
కోలీవుడ్ హీరో విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. ఆపై కొద్దిరోజులకే తెలుగులో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీ సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది. సినిమా రన్ టైమ్ ముగిసిపోయి చాలారోజులు అయింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మోస్ట్ వెయిటెడ్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. హీరోయిన్ సదా( Sadha) కూడా ఒక ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. ఈ పాట వీడియో వర్షన్ కోసం అభిమానులు చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది.