
నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) సరికొత్త ఫ్యాషన్‌తో అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ప్రముఖ డిజైనర్ మనీహ్ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్ చేసిన చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అద్భుతం అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ట్రెడిషన్ విత్ ట్రెండ్ అనేలా ఊర్మిళ మతోండ్కర్ మనీష్ మల్హోత్రా రోజ్ గోల్డ్ చీరలో ట్రెండీ లుక్‌లో అదిరిపోయింది. ఇందులో అనేక సీక్విన్లు ఉండటం విశేషంగా నిలిచింది. ఆరు గజాల చీర, అందమైన జాకెట్లు మాత్రమే కాదు, అంతకంటే భిన్నంగా అలంకరించుకుని ఆధునిక పద్ధతిలో స్టైలిష్‌గా కనిపించవచ్చు అని ఊర్మిళ రుజువు చేస్తోంది. మనీష్ మల్హోత్రా సిగ్నేచర్ స్టైల్‌లో ఊర్మిళ, చీరకు జతగా సాధారణ బ్లౌజ్‌ను వదిలివేసి, దానికి బదులుగా సమకాలీన కార్సెట్ టాప్‌ను ఎంచుకుంది. శరీరానికి సరిగ్గా అతుక్కునేలా శిల్పంలాటి ఆకృతిలో, నడుము ఒంపులను ప్రదర్శిస్తూ స్ట్రాప్‌లెస్ నంబర్ ఫిట్‌తో వచ్చింది. పల్లూను దుపట్టా లాగా వెరైటీగా చేతిపై కప్పుకుని ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెప్పింది. నడుము దగ్గర 3D పూల అప్లిక్ వర్క్ మొత్తం లుక్‌కు రొమాంటిక్ ఫ్లెయిర్‌ను జోడించింది.
షీర్ ఫాబ్రిక్ తో తయారు చేసిన చీరను అంచుల చుట్టూ మల్టీ సీక్విన్స్ తో షైనీగా ఉంది. అల్టిమేట్ కాక్‌టెయిల్ ఎంసెంబుల్ కోసం ప్రేరణ కోరుకునే ఫ్యాషన్ ఔత్సాహికులందరూ వావ్ అంటున్నారు. డైమండ్ ఆభరణాలు,తన జుట్టును వా లుగా వెనక్కి వదిలేసి10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి చీరలపై అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు. స్లిక్ లుక్‌లో స్టైల్ చేసింది. అటు మనీష్ మల్హోత్రా కూడా ఊర్మిళ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి ఇప్పటిదాకా చీరలపై తమ అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు.
కాగా బాలీవుడ్‌లో కర్మ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్మిళ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. కుర్రకారు మనసును ఇట్టే దోచేసింది. ఆ తరువాత అనగనగా ఒకరోజు, రంగీలా, సత్య చిత్రాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకుంది.తనకంటే వయసులో 10 ఏండ్లు చిన్నవాడు అయిన మోడల్ మోసిన్ అక్తార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ గత ఏడాది ఆమె భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ నుండి విడాకులకు దరఖాస్తు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.