బీసీ సంక్షేమ వెబ్‌సైట్ ఆవిష్కరణ | BC welfare website Innovation | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Published Sun, Jan 31 2016 5:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

బీసీ సంక్షేమ వెబ్‌సైట్ ఆవిష్కరణ

బీసీ సంక్షేమ వెబ్‌సైట్ ఆవిష్కరణ

ఇకపై సులువుగా సమగ్ర సమాచారం: మంత్రి జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు బీసీ సంక్షేమ వెబ్‌సైట్‌ను రూపొందించామని ఆ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో కొత్త వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, స్టడీ సర్కిళ్లు, ఆయా కేంద్రాల్లో లభించే శిక్షణ వివరాలను www.tsbcwd.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇకపై తెలుసుకోవచ్చన్నారు.

త్వరలోనే 3 జూనియర్ కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల పేరును తెలంగాణ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామన్నారు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఇచ్చే రుణాల్లో యూనిట్‌కు రుణపరిమితిని రూ.35 లక్షల వరకు, సబ్సిడీ పరిమితి రూ.15 లక్షల వరకు పెంచామన్నారు. నేడు (ఆదివారం) పదవీవిరమణ చేయనున్న బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ టి.రాధను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ కమిషనర్ అరుణ, జాయింట్ డెరైక్టర్ అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, స్టడీసర్కిల్స్ డెరైక్టర్ చంద్రశేఖర్  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement