ప్రముఖ నటుడికి రెమ్యునరేషన్ రూ.101.. ఎందుకంటే? | Sharad Kelkar 101 Rupees Remuneration For Srikanth Movie | Sakshi
Sakshi News home page

Sharad Kelkar: అందుకే తక్కువ పారితోషికం తీసుకున్నా

Published Fri, Aug 30 2024 9:33 PM | Last Updated on Fri, Aug 30 2024 9:33 PM

Sharad Kelkar 101 Rupees Remuneration For Srikanth Movie

పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో శరద్ కేల్కర్ విలన్‌గా చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో దానిలో యాక్ట్ చేయలేదు. అదే టైంలో హిందీలో వెబ్ సిరీసులు, సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లోనూ ప్రియమణికి బాస్‌గా చేసింది ఇతడే. పాపులర్ యాక్టర్స్‌లో ఒకరైన శరద్.. రీసెంట్‌గా 'శ్రీకాంత్' మూవీలో నటించినందుకుగానూ కేవలం రూ.101 తీసుకున్నాడట. తాజాగా ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)

'తుషార్ ('శ్రీకాంత్' డైరెక్టర్) దగ్గర డబ్బుల్లేవు. కానీ నన్ను సినిమాలో పెట్టుకోవాలని ఉంది. తను సినిమా గురించి అడగ్గానే.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకూడదని అనుకున్నాను. ఇదే కాదు తుషార్ నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. అలానే తుషార్ నిజాయతీ నచ్చింది. డబ్బులుంటే నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాడనని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవాలనిపించలేదు. అందుకే రూ.101 మాత్రమే తీసుకున్నాను' అని శరద్ కేల్కర్ చెప్పాడు.

రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీకాంత్' సినిమాని తెలుగు కుర్రాడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో చూపు కోల్పోయిన శ్రీకాంత్.. బిజినెస్‌మ్యాన్ ఎలా అయ్యాడు? పలు ఇండస్ట్రీలకు యజమాని ఎలా అయ్యాడు అనేదే స్టోరీ. ఇందులో సెకండాఫ్‌లో వచ్చే చిన్న పాత్రలో శరద్ కేల్కర్ నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement