సామాజిక కార్యకర్త | Sonakshi Sinha has unveiled her first look from her upcoming film Bhuj | Sakshi
Sakshi News home page

సామాజిక కార్యకర్త

Published Sat, Jul 18 2020 3:45 AM | Last Updated on Sat, Jul 18 2020 5:15 AM

Sonakshi Sinha has unveiled her first look from her upcoming film Bhuj - Sakshi

సోనాక్షీ సిన్హా

1971లో జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. అజయ్‌ దేవగన్, సంజయ్‌ దత్, సోనాక్షీ సిన్హా, షరద్‌ కేల్కర్, ప్రణీతా సుభాష్‌ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్‌ అనే ఎయిర్‌పోర్ట్‌ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ విజయ్‌ కార్నిక్‌ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు.

ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్‌బెన్‌ జెతా మదర్‌పార్య. ఈ సుందర్‌బెన్‌ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్‌ బెన్‌ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. అభిషేక్‌ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement