వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది? | Aditi Rao Hydari Siddharth Wedding Details Latest | Sakshi
Sakshi News home page

Aidti Rao Hydari: పెళ్లి డీటైల్స్ బయటపెట్టిన హీరోయిన్ అదితీ

Published Fri, Aug 30 2024 5:39 PM | Last Updated on Fri, Aug 30 2024 7:15 PM

Aditi Rao Hydari Siddharth Wedding Details Latest

హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది. హీరో సిద్ధార్థ్‌తో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె.. ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణలోని వనపర్తిలోని ఆలయంలో నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా ఈ వేడుక జరిగిపోయింది. తాజాగా అదితీ పెళ్లి గురించి మాట్లాడింది. వనపర్తిలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇంకా ఏమేం మాట్లాడిందంటే?

అక్కడే ప్రపోజ్ చేశాడు
'మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకునే దాన్ని. హైదరాబాద్‌లో ఆమెకు ఓ స్కూల్ ఉంది. అది నాకు చాలా స్పెషల్. నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నాళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఇది సిద్ధార్థ్‌కి కూడా తెలుసు. అక్కడికి తీసుకెళ్లమని ఓ రోజు అడిగాడు. మార్చిలో మేం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చుని, అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే అ‍క్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు.'

(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)

పెళ్లి అక్కడే!
'వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే. తేదీ ఖరారయ్యాక మేమేం ఎప్పుడనేది ప్రకటిస్తాం' అని అదితీ రావు హైదరీ చెప్పుకొచ్చింది.

ఇద్దరు రెండోదే!
సిద్ధార్థ్-అతిదీ బహుశా ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశముంది. సరే దీని గురించి పక్కనబెడితే ఈ పెళ్లి ఇద్దరికీ రెండోదే. ఎందుకంటే సిద్ధార్థ్ గతంలో మేఘనా నారాయణ్‌ని 2003లో వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడితో 2009-13 వరకు కాపురం చేసింది. కానీ బంధంలో కలతలు వచ్చి విడిపోయారు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement