
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేయగా.. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అయితే, ఈ బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ఉత్తమ చిత్రంతో పాటు ఏకంగా పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు.
అవార్డ్స్ జాబితా
ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్
ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)
ఉత్తమ నటి: నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకులు: కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయనటి: జాకీ బోడివాలా (షైతాన్)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని ( కిల్)
ఉత్తమ నటి (తొలి పరిచయం): ప్రతిభా (లాపతా లేడీస్)
ఉత్తమ విలన్: రాఘవ్ జాయల్ (కిల్)
ఉత్తమ సంగీత డైరెక్టర్: రామ్ సంపత్(లాపతా లేడీస్)
ఉత్తమ సింగర్ -మేల్: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370)
ఉత్తమ సింగర్ - ఫిమేల్: శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3)
ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)
ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)
ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)
Comments
Please login to add a commentAdd a comment