అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్‌సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.
విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..
అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.
అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్‌సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment