సాక్షి, సేలం: కోడి గుడ్డు, చికెన్ తినడం వలన కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎవరైనా తేలిస్తే వారికి రూ.కోటి బహుమతిని అందజేస్తామని గుడ్ల కోళ్ల సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి మంగళవారం వెల్లడించారు. మాంసం, కోళ్లు, కోడిగుడ్లకు ప్రసిద్ధి చెందిన నామక్కల్ జిల్లాలో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ స్థితిలో మంగళవారం తమిళనాడు గుడ్ల కోళ్ల సమ్మేళం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి, ఉపాధ్యక్షుడు వాగ్లీ సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రోజులుగా కరోనా భీతితో కోడి మాంసం, కోడి గుడ్లు వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రూ. 4.50 గా విక్రియిస్తున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్నారు. దీనికి కారణం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులే కారణం. ఇందులో కోళ్ల ఫారం యజమానులే కాకుండా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చదవండి: ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక
రూ. 20 విక్రయించిన మొక్క జొన్నలు (కోళ్ల దానా) ఇప్పుడు రూ. 16 కు విక్రయిస్తున్న కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారు. నామక్కల్ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, పాఠశాలలు సెలవుల కారణంగా అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, వీటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత విక్రయించవచ్చా అని ఆలోచిస్తున్నామన్నారు. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిర్ధారిస్తే వారికి తమ సమ్మేళం తరఫున రూ.కోటి బహుమతి అందజేస్తామని తెలిపారు.
అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాల్లో కూడా కోడి మాంసం, కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. అక్కడ కోడి మాంసం వలన ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఇక్కడ కరోనా వలన ఎలాంటి నష్టం లేకపోయినా కోడి మాంసం తినకూడదని, కోడి గుడ్లు తినకూడదని వదంతులు రావడంతో ఈ వ్యాపారం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లను నాశనం చేసే ఆలోచన మాకు లేదు. వాటిని దానా పెట్టకపోతేనే అవి గుడ్లుపెట్టవు. ప్రజలు వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది. చదవండి: రాష్ట్రంలో ఐదో కరోనా కేసు
Comments
Please login to add a commentAdd a comment