
ష్యాషన్ క్వీన్ అనగానే గుర్తొచ్చే సీనియర్ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా, ఫ్యాషన్ ఐకాన్‌లా ఉంటారామె. ఆమె చీర కడితే ఆ చీరకే అందం. కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది. అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ సిగ్నేచర్ స్టైల్ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్‌లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్‌గా నిలిచింది. స్టైల్, గ్రేస్, డై-హార్డ్ లుక్స్‌తో ఫ్యాషన్‌కు, మెడ్రన్ స్టైల్‌కు వయస్సు పనేముందని నిరూపించిన వైనం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో లేడీ బాస్ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్‌లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్‌లో చిక్ లుక్‌లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్‌ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్ లెగ్ ట్రౌజర్‌తో జత చేసింది. బ్లాక్ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్‌గా వైట్ క్యాప్ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ను తెచ్చి పెట్టాయి. అలాగే ఒక అందమైన షాయరీని చదవి వినిపించడం విశేషం.

అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్‌గా, ఫ్రెష్‌గా లుక్‌తో మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఆమె స్టైల్‌ను ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025 వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్‌లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది.

ఆమె లుక్‌తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం, కళామతల్లిపై ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా పాపులర్ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment