Sharad Kelkar
-
ప్రముఖ నటుడికి రెమ్యునరేషన్ రూ.101.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో శరద్ కేల్కర్ విలన్‌గా చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో దానిలో యాక్ట్ చేయలేదు. అదే టైంలో హిందీలో వెబ్ సిరీసులు, సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లోనూ ప్రియమణికి బాస్‌గా చేసింది ఇతడే. పాపులర్ యాక్టర్స్‌లో ఒకరైన శరద్.. రీసెంట్గా 'శ్రీకాంత్' మూవీలో నటించినందుకుగానూ కేవలం రూ.101 తీసుకున్నాడట. తాజాగా ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)'తుషార్ ('శ్రీకాంత్' డైరెక్టర్) దగ్గర డబ్బుల్లేవు. కానీ నన్ను సినిమాలో పెట్టుకోవాలని ఉంది. తను సినిమా గురించి అడగ్గానే.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకూడదని అనుకున్నాను. ఇదే కాదు తుషార్ నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. అలానే తుషార్ నిజాయతీ నచ్చింది. డబ్బులుంటే నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాడనని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవాలనిపించలేదు. అందుకే రూ.101 మాత్రమే తీసుకున్నాను' అని శరద్ కేల్కర్ చెప్పాడు.రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీకాంత్' సినిమాని తెలుగు కుర్రాడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో చూపు కోల్పోయిన శ్రీకాంత్.. బిజినెస్‌మ్యాన్ ఎలా అయ్యాడు? పలు ఇండస్ట్రీలకు యజమాని ఎలా అయ్యాడు అనేదే స్టోరీ. ఇందులో సెకండాఫ్‌లో వచ్చే చిన్న పాత్రలో శరద్ కేల్కర్ నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?) -
నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్: నటుడు
ప్రభాస్ కెరీర్లో అత్యంత డిజాస్టర్ మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. నిర్మొహమాటంగా తిరస్కరించారు. అయితే తన కూతురు మాత్రం ఇప్పటివరకు చూసిన ఏకైక సినిమా ఆదిపురుష్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్.ఇదే బెటర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను ఏయే సినిమాలు చేశాను, అసలు ఏం చేస్తున్నాననేది నా కూతురు కేశ పెద్దగా పట్టించుకోదు. అసలు నేను నటించిన సినిమాలే చూడదు. టీవీ షోలు, సినిమాలపై అంతగా ఆసక్తి చూపించదు. కాబట్టి నా వృత్తేంటో తనకు తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదే నయం. తనిలా అమాయకంగా ఉంటేనే బాగుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనేంటో, నా పాపులారిటీ ఎలా ఉంటుందో తనకు నేనే పరిచయం చేస్తాను.గొంతు గుర్తుపట్టిందిఅప్పటివరకు అందరు పిల్లల్లాగే తను కూడా బాల్యాన్ని సాధారణ బాలికలా ఎంజాయ్ చేయాలి. తను ఇంతవరకు నా సినిమాలేవీ చూడలేదు. ఆమె చూసిన ఏకైక చిత్రం ఆదిపురుష్. అప్పుడప్పుడు యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూస్తూ ఉంటుంది. ఆదిపురుష్ మూవీలో నా గొంతును గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తను ఎదుగుతోంది కాబట్టి నెమ్మదిగా యాక్షన్ కామెడీ సినిమాలు కూడా చూపించడం మొదలుపెడతాను' అని చెప్పుకొచ్చాడు.నటుడిగా, వాయిస్ ఆర్టిస్టుగాశరద్ కేల్కర్ మొదట్లో సీరియల్స్‌లో నటించాడు. తర్వాత సినిమాలకు షిఫ్ట్ అయ్యాడు. హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్‌లో రాజా భైరవ్ సింగ్‌గా మెప్పించాడు. ఇటీవలే అయలాన్ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. పలు హాలీవుడ్ సినిమాల్లోని పాపులర్ పాత్రలకు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. అలాగే రామ్‌చరణ్ (వినయ విధేయ రామ), ప్రభాస్ (సలార్, బాహుబలి 1, 2, ఆదిపురుష్)కు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. దసరా హిందీ వర్షన్లో నానికి గొంతు అరువిచ్చాడు.చదవండి: ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి వర్మ ఆహ్వానం.. జూన్ 9న లిస్ట్ విడుదల -
కేవలం గుడ్లు, రోటీలతోనే బతికా: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడు
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. శరద్ 2004లో హిందీ సినిమా హల్ చల్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టారు. శరద్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠి భాషా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో రాజా భైరోన్ సింగ్ పాత్రలో నటించారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2002లో ముంబయికి వచ్చాక చిత్ర పరిశ్రమలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఆయన పాల్గొన్న సైరస్ బ్రోచా పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. శరద్ కేల్కర్ మాట్లాడుతూ.. 'నేను బాంద్రాలోని బజార్ రోడ్లో ఒక గదిలో ఉండేవాన్ని. ఒకే రూమ్‌లో తొమ్మిది మంది కలిసి ఉండేవాళ్లం. అదే రూమ్‌ను రాజస్థానీ డాబాగా ఉపయోగించేది. అక్కడ ఒక చపాతీ 2 రూపాయలకు అమ్మేవారు. అక్కడే నేను గ్యాస్ సిలిండర్లు చూసుకునేవాడిని. అందుకు వారితో నా ఒప్పందం రోజుకు నాలుగు గుడ్లు, రెండు రోటీలు. అది రెండుపూటలా ఇవ్వాలి. నేను అలా రోజుకు రూ. 25తోనే బతికా. మేము ఏదైనా పని దొరికినప్పుడు మాత్రమే పార్టీ చేసుకునేవాళ్లం. అప్పట్లో తాను పనిచేసే జిమ్‌లో నెలకు రూ. 2750 సంపాదించేవాడిని. ఆ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో రూ. 5000 ఆఫర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.' అని అన్నారు. -
సామాజిక కార్యకర్త
1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్బెన్ జెతా మదర్పార్య. ఈ సుందర్బెన్ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అభిషేక్ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
పవన్‌కి విలన్.. ప్రభాస్‌కు ప్రాణం
మొన్నటివరకు అతనో సాధారణ టీవీ సీరియల్ నటుడు. 'శరద్ కేల్కర్.. బాగా నటిస్తాడు' అనే కితాబులే తప్ప పెద్దగా అవకాశాలు చిక్కని పరిస్థితి. అయితే బాహుబలి- ది బిగినింగ్ విడుదలయ్యాక మాత్రం అతని దశ,దిశలు మారిపోయాయి. హిందీ బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పి తన గొంతుతో బాహుబలి పాత్రకు ప్రాణంపోసిన శరద్ కేల్కర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్(భైరవ్ సింగ్)గా నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే విలేకరులతో మాట్లాడిన శరద్ కేల్కర్ ఏమన్నాడంటే.. 'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్. -
'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు'
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతున్న యువనటుడు శరద్ కేల్కర్, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రాక్షసుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు. స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని, తర్వాత ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఉత్తరాదిన టీవీ సీరియల్స్‌తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శరద్ కేల్కర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. సర్దార్ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శరద్ కేల్కర్, పవన్‌తో పాటు సినిమా యూనిట్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి వివరించాడు. తొలిసారిగా తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు. ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగిడాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసి ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.