విలన్ పాత్ర చేస్తానంటున్న సునీల్!! | Comedian Sunil Varma keen to play villain | Sakshi
Sakshi News home page

విలన్ పాత్ర చేస్తానంటున్న సునీల్!!

Published Mon, Dec 2 2013 12:35 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

విలన్ పాత్ర చేస్తానంటున్న సునీల్!! - Sakshi

విలన్ పాత్ర చేస్తానంటున్న సునీల్!!

సునీల్ అనగానే ఒక్కసారిగా పెదాలమీదకి నవ్వు ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో సిక్స్ ప్యాక్ బాడీతో హీరో పాత్రలు చేసినా ఇప్పటికీ సునీల్ తన నవ్వులతోనే ఎక్కువగా అలరిస్తున్నారు. అలాంటి సునీల్.. ఇప్పుడు కొత్తగా విలన్ పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. మంచి అవకాశం వస్తే తప్పకుండా విలన్ పాత్ర చేస్తానని చెబుతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం అంటే తనకు చెప్పలేనంత అభిమానం ఉందని, ఆయన సినిమాల్లోనే విలన్గా కూడా చేయాలని ఉందని చెప్పాడు. ఇంతవరకు తనకా అవకాశం రాలేదు గానీ, మర్యాద రామన్న చిత్రంతో తనను హీరో చేసింది కూడా ఆయనేనని సునీల్ గుర్తుచేశాడు.

ఇప్పుడు రాజమౌళి చిత్రంలో విలన్గా చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం తప్పకుండా సంతోషంగా విలన్గా చేస్తానని సునీల్ అన్నాడు. ఇతర సినిమాల్లోనైనా విలన్గా చేయడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే మంచి పాత్ర మాత్రం కావాలని తెలిపాడు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నేను లాంటి సినిమాల్లో కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సునీల్, గత రెండేళ్లలో తడాఖా, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాల్లో హీరో పాత్రలు చేశాడు. మొదట్లో కమెడియన్ పాత్రలు పోషించేటప్పుడు ఏడాదికి పది సినిమాలు చేసేవాడినని, కానీ ఇప్పుడు హీరోగా మాత్రం గట్టిగా రెండు సినిమాలు కూడా చేయలేకపోతున్నానని సునీల్ అంటున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేశాననేదానికన్నా ప్రేక్షకులు తనను ఎంతగా ఆదరించారన్నదే ముఖ్యమని చెబుతున్నాడు. ప్రస్తుతం సునీల్ 'భక్త కన్నప్ప' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement