Villain
-
శ్రీ ముకాంబిక ఆలయంలో జైలర్ విలన్ వినాయకన్, నటుడు జయసూర్య (ఫోటోలు)
-
పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం..డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది. -
వివాహా బంధంలోకి అడుగుపెట్టిన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ (ఫోటోలు)
-
మద్యం మత్తులో జైలర్ విలన్ అర్ధ నగ్నంగా హల్ చల్
-
నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కీలక పాత్రలో లాపతా లేడీస్ నటుడు!
అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఇతడు విలన్‌గా చేస్తే పాన్ ఇండియా హిట్ కన్ఫర్మ్!? (ఫొటోలు)
-
వర్త్ ...వర్మా వర్త్
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆదివారం కడపలో హల్చల్ చేసిన ఓ వ్యక్తిని చూసినవారు ఇది నిజమేనని ఆశ్చర్యపోయారు. జైలర్ సినిమాలో వర్మ పేరుతో నటించిన వినాయకన్ విలన్ ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. అన్నమయ్య జిల్లా చిన్నమండెంకు చెందిన మాజిద్ అచ్చు వినాయకన్లాగే కనిపించి హల్చల్ చేశాడు. బీడీలు తాగుతూ వర్మ వేషధారణలో హావభావాలు ప్రకటించాడు. దీంతో ప్రజలు అతని చుట్టూ చేరి జైలర్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘వర్త్.. వర్మా వర్త్’ అంటూ కేరింతలు కొట్టారు. – మహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప -
ప్రభాస్ 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు)
-
నాగార్జున ప్లాన్ వర్కవుట్ అవుతుందా.? నాగ్ ప్లాన్ ఏంటి.?
-
‘ధూమ్ 4’లో విలన్‌గా సూర్య.!
-
జైలర్ సినిమా విలన్ వినాయక్ అరెస్ట్
-
రజినీకాంత్ తో కయ్యానికి సిద్దమైన నాగ్..
-
హీరోగా మగధీర విలన్.. టీజర్ రిలీజ్ చేసిన రాజమౌళి!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్‌గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. Forever grateful to you @ssrajamouli garu 🙏🏼❤️#AhoVikramaarkaTeaser out now! - https://t.co/WIxYwyGxu7#AhoVikramaarka @iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini @SayajiShinde @BithiriSathi_ @prabhakalakeya @petatrikoti pic.twitter.com/V5bw3GKavM— Dev Gill (@iamdevsinghgill) June 20, 2024 -
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్‌గా ఉంటే..విలన్ నెగటివ్‌గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్‌గాను మారుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్ హీరోలపై ఓ లుక్కేయండి. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
మురికి కాలువ పక్క నిద్రించిన విలన్.. భార్య చనిపోతే డబ్బుల్లేక!
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఒకప్పుడు నటులు ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్ అజిత్ తనయుడు షెహజాద్ ఖాన్. అతడు మాట్లాడుతూ.. 'సూపర్ హిట్ మూవీ నయా డౌర్(ఈ మూవీకి అజిత్ సహాయక నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు) తర్వాత నాన్న కెరీర్ పతనం కావడం ప్రారంభమైంది. నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదు. ఏ పనీ చేయలేదు. హీరోల వల్లే నాన్నకు కష్టాలు.. ఇందుకు ప్రధాన కారణం.. హీరోలకున్న భయమే! నాన్న సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్ చేస్తాడో అని భయపడ్డారు. ఆయనతో పని చేస్తే తనకే గుర్తింపు వస్తుంది, తనకే అవార్డులిచ్చేస్తారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారు. అందుకని అవకాశాలివ్వలేదు. అలా ఎన్నో కష్టాలు చూశాడు. కెరీర్ ప్రారంభంలో అయితే అంతకన్నా ఎక్కువే చూశాడు. ఓరోజు ముంబైలో మొహమ్మద్ అలీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలువను చూపిస్తూ దీని పక్కనే పడుకున్నానని చెప్పాడు. ఆస్తులు లాక్కున్న బంధువులు హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో రోడ్డుపైనే నిద్రపోయానన్నాడు. తన కాలేజీ పుస్తకాలు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైకి వచ్చాడు' అని తెలిపాడు. మొదట్లో కష్టాలతోనే సావాసం చేసిన అజిత్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. 1960, 70వ దశకంలో టాప్ విలన్‌గా రాణించాడు. 1998లో మరణించాడు. కొంతకాలానికి ఆయన మూడో భార్య సారాకు క్యాన్సర్‌కు సోకింది. ఆ సమయంలో ఆమె వైద్య ఖర్చులు భరించడానికి షెహజాద్ అన్నయ్య ముందుకురాలేదట! ఆస్పత్రి బిల్లు కూడా కట్టలే! 'నాన్న పోయాక ఆయన కూడబెట్టిన డబ్బునంతా అన్నయ్య, బంధువులే పంచుకున్నారు. దీంతో అమ్మకు మంచి వైద్యం అందించడం నాకెంతో కష్టమైంది. అమ్మ చనిపోయినప్పుడు రూ.5000 ఆస్పత్రి బిల్లు కట్టడానికి కూడా అన్నయ్య నిరాకరించాడు. కానీ ఆమె ఆస్తులు, నగలు మాత్రం అన్నీ తీసుకున్నాడు' అని విచారం వ్యక్తం చేశాడు. కాగా షెహజాద్ అందాజ్ అప్నా అప్నా అనే సినిమాలో భల్లా అనే పాత్రతో ఫేమస్ అయ్యాడు. ఇతడు కూడా నటుడిగా రాణిస్తున్నాడు. చదవండి: సౌత్ ఇండస్ట్రీలో నటికి చేదు అనుభవం.. ఆఫీసుకు రమ్మని చివరకు.. -
ఎన్టీఆర్ విలన్ పాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉంది
-
మెచ్చుకున్నారే కానీ తెలుగులో అవకాశాలు ఇవ్వలేదు: విలన్
సంక్రాంతి పోటీ భలే రంజుగా మారింది. నాలుగు సినిమాలు పందెం కోళ్లలా బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇకపోతే రేపు (జనవరి 12న) గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతుండగా, సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ ఆ మరుసటి రోజున విడుదల కానున్నాయి. అయితే గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాల్లో విలన్‌గా నటించిన మధుసూదన రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. నాకు తెలియకుండానే సినిమా పూర్తి చేశాడు 'అమ్మది ఖమ్మం, నాన్నది ఒంగోలు. నేను పుట్టిపెరిగింది, చదువుకుందంతా కర్ణాటకలో! నన్ను విలన్‌గా గుర్తించిన డైరెక్టర్ దేవ్ కట్టా. ఆయన దర్శకత్వం వహించిన ఆటో నగర్ సూర్య సినిమా తర్వాత ఇక్కడ దశ మారుతుందనుకున్నాను. అందరూ అద్భుతంగా చేశావని చెప్పేవారే తప్ప అవకాశాలు మాత్రం ఎక్కువగా ఇవ్వలేదు. అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాను. నా భార్య శృతి కూడా విలన్‌గా యాక్ట్ చేసింది. మాకు ఇద్దరు కుమారులు సంతానం. ఓ కుమారుడు ప్రీతమ్ నాకు తెలియకుండానే సినిమా చేశాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే చిత్రంలో నటించాడు. అంతా అయ్యాక సినిమా చేశానని చెప్పడంతో షాకయ్యాను. తను కళ్ల ముందే ఎదుగుతున్నందుకు ఉప్పొంగిపోయి ఆనందంతో ఏడ్చేశాను. అయితే నా పేరు ఎక్కడా వాడకూడదని తనకు కండీషన్ కూడా పెట్టాను. కానీ . రోజంతా కష్టపడితే.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజంతా పని చేస్తే రూ.300 వచ్చేవి. కెప్టెన్ విజయ్‌కాంత్ అంటే చాలా ఇష్టం. ఆర్మీ నుంచి యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇన్నేళ్లలో వందల కోట్లు సంపాదించాననుకుంటారు. కానీ అంత సీన్ లేదు. లక్ష రూపాయలు వస్తే అందులో 30% జీఎస్టీ పోతుంది. నా మేనేజర్‌కు, మేకప్‌మెన్‌కు.. వారికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఎవరికైనా డబ్బు కావాలంటే సాయం చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషల్లో నటించాను. ఈసారి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చాడు మధుసూదనరావు. చదవండి: కమల్, శ్రీవిద్య లవ్‌స్టోరీ.. పెళ్లి చేసుకుంటానన్న కమల్.. కానీ! -
Ramachandra Raju-Jeest : తిరుమలలో కేజీఎఫ్ విలన్, బెంగాలీ స్టార్ నటుడు సందడి (ఫోటోలు)
-
Shine Tom Chacko Engagement: లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన దసరా విలన్.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
సిగ్గుండాలి.. 9 నెలలవుతున్నా డబ్బు ముట్టలేదు: డెవిల్ విలన్ ఫైర్
బింబిసార సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అయితే ఆ తర్వాత త్రిపాత్రాభినయంతో చేసిన అమిగోస్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఇతడు డెవిల్ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయదర్శకత్వంలో నిర్మించాడు. మొదట్లో అతడు.. తర్వాత ఇతడు ఈ సినిమా ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉంది. మొదట్లో ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు అని చెప్పారు. రిలీజైన పోస్టర్లోనూ అతడినే డైరెక్టర్‌గా ప్రస్తావించారు. తర్వాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం దర్శకుడి స్థానంలో అభిషేక్ నామా పేరును పెట్టేశారు. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటించిన యాక్టర్ మార్క్ బెనింగ్టన్ చిత్రయూనిట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. నాకు డబ్బులివ్వలేదు మార్క్ మాట్లాడుతూ.. 'డెవిల్ సినిమా షూటింగ్ మొదట్లో బాగానే జరిగింది. చివరి షెడ్యూల్ జరిగేటప్పుడు మాత్రం కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. నా పాత్ర షూటింగ్ అయిపోయి 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నాకు డబ్బులు ముట్టనేలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. అది నేను ట్రైలర్లో చూసి చాలా బాధపడ్డాను. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుంది' అని మండిపడ్డాడు. ఇలాంటి పని చేయడానికి కాస్తైనా సిగ్గుండాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లోనూ డెవిల్ నిర్మాతలపై ఫైర్ అయ్యాడు. మెంటల్ టార్చర్.. తాజాగా ఈ విషయంపై డెవిల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత మోహిత్ రాల్యాని స్పందించాడు. నటుడి పోస్ట్‌కు కామెంట్ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'నీ మేనేజర్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాం. అయినా కూడా ఇంకా డబ్బు కావాలంటూ మానసికంగా వేధిస్తున్నారు. నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిన విషయానికి వస్తే.. నువ్వు తెలుగు మాట్లాడగలవా? లేదు.. అలాంటప్పుడు ఇంగ్లీష్ డైలాగులకు నీ వాయిస్, తెలుగు డైలాగులకు వేరొకరి వాయిస్ ఎలా వాడగలం? అగ్రిమెంట్లో ఆ రూల్ లేదు.. పైగా మీడియాలో మా నిర్మాణ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా వార్తలు ప్రచారం చేయిస్తున్నావు. నీ వాయిస్ వాడలేదని మమ్మల్ని కించపరుస్తున్నావు. నీ మాటలు నమ్మిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాసేస్తున్నారు. అసలు అగ్రిమెంట్లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్ చెప్పాలన్న నిబంధనే లేదు. ఎప్పుడేం చేయాలనేది నిర్మాత ఇష్టం. మనం ఇలా అందరి ముందు గొడవపడుతుండటం అసహ్యంగా ఉంది. నీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయం నీక్కూడా తెలుసు. నీ నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఈ గొడవ సద్దుమణిగిందో మరేంటో కానీ కాసేపటి క్రితమే మార్క్ బెనింగ్టన్ డెవిల్ చిత్రయూనిట్‌ను తిడుతూ పెట్టిన పోస్టులను డిలీట్ చేశాడు. డెవిల్ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. చదవండి: ఏడాది తిరగకముందే భార్యకు కటీఫ్.. నాలుగోసారి ప్రేమలో మ్యూజిక్ డైరెక్టర్.. -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్‌గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్‌తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్‌గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్‌గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
4సార్లు జైలుకు.. ఎలుకలు పడ్డ పప్పు తిన్న టాలీవుడ్ విలన్ ఎవరంటే?
ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే నటుడు అజాజ్ ఖాన్. దురుసు వ్యాఖ్యలతో, డ్రగ్స్ వివాదంతో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఈయన కొద్ది నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. 2021లో డ్రగ్స్ కేసులో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా రెండున్నరేళ్లపాటు జైలుజీవితం గడిపాడు. మే 19న బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవల తన అనుభవాలను చెప్పుకొచ్చాడు. 400 మందికి నాలుగే బాత్రూమ్స్ 'ఈ రెండు సంవత్సరాలు నాకెంతో కష్టతరమైనవి. నేను నిజం మాట్లాడాను.. ఫలితంగా దగ్గరివాళ్లే నన్ను దూరం పెట్టారు. 26 నెలలపాటు నా కుటుంబానికి, అనారోగ్యంతో ఉన్న నా తండ్రికి దూరంగా ఉన్నాను. నా కుటుంబం కోసం నన్ను ఇంకా బతికే ఉంచినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదంటే.. ఎండిపోయిన చపాతీలు, రాళ్ల అన్నం తినేవాడిని. 400 మంది ఖైదీలకు నాలుగంటే నాలుగే బాత్రూమ్స్ ఉండేవి. బయటకు వచ్చాక సాధారణ జీవితానికి అలవాటు పడటానికి నెల రోజులు పట్టింది. ఒకరిపై మరొకరు పడుకుంటారు మంచి ఆహారం తీసుకోవడం, శుభ్రమైన బాత్రూమ్లో స్నానం చేయడం.. ఇంకా కొత్తగానే ఉంది. జైలులో ఎలుకలు, పురుగులు పడ్డ పప్పునే తిన్నాను. పురుగులు, కీటకాలతోపాటు నేలపై పడుకునేవాడిని. ఇక్కడ జైళ్లు ఎంత రద్దీగా ఉంటాయంటే.. స్థలం లేక ఒకరిపై మరొకరు పడుకుంటారు. 800 ఖైదీల సామర్థ్యం ఉన్న జైల్లో 3000 మందిని కుక్కుతారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు కూడా ఓ కేసులో జైలుకు వచ్చాడు. కానీ ఏమైంది? సింపుల్‌గా బయటపడ్డాడు. అతడికి, రాజ్‌కుంద్రాకు నేను జైలులో సాయం చేశాను. అయినా ఇప్పుడు దేని గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఒకటే ఆశిస్తున్నాను. నేను నటుడిని, నాకు పనివ్వండి.. నా కుటుంబాన్ని పోషించుకోవాలి' అని అర్థిస్తున్నాడు అజాజ్ ఖాన్. నాలుగుసార్లు కటకటాలపాలు అజాజ్ ఖాన్‌ను తొలిసారి డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 2019 జూలైలో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను అప్లోడ్ చేసినందుకు 2020 ఏప్రిల్‌లో మరోసారి అరెస్టు చేశారు. ఇన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఈ నటుడు 2021 డ్రగ్స్ కేసులో మరోసారి కటకటాలపాలయ్యాడు. ఈసారి మాత్రం కఠిన కారాగార శిక్ష ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది మే 19న బెయిల్‌తో బయటకు వచ్చాడు. అజాజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. అజాజ్ ఖాన్.. లకీర్ కా ఫఖీర్, అల్లా కీ బండే, హై తుజే సలాం, ఫర్కీ రిటర్న్స్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్లో రక్త చరిత్ర, దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేశాడు. అలాగే బుల్లితెరపై.. దివ్య ఔర్ బాతీ హమ్, మట్టి కీ బన్నో, కారమ్ ఆప్నా ఆప్నా.. వంటి అనేక సీరియల్స్‌లో నటించాడు. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 8వ సీజన్లో కూడా కనిపించాడు. చదవండి: ఇస్రో ప్రయోగం.. దేశానికి మీరు గర్వకారణం: మహేశ్‌బాబు -
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ విలన్.. భార్యకు మాత్రం హీరోనే అంటూ!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా పేరు గడించిన నటుడు కబీర్ దుహాన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌తో ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ.. 'జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, నా అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు నా భార్య సీమకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితంలో నేను బెస్ట్ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను సీమాను కలిసిన క్షణంలోనే తనే నా అర్ధాంగి అనిపించింది. నన్ను, నా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం కలిగింది. తను ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. నేనెప్పుడూ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అదే నిజమైంది. తనతో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు కాగా హర్యానాలో పుట్టి పెరిగిన కబీర్ దుహాస్ సింగ్ మొదట మోడల్‌గా పని చేశాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్ సినిమాలో తన సత్తా చూపించి టాలీవుడ్‌కు ఒక కొత్త విలన్ దొరికాడని అందరూ అనుకునేలా చేశాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులనూ భయపెట్టాడు. ఈ రెండు భాషల్లోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేస్తున్నాడు. సౌత్‌లో విలన్‌గా అదరగొడుతున్న అతడు ఇటీవల వచ్చిన శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు. -
బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్స్టాప్.. పెళ్లికి టాలీవుడ్ విలన్ రెడీ!
జిల్, కిక్ 2, స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కబీర్ దుహాన్ సింగ్. హర్యానాలో పుట్టి పెరిగిన అతడు మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్ సినిమాతో తన సత్తా చూపించి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయాడు. వేదాళం సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులనూ విలన్‌గా భయపెట్టాడు. తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. సౌత్‌లో విలన్‌గా రఫ్ఫాడిస్తున్న ఇతడు ఇటీవలే శాకుంతలం సినిమాలో అసుర రాజుగా మెప్పించాడు. తాజాగా కబీర్ పెళ్లికి బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన యువతిని పెళ్లాడబోతున్నాడట! జూన్ 23న హర్యానా సూరజ్ఖండ్లోని గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు, ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ శుభకార్యం జరగనుంది. ఈ రోజు మెహందీ ఫంక్షన్‌తో పెళ్లి సంబరాలు షురూ కానున్నాయట! శుక్రవారం పెళ్లయిపోగానే అదే రోజు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీప్రముఖులు సైతం హాజరు కానున్నారట! కాగా కబీర్ పెళ్లాడబోయే అమ్మాయి సీమా చాహల్ అని, తను వృత్తి రీత్యా టీచర్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kabir Singh Duhan (@kabirduhansingh) చదవండి: ప్రేమలో అదే పెద్ద సమస్య: రకుల్ ప్రీత్ సింగ్ -
హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు
తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో కలిపి 300కు పైగా చిత్రాల్లో నటించాడు శరత్ సక్సేనా. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటిన ఆయన టాలీవుడ్లో ఘరానా మొగుడు, ఎస్పీ పరశురాం, సింహాద్రి, బన్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కెరీర్ మధ్యలో బాలీవుడ్‌ను పక్కన పెట్టి సౌత్ ఇండస్ట్రీలో బిజీ అయిన ఆయన అందుకు గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరోల ఇంట్రడక్షన్ సీన్లో కొట్టించుకోవడమే పని.. ముంబైలో నాకు మంచి పని దొరకడం లేదు, అందుకే సౌత్‌లో పని చేస్తున్నాను. అక్కడ నాకు కేవలం ఫైట్ సీన్లు మాత్రమే ఇచ్చేవారు. పొద్దున్నే లేచి అద్దం ముందుకు వెళ్లి చూసుకుంటే నాపై నాకే అసహ్యం కలిగేది. ఎందుకంటే ఇప్పుడు రెడీ అయి సెట్స్‌కు వెళ్లగానే హీరోలతో దెబ్బలు తినాలి. అందుకే నా ముఖం కూడా నాకు నచ్చేది కాదు. చాలామటుకు హీరోలను పరిచయం చేసే సీన్లో మమ్మల్ని ప్రవేశపెడతారు. అప్పుడు అతడు వచ్చి మమ్మల్ని చితకబాది హీరో అవుతాడు. గత 30 ఏళ్లుగా ఇదే నా పని. చిరంజీవిని కలిశా.. ఒకరోజు నేను హిందీలో సినిమాలు మానేద్దామనుకున్నా.. నా భార్యను మనదగ్గర డబ్బుందా? అని అడిగాను. ఉంది, దానితో ఏడాదిపాటు బతికేయొచ్చు అని చెప్పింది. ఆరోజు నుంచే నేను హిందీ సినిమాలు మానేశాను. కానీ దేవుడి దయ వల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్న రెండు, మూడు రోజులకే కమల్ హాసన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. గుణ(1991) సినిమాలో నాకు మంచి పాత్రతో పాటు అందుకు సరిపోయే డబ్బు కూడా ఇచ్చారు. హిందీలో గూండా రాజ్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవిని కలిశా. అలా తెలుగులోనూ వర్క్ చేశాను. పది, పదిహేను చిత్రాలు చేశాను. నాగార్జునతోనూ కలిసి పని చేశా. మలయాళంలో ప్రియదర్శన్‌తో కలిసి ఐదారు సినిమాల్లో నటించాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరో విజయ్‌ది రియల్ హెయిరా? విగ్గా? క్లారిటీ ఇదే! -
ఫస్ట్ సినిమాకే లక్ష అడిగా... కానీ చిరంజీవి..: పొన్నంబలం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోని అందరు సూపర్స్టార్లతో ఫైట్ చేశాడు పొన్నంబలం. విలన్‌గా తన లుక్స్‌తోనే భయపెట్టించే అతడు సినిమాల్లో రాక్షసాన్ని చూపించేవాడు. విలన్‌గా సినిమాల్లో ఇతరుల జీవితాలను మట్టుబెట్టేందుకు ప్రయత్నించేవాడు. కానీ నిజ జీవితంలో మాత్రం అతడి సొంత తమ్ముడే పొన్నంబలం పాలిట విలన్ అయ్యాడు. అతడికి తెలియకుండా స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నాడు. ఈ విషయం అతడికి తెలిసే సమయానికే తన రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతడికి ఆర్థిక సాయం చేయడంతో వెంటనే చికిత్స చేయించుకుని తిరిగి కోలుకున్నాడు. లక్ష ఇస్తేనే ఫైట్.. తాజాగా పొన్నంబలం అప్పటి దీనమైన పరిస్థితితో పాటు తన మొదటి సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'జిమ్నాస్టిక్స్ నేర్చుకుని అందులో పర్ఫెక్ట్ అయ్యాను. తమిళంలో సినిమాలు చేస్తున్నప్పుడు నాకు తెలుగులో ఘరానా మొగుడు సినిమా ఆఫర్ వచ్చింది. ఇక్కడ అదే నా తొలి చిత్రం. అయితే ఎవరు లక్ష రూపాయలు ఇస్తారో వాళ్లతోనే సోలో ఫైట్ చేస్తానని చెప్పాను. మా ఫైట్ మాస్టర్ వచ్చి ఒక్క ఫైట్‌కే లక్ష అడుగుతావేంటి? అని ఆశ్చర్యపోయాడు. ఘరానా మొగుడు టీమ్ మాత్రం అంత గొప్పగా ఫైట్ చేస్తాడా? చూద్దాం.. అని నన్ను పిలిపించారు. ఏంటి, లక్ష అడుగుతున్నావని అడిగారు. చిరంజీవి గిఫ్ట్.. సర్, మీరు నాకు డబ్బులు ఇవ్వొద్దు.. ఫైట్ చేశాక బాగా వస్తేనే లక్ష ఇవ్వండి అని చెప్పాను. నాలుగు రోజులు ఫైట్ సీన్ షూట్ జరిగింది. బాగా చేశానని మెచ్చుకుని రూ.1 లక్ష ఇచ్చారు. ఘరానా మొగుడు 175 రోజులు ఆడింది. తర్వాత ఓసారి ఆఫీస్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే డబ్బులిచ్చారు. నెక్స్ట్ సినిమా కోసం ఇచ్చారేమో అనుకున్నాను. తీరా ఆ డబ్బులు లెక్కపెడ్తే రూ.5 లక్షలున్నాయి. పొరపాటున వేరేవాళ్లకు ఇవ్వాల్సింది నాకిచ్చారేమోనని కాల్ చేస్తే చిరంజీవి ఇచ్చారని చెప్పారు. ఘరానా మొగుడు సినిమాకు అంత డబ్బు గిఫ్ట్‌గా ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు. నాకోసం అరకోటి దాకా ఖర్చు.. తమ్ముడు విషప్రయోగం చేసిన సంఘటన గురించి మాట్లాడుతూ.. 'నా ఎదుగుదల ఓర్వలేక సొంత తమ్ముడే ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. అది తెలియక వాడిని నమ్మి ఉద్యోగం కూడా ఇచ్చాను. కానీ నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్నే చంపాలని చూశాడు. స్లో పాయిజన్ వల్ల రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆ సమయంలో చిరంజీవి నన్ను కాపాడాడు. ఆ భగవంతుడు చిరంజీవి రూపంలో వచ్చి సాయం చేశాడు. చిరంజీవి కోడలు ఉపాసన కూడా ఫోన్ చేసి మాట్లాడింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం చిరంజీవి దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చుపెట్టాడు' అని తెలిపాడు. చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? ఆమె రియాక్షన్ ఇదే! -
అలాంటి పాత్రలు చేసి నిరాశ పర్చను: ఏజెంట్ విలన్
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈనెల 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో అందరి దృష్టి మాత్రం అతనిపైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారాయన. ఇంతకీ అతనేవరో తెలుసుకుందాం. డినో మోరియా గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఏజెంట్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ది గాడ్ అలియాస్ ధర్మ పాత్రలో అదరగొట్టారు. బాలీవుడ్‌లోనూ వెబ్ సిరీస్ ది ఎంపైర్‌లో ఆయన చివరిసారిగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డినో మోరియా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) డినో మోరియా మాట్లాడుతూ.."నిజం చెప్పాలంటే.. నేను ఇక్కడ ఏదో చేయాలని వచ్చా. నాకు బాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. నాకు వస్తున్న పాత్రలు నాకు నచ్చడం లేదు. ఒకవేళ వాటికి నేను ఒప్పుకుంటే నా అభిమానులు నిరాశకు గురవుతారు. 'ఏంటి నువ్వు ఇలాంటి పాత్రలు చేస్తున్నావా? అని ప్రశ్నిస్తారు. నా కెరీర్‌ని ఐదడుగులు వెనక్కు లాగే క్యారెక్టర్స్ కాకుండా.. ఒక్క అడుగు ముందుకు వేసే మంచి పాత్రలను ఎంచుకోవాలి. ఏజెంట్ మూవీ షూటింగ్‌పై తన అనుభవాలను పంచుకున్నారు. డినో మాట్లాడుతూ.. 'ఒమన్‌లో షూటింగ్ చాలా సవాళ్లతో కూడుకున్నది. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో 4 పొరల దుస్తులు ధరించి ఎండలో నటించా. ఆ సమయంలో తాము ఉడికిపోయినట్లు అనిపించింది. అయినా కూడా షూటింగ్ పూర్తి చేశాం. నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి సాహసోపేతమైన పాత్రతో తెలుగు అరంగేట్రం చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీలయ్యా.' అని వెల్లడించారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) కాగా.. డినో 1999లో ప్యార్ మే కభీ కభీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కందుకొండైన్ కందుకొండైన్, జూలీ, సోలోతో సౌత్ సినిమాల్లో నటించారు. ఏజెంట్ మూవీ షూటింగ్ బుడాపెస్ట్, హైదరాబాద్, ఒమన్‌లో జరిగింది. -
ఇండియన్ సినిమాలు... ఫారిన్ విలన్లు!
భారతీయ కథలు ఇప్పుడు దేశీ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విదేశీ ఫైట్ మాస్టర్స్ ఇండియన్ సినిమాలకు ఫైట్స్ కంపో జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ ఆర్టిస్టులు కూడా అరంగేట్రం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించారు. అంతకుముందు అమీ జాక్సన్ వంటి తారలు కూడా వచ్చారు. ఇప్పుడు ఫారిన్ విలన్లు వస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చి న ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కమల్– శంకర్ కాంబోలోనే సెట్స్‌పై ఉన్న ఈ సీక్వెల్లో ముంబై బేస్డ్ బ్రిటిష్ యాక్టర్ బెనెడిక్ట్ గారెట్ ఓ కీ రోల్ చేశారు. ఆల్రెడీ ఆయన క్యారెక్టర్ తాలూకు షూటింగ్ కూడా పూర్తయింది. ‘‘ఇండియన్ 2’లో నా వంతు షూటింగ్‌ను పూర్తి చేశాను. అద్భుతమైన అనుభవం దక్కింది. ఈ సినిమా తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు బెనెడిక్ట్. కాగా ఈ చిత్రంలో బెనెడిక్ట్ది విలన్ రోల్ అనే ప్రచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక కోలీవుడ్‌లో సుమారు ఆరేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లి ఇంకా రిలీజ్‌కు నోచుకోని చిత్రం ‘ధృవనక్షత్రం’. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ఇది. గతంలో ఆగిపో యిన ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవలే మళ్లీ ఆరంభించారు. ‘ఇండియన్ 2’లో నటించిన బెనెడిక్ట్ గారెట్ ఈ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ యాక్టర్ డేనియల్ కాల్టాగిరోన్ ఓ ప్రధాన పాత్రపో షిస్తున్నారు. ఆయనది ప్రతినాయకుడి పాత్ర అని కోలీవుడ్ టాక్. ఇక ‘తంగలాన్’ విడుదల తేదీపై త్వరలోనే సరైన స్పష్టత రానుంది. ఇలా... రానున్న రోజుల్లో మరికొందరు ఇంగ్లిష్ యాక్టర్స్ ఇండియన్ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. -
కొడుకు చనిపోయినా షూటింగ్లో పాల్గొన్నా: వాల్తేరు వీరయ్య విలన్
సినిమాలో విలనిజం బాగా పండితేనే హీరోయిజం ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. అందుకే సినిమాల్లో హీరోలెంత ముఖ్యమో విలన్లు కూడా అంతే ముఖ్యం. ఇక ఫైట్ సీన్లలో వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంత కష్టమైనా పడతానంటున్నాడు విలన్ రెమో అలియాస్ రహీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విలన్‌గా రాణిస్తున్నాడు రెమో. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించాడు. 18 ఏళ్లలో దాదాపు ప్రధాన హీరోలందరితోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండేది. వెంకీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పొద్దున్నుంచి రాత్రివరకు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. నన్ను గమనించిన రవితేజ.. టెర్రరిస్టువా? ఏంది? అలా చూస్తున్నావని అడిగితే యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాను. సినిమాలు చేయాలంటే మంచి బాడీ ఉండాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పాడు. నేను ఏడ్చుకుంటూ వెళ్తుంటే రవితేజ పిలిచి తన నెంబర్ ఇచ్చాడు. ఫిట్‌గా అయి, యాక్టింగ్ నేర్చుకున్నాక ఫోన్ చేయమన్నాడు. ఆ నెంబర్ వల్లే నేనీ స్థాయికి వచ్చాను. మహేశ్‌బాబు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశా. డీజే షూటింగ్లో ఓ ఫైట్ సీన్లో అల్లు అర్జున్‌కు, నాకు గాయాలయ్యాయి. నేను బాగా కష్టపడ్డానని నన్ను పోస్టర్లలో వేయించారు. ఆ పోస్టర్ వైరల్ అవడంతో తర్వాత 35 సినిమాలు చేశా. పుష్ప 2లో ఆయనతో మళ్లీ కనిపిస్తా. మొదటిసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తున్నా. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చింది. కాకపోతే అప్పుడు నా జీవితంలో ఓ విషాదం జరిగింది. నా భార్య, బాబుకు ఆరోగ్యం బాలేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేశాను. బాబును ఐసీయూలో ఉంచారు. ఆరోజు నన్ను వాల్తేరు వీరయ్య షూటింగ్‌కు పిలిచారు. వెళ్లకపోతే ఛాన్స్ మిస్ అవుతుందేమోనన్న భయంతో వెళ్లాను, డైలాగ్స్ చెప్పాను. ఇంతలో బాబు చనిపోయాడంటూ ఫోన్ కాల్.. ఫస్ట్ డే షూటింగ్... ఉండాలా? వెళ్లిపోవాలా? అర్థం కాలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లాను. నెక్స్ట్ డే కూడా సెట్స్‌కు వెళ్లాను' అంటూ విషాద ఘటనను పంచుకున్నాడు విలన్ రెమో. చదవండి: యాంకరింగ్‌కు బ్రేక్? స్పందించిన బ్రేక్ -
మరోసారి విలన్‌గా బాహుబలి కట్టప్ప సత్యరాజ్
తమిళ సినిమా: తొలి రోజుల్లో ప్రతి నాయకుడిగా దుమ్ము రేపిన నటుడు సత్యరాజ్ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి స్టార్ హీరోగా రాణించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బిజీ అయ్యారు. విలన్ పాత్రలు చేయనని చెప్పిన సత్యరాజ్ తాజాగా అలాంటి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈయన డేర్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం అంగారకన్. నటుడు శ్రీపతి కథానాయకుడిగా పరిచయం అవుతూ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ అధికారి అయిన ఈయన సినిమాపై ముఖ్యంగా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారు. మోహన్ డచ్చు ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మలయాళ నటి నియా కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నటుడు అంగాడితెరు మహే‹Ù, రైనాకారత్, రోషన్, అప్పు కుట్టి, దియా, నేహా రోస్, గురుచంద్రన్, కేసీపీ ప్రభాత్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలియన్, జెరోమా ఇంటర్నేషనల్ పతాకంపై జోమోన్ పిలిప్, జీవా జోమోన్ నిర్మిస్తున్నారు. కె కార్తీక్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆర్.కలైవానన్ జాగ్రహం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ముమ్మరంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అన్నివర్గా ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల వసూళు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై కొందరు బ్రిటిష్ నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసిన చూపించారంటూ విమర్శలు రావడంతో తాజాగా వాటిపై స్పందించారు జక్కన్న. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. ఈ సినిమాలో బ్రిటిషన్లని విలన్లుగా చూపించినంత మాత్రాన బ్రిటిషర్స్ అందరూ విలన్స్ అయిపోరని, ఒకవేళ అందరూ అలాగే అనుకుంటే బ్రిటన్‌లో ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించేది కాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ‘స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వచ్చే గమనిక(డిస్ల్కైమర్) అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది ఓ సినిమా కథ మాత్రమే. పాఠం కాదు. ఈ విషయం సినిమాలో నటించిన నటీనటులందరికీ తెలుసు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా విషయం అర్థమై ఉంటుంది. అయితే.. ఓ స్టోరీ టెల్లర్గా ఈ విషయాలన్నీ అవగాహన ఉంటే.. వేరే విషయాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు’ అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! ఒక ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ సినిమాను.. సినిమాగానే చూడాలని, అప్పుడే దాన్ని ఎంజాయ్ చేయగలుగతారంటూ జక్కన్న సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్స్‌కు పంపకుండా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతి చిత్రం ఛైలో షోను నామినేట్ చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అమెరికాలో ఆర్ఆర్ఆర్ను డిస్ట్రిబ్యూట్ చేఇసన వేరియల్స్ ఫిలిం సంస్థ ఆర్ఆర్ఆర్ ఆస్కాన్ నామినేషన్స్‌కు పరిశీలించాలని ఆకాడమిని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తోంది. -
మహేశ్ కోసం ‘కోబ్రా’ విలన్‌ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ 2015లో మాలీవుడ్‌లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్‌ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. -
పూరీ కంటే చార్మీ ఎక్కువ కష్టపడింది: లైగర్ విలన్
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్' ఆగస్ట్ 25న విడుదల కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన నటుడు విష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన పంచుకున్న లైగర్ చిత్ర విశేషాలివి.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మీ ప్రయాణం? పూరీ గారిని కలవక ముందే ఆయన సినిమాలకు అడిక్ట్ అయ్యాను. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయన్ని కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా చేద్దామని అప్పుడే లైగర్ ఐడియా చెప్పి టచ్ లో వుందామని చెప్పారు. ఎట్టకేలకు లైగర్ తో నా కల తీరింది. పూరి గారు, విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ .. ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా. పూరి కనెక్ట్స్ సిఈవో ఎలా అయ్యారు? పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశాను. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్, సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి సిఈవోని చేశారు. విజయ్, మైక్ టైషన్ లాంటి బలమైన పాత్రల మధ్య మీ రోల్ ఎలా ఉండబోతుంది? విజయ్, నా పాత్రల మధ్య శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. లైగర్‌లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైషన్ గుర్తుకువస్తారు. ఆయన కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది. మైక్ టైసన్ నుంచి ఏం నేర్చుకున్నారు ? చిన్నప్పటినుంచి మైక్ టైసన్‌కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో ఆయన అంత స్వీట్‌గా ఉన్నారు. నీకు సంతోషాన్ని ఇచ్చేదే చెయ్ అని చెప్పేవారు. మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? పూరి గారిదే. అయన రెబల్. ఆయనకి సరిహద్దులు వుండవు. పరిమితులు ఎప్పుడూ పెట్టుకోరు. నేను కూడా ఆయనలానే లిమిట్స్ పెట్టుకోను. అయితే మైక్‌ని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి చార్మీగారు ఎక్కువ కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. మిగతా స్పోర్ట్స్ డ్రామాలకు లైగర్ కు వున్న ప్రత్యేకత ఏమిటి ? లైగర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. లైగర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అలాగే మైక్ టైసన్ కూడా మీరు గమనిస్తే బాక్సింగ్ రింగ్ లో కనిపించరు. కౌబాయ్ గెటప్ లో వున్నారు. ఆయన కమర్షియల్ పాత్రలో కనిపిస్తారు. కరణ్ జోహార్ సినిమా చేస్తున్నారా? లైగర్ ట్రైలర్ రిలీజైన తర్వాత రోజే కరణ్ జోహార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నరేషన్ గురించి రమ్మన్నారు. అలాగే తమిళ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. పూరీ గారితో చెప్పాను. ట్రైలర్ లో ఒక్క గ్లింప్స్ కే ఇలా వుంటే సినిమా విడుదలైన తర్వాత ఎలా వుంటుందో చూడు అన్నారు. పూరి గారు నా గురువు. ఆయనతో అన్నీ పంచుకుంటా. ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా జరిగింది? ఇంటర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశాను. ఈ ప్రయాణం అంత తేలికగా జరగలేదు. చాలా ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ? మాది చేవెళ్ళ దగ్గర కడుమూరు. అయితే పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. నాన్న వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ హోం మేకర్. ఇద్దరు సిస్టర్స్ విదేశాల్లో వున్నారు. నేను పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమాను మా ఫ్యామిలీకి అంకితం చేస్తున్నా. నెగిటివ్ పాత్రలు చేయడానికే ఇష్టపడతారా ? నటుడిగా అన్ని పాత్రలు చేస్తాను. నేను ఒక తెల్లకాగితం. దర్శకుడు దానిపై ఏది రాస్తే అది అవుతా. వెబ్ సిరీస్ ఆలోచనలు ఉన్నాయా ? పూరీ గారి దగ్గర చాలా కథలు వున్నాయి. నేను కూడా రాస్తాను. మంచి ఉత్సాహం వున్న టీమ్ తో కలసి పని చేయాలనీ వుంది. కంటెంట్ టీం ఏర్పడటానికి సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు జనగణమన, లైగర్ చేస్తున్నాము. చాలా ఆలోచనలు వున్నాయి. రిజినల్, వెబ్ సిరిస్‌లు పాన్ ఇండియా సినిమాలు చేయాలి. అలాగే పూరి గారితో ఒక హాలీవుడ్ సినిమాకి డైరెక్షన్ చేయించాలి. చదవండి: ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నందమూరి బాలకృష్ణ ఆ యాంకర్‌తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్! -
విలన్‌గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై
టాలీవుడ్లో ఒకప్పుడు విలన్ అంటే.. గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు, భారీ శరీరంతో గంభీరంగా ఉండేవారు. వారి పాత్రకి అంతగా రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పటి విలన్స్ మాత్రం హీరోకి సమానంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ‘సర్’ అని పివాల్సిందేనని పట్టుబడుతున్నారు. గతేడాది రిలీజైన బ్లాక్ బస్టర్ పుష్పలో ఫస్టాఫ్ మొత్తం ఎదురులేకుండా ఎదుగుతూ వెళ్తుంటాడు పుష్పరాజ్.కానీ విలన్ భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాజిల్) ఎంట్రీ ఇచ్చిన తర్వాత పుష్ప స్పీడ్ తగ్గతుంది. పుష్పకు, భన్వర్ కు మధ్య కేవలం ‘సర్’ అనే పాయింట్ పైనే అసలు వైరం మొదలవుతుంది. ఒక్కటి తగ్గుతోంది పుష్పా అంటూ భన్వర్.. ఇది సర్ నా బ్రాండ్ అంటూ పుష్ప చెప్పే డైలాగ్స్.. వీరిద్దరి వైరాన్ని సీక్వెల్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్,ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఒక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’లో విలన్‌ది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఈ చిత్రం క్లైమాక్స్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య విలనీజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెంటింగ్ టాపిక్.పుష్ప మాదిరే విక్రమ్‌లో కూడా విలన్ రెస్పెక్ట్ కోరుకున్నాడు.తన మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేకపోతాడు.రోలెక్స్ సర్ అని పిలవాల్సిందే అని పట్టుబడతాడు.ఈ సీన్ కూడా సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా విలన్ గా మారుతున్న హీరోలు కొత్త కండీషన్ పెడుతున్నారు. హీరోల చేతిలో తన్నులు తిన్నా సరే రెస్పెక్ట్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు.సర్ అని పిలవకపోతే సీక్వెల్ వరకు ఆ వైరం కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. -
నాలాంటి దరిద్రపు వాళ్ల వల్లే ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నారు
టాలీవుడ్లో ప్రతినాయకుడిగా మెప్పించినవారిలో నటుడు సత్య ప్రకాశ్ ఒకరు. ఈయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయనగరంలో పుట్టిన తాను ఒడిశాలో పెరిగానని, ఆ తరువాత బ్యాంకులో ఉద్యోగం చేశానని చెప్పుకొచ్చాడు. తానేదో పిచ్చిపనులు చేస్తుంటే ఓ డైరెక్టర్ రా బాబు అంటూ పిలిచి మరీ సినిమాలో వేషం ఇచ్చారని, కానీ ఆయన తనను ఆర్టిస్టును చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని నవ్వుతూ పేర్కొన్నాడు. తనను ఆర్టిస్టును చేసి జీవితంలో పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతున్నారని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా దాదాపు 600 సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ ఉంటానన్నాడు. తనను సెట్స్‌లో అవమానించిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఒక సినిమా షూటింగ్లో సుమన్‌తో ఫైట్ సీన్లో నటించాలి. ఆయన కొట్టినప్పుడు రియాక్షన్ ఇవ్వాలి. కానీ నేనివ్వలేదు. అప్పుడు అక్కడున్న కో డైరెక్టర్ నన్ను ఉద్దేశించి.. ఇలాంటి దరిద్రపువాళ్లంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది' అన్నారు అని వాపోయాడు సత్య. -
బాలయ్య చిత్రంలో అర్జున్ విలన్ ?
-
పుష్పరాజ్ కోసం వాళ్లని సెట్ చేసిన సుకుమార్
Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఊరమాస్ లుక్‌లో పుష్పరాజ్‌గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్లోనే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్ చేశాడు సుకుమార్. హీరో పాత్రను పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే పుష్పరాజ్‌కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్ చేశాడు సుకుమార్. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఉండటం విశేషం. ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్ ఫాజిల్. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్ ఆ తర్వాత శాండల్‌వుడ్‌లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్‌తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఒకప్పటి టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా విలన్‌గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ,అజయ్ ఘోష్, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. -
విలన్ గా దూసుకుపోతున్న సునీల్
-
NBK107: బాలయ్యకు విలన్‌గా కన్నడ హీరో!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోయే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన గోపీచంద్ నటీనటులను సెలెక్ట్ చేసే పనులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలయ్య సరసన శృతి హాసన్‌ను ఖరారైంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. చదవండి: బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా కన్నడ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు దునియా విజయ్. కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం ఆయనను విలన్‌గా దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్ ఇక్కడ విలన్స్‌గా రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: Unstoppable Talk Show: చిరంజీవిపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
ప్రముఖ విలన్ భార్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ విలన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు టార్జన్ అలియాస్ లక్ష్మీనారాయణ గుప్తా సతీమణి ఉమారాణి(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. కాగా టార్జన్ లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. చదవండి: యాంకర్‌గా ఎంట్రీ.. హీరోయిన్గా సెటిల్.. ఆ తారలు ఎవరంటే.. -
ఆన్లైన్లో లీకైన ‘పుష్ప’ స్టోరీ, సుక్కుపై ట్రోల్స్!
ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సూకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడించింది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ మూవీని రూపొందించాడు. ఇందులో స్టైలిష్ స్టార్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. పుష్పరాజు అనే లారీ డైవర్‌గా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలై ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్లో అల్లు అర్జున్ చెప్పే ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయతే తాజా బజ్ ప్రకారం.. పుష్ప స్టోరీ ఆన్లైన్లో లీక్ అయినట్లు వినపిస్తోంది. పుష్ప కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అది చూసిన వారంత పుష్ప స్టోరీ కాపీ కొట్టిందని, మన టాలెంటెడ్ దర్శకుడు సూకుమార్.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ‘విలన్’ మూవీ కథను ఆధారంగా చేసుకుని ‘పుష్ప’ను రాసుకొచ్చారంటూ ఆయనపై తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే రామాయణం కథను ఆధారంగా చేసుకొని.. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ‘విలన్’ సినిమాని రూపొందించారు మణిరత్నం. తన చెల్లికి జరిగిన అన్యాయంపై హీరో.. విలన్లపై ఏ విధంగా పగ తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ. అయితే సుకుమార్ కూడా ఈ కథని బేస్ చేసుకొనే ‘పుష్ప’ మూవీని రూపొందించారని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ‘పుష్ప’ సినిమాలో కూడా అల్లు అర్జున్‌కు ఓ చెల్లి పాత్ర ఉంటుందనేది మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ తన చెల్లికి అన్యాయం చేసిన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిజంగానే సుకుమార్ ‘విలన్’ సినిమాని కాపీ కొట్టారా లేదా అనే విషయం తెలియాంటే ఈ మూవీ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ఆగస్టు 13న రిలీజ్ కానుంది. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. కన్నడ రీమేక్‌లో నితిన్ హిట్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా! -
ప్రభాస్ సలార్ అప్డేట్, విలన్ అతడేనా!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. చదవండి: ప్రభాస్ అభిమానులకు ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ హామీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్ కాలేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్యాస్టింగ్, టెక్నికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ భామ దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సలార్ సినిమాలో విలన్ పాత్రలో కూడా ఓ బాలీవుడ్ స్టార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటుడు జాన్ అబ్రహం విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు పవర్ఫుల్ విలన్ ఉండాలని భావించిన చిత్ర యూనిట్ జాన్ అబ్రహాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్ -
30 ఏళ్లు పట్టించుకోలేదు: ప్రముఖ నటుడు
ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. మధ్యప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన శరత్ సక్సేనాకు కూడా సినిమాల్లోకి వెళ్లే ఓ రోజు వచ్చింది. కానీ గుర్తింపు రావడానికే 30 ఏళ్లు పట్టింది. నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి ఇంత కాలం పట్టలేదు. కేవలం దర్శకనిర్మాతలు ఆయనను పట్టించుకోవడానికి ఇంత గడువు పట్టింది. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను శరత్ సక్సేనా.. సీఐఎన్‌టీఏఏ(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. అందరి మనసులను మెలివేస్తున్న 2018నాటి ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నారో చదివేయండి.. సారీ బాస్, ఎస్ బాస్.. ఇవే డైలాగులు "నా భారీకాయం చూసి దర్శకులెవ్వరూ నన్ను నటుడిగా లెక్కలోకి తీసుకోలేదు. ఎప్పుడూ ఫైటర్, జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలే ఇచ్చేవారు. అంతదాకా ఎందుకు.. ఎవరికైనా కండలు తిరిగి బాడీ బిల్డర్‌లా కనిపిస్తే వారిని ఈ దేశంలో లేబర్ క్లాస్ కింద పరిగణించేవాళ్లు. వాళ్లు దేనికీ పనికి రారన్నట్లుగా చూసేవాళ్లు. విలన్ అని ముద్ర వేస్తారు. అయితే మా నాన్న అథ్లెట్ కావడం వల్ల మేము కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నాం. కానీ నన్ను అలా చూసిన దర్శకనిర్మాతలకు నాలో నటుడు కనిపించలేదు. కేవలం జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. అలా ముప్పై ఏళ్లు కేవలం ఫైట్ సీన్లలోనే నటించాను. ఎస్ బాస్, నో బాస్, వెరీ సారీ బాస్, నన్ను క్షమించండి బాస్.. ఈ డైలాగులు మాత్రమే వల్లించేవాడిని. ఆ తర్వాత కొన్నేళ్లకు డైరెక్టర్ షాద్ అలీ నన్ను గుర్తించి "సాథియా"లో హీరోయిన్ తండ్రి పాత్ర ఇచ్చారు. అది చిన్న పాత్రే అయినప్పటికీ జనాలు నన్ను ఇష్టపడ్డారు. ఈ సినిమా నుంచి నేను ఫైటర్‌గా కాకుండా నటుడిగా మారాను. కానీ ఈ మార్పుకు ముప్పై ఏళ్లు పట్టింది" అని కెరీర్ తొలినాళ్లనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. (చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపిన 2020) జీరో నుంచి ప్రముఖుడిగా మారారు.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న శరత్‌కు నటుడవ్వాలనేది కల. అలా ముంబైలో అడుగు పెట్టిన ఆయనను డైరెక్టర్లు నెగెటివ్ పాత్రలో ఊహించుకున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి విలన్‌కు సలాం చేసే గ్యాంగ్ సభ్యుడిగా స్థిరపడిపోయారు. దశాబ్ధాల కాలం తర్వాత సాథియా, బాఘ్బాన్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. తెలుగులోనూ పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మెప్పిస్తూ ప్రముఖ నటుడిగా మారిపోయారు. ఇక ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. శరత్ అద్భుతమైన నటుడని, అతడికి ప్రతిభకు తగ్గ పాత్ర ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. అతడికి వివక్ష జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్) -
టిక్‌టాక్ జానీ దాదా కథ అలా ముగిసింది
‘‘ప్రతిదీ నాశనం చేస్తా..చూస్తూ వుండండి" అంటూ సంచలన రేపిన వివాదాస్పద టిక్‌టాక్ విలన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వినీకుమార్ (30), అలియాస్ జానీ దాదా కథ విషాదాంతమైంది. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడైన అశ్వినీ కుమార్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అన్నింటినీ నాశనం చేస్తా’, ‘దెయ్యం రెడీగా ఉంది’, ‘నేను సృష్టించే విలయం చూడండి’ అంటూ పోస్టింగులు పెట్టే జానీ దాదా చివరికి బర్హాపూర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అశ్వినీ కుమార్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారినట్టుగా అనుమానిస్తున్న అశ్వినీ మూడు హత్యకేసులో నిందితుడుగా ఉన్నాడు. ముఖ్యంగా సెప్టెంబరు 30 న, దుబాయ్‌లోని ఒక హోటల్లో పనిచేస్తూ, పెళ్లి కోసం సొంత వూరు బిజ్నూర్ వచ్చిన నితికా శర్మ (27)ను దారుణంగా కాల్చి చంపడం కలకలం రేపింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన కారణంతో నికితాపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అలాగే వెస్ట్ యుపిలో బీజేపీ నేత కుమారుడు (26), అతని మేనల్లుడిని (25) హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు. భయంకరమైన హత్యల నిందితుడు అశ్వినీ కుమార్ కోసం పోలీసులు ఇటీవల గాలింపును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అతగాడు ఢిల్లీ పారిపోయేందుకు బస్సెక్కాడు. ఈ విషయాన్నిగమనించిన పోలీసులు తనిఖీ చేయటానికి బస్సును ఆపడంతో భయపడి తుపాకితో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. తెల్లటి రుమాలుతో ముఖం కప్పుకుని ప్రయాణిస్తున్నఅతగాడిపై స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అశ్వినీ కుమార్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బస్సును ఆపగా, కాల్చకుని చనిపోయాడని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) విశ్వజీత్ శ్రీవాస్తవ తెలిపారు.అంతేకాదు అతను ఎపుడూ ఒక పిస్తోల్‌ను, రెండు మ్యాగజైన్స్ (బుల్లెట్ల) 14 పేజీల నోటును వెంట తీసుకెళ్తాడట. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశ్విని కుటుంబం అందించిన సమాచారం ప్రకారం గ్రాడ్యుయేట్ అయిన అశ్విన్ ప్రైవేట్ సంస్థ లో పనిచేశాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదు. మత్తు మందులకు అలవాడు పడ్డాడు. అశ్వినీ తండ్రి ధంపూర్ తహసీల్ లోని చెరకు సహకార సంఘంలో గుమస్తాగా ఉండగా, అతని అన్నయ్య డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. -
‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో
సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ఆయన తనయులు రమేష్, జీవా తెలుగు, తమిళ భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'విద్యార్థి' చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్ ఆ తర్వాత తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రమేష్ తెలుగులో నటించిన సినిమా 'ఒకటే లైఫ్'. ఇప్పుడు హీరో రమేష్ 'నిరీక్షణ' చిత్రంలో మొదటిసారిగా మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'నిరీక్షణ'. ఈ చిత్రంలో హీరో రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్, సన స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, మధుసూదన్, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలను అందిస్తున్నారు. -
మరో సినీ వారసుడు పరిచయం..
సినిమా: కోలీవుడ్‌కు మరో సినీ వారసుడు పరిచయం అవతున్నారు. నటుడు వైభవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడైన వైభవ్ కోలీవుడ్‌లో యువ హీరోగా తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన అన్నయ్య సునిల్ నటుడిగా పరిచయం అవుతుండడం అదీ విలన్‌గా రంగప్రవేశం చేయడం విశేషం. నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం సీతకాది. «బాలాజి ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీతకాది డిసెంబర్ 20న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రముఖ నటీనటులను పరిచయం చేసే కార్యక్రమానికి చిత్ర వర్గాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చిత్ర విలన్ గురించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ వినోదంతో పాటు, భావోద్రేకాలతో కూడిన ఈ చిత్ర హీరో విజయ్‌సేతుపతి గురించి ఇప్పటికే పలు విషయాలను తెలియజేశామన్నారు. ఆయన ఇందులో పలుగెటప్ల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారని చెప్పారు. మరో ముఖ్యపాత్ర విలన్ అని. ఈ పాత్రకు ఇప్పటి వరకూ పరిచయం కాని నటుడి నటన కొత్తగా ఉంటుందన్నారు. నటుడు వైభవ్ అన్నయ్య సునిల్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన పాత్ర చాలా వినూత్నంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రకు నటుడిని ఎంపిక చేయడం సవాల్‌గా మారిందన్నారు. చిత్ర కథకు కథనాన్ని తయారు చేసుకున్నప్పుడే మామూలుగా ఉండరాదని విభిన్నంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో నటించడానికి చాలా మంది ప్రముఖ నటులను సంప్రదించామని, వారికి పాత్ర నచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయారని అన్నారు. అలా ఒక పుట్టినరోజు వేడుకలో సునీల్‌ను చూసి తన చిత్రానికి విలన్ తనేనని నిర్ణయించుకున్నానన్నారు. ఆయన నటించడానికి ముందు సంకోచించినా, చివరికి అంగీకరించినట్లు తెలిపారు. అందుకు సునీల్ చాలా శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. ఇందులో హీరో విజయ్‌సేతపతి పాత్రకు తగ్గని విధంగా విలన్ పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు బాలాజి ధరణీధరన్ అన్నారు. -
‘విలన్’ వివాదంపై స్పందించిన హీరో
కరునాడ చక్రవర్తి, హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ 36 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారని, సినిమా కథ వినకుండా నటించేంందుకు ఆయన ఒప్పుకుంటారా అని శివన్న అభిమానులను కిచ్చా సుదీప్ ప్రశ్నించారు. సుదీప్, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా గురువారం ‘విలన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌పై సుదీప్ చేయి చేసుకునే సన్నివేశం ఉంది. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిపై సుదీప్ చేయి చేసుకున్నారని సుదీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దావణగెరెలో మీడియాతో సుదీప్ మాట్లాడుతూ... చిత్రరంగంలో ఎంతో అనుభవం ఉన్న శివరాజ్‌కుమార్ కథ వినకుండా సినిమాలో నటిస్తారా అని ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా సినిమాను సినిమాగా చూడాలని సూచించారు. కావాలంటే ఆ ఫైట్ సీన్ సినిమా నుంచి తొలగిస్తే తనకు ఏలాంటి అభ్యంతరంలేదని సుదీప్ స్పష్టం చేశారు. సినిమాను చూసిన శివరాజ్‌కుమార్ అభిమానులు డైరెక్టర్ ప్రేమ్‌పై ఆక్రోశంను వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్‌ను సినిమా నుండి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అందోళన చేయాలని శివరాజ్‌కుమార్ అభిమానులు నిర్ణయించారు. అలాగే మరో సీనియర్ నటుడు దర్శన్‌పై కూడా సుదీప్ స్పందించారు. దర్శన్‌కు తనకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరి మధ్య కొద్దిపాటి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. -
పోలీసులకు సినీఫైటర్ల ఫిర్యాదు
బంజారాహిల్స్: వారు సినిమాల్లో ఫైటర్లు... విలన్ వేషాల్లో అందరికీ దడపుట్టిస్తుంటారు. అలాంటి వారికే ఓ దొంగ చెమటలు పట్టిస్తున్నాడు. కారు అద్దాలు పగలగొట్టి నగదుతో పాటు మ్యూజిక్ ప్లేయర్‌ను ఎత్తుకెళుతుండటంతో నిందితుడిని పట్టుకోవాలని కోరుతూ బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..కమలాపురి కాలనీకి చెందిన రాజేందర్ తన కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేశాడు. తెల్లవారి లేచి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో రూ. 20 వేల నగదు బ్యాగ్, మ్యూజిక్ ప్లేయర్ చోరీకి గురయ్యాయి. దీంతో అతను సహచరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నాన్నగా నటించడం ఇష్టం లేదు
తమిళసినిమా: నాన్న పాత్రల్లో నటించడం ఇష్టం లేదని నటుడు సత్యరాజ్ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఈ రోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ ఆరంభంలో తనకు ఘోరమైన విలన్ వేషాలే లభించాయన్నారు. నూరావదు నాళ్ చిత్రంలో విలన్ పాత్రను పోషించాననీ, ఆ చిత్రం హిట్ అవుతుందా? అన్న ఆతృతతో విడుదల సమయంలో థియేటర్లకు వెళ్లి చూశానన్నారు. ఎంజీఆర్ చిత్రాలకు వచ్చినంత జనం తన చిత్రానికి రావడంతో నటుడిగా పాస్ అయ్యాయన్నారు. అప్పట్లో రజనీకాంత్, కమలహాసన్ ఇలా అందరి చిత్రాలకు నేనే విలన్ అని చెప్పారు. హీరోగానూ పలు చిత్రాల్లో నటించిన తాను బాగానే సంపాదించుకున్నానని సత్యరాజ్ తెలిపారు. ఇకపై తండ్రి పాత్రలు వద్దనుకునేసరికి తెలుగులో గోపీచంద్ హీరోగా ఓ చిత్రంలో నాన్న పాత్రకు అంగీకరించానన్నారు. ఆ చిత్రంలో కథానా యకి త్రిష తనను మామగారు అని పిలుస్తుం టే చచ్చానురా! అనిపించిందన్నారు. అలా నటిస్తున్న సమయంలోనే బాహుబలి లాంటి గొప్ప అవకాశం వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. -
రీ–ఎంట్రీకి రెడీ
‘సినిమాలు మానేసే ఆలోచన అస్సలు లేదు’... వీరేంద్రని పెళ్లాడినప్పుడు నమిత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గతేడాది నవంబర్‌లో నమిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మంచి కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ తన ఆలోచనలకు తగ్గట్టుగా ఓ సినిమా కుదిరిందట. ప్రముఖ తమిళ దర్శకుడు–నటుడు టి. రాజేందర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారట. విశేషం ఏంటంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత టి.రాజేందర్ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇటీవల నమితను కలసి కథ చెప్పారట. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. నిజానికి తమిళంలో ఫేమస్ అయ్యే ముందు నమిత తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే అభిమానం. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తే చేయాలనుందనీ, ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నానని నమిత పేర్కొన్నారు. అన్నట్లు.. నమిత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లయింది. 2016లో చేసిన ‘పులి మురుగన్’ ఆమె చివరి సినిమా. -
నేను సూపర్ విలన్ భార్యను
మనీలా : పాపులారిటీ ఉన్న వాళ్ల పేర్లను వాడుకుని ప్రచారం పొందడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కామిక్ విలన్‌ను కూడా వదలటం లేదు కొందమంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయపథంలో దూసుకుపోతున్న అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లోని విలన్ థానోస్ తన భర్తంటూ ఫిలిప్పీన్స్ సెనేటర్ ట్విటర్లో పోస్టులు పెట్టారు. వివరాలలోకి వెళితే.. మే 5న ఫిలిప్పీన్స్ సెనేటర్ నాన్సీ బినయ్ ఇన్ఫినిటీ వార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మాయోయావోలో ఫోటోలు దిగి ట్విటర్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీలో పాల్గొన్న ఆమె తలపై వైకింగ్స్ కిరీటాన్ని ధరించి థానోస్ భార్యను తానే అని ప్రకటించుకున్నారు. మరి ఆమె అవెంజర్స్ సినిమా చూసి ఇలా మాట్లాడారా? లేదా ఫిలిప్పీన్స్ పర్యాటక రంగాన్ని పాపులర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారో అని తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్కడి వారు. కామిక్ విలన్ మనిషిని ఏట్లా పెళ్లి చేసుకుంటాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “I am the wife of Thanos,” Sen @nancybinay exclaims in jest as well-wishers sing “Happy birthday” | via @sherieanntorres pic.twitter.com/ez9oa2bjhy — ABS-CBN News (@ABSCBNNews) May 10, 2018 -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
తెలుగు ప్రేక్షకులకు జబర్థస్త్ షోతో హాస్యనటుడిగా పరిచయం అయిన ఛమ్మక్ చంద్ర పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో ఇంత వరకు కనిపించలేదు చంద్ర. తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ దక్కకపోయినా.. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆ అవకాశం ఇచ్చింది. త్వరలో ఓ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కామెడీ స్టార్. సెయల్ పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చంద్ర విలన్ రోల్ లో కనిపించనున్నాడు. రవి అబ్బులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు. -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
-
విలన్ పాత్రలో టాప్ డైరెక్టర్!
సాక్షి, చెన్నై: ఒకప్పుడు విలన్ పాత్రధారులు హీరోలుగా నటించడం ప్రమోషన్‌గా భావించేవారు. కానీ, ఇప్పుడు హీరోలూ విలన్‌గా నటిస్తున్నారు. దర్శకులు నెగిటివ్ రోల్లో నటించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే 'స్పైడర్'లో ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కూడా విలన్ పాత్రపై మక్కువతో ఉన్నారు. ఆయన తాజాగా ప్రతినాయకుడిగా తెరపై కనిపించబోతున్నారు. ప్రభుదేవాకు బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుంది. అలాంటి ఆయన చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌కు 'దేవి' చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. తాజాగా హన్సికతో కలిసి 'గులేబకావళి', నటి లక్ష్మీమీనన్‌తో 'యంగ్ మంగ్ జంగ్' చిత్రాల్లో నటిస్తున్న ఈయన.. 'మెర్క్యురీ'లో విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు. దీపక్ పరమేశ్, రమ్యానంభీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'మెర్క్యురీ' సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారన్న కథనాలతో అభిమానులు ఆయన విలనిజాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది!
సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు. ‘తమ్మీ... ఇస్టేటుగా పాయింట్లకు వస్తున్న. నీ ఫైళ్ల ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్టే. నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే! మరి నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది’. హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. ‘గణేష్’ సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. విలనిజంలో అసలు సిసలు ‘స్థానికత’ను తీసుకువచ్చారు కోట. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు వేసి తనదైన గుర్తింపు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు.నవ్వించే నటుడిని తీసుకువచ్చి విలన్ క్యారెక్టర్ ఇస్తే... భయం కలగకపోగా నవ్వొస్తుంది. అయితే దీనికి కోట మినహాయింపు. నిన్నటి సినిమాలో కమెడియన్‌గా తెగ నవ్వించిన కోట, ఈరోజు వచ్చిన సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపి భయపెట్టించగలరు! ∙∙ కాలేజీ రోజుల నుంచి నాటకాల్లో నటించడం అంటే కోటకు తెగ ఇష్టం. అయితే సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా రంగం అంటే భయం కూడా! ఎందుకంటే... ‘సినిమాల్లో నటించే వాళ్లు ఆషామాషీ వ్యక్తులు కాదు... పొడుగ్గా ఉంటారు. తెల్లగా ఉంటారు. ఉంగరాల జుట్టుతో ఉంటారు... అందుకే నేను సినిమాలకు పనికిరాను’ అనుకునేవారు కోట. ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకంతో కోటకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు అందులో నటించే అవకాశం వచ్చింది. హైదరాబాద్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాటకాలు విరివిగా ఆడేవారు కోట. హైదరాబాద్ దాటి వెళ్లాల్సి వస్తే నాటకాలు ఆడే అవకాశం కోల్పోతానని, నాటకాల కోసం ప్రమోషన్స్ కూడా వదులుకునేవారు.ఎప్పుడైనా జంధ్యాల హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ చేస్తే సరదాగా ఆ సినిమాలో చిన్న వేషం వేసేవారు తప్ప సినిమాల్లోకి వెళ్లాలని, పెద్ద నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు కోట. అనుకోవడం, అనుకోకపోవడంతో విధికేం పని! టి.కృష్ణ, ముత్యాలసుబ్బయ్య ఒక నాటకం చూశారు. అందులో కోట నటన వారికి బాగా నచ్చింది. ‘సినిమాలకు పనికొస్తాడు’ అనుకున్నారు. అలా కోటతో ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’ సినిమాలలో నటింపచేశారు. అయితే ‘ప్రతిఘటన’ సినిమాలో పోషించిన గుండు కాశయ్య పాత్ర కోట శ్రీనివాసరావును ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ‘ఆర్టిస్ట్‌కు టైం వస్తే టైమే ఉండదు’ అని కోట చెప్పే మాట ఆయన విషయంలోనే అక్షరాలా రుజువైంది! -
టైటిల్ ఒక్కటే... కథలు రెండు!
...ఆ రెండిటిలోనూ హీరో ఒక్కరే కావడం విశేషమిక్కడ! మలయాళ హీరో మోహన్‌లాల్ ‘విలన్’ టైటిల్‌తో మాతృభాషలో ఓ సినిమా చేస్తున్నారు. అందులో మన తెలుగు నటుడు శ్రీకాంత్, హీరో విశాల్, హీరోయిన్లు రాశీ ఖన్నా, హన్సిక ముఖ్య తారలు. సేమ్ టైటిల్‌కు ముందు ‘ది’ తగిలించి.. ‘ది విలన్’ టైటిల్‌తో కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో శివ రాజ్‌కుమార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోలు. అమీ జాక్సన్ హీరోయిన్. ఇప్పుడీ కన్నడ విలన్‌ను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీయాలనుకుంటున్నారు నిర్మాత సీఆర్ మనోహర్. తెలుగులో ‘మహాత్మ, రోగ్’ సినిమాలను నిర్మించిందీయనే. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుదీప్, అమీలు సుపరిచితులే. శివ రాజ్‌కుమార్ గురించి తక్కువమందికి తెలుసు. సో, ఆ పాత్రలో మిగతా భాషల ప్రేక్షకులకు పరిచయమున్న నటుడయితే బాగుంటుందని మోహన్‌లాల్‌ను సంప్రదించారు. కన్నడ వెర్షన్లో శివ రాజ్‌కుమార్ చేస్తున్న పాత్రను తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్‌లో మోహన్‌లాల్ చేస్తారన్న మాట. ప్రస్తుతం హీరో, దర్శక–నిర్మాతల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. ‘ది విలన్’కు మోహన్‌లాల్ ఆల్మోస్ట్ సైన్ చేసినట్టే! ఇంకో విశేషం ఏంటంటే... ఇందులోనూ శ్రీకాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన కూడా సేమ్ టైటిల్‌తో రూపొందుతోన్న రెండు సినిమాల్లో చేయబోతున్నారన్న మాట! -
శివమ్ ప్రకాశమ్!
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు... మరి సినిమా స్టార్స్?!.. ఆ.. వీళ్లకు పక్క నుంచి ఓ లైట్, పై నుంచి ఓ లైట్, ఫ్రంట్ నుంచి ఓ లైట్ వేస్తే కానీ మెరవరు... అయితే, స్వయం ప్రకాశాన్ని కట్ చేస్తే... శివం ప్రకాశమ్ ఎందుకొచ్చిందో.. ‘సంతోషం సంబరమైతే.. ఆనందమే తాండవిస్తే... శివుడు ప్రకాశం అంటున్నారు’ జయప్రకాశ్‌రెడ్డి అందరూ కష్టాల్లో దేవుణ్ణి తలుచుకుంటే... తను సంతోషంలో దేవుణ్ణి దర్శిస్తుంటారు. ‘‘జయ ప్రకాశం జయ ప్రకాశం నా బతుకే శివప్రకాశం.. సాక్ష్యం భూమి, ఆకాశం.. సదాశివునిపై భక్త్యావేశం... ’’ సినిమాల్లో విలన్‌గా మనకు తెలిసిన జయప్రకాశ్‌రెడ్డి శివగానం చేస్తుంటే ఆశ్చర్యంతో చూస్తుండిపోయాం. హైదరాబాద్ మోతీనగర్‌లోని జయప్రకాశ్‌రెడ్డిని కలిసి, మీ ఇష్ట దైవం గురించి చెప్పమని అడిగినప్పుడు పాటతో ఇలా పరవశించిపోయారాయన. ♦ ఇంత అద్భుతంగా పాడుతున్నారు. సదాశివుడు మీ దైవం ఎప్పుడయ్యాడు? తాతల నాటి నుంచి మా కుల దైవం శివయ్యే! ఇప్పటికీ ఇంట్లో రోజూ ఉదయం దీపారాధన చేస్తుంటాను. అలాగని మిగతా దేవుళ్లను తక్కువ చేయను. సోమవారం శివయ్య, మంగళవారం ఆంజనేయస్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయి బాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర్లు, ఆది– సోమ మళ్ళీ శివయ్య.. ఏది జరిగినా ‘ఈశ్వరా’ అనుకోవడమే శ్వాస. ♦ కష్టంలోనూ శివయ్యనే తల్చుకుని గట్టెక్కారా? ముప్పై ఏళ్ళ కిందటి వరకు అష్టకష్టాలే. బి.ఎస్సీ బీఈడీ చదువుకున్న నేను మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేవాడిని. నాటకాలు నా ప్రాణం. ఒకసారి దాసరి నారాయణరావు గారు నా నాటకం చూసి ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో టీచర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మద్రాసుకు వెళ్లాను. ఆ తర్వాత చిన్నా చితక వేషాలు ఉన్నా రాబడి ఏమీ లేదు. నాకు ఓ కొడుకు, కూతురు. వాళ్లు స్కూల్ నుంచి కాలేజీ చదువులకు వస్తున్నారు. ఫీజులు, కుటుంబ ఖర్చులు పెరగుతున్నాయి. బాగా అప్పులయ్యాయి. కుటుంబం ఎలా గడుస్తుందని భయం. ‘ఎలారా దేవుడా’ అనుకున్నప్పుడు ఉద్యోగమే మేలని ఊరొచ్చేశాను. ప్రైవేట్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేస్తూ ఐదేళ్లు సినిమా రంగం గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆ టైమ్‌లో శ్రీశైలంలో జరిగే శివదీక్ష గురించి తెలిసింది. నాకూ ఆ దీక్ష తీసుకోవాలనిపించింది. నలభై ఒక్కరోజుల పాటు శివదీక్ష తీసుకున్నాను. ఈ దీక్ష తీసుకున్నవారు సరిగ్గా మహాశివరాత్రి నాటికి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్లాలి. లింగోద్భవ కాలంలో దేవాలయానికి తలపాగా చుడతారు. అది తప్పక చూసి రావాలి. అలా ప్రతి ఏటా 18 ఏళ్ల పాటు శివదీక్ష చేశాను. ఇదీ అని చెప్పలేను గానీ అప్పటి నుంచి నా దశ కూడా మారుతూ వచ్చింది. అనుకోకుండా రామానాయుడిగారి కంటపడటం ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత శ్రీరాములయ్య, ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’... అలా అలా బతుకు చిత్రమే మారిపోయింది. ఈ మూడేళ్లుగా దీక్ష తీసుకోవడం లేదు. శివయ్యకు చెప్పేశాను. ‘లక్షలాది జనం మధ్య జ్యోతిర్ముడితో రావడం కుదరడం లేదయ్యా! కరుణించు’ అని వేడుకున్నాను. అంతా ఆయనిచ్చిన అదృష్టం. ♦ ఆ అదృష్టమే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందా? దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అదృష్టానికి మన కష్టం తోడవ్వాలి. ‘ప్రేమంటే ఇదేరా!’ సమయంలో రాయలసీమ మాండలికంలో డైలాగులు కావాలన్నారు. నంద్యాలలో పెరిగినందుకు ఆ భాష కలిసొచ్చింది. అయినప్పటికీ మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లి టేపురికార్డర్ పట్టుకొని, అక్కడి షాపుల వాళ్లతో మాట్లాడి ఆ మాటలన్నీ రాత్రిపూట వింటూ, యాస కోసం బాగా సాధన చేసేవాడిని. ముందురోజే స్క్రిప్టు కావాలని రైటర్లను అడిగేవాడిని. వాళ్లెంత బిజీగా ఉన్నప్పటికీ నా అభ్యర్ధనను మన్నించారు. ముందుగానే స్ట్రిప్టు ఇచ్చేవారు. దానిని నేను నాదైన బాసలోకి మార్చుకుని సాధన చేసేవాడిని. ఆ కష్టం ఊరికేపోలేదు. ‘సమరసంహారెడ్డి’ సినిమాతో బాగా పేరొచ్చింది. యేటా ఏదో ఒక మంచి వస్తూనే ఉండేది. అప్పులు తీర్చుకుంటూ వచ్చాను. నన్ను నిమ్మి ఆ సమయంలో జనాలు కూడా సాయం చేసేవారు. ♦ మనుషుల్లో దైవత్వాన్ని ఎప్పుడు చూశారు? ఎక్కడో కాదు. ఇంట్లోనే. మా నాయిన సాంబిరెడ్డిలో చూశాను. ఆయన నాకు సాక్షాత్తు శివయ్యే! మా నాయిన పోలీసు ఆఫీసర్. విపరీతమైన నిజాయితీపరుడు. ఆయన కొలీగ్స్ అంతా సంపాదించుకుంటే ఈయన మాత్రం తాతల ఆస్తిని అమ్మేసుకున్నాడు కుటుంబ పోషణకు. వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. జనం ఆయన్ని ఓ దేవుడిలా చూసేవారు. పెద్ద పెద్ద వాళ్లు ఎంతో గౌరవంగా చూసేవారు. అలా బతకాలి అనిపించేది. మా నాన్న నాకు చెప్పింది నేర్పింది ఒక్కటే ఆత్మసంతృప్తి. ‘ఒరేయ్, ఈ లోకంలో తిండి లేక, సరైన బట్ట లేక ఎంత మంది యాతన పడుతున్నారో చూడు. నీకు తినడానికి మూడు పూటలా తిండి ఉంది. బట్ట కట్టుకుంటున్నావ్. ఇది దేవుడు నీకు ఇచ్చిన అదృష్టం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు. పచ్చడి అయినా ఒకటే, పరమాన్నం అయినా ఒకటే అని భావించు’ అన్నాడు. ఆ స్ఫూర్తే ఆయన నాకు ఇచ్చిన ఆస్తి. అంతేకాదు, ఆయన చూపిన తోవే నన్ను ఈ రోజు ఎంతోమందికి తెలిసేలా చేసింది. మా నాన్నకు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. పోలీసాఫీసర్‌గా నాటకాలు వేయడం ఆయనకు కుదిరేది కాదు. ఎప్పుడైనా నేను ఖాళీగా కనపడితే చాలు ‘నాటకం వేయకుండా ఏం చేస్తున్నావ్‌రా!’ అని తిట్టేవాడు. ఆయనకున్న నాటకాల పిచ్చి, అభిమానం నాకూ బాగా వంటబట్టాయి. ♦ ఎప్పుడూ దైవం మీద కోపం రాలేదా? కష్టం వస్తే ‘ఈశ్వరా’ అనుకున్న రోజులున్నాయి గానీ, కోపమా?! ఎంతమాట. మొదటిసారి శ్రీశైలంలో స్వామిని కలిసినప్పుడే ఒక ధైర్యం కలిగింది. ఏదొచ్చినా శివయ్య ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు అనిపించేది. ఆ స్వామి దగ్గర నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను. కాకపోతే ‘ఇదియ్యి, అదియ్యి’ అని ఎప్పుడూ మూర్ఖంగా కోరుకోలేదు. ఫలానా పని అవలేదు అని ఎప్పుడూ తిట్టుకోలేదు. ఏ ప్రాంతానికి వెళ్లినా నన్ను ఫలానా అని గుర్తుపట్టేస్తారు. అంతకుమించి ఏం కావాలండీ! ♦ ఆలయాలకు ఎప్పుడెప్పుడు వెళుతుంటారు? ఆలయం విషయం వస్తే.. ముందు నలభై ఏళ్ల కిందటి సంఘటన ఒకటి చెప్పాలి. మా అమ్మమ్మ ఊరు వెళ్లాను. ఇంటికి కావల్సినవి ఏవో కొనుక్కురమ్మన్ని మార్కెట్‌కి పంపించారు. మార్కెట్‌కి బస్‌స్టాప్ మీదుగ వెళ్లాను. అక్కడ శ్రీశైలం బోర్డున్న బస్సు కనిపించింది. అప్పటి వరకు శ్రీశైలం గురించి విని ఉన్నాను. కానీ, ఎప్పుడూ వెళ్లింది లేదు. ఎవరో మంత్రం వేసినట్టు వెళ్లి ఆ బస్సులో కూర్చున్నాను. శ్రీశైలం చేరుకున్నాను. అక్కడ స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ.. నా తలను శివ లింగానికి తాకించారు. అంతే, ఒక్క క్షణం.. ఓ తెలియని విద్యుత్తు ఏదో ఆ లింగం నుంచి నా నుదుటి ద్వారా ఒళ్లంతా పాకినట్టు అనిపించింది. దానిని ఇన్నేళ్లు అయినా మర్చిపోలేను. ఒక అలౌకికమైన ఆనందం. ఆ రాత్రి అక్కడి సత్రంలోనే బస చేసి, ఉదయాన్నే మళ్ళీ దర్శనం చేసుకొని ఊరొచ్చాను. అప్పుడు ఫలానా చోట ఉన్నానని చెప్పడానికి ఫోను సదుపాయం లేదు. మా ఇంట్లో వారంతా ఏడుపులు.. పిల్లాడు ఎక్కడికి పోయాడో అని. ఇప్పుడైతే.. సంతోషంగా ఉన్నప్పుడు. దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపించినప్పుడల్లా తప్పక వెళతాను. శ్రీశైలమే కాదు తిరుపతికి, శిరిడీకి కూడా వెళుతుంటాను. ♦ మీలో దైవత్వాన్ని చూసినవారి గురించి... మా నాన్న చేసినంత సాయం నేను చేయలేదు. నా పరిధిలో ఉన్నంతవరకు మా జూనియర్ ఆర్టిస్టుల పిల్లలకు చదువులు చెప్పించాను. చెప్పిస్తుంటాను. వాళ్ల చేతికి డబ్బు ఇవ్వను. కాలేజీ, స్కూళ్లకు వెళ్లి ఫీజులు కట్టివస్తుంటాను. 40 సంవత్సరాల క్రితం నాతో పనిచేసిన టీచర్లు ‘నువ్వేం మారలేదయ్యా’ అంటుంటారు. అదే నాకు ఆనందం. ♦ విశ్రాంతి జీవితంలో దైవం ఆలంబన? నా వయసు 71. ఈ రోజుకీ బీపీ కూడా లేదు. ఉపాధ్యాయుడిగానూ, నటుడిగానూ రాణించగలిగాను. ప్రతి నెలా నాటక పరిషత్ ద్వారా నాటకాలు వేయిస్తుంటాను. నాకు ఎంతో ఇష్టమైన ‘అలెగ్జాండర్’ నాటకాన్ని ఇప్పటికీ వేస్తుంటాను. పిల్లల జీవితాలు బాగున్నాయి. నన్ను అర్థం చేసుకునే అర్ధాంగి ఉంది. దేవుడి దయ వల్ల పెన్షన్ వస్తుంది. ఇది లేదు అనే దిగుల్లేదు. ఇప్పటికీ ఏమీ లేకపోయినా శ్రీశైలం వెళితే.. అక్కడి సత్రంలో ఓ గది ఇస్తారు. నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే చాలు భోజనం పెడతారు. పొద్దునే ఓం నమఃశివాయ అని వినిపిస్తూ ఉంటుంది. ఇంక ఏం కావాలి? మనం సంతోషంగా ఉండాలనే దైవం కోరుకుంటుంది. అందుకే వర్రీస్ గురించి వర్రీ అవ్వద్దు. ♦ శివయ్య గురించి అంత బాగా గానం చేశారు. ఎలా వచ్చింది ఆ పాట..? శివయ్య మీద ఉన్న భక్తి భావాలను పేపర్ మీద పెట్టడానికి చాలా ప్రయత్నించాను. కానీ, అద్భుతంగా కీర్తిస్తూ రాయలేను. నా జీవితాన్ని నడుపుతున్నది శివయ్యే! ఆయన మీద నోరారా పాటలు పాడుకోవాలి ఎలా అని పరితపించాను. రచయిత జొన్నవిత్తులను అడిగాను. మహానుభావుడు పైసా అడగలేదు, ఆరుపాటలు రాసిపెట్టాడు. వీణాపాణి బాణీలు కట్టారు. ఆ పాటలు పాడి ‘శివ ప్రకాశం’ పేరుతో ఆల్బమ్ చేయించాను. నాకు పాటలు రాయడం, సంగీతం, గానం రావు. కానీ, భావం– భక్తి ప్రధానం అని నమ్మి పాడాను. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
బాలయ్యకు విలన్‌గా మరో హీరో
సీనియర్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన ఈ సీనియర్ హీరో, ఆ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని పూరి జగన్నాథ్ దర్వకత్వంలో పైసా వసూల్ సినిమాను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పైసావసూల్ సెట్స్ మీద ఉండగానే తన 102వ సినిమా పనులు కూడా స్టార్ట్ చేశాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా ఓ స్టార్ హీరో నటించనున్నాడు. గతంలో ఘనవిజయం సాధించిన లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించాడు. అదే బాటలో నెక్ట్స్ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, బాలయ్యకు ప్రతినాయకుడిగా తలపడనున్నాడు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్, త్వరలో తెలుగు సినిమాలోనూ నెగెటివ్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. బాలయ్య నయనతార మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. -
కొత్త స్టెప్!
సినిమాల్లోకి ప్రభుదేవా ఫస్ట్ స్టెప్ కొరియోగ్రఫీ – సక్సెస్. సెకండ్ స్టెప్ హీరో – సక్సెస్. థర్డ్ స్టెప్ డైరెక్షన్ – సక్సెస్. రెండు తమిళ సినిమాలకు పాటలు పాడారు. ఓ సినిమాకి పాట రాశారు. ఇప్పుడు ప్రభుదేవా ఇంకో స్టెప్ వేయనున్నారు. ఇప్పటివరకూ వేసిన అడుగులకన్నా అది ఫుల్ డిఫరెంట్. ప్రభుదేవా విలన్‌గా స్టెప్ వేయనున్న ఆ సినిమా పేరు ‘మెర్క్యురీ’. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ అండ్ ఒరిజినల్స్ పతకాంపై ‘పిజ్జా’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది థ్రిల్లర్ మూవీ. ‘నిశ్శబ్దం ఎంతో శక్తిమంతమైనది’ అనేది ట్యాగ్‌లైన్. ప్రభుదేవా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. టీనేజ్‌లో కెరీర్ ఆరంభించి, వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ అయిన ప్రభుదేవా ఇప్పుడు వేయనున్న ఈ కొత్త స్టెప్‌లోనూ సక్సెస్ అవుతారని ఊహించవచ్చు. -
ఆ హీరోయిన్ మూటాముల్లె సర్దుకోవలసిందే !
బొద్దుగుమ్మ హన్సిక పరిస్థితి చూసి ఇటీవల సినీ వర్గాలు అయ్యో పాపం అనుకున్నాయి. కొందరైతే ఈమె పని అయిపోయింది. ఇక మూటాముల్లె సర్దుకోవలసిందే అనే కామెంట్లు కూడా చేశారు. అందుకు కారణం హన్సిక చేతిలో ఒక్క చిత్రం కూడా లేదన్నదే. అయితే ఇలాంటి పనికి మాలిన కామెంట్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతోంది ఈ భామ. అర్ధం కాలేదా? హన్సికకు మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు, మాలీవుడ్‌లో ఒకటి చిత్రాలతో హన్సిక బిజీగా ఉంది. తమిళంలో డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో గుళేభకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్న హన్సిక శశికుమార్‌కు జంటగా కొడివీరన్ చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు తొలిసారిగా మలయాళ చిత్ర సీమలోకి అడుగుపెట్టి అక్కడ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సుదీప్ హీరోలుగా నటిస్తున్న విలన్ చిత్రంలో హన్సిక ప్రధాన పాత్రలో మెరుస్తోంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ హీరో విశాల్ విలన్‌గా విలక్షణ పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఇటీవలే హన్సిక విలన్ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యిందట. -
విలన్‌గా స్టార్ హీరోయిన్..!
90లలో వెండితెరను ఏలిన ఓ అందాల భామ, రీ ఎంట్రీ విలక్షణ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాప్ స్టార్ సిమ్రన్ త్వరలో తమిళ సినిమాతో విలన్ గా మారుతోంది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తీకేయన్ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కీలక పాత్రలో నటించనుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రన్ చేయబోయేది నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. పొన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 24 ఎం ఎం బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పెళ్లి వార్తల తరువాత సమంత ఓ మీడియం రేంజ్ సినిమాకు ఓకె చెప్పటం ఒక విశేషం కాగా.. సిమ్రన్ లాంటి టాప్ హీరోయిన్ నెగెటివ్ రోల్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఎన్టీఆర్‌తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..?
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్, ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్, కథా కథనాలు సిద్ధం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జై లవ కుశ షూటింగ్ తరువాత బిగ్ బాస్ తెలుగు షో షూటింగ్ కోసం కొంత కాలం ముంబైలోనే ఉండనున్నాడు జూనియర్. -
సారూ.. కొంచెం నేర్పించరూ!
విశాల్ తెలుగు కుర్రాడు. కానీ, తమిళ్ బాగా మాట్లాడతాడు. ఎందుకంటే, ఉంటున్నది చెన్నైలో కదా. అయినా మాతృభాష అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కదా అందుకే, తమిళంలో తాను చేస్తున్న చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుంటారు. ఇప్పుడీ హీరో మలయాళ భాష నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకంటే, అక్కడ ‘విలన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘సారూ.. కొంచెం మలయాళం నేర్పించరూ’ అంటూ విశాల్ డైరెక్టర్ హెల్ప్ తీసుకుంటున్నారట. మోహన్‌లాల్ లీడ్ రోల్లో బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశాల్ డాక్టర్‌గా యాక్ట్ చేస్తున్నారట. ఇందులో విశాల్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. -
సూపర్ స్టార్ కోసం సింగర్‌గా..!
తొలిసారిగా ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన జోడి కట్టే అవకాశం రావటంతో ఫుల్ జోష్ లో ఉన్న రాశీఖన్నా ఇప్పుడు మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మలయాళ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ సినిమాతో కావటంతో రాశీ ఆనందానికి అవధుల్లేవు. అయితే తాజాగా ఈ భామకి మరో గోల్డెన్ ఆఫర్ వచ్చింది. ఇప్పటికే తెలుగులో జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన ఈ భామ, మోహన్ లాల్ సినిమాలోనే అదే ఫీట్‌ను రిపీట్ చేయబోతోంది. ఇప్పటికే పాటను రికార్డ్ చేసిన రాశీ, రికార్డ్ స్టూడియోలో దిగిన ఫోటోతో పాటు తన చిన్ననాటి ఫోటను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. నా చిన్ననాటి కల నెరవేరింది అంటూ ట్వీట్ చేసింది. విలన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్, హన్సిక, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. -
ఆ ముగ్గురు స్త్రీలే మహా సైన్యం
ఇశ్రాయేలీయులు లేదా హెబ్రీయుల ఐగుప్తు దాస్య విముక్తి, వారి వాగ్దాన దేశయాత్రలో ముఖ్య విలన్ ఫరో చక్రవర్తి కాగా, దేవుడు వాడుకున్న గొప్ప హీరో మోషే! కాని ప్రాణార్పణకు కూడా సిద్ధపడి ఆ మోషేను బతికించిన ముగ్గురు స్త్రీల పాత్ర చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం కూడా. హెబ్రీ మగపిల్లవాణ్ని పుట్టగానే చంపేయాలన్నది మంత్రసానులకు ఫరో చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ. ధిక్కరిస్తే మరణశిక్ష తప్పదు. అయినా తన కుమారుణ్ని బతికించుకోవాలని నిర్ణయించుకుంది మోషే తల్లి యోకెబెదు. షిఫ్రా, పూయా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానులు చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించి దైవభయంతో ఆమెకు సహకరించారు. అలా పురిటినాడే చనిపోవలసిన మోషే ఆ ముగ్గురి తెగువ, దైవభక్తి కారణంగా బతికాడు. ఆయనే ఇశ్రాయేలీయుల దాస్య విముక్తిని సాధించాడు. కండలు తిరిగిన యుద్ధవీరులే బలవంతులంటుంది లోకం. కాని దేవునికి లోబడి ఆయన మాట నెరవేర్చేవారే నిజమైన బలశూరులంటుంది బైబిల్ (కీర్తన 103:20). దేవునికి భయపడటం అంటే హింస, దౌర్జన్యం, అశాంతి, మోసం లాంటి లోక వైఖరిని ధిక్కరించడమని బైబిలు వివరిస్తోంది. తెగువలేని దైవభక్తి చక్రాలు లేని బండిలాగే నిష్ప్రయోజనకరమైనది. విశ్వాసికి దైవభక్తి ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టగల అసమానమైన తెగువ కూడా ఉండాలి. మోషే ఉదంతంలో దేవుని సంకల్పం అనే దీపం ఆరిపోకుండా తెగించి తమ చేతులు అడ్డుపెట్టిన మహాసైన్యం ఈ ముగ్గురు స్త్రీలు. అందుకే మోషే ఉదంతమున్న బైబిలు నిర్గమకాండంలో మహాబలుడనని విర్రవీగిన ఫరో చక్రవర్తి పేరును దేవుడు ప్రస్తావించలేదు కాని ఏ విధంగా చూసినా అనామకులు, దుర్బలులైన ఆ ముగ్గురు సామాన్య స్త్రీల పేర్లు ప్రస్తావించాడు. స్త్రీలను చులకన చేసి మాట్లాడే పురుషాధిక్య సమాజానికి దేవుడు పెట్టిన చురక, నేర్పిన అమూల్యమైన పాఠమిది. దైవభక్తిలో తెగింపు, చొరవ లేకపోతే అది ‘కొంగజపం’, ‘వేషధారణ’ అవుతుంది. దేవుని రాజ్యాన్ని, సమాజాన్నంతటినీ, చర్చిని, పరిచర్యను కాపాడుకోవలసిన బాధ్యత విశ్వాసులందరిదీ. పాము ఇంట్లో దూరితే ఇంటిని, ఇంట్లోని చంటిపిల్లల్ని ఒదిలి ప్రాణభయంతో పారిపోయే తల్లిదండ్రులు ఇలాంటివారే! దైవభక్తి తెగింపు మిళితమైన పరిచర్య చేసిన ఒకప్పటి మార్టిన్ లూథర్, మదర్ థెరిస్సా, స్పర్జన్, నిన్నమొన్నటి మాసిలామణి, భక్తసింగ్, పి.ఎల్.పరంజ్యోతిగార్లు, ఇప్పటి స్వర్గీయ జాన్‌డేవిడ్ (చిలకలూరిపేట), రెవ.డా.జీ.శామ్యేల్ (హైదరాబాద్ బాప్టిస్టుచర్చి) అలా తెగించి దేవుని సంక్పల్పాలను నెరవేర్చినవారే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సూపర్ స్టార్‌కు విలన్‌గా ఫ్యామిలీ హీరో
సీనియర్ హీరోలందరూ ఇప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. వయసైపోయిన హీరోలందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మారిపోతుంటే ఇప్పటికీ హ్యండ్సమ్గా కనిపిస్తున్న సీనియర్ హీరోలు విలన్ రోల్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే జగపతిబాబు విలన్‌గా ఆకట్టుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో మంచి విజయాలు సాధించిన శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో విలన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు తొలి సినిమానే ఓ సూపర్ స్టార్‌కు ప్రతినాయకుడిగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా మారుతున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో విలన్ గా నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్, హీరోగా మారాక ఒక్క సినిమాలో కూడా నెగెటివ్ రోల్లో కనిపించలేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ హ్యండ్సమ్ హీరో ఇప్పుడు మరోసారి నెగెటివ్ రోల్లో నటిస్తుండటంతో ఆ సినిమాపై మాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
నాతోనే గేమ్సా?!
