫ్యాకల్టీ కొరత ప్రధాన సమస్యగా మారింది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ సమస్యకు కూడా మూలాలు మన అకడమిక్ విధానంలోనే ఉన్నాయి. బోధన రంగంపై ఆసక్తిని పెంచేలా అకడమిక్ స్థాయిలోనే అవగాహన కల్పించాలి. కార్పొరేట్ కొలువుల కోసమే కోర్సులు కాదని తెలియజేయాలి. ఫలితంగా వారు ఉన్నత విద్యవైపు దృష్టి సారించి.. పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయికి చేరుకోవడం, బోధనవైపు అడుగులు వేయడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. సొంత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి విద్యా సంస్థలు.. సంస్థలతో ఒప్పందాల ద్వారా ఆర్ అండ్ డీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవి కేవలం జాయింట్ కొలాబరేషన్స్కే పరిమితం కాకుండా.. సొంత ఆవిష్కరణలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. కొత్త సంస్థలు మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటై, సుస్థిరత సాధించిన ఇన్స్టిట్యూట్లు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. సహనం.. సానుకూల దృక్పథం.. నేటి యువతకు కష్టించేతత్వంతోపాటు సహనం, సానుకూల దృక్పథం చాలా అవసరం. లభించని ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తూ నిరాశ చెందకుండా అందుబాటులోని వనరులనే అవకాశాలుగా మలచుకోవాలి. మేం పరిశోధనలు ప్రారంభించిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రోత్సాహకాల పరంగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. విద్యార్థులు కూడా ఎంక్వైరీ దృక్పథాన్ని, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి. దీనివల్ల విస్తృత స్థాయిలో నైపుణ్యాలు లభిస్తాయి. వాస్తవ పరిస్థితులపై వాస్తవ అవగాహన పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. ఈ విషయంలో అధ్యాపకులు చొరవ చూపాలి!!