sadha
-
ఓ సుకుమారీ.. నీ స్టయిలే అదిరే.. కుమారీ! (ఫోటోలు)
-
ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా
హీరోయిన్ సదా పేరు చెప్పగానే 'వెళ్లవయ్యా వెళ్లు..' అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ పాపులారిటీ అలాంటిది మరి. అయితే హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కనబెట్టేసింది. ప్రస్తుతం రియాలిటీ షో జడ్జిగా పలు షోలు చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమాలో ఓ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతోందట. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఏ సీన్ గురించి..? నితిన్-తేజ కాంబోలో వచ్చిన 'జయం' మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన వాళ్లతో పాటు విలన్‌గా నటించిన గోపీచంద్‌కి కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్లో భాగంగా హీరోయిన్ సదా బుగ్గపై.. విలన్ గోపీచంద్ నాలుకతో నాకుతాడు. సదా ఈ సీన్ గురించే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదా ఏం చెప్పింది? 'జయం సినిమాలో ఓ సీన్లో ఎందుకు నటించా అని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చాను. నా ముఖాన్ని పదేపదే కడుక్కున్నాను. ఇప్పటికీ టీవీలో ఆ విజువల్ వస్తే ఆ దరిదాపుల్లో ఉండను' అని సదా చెప్పినట్లు సదరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!) -
ఆక్వా పార్క్ వివాదం.. హైకోర్ట్‌లో విచారణ
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ పోరాటం అనేది అందరి బాధ్యత. దాన్ని స్వచ్ఛందంగా చేపట్టి కొందరు సినీ ప్రముఖులు పోరాడుతున్నారు. కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్.. పర్యావరణానికి పెద్ద ముప్పు కానుందని రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం నిలిపేయాలని కోర్ట్‌ను ప్రముఖులు ఆశ్రయించారు. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్కులతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. పర్యావరణానికి చేటు చేసేలా ఉన్న ఈ ప్రాజెక్టుపై తమ పోరాటానికి మద్దతు కావాలని పిటీషనర్లలో ఒకరైన శశికిరణ్ తిక్కా చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ లో నీటి సమస్య ఉందని, ఆక్వా మెరైన్ వల్ల అది మరింత ఎక్కువవుతుందని సదా అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జయం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సదా. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పాటు తమిళ్లోనూ నటించింది. విక్రమ్‌తో నటించిన ‘అపరిచితుడు’తో సదాకు సౌత్ లెవల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పట్లో సదా పేరు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మారుమోగింది. అయితే ఆ చిత్రం తర్వాత సదా నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇటీవల సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకవైపు సినిమాలతో పాటు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇలా కెరీర్ పరంగా మళ్లీ బిజీగా అయిన సదా.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆమెతో పాటు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కూడా కన్నారు. కానీ సదా మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పింది. ‘పెళ్లి చేసుకుంటే ఫ్రీడం పోతుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నాకిష్టమైన పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు దొరికితే పర్వాలేదు కానీ.. లేకపోతే? పైగా ఇప్పుడు చాలా మంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని.. కొద్ది రోజులకే విడిపోతున్నారు. ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోవడం ఎందుకు? దాని కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ కదా’అని సదా చెపుకొచ్చింది. (చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) -
బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటం నయం: సదా
అదృష్టం బాలేకుంటే, అరటిపండు తిన్నా పళ్లు విరిగినట్లు.. అగ్రహీరోలతో నటించినా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది నటి సదా. అందుకే, కాస్త సమయం తీసుకుని ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో తన సత్తా చాటుతోంది. ► మహారాష్ట్రలోని రత్నగిరి సదా సొంతూరు. తండ్రి డాక్టర్, తల్లి బ్యాంక్ ఉద్యోగి. రత్నగిరిలోని సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, ముంబై చేరింది. ► అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ‘జయం’ లో అవకాశం ఇచ్చాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది. ► ఆ తర్వాత ‘దొంగ దొంగది’, ‘అపరిచితుడు’, ‘మోనాలిసా’, ‘లీలా మహల్ సెంటర్’, ‘ఔనన్నా కాదన్నా’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘వీర భద్ర’, ‘టక్కరి’ వంటి పలు చిత్రాల్లో నటించినా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. దీంతో రూట్ మార్చి, బుల్లితెరపై మెరిసింది. ► పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరించి తెలుగువారికి మరింత దగ్గరైంది. వీటితోపాటు యూట్యూబ్ వేదికగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ► ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘హలో వరల్డ్’ సిరీస్‌లో పవర్ఫుల్ లేడీ బాస్‌గా కనిపిస్తోంది. ఇంట్లో ఎలాగైతే అవసరం లేని వస్తువులను బయటపడేసి శుభ్రం చేసుకుంటామో, అలాగే మన జీవితాల్లోంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండటం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటం మంచిది – సదా చదవండి: మైనస్ 15 డిగ్రీల చలిలో హీరోయిన్ -
ఎంత ప్రయత్నించినా కన్నీళ్లాగడం లేదు.. సదా ఎమోషనల్ వీడియో వైరల్
-
నాకిది పెద్ద షాక్, నా వల్ల కావడం లేదు: బోరుమని ఏడ్చేసిన సదా
వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ సింగిల్ డైలాగ్‌తో ఫేమస్ అయిన నటి సదా. జయం సినిమాలో హీరోయిన్గా నటించిన సదా తొలి చిత్రానికే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. జయం తమిళ వర్షన్, అన్నియన్ (అపరిచితుడు) సినిమాలతో తమిళంలోనూ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసింది. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా కనిపించని సదా బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలో జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కన్నీటిపర్యంతమవుతున్న వీడియో షేర్ చేసింది. సదా ముంబైలో ఎర్త్‌లింగ్స్ కెఫె పేరిట వెజ్ రెస్టారెంట్ నడుపుతోంది. ఈ కెఫె చూసుకోవడంలో తనకు ఎంతో తృప్తి ఉందని గతంలోనూ వెల్లడించింది నటి. అయితే సడన్‌గా ఈ కెఫె మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అదే విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సదా. '2019 ఏప్రిల్ 23న ఎర్త్‌లింగ్స్ కెఫె ప్రారంభించాను. ఇది నా ఫస్ట్ బిజినెస్. ఈ వ్యాపారాన్ని నా కన్నబిడ్డలా చూసుకున్నాను. 2023 ఏప్రిల్ 23.. నాకు బాధను మిగిల్చిన రోజు. కెఫె స్థలం యజమాని ఫోన్ చేసి ఖాళీ చేయాలని ఆదేశించాడు. అందుకు నెల రోజుల గడువు ఇచ్చాడు. నాకు పెద్ద షాక్ తగిలినట్లైంది. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు. మూడు వారాల్లో మేము ఖాళీ చేయాలి. నేను కెఫె పెట్టకముందు ఈ స్థలం దారుణ స్థితిలో ఉంది. కోవిడ్ టైంలో రోజుకు 12 గంటలు ఇక్కడే పని చేశాను. ఏడాదిన్నరపాటు కష్టపడి దీన్ని అందంగా తీర్చిదిద్దాను. మిగతా పనిని కూడా పక్కన పడేసి ఇదే ప్రపంచంగా బతికాను. లాక్డౌన్ సమయంలోనూ పెద్దగా బిజినెస్ లేకపోయినా నేను క్రమం తప్పకుండా అద్దె చెల్లించాను. పరిస్థితులు చక్కబడ్డాక నెమ్మదిగా ఈ కెఫెను ముందు వరుసలో నిలబెట్టాను. ఎంతో బాగా రన్ అవుతోంది. అయినా సరే, అతడు ఖాళీ చేసి వెళ్లిపోమంటున్నాడు. నాకు దీన్ని వదిలి వెళ్లాలని లేదు. ఇది నాకొక ఎమోషన్. ఏదో కోల్పోతున్నట్లుగా ఉంది. తట్టుకోలేకపోతున్నా.. మీకు మూడు వారాలు మాత్రమే రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అది మూతపడుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి నచ్చిన ఫుడ్ తినండి, ఈ ప్రదేశాన్ని ఆస్వాదించండి. కానీ మోమో(శునకం) ఎక్కడికని వెళ్తుంది. తర్వాత ఇక్కడ రెంట్‌కు వచ్చేవాళ్లు మోమోను తరిమేయకుండా దాని బాగోగులు చూస్తే బాగుండు. నేను దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. మూడు రోజులు నాతో పాటు ఇంట్లో ఉంచేస్తే తను చాలా కోపంగా ఉంటోంది. అలా బందీ అయినట్లుగా ఉండటం తనకు నచ్చక అన్నీ పగలగొడుతోంది. అందుకే తనను తిరిగి మళ్లీ కెఫెలోనే వదిలేశా..' అని చెప్తూ ఎమోషనలైంది సదా. ఈ వీడియో చూసిన అభిమానులు రెస్టారెంట్‌ను మూసేయొద్దని, వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయండని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒక్క సినిమాకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలే వద్దిలేద్దామనిపించింది దొంగచాటుగా కలుసుకునేవాళ్లం: తన లవ్ స్టోరీ చెప్పిన మారుతి -
'కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది'.. ఉదయ్‌కిరణ్ మృతిపై సదా కామెంట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయ్‌కిరణ్ మృతిపై హీరోయిన్ సదా మాట్లాడుతూ.. 'అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్‌తో కలిసి 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు
‘వెళ్లవయ్యా.. వెళ్లు..’ అనే డైలాగ్ వినపడగానే టక్కున గుర్తోచ్చే హీరోయిన్ సదా. ‘జయం’ మూవీతో తెలుగు తెరపై కనిపించిన సదా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. అందులో ఆమె చెప్పే ఈ డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సిగ్నేచర్ డైలాగ్‌ను చాలా మంది ఫాలోవుతున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ జయం ఇచ్చిన గుర్తింపును ఆమె నిలుపుకోలేకపోయింది. క్రమంగా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చింది. దీంతో బుల్లితెర డాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న తాజాగా హోల్డ్ వరల్డ్ అనే సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా సదా మూడు పదుల వయసులో ఉన్న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాబోయే భర్త గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఈ సందర్భం ఆమె పెళ్లిపై స్పందిస్తూ.. ‘నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. మన జీవితం మీద కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నాయా? ఎవరూ హ్యాపీగా ఉండడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన అలాగే కాబోయే భర్త గురించి చెబుతూ.. ‘నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్‌కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై ఆధారపడాల్సిన అవసం ఏముంది. నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటెరియన్ అయ్యి ఉండాలి. అతడు ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. ముఖ్యంగా నా సంపాదనపై అతడు ఆధారపడొద్దు. అలాంటి వాడు దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటా’ అంటూ వివరణ ఇచ్చింది. -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
జాగ్రత్త అంటోన్న అక్షయ్, అవి కూడా జీవితాన్నిఇస్తాయంటున్నా అరియాన
తక్కువ విచారించండి, ఎక్కువ నవ్వండి: ప్రగ్యా జైస్వాల్ కొన్ని సమయంలో జీవం లేని వస్తువులు కొత్త జీవితాన్ని ఇస్తాయంటున్న అరియాన గ్లోరీ రణ్వీర్ సింగ్‌కు అలియారేఅలియా స్టేప్పులేస్తున్న అక్షయ్ కుమార్. ఈ స్టెప్పులతో జాగ్రత్త అంటూ హెచ్చరిక ‘నేటి ఈ కష్టం రేపటి మీ బంగారు భవిష్యత్తుకు పునాది’ అంటున్న ప్రియమణి View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
హల్చల్: సదా స్టెప్పులు..దీపిక రీల్స్
►పట్టుచీరలో లాస్య ఫోటో షూట్ ► ట్రెండింగ్ రీల్స చేసిన దీపిక పిల్లి ► స్టన్నింగ్ లుక్‌లో మలైకా అరోరా ► ఫేవరెట్ ఫోటోగ్రాఫర్‌తో స్టెప్పులేసిన సదా View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
అలాంటి అబ్బాయినే పెళ్లిచేసుకుంటా : హీరోయిన్ సదా
జయం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న సదా ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు నాట గుర్తింపు సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ షోలో పాల్గొని సినిమాలు సహా పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినీ పరివ్రమలోకి అడుగుపెట్టానిని, అమ్మ సహకారతోనే హీరోయిన్ అయ్యానని తెలిపింది. జయం చిత్రీకరణ సమయంలో ఓ పెద్ద యాక్సిడెంట్ క్షేమంగా బయటపడ్డాని చెప్పింది. ఇక 2015లో తన తల్లికి క్యాన్సర్ అని తేలడంతో ఒక్కసారిగా మా జీవితాలు మారిపోయాయి. అమ్మ రిటైర్మెంట్కు పది రోజుల ముందు ఆమె పుట్టినరోజు నాడే క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. దీంతో నేను, నాన్న చాలా కృంగిపోయాం. ఆ సమయంలో సినిమా అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేశాను. అసలు అవతలి వాళ్లు ఎవరు? ఏ బ్యానర్? కథేంటి అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్టులకు నో చెప్పేదాన్ని.. ఆ సమయంలోనే సినిమాలు దూరమయ్యాయి. అలా చంద్రముఖి, ఆనంద్ సహా పలు సినిమాలను వదులుకున్నాను అని పేర్కొంది. ఇక కొన్నాళ్లు క్రితమే వీగన్‌గా మారిపోయిన సదా..జంతువులకు హానీ కలిగించే ఏ పదార్థాన్ని తీసుకోనని, ఆఖరికి లెదర్ బ్యాగ్ లాంటివి కూడా వాడనని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ..తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వంద శాతం వీగన్ అయి ఉండాలని, అలా ఉంటేనే చేసుకుంటానని, లేదంటే ఇలాగే సింగిల్‌గానే లైఫ్ గడిపేస్తానని వెల్లడించింది. చదవండి : హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్ భర్తతో కలిసి ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత -
ఓటు వేసి గెలుద్దాం
ఓటే బ్రహ్మాస్త్రం. ప్రజాస్వామ్యంలో ఓటు కంటే విలువైన హక్కు ఏదీ లేదు. ఆ హక్కును సద్వినియోగం చేసుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. తొలిసారి ఓటు హక్కు పొందిన వారి నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అంతా ఓటేయాలి. పెద్దలకు యువత తోడుగా నిలవాలి. సమాజానికి వ్యక్తిగా ఏమీ చేయలేకపోవచ్చు గానీ సరైన నాయకుడిని మాత్రం ఎన్నుకునే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి... - తమన్నా, హీరోయిన్ సమర్థులనే ఎన్నుకోండి.. ఓటు వేయడం మన బాధ్యతే కాదు పౌరులుగా మన ప్రాథమిక హక్కు కూడా.. అలాంటి ఎంతో విలువైన ఓటు వృథా కాకూడదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి సమర్థులెన నేతలనే ఎన్నుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరైతే ప్రగతిపథంలో నడిపించగలరో.. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తారో అటువంటి వారినే ఎన్నుకోవాలి. డబ్బులు తీసుకునో, ఇతర బహుమతులు తీసుకునో ఓట్లు వేయద్దు. అలా చేస్తే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టే. - సదా, హీరోయిన్