Poultry Business
-
పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్షీట్లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..
మనం దేశంలలో రోజుకు ఎన్ని కోళ్లు ఖతం అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ లెక్కన ఏడాదికి లక్షకు పైమాటే. ఒక కేజీ లేదా కేజీపైనా తూగే కోడిలో మహా అయితే దగ్గర 650 నుంచి 750 గ్రాముల మాంసం రాగా, మిగతా అంతా వేస్టేజ్. అంటే ఒక్క కోడికి ఇంత వేస్టేజ్ అంటే మరీ రోజుకి ఎంత పౌల్ట్రీ వ్యర్థాలు వస్తున్నాయో ఊహిస్తేనే వామ్మో అనిపిస్తోంది కదూ. అయితే ఈ వ్యర్థాలతో సరికొత్త వస్త్ర పరిశ్రమకు నాంది పలికి అందిరి చేత శెభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నాడు యూపీకి చెందిన ఒక వ్యక్తి. అతడెవరూ? ఎలా ఈ వ్యర్థాలతో వస్త్రాలు తయారీ చేశాడంటే..అతడి పేరు రాధేష్ అగ్రహరి. ఆయన స్టార్టప్ "గోల్డెన్ ఫెదర్స్" వ్యవస్థాపకుడు. ఇది ఇది పౌల్ట్రీ వ్యర్థాలను 'ఉన్ని లాంటి' ఫైబర్, చేతితో తయారు చేసిన కాగితంగా మారుస్తుంది. ఈ వ్యర్థాలను ముడి పదార్థంగా ఉపయోగించి, స్టార్టప్ శాలువాలు, కుల్తాలు, స్టోల్స్, డైరీలు, చేపల మేత కంపోస్ట్‌లను తయారు చేస్తుంది. జైపూర్, పూణేలలో కంపెనీకి సంబంధించని మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడ తయారైన ఉత్పత్తులను B2B మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్లు. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఏకంగా 73 లక్షల కిలోల కోడి మాంసం వ్యర్థాలను రీసైకిల్ చేసింది. ఆయన చేస్తున్న పర్యావరణ హిత బిజినెస్ి గానూ దాదాపు 25 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ వినూత్న ఆలోచన ఎలా వచ్చిందంటే..జైపూర్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ చదువుతున్న టైంలో రాధేష్ అగ్రహరికి ఈ ఆలోచన వచ్చింది. ఒక రోజు కాలేజ్‌లో రీసైక్లింగ్ స్టడీ నిమిత్తం విద్యార్థులను వ్యర్థాలను సేకరించి తీసుకురమ్మని ఉపాధ్యాయులు ఆదేశించారు. అందరూ ప్లాస్టిక్ నుంచి థర్మోకోల్ వరకు అన్ని రకాల వ్యర్థ పదార్థాలను క్రమబద్ధీకరించి ఏం తయారు చేయొచ్చొ వివరించారు. రాధేష్ వంతు వచ్చేటప్పటకీ ఎలాంటి వ్యర్థాలు సేకరించాలో అర్థంగాక తీసుకురాకపోవడంతో క్లాస్ రూం నుంచి ఉపాధ్యాయులు బయటకు పంపించేశారు. అవమానంతో నిరాశగా వచ్చిన అతడికి కాసేపు మంచి చికెన్ తెచ్చుకుని తింటే మూడ్ మారుతుంది. పైగా ఏదైన ఆలోచన తట్టొచ్చు అని భావించి, మార్కెట్‌కి వెళ్లి ఒక కేజీ చికెన్ ఆర్డర్ చేశాడు. అయితే అక్కడ దాన్ని నీటిగా క్లీన్ చేయగా తూగింది 650 గ్రాములే. కానీ దుకాణదారుడు ఒక కేజి చికెన్ ధర వసూలు చేయడం జరిగింది.మరీ మిగతా భాగం ఏంటని రాధేష్ దుకాణదారుడిని ప్రశ్నించటంతో.. మిగిలిన 350 గ్రాములు వేస్ట్ అని చెప్పగా దాన్ని ప్యాక్ చేసి ఇమ్మని చెప్పి మరీ తీసుకెళ్లాడు. అప్పుడే అతనికి ఈ వ్యర్థాలు ఏం చేస్తారు, ఏటా ఎన్ని కోళ్ల వ్యర్థాలు వస్తున్నాయి అనే దిశగా ఆలోచించడం, పరిశోధించండ ప్రారభించాడు. కాలేజ్ రీసెక్లింగ్ ప్రాజెక్ట్ కారణంగా కోళ్ల వ్యర్థాల గురించి వచ్చిన ఆలోచన క్రమేణ రీసైక్లింగ్ చేసి ఏం చేయొచ్చు అనే దిశగా పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అందరూ ప్లాస్టిక్ వంటి వ్యర్థాలతో రీసైక్లింగ్ వంటివి చేస్తారు తాను మాత్రం ఇలా కోళ్ల వ్యర్థాల రీ సైక్లింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడు. అలా రాధేష్కి వీటిని సరిగ్గా రీసైకిల్ చేసి ఉత్పత్తులుగా రూపొందించడానికి దగ్గర దగ్గర 13 ఏళ్లు పట్టింది.అంతేగాదు ఈ కోళ్ల వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద తడి వ్యర్థాల సమస్య. పైగా నదీ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. అదీగాక సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (CEE) నివేదిక ప్రకారం, US, EU, బ్రెజిల్ మరియు చైనా తర్వాత బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఐదవ అతిపెద్దది. వార్షిక ఉత్పత్తి 4.6 మిలియన్ మెట్రిక్ టన్నులు అని నివేదికలు చెబుతున్నాయి. ఐతే ప్రపంచం ప్లాస్టిక్ రీసైక్లింగ్ వైపు పని చేస్తోంది, కానీ చికెన్ వ్యర్థాల గురించి కూడా మాట్లాడటం లేదని అంటున్నారు రాధేష్. నీటి వనరులను శుద్ధి చేయాలని నినాదాలు చేసే బదులు మూలా కారణాలకు చెక్‌పెడితే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. కాగా, రాధేష్ తన స్టార్టప్ కంపెనీని 2019లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇక కంపెనీ పనితీరు గురించి వివరిస్తూ..ఈ కంపెనీ కబేళాల నుంచి కోళ్ల వ్యర్థాను సేకరించి క్రిమి సంహారక మందులు, ఆవిరితో శుభ్రపరుస్తాం. అలాగే వాటికి ఉండే ఈకలను పత్తి, జనపనార, ఉన్ని, పట్టు వంటి సహజ ఫైబర్లుగా తయారు చేస్తాం. ఇక స్పిన్నింగ్‌కి సరిపడని ఈకలతో హ్యాండ్ మేడ్ కాగితాన్ని తయారు చేస్ం. అంతేగాదు కోళ్ల వ్యర్థాల్లోని ఉపఉత్పత్తులను ఎరువులుగా, చేపల మేతగా మార్చడం జరుగుతుందని చెబుతున్నారు రాధేష్. నిజానికి రాధేష్ డిజైనర్ నుంచి గొప్ప ఇన్నోవేటర్‌గా మార పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించేలా గొప్ప స్టార్టప్ వ్యాపారానికి నాంది పలికి, యువతకు ఆదర్శంగా నిలిచారు.(చదవండి: సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు..నవతరం తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!) -
తక్కువ కాలంలో లాభాలు తెచ్చిపెట్టే పౌల్ట్రీ ఫామ్
-
తక్కువ పెట్టుబడి అధిక లాభాలు
-
పౌల్ట్రీ రంగంలో లాభాలతో దూసుకుపోతున్న రిటైర్ ఆర్మీ ఉద్యోగి
-
ఊపందుకుంటున్న పౌల్ట్రీ రంగం... ఇలా చేస్తే కోటీశ్వరులు అయినట్టే..
-
చికెన్ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్ లాక్డౌన్?
ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కార్పొరేట్ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్డౌన్ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్డౌన్ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చదవండి👉🏼 రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం మార్కెట్‌పై పట్టు సాధించి.. గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి. చికెన్ ధర రూ.300 దాటినా.. మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడి, బ్రాయిలర్ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్డౌన్ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్ల ఖర్చు, విద్యుత్ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. ఖాళీగా ఫారాలు ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్డౌన్ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు బ్రాయిలర్ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి గ్రోయింగ్ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, ఊక, విద్యుత్ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ సరిపోవడం లేదు. – యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం లాక్డౌన్ తప్పదు 10 వేల కోడి పిల్లల బ్యాచ్‌ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్‌కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి. – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల చదవండి👇 క్వింటాల్ పసుపు రూ. 6,850 ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి -
రుచి తగ్గిన బ్రాయిలర్.. నాటుకోడికి జై, కిలో రూ.600
సాక్షి,తూర్పుగోదావరి: బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం జిల్లాలో మళ్లీ ఊపందుకుంటోంది. మార్కెట్లు, రోడ్ల పక్కన వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాటుకోడి గుడ్లు, మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. పూర్వం మాంసాహార ప్రియుల ఇళ్ల వద్ద కోళ్ల గూళ్లలో 10 నుంచి 30 వరకూ నాటుకోళ్లను పెంచేవారు. ఇంట్లో కూరలకు వీటి గుడ్లనే వినియోగించేవారు. చుట్టాలు వచ్చినప్పుడు వారికి నాటు కోడి కూర పెట్టడంతో పాటు పండగలప్పుడు నైవేద్యాలకు నాటుకోళ్లనే కోసేవారు. 1988–92 మధ్య కాలంలో జిల్లాలో లేయర్ కోళ్ల పరిశ్రమ విస్తరణతో తక్కువ ధరకే గుడ్లు లభించడం, ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో రానురానూ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. మరోపక్క దుమ్ములు కూడా మెత్తగా నమలడానికి వీలుగా ఉండే బ్రాయిలర్ కోళ్ల వినియోగం పెరిగింది. అయితే కాలక్రమేణా మాంసాహార ప్రియుల అలవాట్లలో మార్పులొస్తున్నాయి. త్వరగా బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు చేస్తున్న హార్మోన్లు ఇంజక్షన్లు ఆరోగ్యానికి చేటు తెస్తాయన్న భావన పెరిగింది. దీనికితోడు వీటి మాంసం రుచి తగ్గడంతో నాటుకోడి వైపు మాంసాహార ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నాటుకోళ్ల పెంపకం రెండేళ్లుగా జోరందుకుంది. లాభదాయకంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 200 పైగా నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లోని ఫారాల్లో కోళ్లను పెంచి వారాంతంలో పట్టణాలకు, నగరాలకు తీసుకువచ్చి మార్కెట్లు, రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి లైవ్ కిలో రూ.600, చికెన్ రూ.700 ఉంటోంది. మటన్, నాటుకోడి ధరలు మార్కెట్లో దాదాపు ఒకేలా ఉంటున్నాయి. లేయర్ కోడి గుడ్డుతో పోలిస్తే నాటుకోడి గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఒక్కో గుడ్డు రూ.20 పలుకుతోంది. లాభసాటిగా ఉంది నాటుకోళ్లకు డిమాండ్ పెరగడంతో రెండేళ్ల క్రితం పశువుల మకాం వద్ద నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడిపుంజుకు రూ.75 వేలు, పెట్టకు రూ.12 వేలు వెచ్చించాం. పూర్తి ఆర్గానిక్ తరహాలో ఒక్కో బ్యాచ్ సిద్ధం కావడానికి ఎనిమిది నెలలు పడుతోంది. మా వద్ద పెంచిన కోళ్లను చికెన్ వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువెళుతుంటారు. నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంది. – పిల్లా విజయ్‌కుమార్, ఆర్గానిక్ నాటుకోళ్ల రైతు, పాలతోడు చదవండి: ప్రకాశం జిల్లా: 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
అది బర్డ్‌ఫ్లూ కాదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కోళ్లు చనిపోయిన ఘటనలపై పశు సంవర్థక శాఖ స్పందించింది. కోళ్లు చనిపోయింది బర్డ్‌ఫ్లూ వల్ల కాదని స్పష్టం చేసింది. వారం రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో 35 కోళ్లు చనిపోయాయని, అయితే పోస్టుమార్టంలో అవి రానికేట్ వ్యాధి వల్ల చనిపోయినట్టు తేలిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్ శుక్రవారం ‘సాక్షి’కి వెల్లడించారు. అవి కూడా ఒకే రోజు చనిపోలేదని, వారం రోజుల పాటు రోజుకు 5–10 చొప్పున చనిపోయినట్లు తేలిందని చెప్పారు. దీంతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ కోళ్లఫారంలో వ్యక్తిగత కారణాలతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని కోళ్లను చంపేశారని, పోస్టుమార్టంలో కూడా వాటిని చంపినట్లు తేలిందని ఆయన చెప్పారు. అసలు రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. (చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?) అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయని, శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరుపుతున్నాయని స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామంలో కొన్ని కోళ్లు చనిపోయిన సంఘటనపై విచారణ చేయగా విష ప్రయోగం వల్ల అవి చనిపోయాయని, ఈ మేరకు పోలీసు కేసు కూడా నమోదయినట్లు తమకు నివేదిక అందిందని ఆయన వివరించారు. ఇక మెదక్‌జిల్లా మునుపల్లి గ్రామంలో ఏడు నెమళ్లు చనిపోగా, అధికారులు పోస్టుమార్టం చేయించారని.. వాటి కడుపులో ఎక్కువ మొత్తంలో వడ్లు కనిపించాయని, పురుగు మందు మోతాదు ఎక్కువగా ఉన్న వడ్ల కారణంగానే నెమళ్లు చనిపోయినట్లు తేలిందని రాంచందర్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ప్రవేశించలేదని, ఆందోళన చెందవద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అనవసరపు ప్రచారాల గురించి భయపడొద్దని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
నల్లకోళ్ల పేరుతో రూ.50 లక్షల కుచ్చుటోపీ
సాక్షి, పీలేరు: నల్లకోళ్లు..అస్సలు ఖర్చులేదు..ఈ కోళ్ల వ్యాపారం చేస్తే డబ్బే..డబ్బు..మార్కెట్లో డిమాండ్ మస్తు..మస్తు..అంటూ ఊరించిన ఓ ప్రబుద్ధుడు కుచ్చుటోపీ పెట్టాడు. పెంచితే 4 నెలల తర్వాత తానే కొంటానంటూ నమ్మించి, కోడిపిల్లల పేరిట మూడు జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసి ఎగనామం పెట్టాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం పీలేరు ప్రెస్‌క్లబ్‌లో వారు తెలిపిన వివరాలు..కలికిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా 5 నెలల నుంచి నివాసం ఉంటున్నానని, తాను ఎంహెచ్‌బీ కడక్‌నాథ్ కోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నానని, తనపేరు హరిప్రసాద్ అని పీలేరు, కలికిరి పరిసర ప్రాంతాల్లో కొందరు రైతుల్ని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఒక్కో కోడిపిల్లకు రూ.120 చెల్లిస్తే తమ సంస్థ నుంచి కోడిపిల్లలను తెప్పించి ఇస్తామని, ఆ కోడిపిల్లలను నాలుగు నెలల పాటు పెంచితే కిలో రూ.670 చొప్పున తిరిగి సంస్థ కొనుగోలు చేస్తుందని నమ్మించాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.ల„క్ష నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసి, ఖాళీ చెక్కులు ఇచ్చాడు. అయితే వారాలు గడచినా కోడి పిల్లలు ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఫోన్లో కోరితే దురుసుగా మాట్లాడుతుండడంతో విసిగి వేసారిన రైతులు ఈనెల 17న కలికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. (జన్మదినం రోజే బలవన్మరణం) పీలేరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బాధితులు చిత్తూరు జిల్లాతోపాటు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల వారినీ ఇలాగే అతడు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని, పోలీసు ఉన్నతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బాధితులు రవీంద్ర, మనోహర్‌రెడ్డి, సలీమ్, రాకేష్‌కుమార్, శివజ్యోతి, మనోజ్‌కుమార్, రామస్వామి, మల్లేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. కోటి బహుమతి
సాక్షి, సేలం: కోడి గుడ్డు, చికెన్ తినడం వలన కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎవరైనా తేలిస్తే వారికి రూ.కోటి బహుమతిని అందజేస్తామని గుడ్ల కోళ్ల సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి మంగళవారం వెల్లడించారు. మాంసం, కోళ్లు, కోడిగుడ్లకు ప్రసిద్ధి చెందిన నామక్కల్ జిల్లాలో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ స్థితిలో మంగళవారం తమిళనాడు గుడ్ల కోళ్ల సమ్మేళం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి, ఉపాధ్యక్షుడు వాగ్లీ సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రోజులుగా కరోనా భీతితో కోడి మాంసం, కోడి గుడ్లు వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రూ. 4.50 గా విక్రియిస్తున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్నారు. దీనికి కారణం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులే కారణం. ఇందులో కోళ్ల ఫారం యజమానులే కాకుండా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చదవండి: ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక రూ. 20 విక్రయించిన మొక్క జొన్నలు (కోళ్ల దానా) ఇప్పుడు రూ. 16 కు విక్రయిస్తున్న కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారు. నామక్కల్ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, పాఠశాలలు సెలవుల కారణంగా అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, వీటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత విక్రయించవచ్చా అని ఆలోచిస్తున్నామన్నారు. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిర్ధారిస్తే వారికి తమ సమ్మేళం తరఫున రూ.కోటి బహుమతి అందజేస్తామని తెలిపారు. అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాల్లో కూడా కోడి మాంసం, కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. అక్కడ కోడి మాంసం వలన ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఇక్కడ కరోనా వలన ఎలాంటి నష్టం లేకపోయినా కోడి మాంసం తినకూడదని, కోడి గుడ్లు తినకూడదని వదంతులు రావడంతో ఈ వ్యాపారం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లను నాశనం చేసే ఆలోచన మాకు లేదు. వాటిని దానా పెట్టకపోతేనే అవి గుడ్లుపెట్టవు. ప్రజలు వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది. చదవండి: రాష్ట్రంలో ఐదో కరోనా కేసు -
నాటుకోడి ధర అదరహో
మాంసం ప్రియుల ట్రెండ్ మారింది. ఇంటి పెరట్లో సహజ సిద్ధంగా పెంచుకునే నాటు కోళ్ల మాంసం రుచే వేరు. వీటి మాంసం గట్టిగా ఉండడంతో వండడానికి, తినడానికి ఇబ్బంది పడేవారు. రుచి లేకపోయినా మృదువుగా ఉండే బాయిలర్ కోడి మాంసానికి అలవాటు పడిన జనం ప్రస్తుతం నాటు కోడి మాంసం వైపు చూస్తున్నారు. వీటి ధరలు మటన్ రేట్లను మరిపిస్తున్నా.. కేజీ బాయిలర్ కోడి మాంసం కంటే.. అరకేజీ నాటుకోడి మాంసంతో సరిపెట్టుకుంటున్నారు. ఆదివారం అయితే నాటు కోళ్ల కోసం జనం బారులు తీరుతున్నారు. దీంతో పల్లెల నుంచి నాటు కోళ్లు తీసుకొచ్చి విక్రయించేవారు ఎక్కువయ్యారు. పాత బస్టాండ్ ప్రాంతం ఆదివారం నాటు కోళ్ల సంతను తలపిస్తోంది. సాక్షి, గూడూరు(నెల్లూరు) : ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, వాటి మాంసాన్ని ఆహారంగా తినేవారు. కాలక్రమంలో వాటిని పెంచడంలో ఇబ్బందులతో పెంచేవారే తగ్గిపోయారు. దీంతో పల్లెల్లో సైతం పుట్టగొడుగుల్లా చికెన్ సెంటర్లు వెలిశాయి. ఇలా కొన్నాళ్లకు ఆ రుచి వెగటేసింది. మళ్లీ నాటు కోడి మాంసం అంటూ అటూ పల్లెలతో పాటు ఇటు పట్టణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనూ, ఫంక్షన్ల్లో ‘నాటు కోడి మాంసం, రాగి సంగటి’ అనే కొత్త సంప్రదాయం వచ్చింది. నాటు కోళ్లకు గిరాకీ పెరగడంతో కొందరు పల్లెల్లో నాటు కోళ్ల పెంపకాలు చేపట్టారు. వ్యాపారులు అక్కడ నాటు కోళ్లను కొనుగోలు చేసి, పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మాంసం ప్రియులు నాటు కోళ్లను కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఈ క్రమంలో నాటు కోడి ఒకటన్నర కిలో ధర రూ.600 ఉంది. వ్యర్థాలు పోను అది సుమారు కిలో మంసం మాత్రమే వస్తుంది. దీంతో నాటు కోడి మాంసం మటన్ ధరకు సరితూగేలా పలుకుతోంది. -
పౌల్ట్రీ రైతు విలవిల
యాచారం: ఇటీవల భానుడి ప్రకోపానికి పౌల్ట్రీఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా చనిపోతున్నాయి. నిత్యం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోళ్లు పెంచుతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల మృత్యువాతను భరించలేక చిన్న, సన్నకారు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల చికెన్ ధరలు కిలో రూ. 200 దాటింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు చల్లదనం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో కోళ్లు చనిపోవడం పరిపాటిగా మారింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల తదితర మండలాల్లో వెయ్యి మంది రైతులు ఆయా మండలాల్లోని పీఏసీఏస్‌లు, వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు ఇంటిగ్రేషన్ పద్ధతిలో సుగుణ, స్నేహ, సీపీ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కోళ్లను పెంచుతున్నారు. ఆయా కంపెనీలు రైతులకు కోడిపిల్లలను సరఫరా చేయడంతో అవి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వచ్చే వరకు పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్నారు. కోడి పిల్లలకు కావాల్సిన దాణా, వైద్యం తదితరాలను కంపెనీ ప్రతినిధులే భరిస్తారు. కోళ్లు 40 నుంచి 45 రోజుల వయసు రాగానే రైతులు ఆయా కంపెనీలకే కోళ్లను విక్రయిస్తుంటారు. కిలోకు రూ. 22 నుంచి రూ.23 వరకు కంపెనీలు రైతులకు చెల్లిస్తున్నాయి. ఇలా డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో వెయ్యి మందికి పైగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ రైతు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా కోళ్లు చనిపోవడం(మొటాల్టీ)తో ఇంటిగ్రేటెడ్ రైతులతో పాటు స్వతహాగా ఫారాలు నిర్వహిస్తున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో ఫారంలో సగటున 20 నుంచి 30 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిత్యం లక్ష వరకు మృతి.. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో డివిజన్లోని ఆయా గ్రామాల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కోళ్లకు ఉపశమనం కలిగించడం కోసం రైతులు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం, గోనె సంచులు కట్టి నీళ్లను చల్లడం, పైకప్పులపై గడ్డి వేసి నీళ్లు పోయడం.. తదితర రక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. యాచారం, మంచాల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బోరుబావుల్లో భూగర్భజలాలు లేకపోవడంతో కోళ్లను కాపాడుకోవడం, వాటి దాహార్తి తీర్చడం కోసం రైతులు ఒక్కో ట్యాంటర్కు రూ. 800 నుంచి రూ. 1,500 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కోళ్ల పెరిగే 40 రోజుల్లోనే కేవలం నీటికే రూ. 40 వేల ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లేక పోవడంతో రైతులు చాలా మంది ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో కోళ్లు పెంచుతున్నారు. ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇక స్వయంగా కోళ్ల పెంపకం చేపడుతున్న రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వేలసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. చనిపోతున్న కోళ్లను పొలాల్లో గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. నష్టం రోజుకు రూ. కోటికి పైగానే ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆయా మండలాల్లో పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందికి పైగా రైతులు ఆయా పీఏసీఎస్‌లు, వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.100 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలిస్తే 10 వేల కోళ్ల పెంపకం చేస్తున్న రైతులకు 40 రోజులకు రూ. 60 వేల నుంచి రూ.80 వేలు, 20 వేల కోళ్ల పెంపకం చేసే రైతులకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. తద్వారా బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తుంటారు. అయితే, ఎండల తీవ్రతతో ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు మృతి చెందడంతో రైతులకు నిత్యం రూ. కోటికి పైగానే నష్టం వస్తోంది. ఇక జిల్లావ్యాప్తంగా అది రూ. 10 కోట్లకు పైమాటే. ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతే ఇంటిగ్రేషన్ సంస్థలు కోడి పిల్లల ఖర్చు భరిస్తాయే తప్పా, కోళ్ల పెంపకం ఉపయోగించే దాణా, వైద్యం ఖర్చులను రైతే భరించాల్సి ఉంటుంది. కోళ్లు చేతికి వచ్చే సమయంలో చనిపోతుండడంతో రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆయా మండలాల్లో రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఆపన్నహస్తం అందివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. చనిపోయిన కోళ్లను చూపిస్తున్న రైతు లిక్కి సుధాకర్‌రెడ్డి -
రాజకీయాల్లోకి రాకుంటే.. బిజినెస్‌మేన్ అయ్యేటోణ్ని
- పదేళ్ల పాటు పీడీఎస్‌యూలో.. - ఉద్యమ సహచారిణితో పెళ్లి - విప్లవ సినిమాలంటే ఇష్టం.. ఓ పది చూసుంటా.. - చిన్నప్పుడే శ్రీశ్రీ సభకు పోయినా - టెన్త్ క్లాస్‌లోనే జైలు కెళ్లినా - పన్నెండేళ్ళుగా తీరిక లేదు - రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరో తరగతిలోనే ఆయన పిడికిలెత్తాడు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అణిచివేత, అన్యాయాల్ని ఎదురించే ఉద్యమాలే పాఠాలుగా చదువుకున్నాడు. చీకటి రోజుల్లోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గొంతెత్తాడు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరుకు నడుం బిగించి పదో తరగతిలోనే జైలుకెళ్లాడు. పదేళ్లపాటు పీడీఎస్‌యూకు తిరుగులేని సారథ్యం వహించాడు. వామపక్ష పార్టీల చీలికలు పేలికలతో ఉద్యమబాట వీడాడు. సొంతంగా కోళ్ల పరిశ్రమను స్థాపించి కొత్త జీవితం ఆరంభించాడు. ఆరేళ్లపాటు పౌల్ట్రీ రంగం.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష.. టీఆర్ఎస్ నేతలతో ఏర్పడ్డ పరిచయాలు.. ఆయనను రాజకీయాల్లోకి రప్పించాయి. అదీ మొదలు తెలంగాణ ఉద్యమం ఆద్యంతం అనిర్వచనీయమైన పాత్ర పోషించారు. కేసీఆర్‌కు కుడి ఎడమ భుజంగా.. టీఆర్ఎస్ కార్యకలాపాలన్నింటా నమ్మినబంటుగా ఎదిగారు. వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినరికార్డును సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనే మంత్రి ఈటెల రాజేందర్. సాదాసీదాగా.. సౌమ్యునిగా.. అందరికీ అందుబాటులో ఉండే ఉద్యమనేతగా పేరుతెచ్చుకున్న ఈటెల ఇన్నర్వ్యూ ఈవారం ‘సాక్షి’ సండేస్పెషల్ ఈటెల రాజేందర్ పుట్టిన తేది : 1964 మార్చి 20 తల్లిదండ్రులు : ఈటెల మల్లయ్య-వెంకటమ్మ అన్న, తమ్ముడు : సమ్మయ్య, భద్రయ్య అక్కాచెల్లెళ్లు : అమృతమ్మ,నీలమ్మ,పూలమ్మ, శోభ, సుజాత విద్యార్హతలు : బీఎస్సీ భార్య : జమున, కుమారుడు నితిన్,కూతురు నీత ‘సదువంతా హాస్టల్. బతుకంతా ఘర్షణ. నిరంతరం ఉద్యమం.. పోరాటం. చిన్నప్పుడు నా ఇల్లే ఓ చిన్నపాటి లైబ్రరీ. ఎన్నో పుస్తకాలు. పన్నెండేళ్లుగా క్షణం తీరిక లేదు. ఒక్క పుస్తకం సదువలేదు. నిత్యం ఉద్యమాలు. రాజకీయాలు. ప్రజా జీవితంలోనే ఉన్నా. వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు.. ఆశయాలు.. నమ్ముకున్న సిద్ధాంతాలు.. ఇప్పుడవి నెరవేరుతాయా.. అంటే చెప్పలేను కానీ.. నాకైతే నమ్మకముంది. ఉద్యమాల ద్వారా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలకు ప్రజాకోణం ఉంటుంది. టీఆర్ఎస్కు అదే ప్రజాకోణం ఉంది. అందుకే ప్రజల ఆకాంక్షలు ఫలిస్తాయనే నమ్మకం నాకుంది..’ - ఈటెల రాజేందర్, ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి అన్నయ్యే స్ఫూర్తి ఊళ్లలో దొరతనం.. భూస్వామ్య పెత్తందారీ రాజ్యం.. అణిచివేత.. అన్యాయం.. అంటరానిత నం.. పేదరికం.. అవన్నీ నేను పుట్టి పెరిగిన పరిసరాలు. అందుకే చిన్నప్పటి నుంచే ఉద్యమబాట ఎంచుకున్నాను. నాకంటే వయసులో ఎనిమిదేళ్లు పెద్దయిన మా అన్న సమ్మయ్య అప్పటికే ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన టీచర్. అతనే నాకు స్ఫూర్తి. బాలసంఘా లు.. రాత్రి పాఠశాలలు.. ఊరి బాగోతాలు.. ఇవ న్నీ ఉద్యమంలో నా తొలి రోజులు. ఇంట్లో అమ్మానాన్నలకు తెలిసేది కాదు. ఇప్పుడు అమ్మ లేరు. మా నాన్నకు 95 ఏళ్లు. ఇంటి దగ్గరే ఉంటున్నారు. మేం తొమ్మిది మంది సంతానం. అయిదుగురు అక్కాచెల్లెళ్లు. ముగ్గురు అన్నాదమ్ముళ్లం ఉన్నాం. ఫస్ట్ గజ్వేలే.. పౌల్ట్రీ బిజినెస్‌లో ఉన్నప్పుడే స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ అవసరాలకు నావంతుగా సహాయ సహకారాలు అందించేటోన్ని. అప్పుడు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దేశ్‌పాండే రాధాకృష్ణ రాజకీయాల్లోకి రావాలని నన్ను ప్రోత్సహించారు. 2002లో పార్టీలో చేర్పించి కేసీఆర్‌కు పరిచయం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో వ్యాపారరీత్యా స్థిరపడటంతో అక్కణ్నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నా. అది రిజర్వుడు సెగ్మెంట్ కావటంతో కమలాపూర్ నుంచి పోటీకి దింపారు. మొదటిసారి పోటీ చేసేటప్పుడు సొంత నియోజకవర్గంతో నాకు పరిచయాలేమీ లేవు. పదో తరగతిలోనే.. చిన్నప్పుడే ఊరి నుంచి వెళ్లిపోవటంతో విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. డిగ్రీ వరకు హాస్టల్ చదువులే. కేశవ్ మెమోరియల్ స్కూళ్లో పదో తరగతి. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్. సైఫాబాద్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివాను. పదో తరగతిలో ఉన్నప్పుడే జైలుకెళ్లాను. మేం యాకుత్‌పురా హాస్టల్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ రూ.40. విద్యార్థులకు రోజుకు రూ.1.33 భోజన ఖర్చులకు చెల్లించేది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు అన్నీఇన్నీ కావు. కాలేజీల్లో, హాస్టళ్లలో సీటు దొరకటమే కష్టం. అప్పుడు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ మరిచిపోలేను. అడ్మిషన్లు, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తాను. అప్పుడు జైలుకెళ్లాల్సి వచ్చింది. అదీ మొదలు.. ఇంటర్లో రెండుసార్లు... డిగ్రీలో ఓసారి... 1986 నుంచి 1996 వరకు వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు నాలుగుసార్లు జైలుకెళ్లాను. ఇంటర్లో ఉన్నప్పుడే పీడీఎస్‌యూకు ఆలిండియా జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టాను. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్, కరీంనగర్లో రెండుసార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేను.. మంత్రిని కాకుంటే... పౌల్ట్రీ బిజినెస్‌మేన్ గా ఉండేటోన్ని. 2002లో టీఆర్ఎస్లో చేరాను. చిన్నప్పుడు ఉద్యమకారునిగా ఉండిపోవాలని అనుకున్నాను. చీలికలు పేలికలతో వామపక్ష పార్టీలు తలోదిక్కు అయ్యాయి. అందుకే ఉద్యమబాటను వీడాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి రాకుంటే బిజినెస్‌మేన్‌గా ఉండేటోన్ని. ఉద్యమ సహచరిణి నా సహచరి జమునారెడ్డి. 1989లో పెళ్లి చేసుకున్నాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నాం. జమునది నల్గొండ జిల్లా పలివెల. వాళ్ల కుటుంబీకులందరితో నాకు మంచి సంబంధాలుండేవి. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు నితిన్. పూణెలో బీబీఏ అయిపోయింది. కూతురు నీతా. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అడుగడుగునా కుటుంబీకుల ప్రోత్సాహం నా వెన్ను తడుతోంది. మరిచిపోలేను కమలాపూర్‌లో ఆరో తరగతి చదివే రోజులు. అప్పుడు ఎమర్జెన్సీ. చీకటి రోజులు. గొంతెత్తితే జైళ్లో పెట్టే రోజులు అవి. అప్పుడే మా స్కూల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను. మాటల్లోనే చీల్చి చెండాడాను. ఇప్పటికీ ఆ సంఘటన మరిచిపోలేను. 1973లో హుజూరాబాద్‌లోని కాలేజీ గ్రౌండ్లో శ్రీశ్రీ మీటింగ్ పెట్టాడు. శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమకాలం. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై జనాన్ని తట్టి లేపేందుకు నిర్వహించిన ఆ సభను చూసేందుకు మా ఊరి నుంచి అక్కడి దాకా వెళ్లాను. మా అన్న ఇంటర్మీడియట్ చదివే రోజులవి. అప్పుడు నేను ఇంకా స్కూల్ పిల్లగాణ్నే. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలప్పుడు చిన్నపిల్లలం. అప్పుడు ప్రచారం చేస్తున్న జనతా పార్టీకి డబ్బుల్లేవు. అప్పుడే జనతా పార్టీ తరఫున ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచారానికి మేం బూట్లు పాలిష్ చేశాం. అదొక్కటే బాధ వామపక్ష పార్టీలు చీలికలు.. పేలికలుగా విడిపోయిన సందర్భం నన్ను బాధపెట్టింది. ఆ తర్వాతే పీడీఎస్‌యూ నుంచి బయటకు వచ్చాను.