IIFA Awards 2025
-
‘ఫ్యాషన్ ఐకాన్’ : 70 ఏళ్లు దాటితేనేం, ఆమే బ్యూటీ క్వీన్
ష్యాషన్ క్వీన్ అనగానే గుర్తొచ్చే సీనియర్ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా, ఫ్యాషన్ ఐకాన్‌లా ఉంటారామె. ఆమె చీర కడితే ఆ చీరకే అందం. కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది. అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ సిగ్నేచర్ స్టైల్ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్‌గా నిలిచింది. స్టైల్, గ్రేస్, డై-హార్డ్ లుక్స్‌తో ఫ్యాషన్‌కు, మెడ్రన్ స్టైల్‌కు వయస్సు పనేముందని నిరూపించిన వైనం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్లో లేడీ బాస్ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్‌లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్లో చిక్ లుక్‌లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్‌ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్ లెగ్ ట్రౌజర్‌తో జత చేసింది. బ్లాక్ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్‌గా వైట్ క్యాప్ ఆమె లుక్కు మరింత గ్లామర్‌ను తెచ్చి పెట్టాయి. అలాగే ఒక అందమైన షాయరీని చదవి వినిపించడం విశేషం.అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్‌గా, ఫ్రెష్‌గా లుక్‌తో మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఆమె స్టైల్‌ను ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025 వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa)ఆమె లుక్‌తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం, కళామతల్లిపై ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా పాపులర్ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. -
IIFA Awards 2025: 'లాపతా లేడీస్' చిత్రానికి 10 అవార్డ్స్
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేయగా.. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అయితే, ఈ బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ఉత్తమ చిత్రంతో పాటు ఏకంగా పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు.అవార్డ్స్ జాబితాఉత్తమ చిత్రం: లాపతా లేడీస్ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)ఉత్తమ నటి: నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)ఉత్తమ దర్శకులు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటి: జాకీ బోడివాలా (షైతాన్)ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని ( కిల్)ఉత్తమ నటి (తొలి పరిచయం): ప్రతిభా (లాపతా లేడీస్)ఉత్తమ విలన్: రాఘవ్ జాయల్ (కిల్)ఉత్తమ సంగీత డైరెక్టర్: రామ్ సంపత్(లాపతా లేడీస్)ఉత్తమ సింగర్ -మేల్: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370)ఉత్తమ సింగర్ - ఫిమేల్: శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3)ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్)ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్) -
ఐఫా 2025 అవార్డ్స్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు. జైపుర్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం మొదలయ్యాయి. చిత్రసీమకు చెందిన చాలామంది నటీమణులు ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్‌ను వినిపించారు. పరిశ్రమలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సినిమాకు సంబంధించి హీరోల్లాగే తాము కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఇక్కడ అందరం సమానంగా పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో నటులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని వారు ఆశించారు. ‘స్త్రీ2’ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిసిందే అంటూ బాలీవుడ్ కథానాయకులు తమ గళాన్ని వినిపించారు.సినిమా విభాగంఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలాఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)ఉత్తమ సహాయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)ఉత్తమ సహాయ నటుడు: దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)ఉత్తమ కథ ఒరిజినల్: కనికా ధిల్లాన్ (దో పట్టి)వెబ్ సిరీస్ విభాగంఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్- 3ఉత్తమ నటి (సిరీస్): శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)ఉత్తమ నటుడు (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ దర్శకుడు (సిరీస్): దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ సహాయ నటి (సిరీస్): సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)ఉత్తమ సహాయ నటుడు (సిరీస్): ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 View this post on Instagram A post shared by IIFA Awards (@iifa)