బాలీవుడ్‌లో టాప్‌-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్‌ ప్లేస్‌ ఎంతంటే? | Amitabh Bachchan Is the Fourth richest in Bollywood | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: బాలీవుడ్‌లో టాప్‌-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్‌ ప్లేస్‌ ఎంతంటే?

Aug 30 2024 12:22 PM | Updated on Aug 30 2024 7:32 PM

Amitabh Bachchan Is the Fourth richest in Bollywood

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కల్కి మూవీతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్‌లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్‌ ఇండియా రిచ్‌లిస్ట్‌ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అమితాబ్‌ నాలుగో ప్లేస్‌లో నిలిచారు.

ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది. అతనికంటే ముందు షారుఖ్ ఖాన్ (రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం (రూ.4600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2000కోట్లు) అతని ముందున్నారు.ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్‌ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.

అయితే ‍అమితాబ్ తన చిన్న వయసులో కోల్‌కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలో జాబ్‌ చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు. కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఇటీవల కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి తాను పుణెలో ఓకే గదిలో ఎనిమిది మందితో కలిసి జీవిస్తున్నట్లు అమితాబ్‌తో అన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ఆ స్థాయి నుంచే వచ్చినట్లు అమితాబ్‌ వెల్లడించారు.

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న అమితాబ్ ఆ తర్వాత సెక్షన్ 84 చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రజనీకాంత్‌ నటిస్తోన్న  వేట్టైయాన్‌లోనూ నటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement