'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ | Mythri Movie Producer Ravi Shankar Gives Clarity On Pushpa 2 The Rule Movie Release And Shooting, Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Update: ప్లానింగ్ ఏంటో చెప్పేసిన నిర్మాత

Published Fri, Aug 30 2024 2:57 PM | Last Updated on Fri, Aug 30 2024 4:52 PM

Mythri Movie Producer Ravi Shankar Pushpa 2 Updates

అల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇది సెట్స్ మీద ఉంది. లెక్క ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరోసారి వాయిదా తప్పదనే రూమర్స్ గత కొన్నాళ్ల నుంచి వస్తున్నాయి. అదే రోజున పలు పాన్ ఇండియా మూవీస్ డేట్ ఫిక్స్ చేస్తుండటమే దీనికి కారణం.

తాజాగా 'మత్తు వదలరా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. 'పుష్ప 2' తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ చిన్న మూవీని కూడా నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. బన్నీ మూవీ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబరు 2 కల్లా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, అక్టోబరు 6 కల్లా సెకండాఫ్ ఎడిటింగ్ పూర్తయిపోతుందని అన్నారు. అలానే నవంబరు 20 కల్లా ఫైనల్ కాపీ సిద్ధమవుతుందని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: నాని 'సరిపోదా శనివారం'కి ఊహించని కలెక్షన్స్‌!)

అలానే సెప్టెంబరు, అక్టోబరులో మిగతా పాటల్ని రిలీజ్ చేస్తామని.. నవంబరు 25న సెన్సార్ పూర్తి చేసి డిసెంబరు 6న వరల్డ్ వైడ్ సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాత రవిశంకర్ చెప్పారు. ఈయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే పక్క ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరేం సందేహాలు పెట్టుకోనక్కర్లేదు.

మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు రావు రమేశ్.. 'పుష్ప 3' కూడా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. మూవీ టీమ్ తనకు షూటింగ్ కోసమని ఈ విషయం చెప్పినట్లు బయటపెట్టారు. ఒకవేళ మూడో పార్ట్ అంటే ఇప్పుడే తీస్తారా లేదంటే కాస్త గ్యాప్ తీసుకుని వస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో టాప్‌-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్‌ ప్లేస్‌ ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement