మనం దేశంలలో రోజుకు ఎన్ని కోళ్లు ఖతం అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ లెక్కన ఏడాదికి లక్షకు పైమాటే. ఒక కేజీ లేదా కేజీపైనా తూగే కోడిలో మహా అయితే దగ్గర 650 నుంచి 750 గ్రాముల మాంసం రాగా, మిగతా అంతా వేస్టేజ్. అంటే ఒక్క కోడికి ఇంత వేస్టేజ్ అంటే మరీ రోజుకి ఎంత పౌల్ట్రీ వ్యర్థాలు వస్తున్నాయో ఊహిస్తేనే వామ్మో అనిపిస్తోంది కదూ. అయితే ఈ వ్యర్థాలతో సరికొత్త వస్త్ర పరిశ్రమకు నాంది పలికి అందిరి చేత శెభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నాడు యూపీకి చెందిన ఒక వ్యక్తి. అతడెవరూ? ఎలా ఈ వ్యర్థాలతో వస్త్రాలు తయారీ చేశాడంటే..
అతడి పేరు రాధేష్ అగ్రహరి. ఆయన స్టార్టప్ "గోల్డెన్ ఫెదర్స్" వ్యవస్థాపకుడు. ఇది ఇది పౌల్ట్రీ వ్యర్థాలను 'ఉన్ని లాంటి' ఫైబర్, చేతితో తయారు చేసిన కాగితంగా మారుస్తుంది. ఈ వ్యర్థాలను ముడి పదార్థంగా ఉపయోగించి, స్టార్టప్ శాలువాలు, కుల్తాలు, స్టోల్స్, డైరీలు, చేపల మేత కంపోస్ట్‌లను తయారు చేస్తుంది. జైపూర్, పూణేలలో కంపెనీకి సంబంధించని మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడ తయారైన ఉత్పత్తులను B2B మార్కెట్‌లో విక్రయిస్తుంది. ఈ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్లు. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఏకంగా 73 లక్షల కిలోల కోడి మాంసం వ్యర్థాలను రీసైకిల్ చేసింది. ఆయన చేస్తున్న పర్యావరణ హిత బిజినెస్‌ి గానూ దాదాపు 25 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఈ వినూత్న ఆలోచన ఎలా వచ్చిందంటే..
జైపూర్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ చదువుతున్న టైంలో రాధేష్ అగ్రహరికి ఈ ఆలోచన వచ్చింది. ఒక రోజు కాలేజ్‌లో రీసైక్లింగ్ స్టడీ నిమిత్తం విద్యార్థులను వ్యర్థాలను సేకరించి తీసుకురమ్మని ఉపాధ్యాయులు ఆదేశించారు. అందరూ ప్లాస్టిక్ నుంచి థర్మోకోల్ వరకు అన్ని రకాల వ్యర్థ పదార్థాలను క్రమబద్ధీకరించి ఏం తయారు చేయొచ్చొ వివరించారు. రాధేష్ వంతు వచ్చేటప్పటకీ ఎలాంటి వ్యర్థాలు సేకరించాలో అర్థంగాక తీసుకురాకపోవడంతో క్లాస్ రూం నుంచి ఉపాధ్యాయులు బయటకు పంపించేశారు. అవమానంతో నిరాశగా వచ్చిన అతడికి కాసేపు మంచి చికెన్ తెచ్చుకుని తింటే మూడ్ మారుతుంది. పైగా ఏదైన ఆలోచన తట్టొచ్చు అని భావించి, మార్కెట్‌కి వెళ్లి ఒక కేజీ చికెన్ ఆర్డర్ చేశాడు. అయితే అక్కడ దాన్ని నీటిగా క్లీన్ చేయగా తూగింది 650 గ్రాములే. కానీ దుకాణదారుడు ఒక కేజి చికెన్ ధర వసూలు చేయడం జరిగింది.
మరీ మిగతా భాగం ఏంటని రాధేష్ దుకాణదారుడిని ప్రశ్నించటంతో.. మిగిలిన 350 గ్రాములు వేస్ట్ అని చెప్పగా దాన్ని ప్యాక్ చేసి ఇమ్మని చెప్పి మరీ తీసుకెళ్లాడు. అప్పుడే అతనికి ఈ వ్యర్థాలు ఏం చేస్తారు, ఏటా ఎన్ని కోళ్ల వ్యర్థాలు వస్తున్నాయి అనే దిశగా ఆలోచించడం, పరిశోధించండ ప్రారభించాడు. కాలేజ్ రీసెక్లింగ్ ప్రాజెక్ట్ కారణంగా కోళ్ల వ్యర్థాల గురించి వచ్చిన ఆలోచన క్రమేణ రీసైక్లింగ్ చేసి ఏం చేయొచ్చు అనే దిశగా పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అందరూ ప్లాస్టిక్ వంటి వ్యర్థాలతో రీసైక్లింగ్ వంటివి చేస్తారు తాను మాత్రం ఇలా కోళ్ల వ్యర్థాల రీ సైక్లింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడు. అలా రాధేష్‌కి వీటిని సరిగ్గా రీసైకిల్ చేసి ఉత్పత్తులుగా రూపొందించడానికి దగ్గర దగ్గర 13 ఏళ్లు పట్టింది.
అంతేగాదు ఈ కోళ్ల వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద తడి వ్యర్థాల సమస్య. పైగా నదీ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. అదీగాక సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (CEE) నివేదిక ప్రకారం, US, EU, బ్రెజిల్ మరియు చైనా తర్వాత బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఐదవ అతిపెద్దది. వార్షిక ఉత్పత్తి 4.6 మిలియన్ మెట్రిక్ టన్నులు అని నివేదికలు చెబుతున్నాయి.
ఐతే ప్రపంచం ప్లాస్టిక్ రీసైక్లింగ్ వైపు పని చేస్తోంది, కానీ చికెన్ వ్యర్థాల గురించి కూడా మాట్లాడటం లేదని అంటున్నారు రాధేష్. నీటి వనరులను శుద్ధి చేయాలని నినాదాలు చేసే బదులు మూలా కారణాలకు చెక్‌పెడితే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. కాగా, రాధేష్ తన స్టార్టప్ కంపెనీని 2019లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇక కంపెనీ పనితీరు గురించి వివరిస్తూ..ఈ కంపెనీ కబేళాల నుంచి కోళ్ల వ్యర్థాను సేకరించి క్రిమి సంహారక మందులు, ఆవిరితో శుభ్రపరుస్తాం. అలాగే వాటికి ఉండే ఈకలను పత్తి, జనపనార, ఉన్ని, పట్టు వంటి సహజ ఫైబర్లుగా తయారు చేస్తాం. ఇక స్పిన్నింగ్‌కి సరిపడని ఈకలతో హ్యాండ్ మేడ్ కాగితాన్ని తయారు చేస్ం. అంతేగాదు కోళ్ల వ్యర్థాల్లోని ఉపఉత్పత్తులను ఎరువులుగా, చేపల మేతగా మార్చడం జరుగుతుందని చెబుతున్నారు రాధేష్. నిజానికి రాధేష్ డిజైనర్ నుంచి గొప్ప ఇన్నోవేటర్‌గా మార పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించేలా గొప్ప స్టార్టప్ వ్యాపారానికి నాంది పలికి, యువతకు ఆదర్శంగా నిలిచారు.
(చదవండి: సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు..నవతరం తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!)
Comments
Please login to add a commentAdd a comment