నన్నే మోసం చేస్తావారా? బొమ్మ పడితే వదిలేస్తా బొరుసు పడితే నరికేస్తా ఇటీవలి కాలంలో దక్షిణాది చలనచిత్రరంగంలో చెడ్డ ‘విలన్’ పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు ఆదిత్య మీనన్. ‘సింహ’ సినిమాలో గోపి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఆదిత్య. ఆ సినిమాలో అతనికి చాంతాడు పొడుగు, బీభత్సమైన డైలాగులేమీ ఉండవు. ‘ఎవడ్రా కొట్టింది?’ ‘వాడి పేరు తెలుసా?’ ‘మనం వచ్చిన పనేమిటి? ఈ గొడవేమిటి?’ ‘చేతికి దొరికిన వాడ్ని వదిలేశానురా’..... ఇలా పొడి పొడి డైలాగులతోనే వీర లెవెల్లో విలనిజాన్ని పండించాడు ఆదిత్య. తక్కువ మాటలతో ఎక్కువ నటనను ప్రదర్శించే ఆదిత్య నటనను గమనిస్తే, విలన్ల గురించి ప్రముఖ మాట ఒకటి చప్పున గుర్తుకొస్తుంది. ‘మా దగ్గర ప్లాన్లు తప్ప డైలాగులు లేవు. మా దగ్గర ప్రాబ్లమ్స్ తప్ప సొల్యూషన్స్ లేవు’ బాడీ అంతగా లేకపోయిన...డైలాగులు, హావభావాలతోనే భయపెట్టడం ఒక రకం. ఉదాహరణకు... రఘువరన్‌లాంటి వాళ్లు. నటనలో పస లేకపోయినా...ఒడ్డూ పొడుగుతోనే భయపెట్టడం రెండో రకం. రెండో రకం విలన్లు పెద్దగా కాలానికి నిలవరు. విలన్‌కు ఒడ్డూ పొడుగు, మంచి శరీరసౌష్ఠవం అవసరమేగానీ అవి మాత్రమే ఉత్తమ విలన్‌కు ప్రామాణికాలు కాలేవు. అందుకే...విలన్ జిమ్‌లోనే కాదు ‘మైండ్ జిమ్’లో కూడా గడపాలి. మానసిక కసరత్తు ఎంత బాగా జరిగితే నటన అంతగా మెరుస్తుంది. ఆదిత్య మీనన్ మంచి ఒడ్డూ, పొడుగు ఉన్న నటుడు. దీనికి తనలోని నటన కూడా తోడుకావడంతో విలన్ పాత్రలను సునాయాసంగా పోషించగలుగుతున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉత్తమ విలన్’గా రాణించగలుగుతున్నాడు. ముంబాయిలో జన్మించాడు ఆదిత్య మీనన్. కొంత కాలం తరువాత అతడి కుటుంబం దుబాయికి వలస వెళ్లింది. దుబాయిలోని ‘అవర్ ఓన్ ఇంగ్లీష్ హైస్కూల్’లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆదిత్య. పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు దుబాయిలోనే ఉన్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో పాటు బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులోని ‘యం.ఎస్.రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో ‘రేడియో మిడ్డే’లో రేడియో హోస్ట్‌గా మీడియా రంగంలోకి ప్రవేశించాడు. ప్రాడక్ట్ లాంచ్, ఫ్యాషన్ షోలాంటి లైవ్ ఈవెంట్స్‌కు హోస్టింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఈవెంట్ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే ఒక థియేటర్ గ్రూపులో చేరి కొన్ని నాటకాల్లో నటించాడు. ఒకసారి ఆదిత్య నటన ప్రకాష్ బేలవాడి కంటపడింది. బెంగళూరుకు చెందిన ప్రకాష్ బేలవాడి జర్నలిస్ట్ మాత్రమే కాదు... నాటకాలు, సినిమా, టీవీలలో నటుడిగా మంచి పేరు ఉంది. సామాజిక, కళారంగాలకు సుపరిచితమైన పేరు ప్రకాష్ బేలవాడి. ఆదిత్య నటనను చూసి ‘‘ఈ కుర్రాడిలో స్పార్క్ ఉంది’’ అనుకున్నారు ప్రకాష్. అలా ప్రకాష్ తీసిన ఒక టీవి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఆదిత్యకు. ఇదే సమయంలో ప్రముఖ కమెడియన్ యస్.కె.చంద్రు దర్శకత్వం వహించిన ‘సూర్య శిఖరీ’ టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. నాటకాల్లో నటించాడు. టీవిలో నటించాడు. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2001లో చెన్నైకు వెళ్లాడు ఆదిత్య. అవకాశాలు రాకో, మరే కారణమో తెలియదుగానీ చెన్నైకి వెళ్లిన తరువాత మళ్లీ బుల్లితెర మీద కనిపించాల్సి వచ్చింది. అలా రాడాన్ మీడియా వర్క్ నిర్మించిన ‘తంతిర భూమి’ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సన్ టీవీలో ప్రసారమైంది. ఆ సమయంలోనే ప్రఖ్యాత దర్శడుకు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ ‘అన్నీ’లో నటించే అవకాశం వచ్చింది. ‘ఆంజనేయ’ ‘జేజే’ సినిమాల్లో నటించే అవకాశం రావడం, ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలుగురి దృష్టిలో పడే ఛాన్స్ దొరికింది. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.‘సింహ’ ‘బిల్లా’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘మిర్చి’ ‘బలుపు’ ‘పవర్’ ‘లయన్’ ‘రుద్రమదేవి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆదిత్యమీనన్ మరిన్ని చెడ్డ పాత్రలతో ‘మంచి’ నటనను ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
అప్పుడు కూతురు హీరోయిన్ ఇప్పుడు తండ్రి విలన్
ఇప్పుడు సినిమా ట్రెండ్ మారుతుందనాలో, హీరోల మనసు మారుతుందనాలో తెలియదు గానీ ఒక కొత్త ఒరవడికి మాత్రం భీజం పడుతోంది. హీరోలు, హీరోయిన్లు ఇమేజ్ అనే చట్రం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంచి మాస్ హీరో ఇమేజ్ ఉన్న విశాల్ మళయాళంలో విలన్ గా నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యాక్షన్ కింగ్‌గా పేరొందిన అర్జున్ ఇప్పుడు విలన్ గా మారుతున్నారన్న తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే అర్జున్ కూతురు ఐశ్వర్య విశాల్ సరసన పట్టత్తు యానై చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారన్నది తెలిసిందే. ఇప్పుడు ఆమె తండ్రి అర్జున్ విశాల్‌కు విలన్ నికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి ఇరుంబు కుదిరై చిత్రంలో నటించనున్నారు. ఇందులో ఆయనకు విలన్ గా నటుడు ఆర్య నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ పాత్రలో అర్జున్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారు. కాగా అర్జున్ విశాల్‌కు గురువన్నది గమనార్హం. ఆయన వద్ద విశాల్ ఆదిలో సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా తనకు గురువు కావడంతో అర్జున్ కు విశాల్ పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని ముట్ట చెబుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
బాపూగారు బాగా ప్రోత్సహించారు
‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రంలో విలన్‌గా నటించా. ఈ సంక్రాంతికి విడుదలైన ఆ రెండు చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలామంది అభినందిస్తున్నారు’’ అని నటుడు సునీల్ కుమార్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నేను నటుడిగా రాణించాలనుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడే దర్శకుడు బాపూగారిని కలిశాను. ఆయన ‘భాగవతం’ సీరియల్లో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రలిచ్చి, ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘రాధాగోపాలం’, ‘సుందరకాండ’ సినిమాల్లో నటించాను. నాకు యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ధర్మనందనుడు పాత్రకు మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడగడంతో ఓకే అన్నా. సినిమాలో నా పాత్ర చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ, హేమమాలినిగార్లతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు. -
విలన్ రోల్లో ఎన్టీఆర్
కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్.. ఈ మధ్య రూట్ మార్చాడు. ప్రయోగాత్మక కథలకు ఓకె చెపుతున్నాడు. టెంపర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన జూనియర్, తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి డిఫరెంట్ ఫిలింస్ తో అలరించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో త్రిపాత్రభినయం చేయనున్నాడు. అంతేకాదు వీటిలో ఒకటి పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ విలన్ రోల్ లో మరోసారి ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు. -
తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను!
ఉత్తమ విలన్ వినీత్ కుమార్ ‘బావూజీకీ ఏంతెలుసు?’అలా అంటారేమిటండీ బాబూ... విన్నా వినగలడు. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి...అదిగో... ‘విక్రమార్కుడు’ సినిమా నుంచి మనల్ని ఉరిమురిమి చూస్తున్నాడు!బావూజీ... అలా చూడకండి..మీ గురించి చిన్న పరిచయం చేసుకుంటున్నామంతే...మన బావూజీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎంత అంటే. ఇంత...‘నా రాజ్యం రామరాజ్యం.ఇక్కడ మర్డర్లుండవు. రేప్‌లు ఉండవు’అదేంటండీ... ఆయన మాట్లాడిందాట్లో తప్పేముంది?అలా అని బావూజీది ఆదర్శ రాజ్యం అనుకునేరు... పప్పులో నుంచి కాలు తీసి మిగతా వాక్యాలు కూడా వినండి...‘ఎవడైనా మాట వినకపోతే కదరా...మర్డర్ చేయాలి.ఎవరైనా రానంటే కదరా...రేప్ చేయాలి.ఎవడైనా ఇవ్వనంటే కదరా... మర్డర్ చేయాలి. అవ్వేమీ లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉంది’ ‘ప్రశాంతత’కు ఎంత చక్కని నిర్వచనం ఇచ్చాడో కదా ఈ విలనీయుడు! తన గురించి ప్రజల్లో ఉండే విశ్వాసం గురించి కూడా ఈ విలనీయుడికి వీరలెవెల్లో విశ్వాసం ఉంది.‘ఒక్కరు తెగించి ముందుకు వస్తే... ఈరోజు వీడి బతుకైపోతుంది. రండి’ జనాలతో అంటున్నాడు హీరో. ఈ మాటలు విన్న బావూజీ ఊరుకుంటాడా ఏమిటి?‘రండిరా రండిరా... క్యా రండిరా?’ అంటూ వెక్కిరిస్తూనే...‘వాళ్ల గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా... ఈ బావూజీ ముద్రలు’ అనగలడు.ఎంత కాన్ఫిడెన్సో!ఏడి... కనిపించడం లేదే...అదిగో ‘రామ రామ క్రిష్ణ క్రిష్ణ’ సినిమాలో కళ్లద్దాలు, సూటుబూటుతో ‘పవర్’గా మన ముందుకు వస్తున్నాడుబావూజీ. చూడండి ఆ కళ్లలో బాధ. ‘విక్రమార్కుడు’లో కొడుకు పోయిన బాధను కళ్లల్లో ఎర్రటి జీరతో ఎంత శక్తిమంతంగా వ్యక్తీకరించాడో! ఇప్పుడు తమ్ముడు పోయిన బాధలో ఏమంటున్నాడో చూడండి...‘తమ్ముడూ...నీకు నడవడం నేర్పించాను.పొడవడం నేర్పించాను.చంపడం నేర్పించాను’ఇంతకీ ఎవరీ నేర్పరి?వినీత్‌కుమార్ సింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు.‘విక్రమార్కుడు... బావూజీ’ అంటే మాత్రం చాలామంది గుర్తు పడతారు. ∙∙l వినీత్ కుమార్ స్వస్థలం పట్నా (బిహార్). బి.ఎన్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన వినీత్ పట్నా యూనివర్సిటీలో లా, సైకాలజీ పూర్తిచేశాడు. వినీత్‌కు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. ఎవరైనా మాట్లాడుకుంటుంటే వారి హావభావాలను గమనించడం. ఈ అలవాటే సైకాలజీలో పీజీ చేయడానికి ఉపకరించడమే కాదు... తన నటనకు అవసరమైన సరంజామాను అందించింది. అన్న ఐపీయస్కు సెలెక్ట్ కావడంతో వినీత్‌పై ఒత్తిడి పెరిగింది. ‘‘అన్నయ్యలాగే ఏదైనా మంచి ఉద్యోగం చెయ్’’ అని ఇంటా బయట సలహాలు. అయితే... వినీత్ మనసంతా నటనపై ఉంది. తండ్రిని తృప్తి పరచడానికి లా కాలేజీలో చేరాడు. ఆ సమయంలో బోలెడు తీరిక దొరకడంతో నాటకాలపై దృష్టి పెట్టాడు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, పట్నా విభాగంలో చేరాడు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’(ఎన్ఎస్డీ)లో చేరాడు. అక్కడ ఎందరో గొప్ప నటుల పరిచయం అయింది. నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ‘ద్రోహ్కాల్’ ‘శూల్’ ‘యే దిల్’ ‘మంజ్నాథ్’ ‘గాడ్‌మదర్’ ‘దౌడ్’ ‘మసాన్’... మొదలైన బాలీవుడ్ సినిమాలతో వినీత్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఫ్లై అవే సోలో’ ‘భోపాల్: ఏ ప్రేయర్ ఫర్ రెయిన్’ ‘రిటర్న్ టూ రాజాపూర్’ ‘స్ట్రింగ్స్’ ‘ఎలక్ట్రిక్ మూన్’... ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించాడు. ఇక తెలుగు విషయానికి వస్తే ‘విక్రమార్కుడు’లో బావూజీ పాత్ర ఆయనకు విలన్‌గా ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘కందిరీగ’ ‘నాయక్’ ‘ఆగడు’ ‘సుప్రీం’ ‘శివం’ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పవర్ ఆఫ్ ఇమాజీనేషన్’ అనేది నటుడికి ముఖ్యం అని నమ్ముతాడు వినీత్. దీనికోసం ఫిక్షన్ చదవాలని కూడా చెబుతాడు. ఈ కసరత్తులే వినీత్ కుమార్‌ను వెండి తెర ‘ఉత్తమ విలన్’గా తీర్చిదిద్దాయి. -
అందులో విలన్.. ఇందులో హీరో!
‘బాహుబలి’లో కాలకేయగా, అంతకు ముందు పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన ప్రభాకర్ ఇప్పుడు హీరో తరహా పాత్రలు చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ‘రైట్... రైట్’లో పాజిటివ్ క్యారెక్టర్ చేశారు. త్వరలో ‘రక్షక భటుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వి, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్యతారలుగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘రక్షక భటుడు’. సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. సంస్థ లోగోను మరో నిర్మాత ఎమ్మెస్ రాజు విడుదల చేశారు. ‘‘కొత్త కథతో క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ సినిమా చేస్తున్నాను. రెండు గంటల సినిమాలో చివరి 15 నిమిషాలు థ్రిల్లింగ్‌గా, మిగతాదంతా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు ఎ. గురురాజ్. ఎస్.ఎల్. గ్రూప్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, సినిమాటోగ్రాఫర్ జోషి పాల్గొన్నారు. -
విలన్ పాత్రకు కత్తెర
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీఒరువన్కు ధృవ రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్లో హీరోకు ధీటుగా కనిపించే విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి, తెలుగు వర్షన్ లోనూ విలన్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఒరిజినల్ వర్షన్ విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాదాపు హీరో కనిపించినంత సేపు విలన్ కూడా తెర మీద కనిపిస్తాడు. కానీ తెలుగు వర్షన్లో మాత్రం ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌కు కోత పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ్‌తో పొలిస్తే ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అయితే కోలీవుడ్‌లో సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన విలన్ క్యారెక్టర్‌కు కోత పెడితే.., తెలుగులో సినిమా రిజల్ట్ తేడా పడే చాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
ఈ బసవరాజు బయటికి వస్తే... ఇక అంతే!
ఉత్తమ విలన్ ఇతని పేరు బసవరాజు. తను సహజంగా బయటికి రాడు. వచ్చాడంటే ఏదో ఒక దారుణం జరుగుతుంది. అతడి అన్న రామరాజు... లోకల్ ఎం.ఎల్.ఏ. ఆలోచన అతనిది. ఆచరణ ఇతనిది. పై పరిచయ వాక్యాలు బసవరాజుగా నటించిన ‘రాహుల్ దేవ్’ గురించి ‘తులసి’ సినిమాలో వినిపిస్తాయి. విలన్ అంటే... డైలాగులతోనైనా భయపెట్టాలి. దేహదారుఢ్యంతోనైనా భయపెట్టాలి. హావభావాలతోనైనా భయపెట్టాలి. అలా అని... రాహుల్ దేవ్ వీర శూర భీకర... పంచ్ డైలాగులు వాడలేదు. అదే పనిగా తన ‘ప్యాక్’ బాడీని ప్రదర్శించలేదు. హావభావాలు కూడా అతిగా ప్రదర్శించలేదు. ‘ఎంత చేయాలో అంత’ అనే లెక్క ప్రకారమే నటిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప... ప్రేక్షకులను భయపెట్టడానికి నటనతో నానా తిప్పలు పడినట్లు కనిపించదు. ‘టక్కరి దొంగ’ సినిమాలో ‘రేయ్ నేను నీ తమ్ముడిని రా’ అని ఒకవైపు బంధం గుర్తు తెస్తూనే... మరోవైపు... నిజం చెప్పించడానికి పది ఛాన్సులు ఇవ్వగలడు. ఆ తరువాత... ఏ ఛాన్సూ ఉండదు. అడకత్తెరతో వేళ్లను ఒక్కటొక్కడిగా కట్ చేయగలడు.మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో ‘శాకా’గా తెలుగు తెరకు పరిచయం అయిన రాహుల్‌దేవ్... మొదటి సీన్‌తోనే ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. ఆ సినిమా బాగా ఆడి ఉంటే... తెలుగు తెరపై రాహుల్ దేవ్ మరింత బాగా పాపులరై ఉండేవాడేమో. ‘నా బెంగుళూరులో నన్ను కొట్టి బతుకుదామనే’ అని ‘బసరావజు’గా వార్నింగ్ ఇచ్చినా...‘నన్ను ఎదిరించాలంటే... ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలి’ అంటూ శ్రీశైలంగా ‘చిన్నోడు’ సినిమాలో తన శక్తి ఏమిటో చెప్పదలిచినా.... రాహుల్ దేవ్ అంటే విలన్. ఒక స్టైలిష్ విలన్. అతని విలనిజం నడకలో ఉందా, పల్చటి పొడవాటి తల వెంట్రుకలలో ఉందా, కండల్లో ఉందా... కళ్లలో ఉందా... కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే! హీరో పర్సనాలిటీ ఉన్న రాహుల్ ‘విలన్’ ఎలా అయ్యాడు?తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందట. డైరీలో మనమొకటి రాసుకుంటే... విధి మన నుదుట మరొకటి రాస్తుందట. రాహల్ దేవ్ మొదట మోడల్. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాడు.అయితే ‘మోడల్’ కావాలనిగానీ, ‘యాక్టర్’ కావాలనిగానీ ఎప్పుడూ అనుకోలేదు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ‘ఇలా కావాలనుకుంటున్నాను’ అని చెప్పే పరిస్థితి ఇంట్లో లేదు. ఒంట్లోనేమో ధైర్యం లేదు.నాన్న ఐపీఎస్ ఆఫీసర్, అమ్మ టీచర్. చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో తన డ్రీమ్ గురించి రాహుల్‌కు పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. కాలేజీ రోజుల్లో ఒక డిస్కోలో రాహుల్‌ను చూసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ ఖోల్సా రేమండ్స్ కోసం మోడలింగ్ చేయమని అడిగాడు. రాహుల్‌కు మోడలింగ్ గురించి ఏమీ తెలియదు, రోహిత్ ఖోల్సా గురించి కూడా ఎప్పుడూ విని ఉండలేదు. ‘ఒక్కసారి ట్రై చేసి చూద్దాం’ అని రంగంలోకి దూకాడు. అలా... మోడల్ అయ్యాడు.ఆ తరువాత... ‘దస్’ సినిమాతో వెండితెర మీదికి వచ్చాడు.సాధారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తరువాత... సినిమాల్లోకి వస్తారు. రాహుల్ మాత్రం... సినిమాల్లోకి వచ్చాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘ఛాంపియన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ‘నసీర్ అహ్మద్’గా ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు. ‘‘మోడలింగ్‌లో పర్సనల్ స్టైల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. అయితే నటన ఇందుకు విరుద్ధం. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు పాత్రే కనిపించాలి తప్ప మనం కాదు’’ అంటాడు రాహుల్. అందుకే... తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తన పేరుతో కంటే... ‘సాధు’ ‘బసవరాజు’ ‘వీరుభాయి’ మొదలైన పాత్రలతోనే రాహుల్ దేవ్ ఫేమస్ అయ్యాడు.‘మోడల్స్ నటులుగా మారితే వారి నటన అంతంత మాత్రంగానే ఉంటుంది’ అనే విమర్శ తప్పని... రాహుల్ దేవ్ విలనిజాన్ని చూస్తే మరోసారి అర్థమవుతుంది. అందుకే... రాహుల్ కేవలం నటుడు మాత్రమే కాదు ‘ఉత్తమ విలన్’ కూడా. -
అజిత్‌కు విలన్‌గా వివేక్ ఒబెరాయ్
హిందీ ప్రముఖ కథానాయకులు కోలీవుడ్‌లో ప్రతినాయకులుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ 2.ఓ చిత్రంలో సూపర్‌స్టార్‌కు విలన్‌గా మారితే తాజాగా అజిత్‌కు స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా మారనున్నారు. అజిత్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన విలన్‌గా నటించడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. వీరం, వేదాళం తరువాత అజిత్ దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కాజల్‌అగర్వాల్ నాయకీగానూ, కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. వెట్రి చాయాగ్రహణం, అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే బల్గేరి, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో విలన్ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులను సంప్రదించినట్లు తెలిసింది. వారిలో అభిషేక్‌బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ పేర్లు కూడా చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరికి చిత్ర వర్గాలు నటుడు వివేక్ ఒబెరాయ్‌ను అజిత్‌కు విలన్‌గా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వివేక్ ఒబెరాయ్‌కు ఇంతకు ముందు హిందీలోనే కాకుండా తెలుగులోనూ హీరోగా నటించిన అనుభవం ఉంది. అయితే తమిళంలో మాత్రం అజిత్‌కు విలన్‌గానే పరిచయం కానున్నారు. అయితే ఆయన తమిళనాట సునామీ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సేవాకార్యక్రమాలు చేశారన్నది గమనార్హం. -
నయనతార విలన్‌కి వెల్కమ్!
‘నాన్ దాన్ రుద్ర’ (నేనేరా రుద్ర).. అంటూ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ డైలాగులు చెబుతున్నారు. తమిళ భాషపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. హిందీ వదిలేసి తమిళ సినిమా ఏదైనా తీస్తున్నారా? అనుకుంటున్నారా? దర్శకుడిగా కాదు, విలన్‌గా తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారాయన. నయనతార పోలీసాఫీసర్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగల్’. ఇందులో రౌడీ రుద్ర పాత్రలో అనురాగ్ నటించనున్నారు. విలన్‌గా అనురాగ్ కశ్యప్‌కి రెండో చిత్రమిది. ఆల్రెడీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘అకీరా’లో విలన్ ఈయనే. ఆ సినిమాలో అనురాగ్ విలనిజంకి ఫిదా అయిన మురుగదాస్ తాజా తమిళ సినిమాకి ఆయన పేరును సూచించారట. ‘‘అనురాగ్ జీ.. వెల్కమ్ టు తమిళ ఇండస్ట్రీ’’ అని చిత్రదర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పేర్కొన్నారు. ఇందులో నయనతార, అనురాగ్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో అథర్వ, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
భర్తను విలన్‌గా మార్చిన సిమ్రాన్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్. పెళ్లికి ముందు ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్‌లోనూ నాయకిగా ఇరగదీశారు.చాలా మంది ప్రముఖ హీరోయిన్లు వివాహానంతరం నటనకు కొంత గ్యాప్ ఇచ్చి కొంత కాలం తరువాత రీఎంట్రీ అయ్యి వివిధ రకాల పాత్రలతో బిజీ అవుతుండడం చూస్తున్నాం. నటి జ్యోతిక లాంటి కొందరు రీఎంట్రీలోనూ మంచి పాత్రలను ఎంపిక చేసుకుని కథానాయకిగానే కొనసాగుతున్నారు. నటి సిమ్రాన్ కూడా దీపక్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత నటనకు తిరిగొచ్చారు. అలా ఆహా కల్యాణం, త్రిషా ఇల్లన్న నయనతార, కరైయోరం లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా, పెద్దగా రాణించలేకపోయారు. అవకాశాలు కూడా అంతగా లేవనే చెప్పక తప్పదు. మధ్యలో సొంత చిత్ర నిర్మాణం, బుల్లి తెర సీరియళ్ల నిర్మాణాల ప్రయత్నాలు చేశారు. అయితే కారణాలేమైనా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక తన భర్తను హీరోగా పరిచయం చేయాలన్న కోరిక ఫలించలేదు. ఇతర ప్రముఖ కథానాయకుల చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా అవీ జరగలేదు. ఇలా హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం గడిచి పోతుందని భావించేరో ఏమో, ఇప్పుడు తన భర్త దీపక్‌ను విలన్‌గా మార్చేశారు. అవును ఓడు రాజా ఓడు చిత్రంలో దీపక్ విలన్‌గా నటిస్తున్నారు. జోకర్ గురుసోమసుందర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాజర్,చారుహాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిశాంత్ రవీంద్రన్, జతిన్ శకర్‌రాజా ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి వినోదభరిత కథా చిత్రం అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు. -
నయనతారకు విలన్!
వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాలతో పాటు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఎంతవాడు గాని’ వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా దర్శకుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్ మీనన్. అడపా దడపా అతిథి పాత్రల్లో తెరపై కనిపిస్తుంటారాయన. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గా నటించనున్నారని చెన్నై టాక్. నయనతార కథానాయికగా తమిళంలో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం గౌతమ్ మీనన్‌ను విలన్ పాత్రకు అడిగారట. కథ విని, ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
ఉత్తమ విలన్
వీరు పెంటయ్య... వీరశంకరరెడ్డి ఎలా అయ్యాడు? ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపుతా’ కేకలు... చప్పట్లు.... వన్స్మోర్లు... హీరోగారి నుంచి ఈ పవర్ఫుల్ డైలాగ్ రావడానికి కారణం ఎవరు? విలన్. విలన్ ఎంత గట్టివాడైతే హీరో నోటి నుంచి అంత పవర్ఫుల్ డైలాగ్‌లు వస్తాయి అని చెప్పడానికి ఈ పాపులర్ డైలాగే ఉదాహరణ. మరి ఈ లెక్కన కుప్పుస్వామినాయుడు కూడా గా...ట్టి విలనే కదా! దేవాలయంలో దేవునికి నిశ్శబ్దంగా మొక్కుకుంటున్న నరసింహనాయుడితో గిచ్చి తగాదా పెట్టుకోవాలనుకుంటాడు కుప్పుస్వామి నాయుడు. ఇలా ఒక డైలాగు కూడా విసురుతాడు... ‘నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలనాయుడి బావమరిదిని. బావమరదులు బావ బతుకు కోరుతారు. కానీ నా బావ బతికిలేడు. కనుక... నేను మా బావను చంపినవాడి చావు చూసే వరకు నిద్రపోను’ అంతేనా? ‘ఇది గుడైపోయిందిరా’ అని కూడా కవ్విస్తాడు. మరి హీరో ఊరుకుంటాడా? ‘ఎక్కడైనా’ ‘ఎప్పుడైనా’ అంటూనే ‘కత్తులతో కాదురా...’లాంటి పవర్ఫుల్డైలాగ్ చెబుతాడు. ‘గాండీవం’లో వీరు పెంటయ్య, ‘మనోహరం’లో ఐఎస్ఐ బాషా, అంతకుముందు బాలీవుడ్ సినిమాలు ‘ఘాయల్’ ‘పరంపర’ ‘గర్దిష్’ ‘బాజీ’... ముఖేష్ రుషి చాలా బాగానే నటించి ఉండొచ్చు....అయితే మన మాస్ కళ్లకు దగ్గర చేసింది మాత్రం ‘నరసింహనాయుడు’ ‘ఇంద్ర’లాంటి సినిమాలే. ఫ్యాక్షనిస్ట్ అనగానే తనే గుర్తుకుచ్చేలా నటించాడు ముఖేష్. ఆరడుగుల ఎత్తుకు, డబ్బింగ్ కంచుకంఠం తోడై కళ్లతోనే ఎర్రగా రౌద్రం పలికించి ‘విలన్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా చేశాడు. చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ముంబైలో స్టోన్-క్రషింగ్ బిజినెస్ చేశాడు ముఖేష్. ఆ తరువాత ఫిజీలో వ్యాపారం చేయడానికి వెళ్లాడు. అక్కడ కొన్నేళ్లు ఉన్న తరువాత న్యూజిలాండ్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేయడానికి వెళ్లాడు. అదే సమయంలో వివిధ కంపెనీలకు మోడలింగ్ కూడా చేసేవాడు. తీరిక లేని ఉద్యోగం, మోడలింగ్...ఈ రెండూ సంతృప్తి ఇవ్వడం లేదు. మనసు ఇంటివైపు లాగుతుంది. అలా ఏడు సంవత్సరాల తరువాత ముంబైకి తిరిగివచ్చాడు. ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్ స్కూల్’లో చేరాడు. ‘‘నేను మంచి నటుడిని కాదు అనే విషయం నాకు తెలుసు. నటనలో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు బాగా నటిస్తున్నావు. ఇక వేషాల కోసం ప్రయత్నించవచ్చు అనే మీరు చెప్పేదాకా నా ప్రయత్నాలేవీ చేయను’’ అని తనేజాతో చెప్పాడు. అయితే ఆరునెలలకే ‘ఇక నువ్వు దూసుకెళ్లవచ్చు’ అంటూ తనేజా అనుమతి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు ముఖేష్. సంజయ్‌ఖాన్ ‘టిప్పు సుల్తాన్’ సీరియల్‌తో ముఖేష్‌కు తొలి బ్రేక్ వచ్చింది. అందులో మీర్ అలీఖాన్ పాత్ర వేశాడు ముఖేష్. ఎత్తు, మంచి శరీరసౌష్టవం ఉండడం వల్ల పెద్దగా కష్టపడకుండానే ముఖేష్‌కు అవకాశాలు వచ్చేవి. ప్రియదర్శన్ ‘గర్దిష్’ సినిమాలో బిల్లా జిలానీ పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో గట్టి విలన్‌గా గుర్తింపు పొందాడు ముఖేష్. ఆ తరువాత వరుసగా నలభై సినిమాలు చేశాడు. అన్నీ నెగెటివ్ రోల్సే. ఇక ‘సర్ఫ్రోష్’లో ఇన్స్పెక్టర్ సలీమ్ పాత్రను చాలెంజింగ్‌గా తీనుకొని అద్భుతంగా నటించాడు ముఖేష్. ఆ పాత్ర ప్రేక్షకులపై ఎంత ముద్రవేసిందంటే... ఒకసారి ముఖేష్ జమ్మూలో ఉన్నప్పుడు ఒక సంభాషణ వినిపించింది. ఒకరు ఇలా అంటున్నారు... ‘‘ఈ దేశం నుంచి టైజాన్ని తుడిచిపెట్టాలంటే అజయ్‌సింగ్ రాథోడ్(అమీర్‌ఖాన్), సలీమ్(ముఖేష్ రుషి) కావాలి’’ ముఖేష్ రుషిని విలన్ పాత్రల్లో చూసీ చూసీ కొందరు ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. వాళ్ల అబ్బాయి... ‘‘మంచి పాత్రలు వేయవూ’’ అని అడిగి ఉండవచ్చు. అయితే నటన విషయంలో... ‘మంచి పాత్ర’ అంటే నైతిక విలువలతో ముడిపడి ఉన్నది కాదు. ఎంత మంచిగా నటించాడన్నదే మంచి పాత్ర. ఆ రకంగా... ముఖేష్ రుషి ఉత్తమవిలన్. ‘గాండీవం’లో వీరు పెంటయ్యగా పరిచయమై కానట్లు అనిపించినా, వీరశంకరరెడ్డిగా మాత్రం ఇప్పుడు ముఖేష్ సుపరిచితుడు. దీనికి కారణం ఆయన అత్యున్నత నటన అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!