పవన్కి విలన్.. ప్రభాస్కు ప్రాణం | Sharad Kelkar: villain in sardar gabbar singh, dubbed for Prabhas again in Bahubali 2 | Sakshi
Sakshi News home page

పవన్కి విలన్.. ప్రభాస్కు ప్రాణం

Published Mon, Apr 4 2016 6:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

పవన్కి విలన్.. ప్రభాస్కు ప్రాణం

పవన్కి విలన్.. ప్రభాస్కు ప్రాణం

మొన్నటివరకు అతనో సాధారణ టీవీ సీరియల్ నటుడు. 'శరద్ కేల్కర్.. బాగా నటిస్తాడు' అనే కితాబులే తప్ప పెద్దగా అవకాశాలు చిక్కని పరిస్థితి. అయితే బాహుబలి- ది బిగినింగ్ విడుదలయ్యాక మాత్రం అతని దశ,దిశలు మారిపోయాయి. హిందీ బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పి తన గొంతుతో బాహుబలి పాత్రకు ప్రాణంపోసిన శరద్ కేల్కర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్(భైరవ్ సింగ్)గా నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే విలేకరులతో మాట్లాడిన శరద్ కేల్కర్ ఏమన్నాడంటే..

'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement